Read zora by Johndavid in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జోరా

కొన్ని సంవత్సరాల క్రితం అశోక పురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పక్కన ఒక అడవి ఉండేది.ఆ గ్రామానికి అడవికి మధ్యలో ఒక ఉపాధ్యాయుడి ఇల్లు ఉండేది.ఆ ఉపాధ్యాయుడి పేరు వీర. వీర ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. వీరా ప్రతిరోజు పిల్లలకు అక్షరాలు నేర్పేవాడు. వీర ఇంటి వెనుక నుండి అడవి మొదలవుతుంది. వీర ఇంటి వెనుక ఒక నక్క నివాసం ఉండేది.వీర ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత, రాత్రి ఆ నక్కకు ఆహారం ఇచ్చేవాడు. కాబట్టి ఆ నక్కకు వీరా అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం నక్క వీర ఇంటి వద్దకు వెళ్లి వీర చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేది. అక్షరాలు నేర్చుకునేది. పాఠాలు చెప్పడం పూర్తయ్యాక వీరు ఇచ్చే ఆహారం తిని తన నివాసానికి తిరిగి వెళ్లి నిద్రించేది. ఆ అడవికి రాజు మగ సింహం. ఆ అడవికి రాణి ఆడ సింహం. మగ సింహం చాలా మంచి స్వభావం కలది. మగ సింహం అడవిలో ఉన్న జంతువులను వేటాడేది కాదు. అడవిలో ఉన్న జంతువులు వాటి అంతట అవే మరణించాక. అప్పుడు వాటిని తినేది మిగిలిన ఆహారం ఆడ సింహానికి ఇచ్చేది. కాబట్టి అడవిలో ఉన్న జంతువులు అన్ని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేవి. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు ఒక వేటగాడి దాడి వల్ల మగ సింహం చనిపోయింది. మగ సింహం చనిపోవడం వల్ల ఆడ సింహం పెత్తనం చేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజు జంతువులను వేటాడేది. ఆడ సింహం వేటాడడం మొదలు పెట్టడం వల్ల అడవిలో ఉన్న జంతువులు అన్ని భయంతో వణికిపోయాయి. ఇదంతా తెలుసుకున్న నక్క తన అడవిని కాపాడుకోవాలని తన అడవిలో ఉన్న జంతువులను కాపాడుకోవాలని ఆ ఆడ సింహాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంటుంది. నక్క అడవిలో ఉన్న జంతువుల వద్దకు వెళ్లి"నా స్నేహితులారా! మీరు భయపడొద్దు. నేను మీ ప్రాణాలను కాపాడతాను. ఆడ సింహాన్ని అడ్డుకుంటాను"అని అంటుంది. అప్పుడు అడవిలో ఉన్న జంతువులు నక్క తో"మేము నీ మాటలు నమ్మము"అని అంటాయి. నక్క"ఎందుకు నా మాట నమ్మరు"అని అడుగుతుంది. అప్పుడు ఆ జంతువులు"నువ్వు ఒక నక్క వి, ద్రోహం చేయడం నక్క స్వభావం, అబద్దాలు చెప్పడం నక్కకు పుట్టుకతో ఉన్న లక్షణం అని తెలిసి కూడా నిన్ను మేము ఎలా నమ్ముతాము"అని అంటాయి. అప్పుడు నక్క"ఏవో కొన్ని నక్కలు మోసం చేశాయని అన్ని నక్కలు మోసపూరితమైనవి అని నమ్మడం తప్పు. ఒక ప్రాణి యొక్క జాతి తన గుణాన్ని ,స్వభావాన్ని నిర్ణయించలేదు. నక్కలు అన్నీ చెడ్డవి అని నమ్మడం మంచిది కాదు"అని చెప్తుంది. అప్పుడు ఆ జంతువులు"సరే నువ్వు అంత గొప్ప దానివి అయితే!! ఆ సింహం బాధ తొలగించు! అప్పుడు నక్కలు అన్నీ చెడ్డవి కాదు అని ఒప్పుకుంటాం!"అని అంటాయి. అప్పుడా నక్క సరే అని అక్కడి నుండి వెళ్ళి పోతుంది. ఆ రాత్రి నక్క వీర దగ్గరికి వెళ్ళినప్పుడు వీర ఇంటి లోపలికి వెళుతుంది. వీర ఇంట్లో ఒక గోడ మీద అక్షరాలు అన్నీ ముద్రించి ఉంటాయి. నక్క ఆ అక్షరాలో కొన్నిటిని ఒక్కొక్కటిగా వీరకు చూపిస్తుంది. అప్పుడు వీర నక్క చూపించిన అక్షరాలను జత చేస్తాడు. అలా జతచేస్తే"వీర! నాకు నీ సహాయం కావాలి" అనే వాక్యం వస్తుంది. అది చూసి వీర ఆశ్చర్యపోతాడు. వీరా నక్కతో"నువ్వెలా అక్షరాలను గుర్తించగలుగుతున్నావు"అని అడుగుతాడు. అప్పుడు నక్క అక్షరాలను సూచిస్తూ"నువ్వు పిల్లలకు చెప్పే పాఠాలు మరియు అక్షరాలు నేను ప్రతిరోజు శ్రద్ధగా వినే దానిని అందుకే ఇప్పుడు నేను వాటిని గుర్తించి నీతో మాట్లాడగలుగుతున్నాను వీర!!"అని చెప్తుంది."సరే నా నుండి నీకు ఏ సహాయం కావాలి?"అని అడుగుతాడు వీర. అడవిలో జరిగిందంతా నక్క వీరకు చెప్తుంది."నా స్నేహితులారా సింహం నుండి మిమ్మల్ని కాపాడతాను అని నా స్నేహితులకి చెప్పాను"అని నక్క చెప్తుంది. అప్పుడు వీర"అయితే ఆ ఆడ సింహాన్ని చంపమంటావా?"అని అడుగుతాడు."లేదు! ఒక్క ప్రాణం పోవడం కూడా నాకు ఇష్టం లేదు"అని నక్క చెప్తుంది."మరి ఏం చేద్దాం"అని అడుగుతాడు వీర."నా దగ్గర ఒక ఉపాయం ఉంది"అని నక్క వీరకు చెబుతుంది. నక్క వీర కు ఒక ఉపాయం చెప్తుంది. తర్వాత రోజు ఉదయం నక్క ఆడ సింహం దగ్గరకు వెళ్లి ఆ సింహం చూస్తుండగా తన తోక ఊపుతుంది. ఆడ సింహం అది చూసి కోపంతో నక్కను వేటాడడం మొదలుపెడుతుంది. నక్క వీర ఇంటివైపు పరుగు తీస్తుంది. అలా వేటాడుతూ వీర ఇంటి దగ్గరకు వెళ్ళాక సింహం వీర ని చూస్తుంది. సింహం వీర నీ వేటాడటం మొదలుపెడుతుంది. అప్పుడు వీర తన దగ్గర ఉన్న తుపాకీ తీసి గాలిలో పైకి పెలుస్తాడు. ఆ శబ్దం విని ఆడ సింహం భయపడి వెనుక ఉన్న గ్రామంలోకి పరుగు తీస్తుంది. అయితే వీర కొన్ని నిమిషాల ముందు పోలీస్ వారికి, అటవీశాఖ బృందం వారికి గ్రామంలోకి సింహం వచ్చింది అనే సమాచారాన్ని అందిస్తాడు. దానితో గ్రామంలో వేచి ఉన్న అటవీశాఖ వారు గ్రామంలోకి చొరబడిన సింహాన్ని బంధించి జంతు పర్యాటక ప్రదేశానికి(zoology park) తీసుకువెళ్తారు. అలా ఆ నక్క అడవిలో ఉన్న జంతువులను వీర సహాయంతో కాపాడుతుంది. తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రతీ నక్క చెడ్డది కాదని తెలుసుకుంటాయి.మళ్లీ అడవిలో ఉన్న జంతువులు అన్ని ఎప్పటిలా జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తాయి. నక్క కూడా ఎప్పట్లా ప్రతిరోజు వీర దగ్గరకు వెళ్తుంది.
ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఆ నక్క పేరు"జోరా".