Read The story of Corona by సామాన్యుడు in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కరోనా కథ

కల్పిత కథ

ఇండియా, తెలంగాణ, నిర్మల్, ఓ ఇంటిలో

విష్ణు ఓ ప్రముఖ జర్నలిస్ట్ కానీ అతని కష్టం అతన్ని కలెక్టర్ ని చేసి పెట్టింది...అతను హైదరాబాద్ ప్రాంతం నుండి బదిలీ కావడం తో నిర్మల్ కి తొలిసారిగా వస్తాడు విష్ణు...
ధరణి అనే వ్యక్తి ఓ ఫేమస్ సైంటిస్ట్, కొన్ని వారాల క్రితమే 6 నెల్లో వచ్చే పంటని 4 నెల్లో వచ్చేలా చేసే వాక్సిన్ తయారు చేసి నోబెల్ అవార్డు పొందింది.....

వాళ్ళిద్దరు కూడ ఎప్పడినుండో ప్రేమికులు...
ధరణి ది సొంత గ్రామం నిర్మల్ హే....

కానీ వల్ల వాళ్ళ పర్సనల్ పనుల వల్ల ఇంకా పెళ్ళి చేసుకోలేదు...

విష్ణు, ధరణి ప్రేమికులే కావడం తో విష్ణు ధరణి ఇంటికి వస్తాడు.....

" లేట్ అయింద విష్ణు "

" ఔను "

" ఒక్కడివే వచ్చావ్ అమ్మ నన్న రాలేదా "

" వాళ్ళు అపార్ట్మెంట్ లోనే దించేసా....నేను నిన్ను కలవడానికి వచ్చాను అంతే... "

" అవునా..అదేంటి కెమెరా తీసుకొచ్చావ్... నన్ను గాని ఇంటర్వ్యూ చేస్తావా ఏంటి.... కలెక్టర్ అయినా జర్నలిజం పనులు ఆపవ"

" చాలా రోజులు అవుతుంది కదా...నీ ubdates ఎవరికి తెలీవు అని...నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా "

ఎందుకు అంటే చాలా రోజులుగా ధరణి బయట ప్రపంచానికి రాకుండా ఇంట్లోనే ఉంది.... ( తాను ప్రపంచ వ్యాప్తoగా గొప్పది కదా )

విష్ణు ఇంటర్వ్యూ కోసమని ధరణిని అడగ్గానే
తన ఒప్పుకోకుండా కొద్దిగా బాధ పడుతుంది....
విష్ణు కెమెరా పక్కన పడేసి ... ధరణికి అడుగుతాడు

"ధరణి ఆ వాక్సిన్ తయారు చేశావు ఓకే.. దానిని ఇంకెప్పుడు వాడకం లో స్టార్ట్ చేస్తారు....?? "

" నేను దాన్ని వాడాలని అనుకోవట్లేదు విష్ణు..
ఆ వాక్సిన్ నా గుర్తింపు కోసమే తయారీచేసుకున్న అంతే "

" ఈ విషయం ఎవరికి తెలియదు గా....అందరు ఈ వాక్సిన్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని wait చేస్తున్నారు... పైగా నువ్ చాలా రోజుల నుండి ఇంట్లో నుండి బయటకి రావట్లేదు గా..అందుకే ఇంటర్వ్యూ తీసుకొన అని అడుగుతున్న...?? " ( అని కెమెరా ని సెట్ చేసుకుంటాడు )

" నావల్ల అవ్వట్లేదు విష్ణు... నేనస్సలు భరించలేకపోతున్న, కళ్ళ ముందర ఇంత చోద్యం జరుగుతున్న కూడ ఆపేoదుకు ఏ నాధుడు లేడు విష్ణు....ఆపుదాం అన్న కూడ సపోర్ట్ చేసే మనుషులు కూడ లేరు విష్ణు "

" ఏం మాట్లాడుతున్నావ్ ధరణి.... సమస్య మనందరిది ధరణి .... పరిస్కారం కూడా మనదే, ఏం చేయాలన్నా కూడా మన చేతిలోనే ఉంది "

"ఒక్కరి చేతిలో ఏం లేదు ప్రపంచమంతా కలిస్తేనే, అందరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలం...
నోబెల్ పురస్కారాలు, గిన్నిస్ రికార్డులు ఎవరికి వాళ్లకి అవార్డులని తెచ్చిపెట్టాయి కానీ వాటివల్ల ప్రపంచానికి ఏమి ప్రయోజనం లేదు "

" ప్రపంచం టెక్నాలజీ లో అభివృద్ధి చెందుతోంది గా, ఇంకెందుకు బాధ, ఇంకేంటి అసహనం "

" ఆక్సిజన్ ని ఇచ్చే చెట్లని కొట్టేసి పరిశ్రమలు నిర్మించే అభివృద్ధి మనకెందుకు...??
నీరున్న చెరువుల్ని పూడ్చేసి బిల్డింగ్లని కట్టడం ఏం ప్రయోజనము....??
నువ్వన్నట్టు అభివృద్ధి చెందుతుంది విష్ణు...
కానీ ఈ నేల ఏమైపోతుంది.... ఈభూగోళం ఎలా కాలిపోతుంది నని ఎవరైనా ఆలోచిస్టున్నారా...??
పక్క గ్రహంలో నీరు ఉందా లేదా అనే ప్రయోగాలు చేస్తారు....భూమి కడుపులో నీరు పిండేస్తుంటే భావి తరాలకు నీరు ఎలా ఆని ఎవరైనా ఆలోచిస్తున్నారా...??
ఏ నోబెల్ కాపాడుతోంది నెలతల్లిని...??
ఏ గిన్నిస్ రికార్డు కాపాడుతుంది మనల్ని మోస్తున్న భూదేవిని.... !!

" ఇదంతా ఓకే.... కానీ నువ్ ఏం చేయగలవు... నువ్ ఏం చేయాలనుకుంటున్నావ్....... "

" నేను చూస్తు కూర్చుండలేను విష్ణు.... ఈ బాధ కన్నా నా అంతమే నయం...ఏదో ఒకటి చేయాలి "

" బలమైనది బలహీనమైనదాణ్ణి చంపడం సహజం...కాని బలహీనమైనది కూడ ఇలా గివ్ అప్ ఇవ్వకుండా చివర వరకు తన శక్తి మేరకు పోరాడుతుంది... ఇప్పుడు చెప్పు ఏం చేయాలి అని అనుకుంటున్నావు "

" అంతమైనా చేయాలి లేకపోతే అంతమైన ఐపోవాలి "

" గుడ్.... నీవో శాస్త్రవేత్తవి అని గుర్తు ఉంచుకుంటే ఏమైనా చేయగలవు...."

" నేను ఓ శాస్త్రవేత్తననే నీకు తెలుసు....6 నెలల్లో చేతికి వచ్చే పంట 4 నేళ్లలో చేతికి వొచ్చేలా వాక్సిన్ తయారు చేసిన సైంటిస్ట్ గా నోబెల్ గెలిచాను అనే తెలుసు... కానీ అడవుల్ని కాపాడదాం అని నేను చేసిన ఉద్యమంలో ఎవరు నా వెనక లేరు...ఆ విషయం ఎవరికి తెలియదు....
ఆ వాక్సిన్ కోసం ఓ డేంజర్ కెమికల్ ని కనిపెట్టా...అది ప్రాణాంతకరమైంది....
దాన్ని కప్పి పుచ్చిన నాకు... దాన్కి అవార్డు ఇచ్చి అందరు నన్ను గుర్తించారు .."

" మోసం ధరణి "

" నేడు మోసం ఉంటేనే పని విష్ణు...వాక్సిన్ తయారీ కన్నా... మోసం కప్పిపుచ్చడానికే ఎక్కువ కష్టం ..... "

" న్యాయం గా చేయొచ్చుగా "

" న్యాయమా....అదెప్పుడో అంతరించిపోయిన గుణం విష్ణు..."

" నువేం బాధ పడకు...ఇప్పుడు ఓ పోలీస్ దగ్గరికి వెళ్ళాలి.... నువ్ కోరుకున్న దాని గురించే మాట్లాడతా.. నేను అక్కడ వెళ్లి చెప్తా.... చర్యలు తీసుకుంటే ఒక్కరి మార్పు కోసమైనా కంప్లైంట్ ఇచ్చి వస్తా ఓకే నా బాయ్ "

అని వెళ్తాడు

విష్ణు, పోలీస్ ఇంటికి వెళ్తాడు....

"నమస్తే పోలీస్ సార్... "

"నమస్తే.... నమస్తే...విషయం ఎన్టీ ....?? "

"సార్ నా ధరణి అలా రోడ్ పై నించొని ఉంది సార్...పక్కన ఎవరో పోరంబోకులు రోడ్ పైననే బహిరంగ ప్రదేశాలలోనే సిగరెట్ తాగుతున్నారు.... "

" ఆ.... ఆ తర్వాత ఏమైంది "

" అందుకు తన చర్మం ఇంజూర్ అవుతుంది సార్...చర్మంపై పొర తేలిపోతుంది... ఊపిరి తిత్తుల్లో పొగ నిండుతోంది....వేడి తో పింపుల్స్ వచ్చి నా ధరణికి రక్తం వస్తుంది సార్... "

పక్కనే ఉన్న ఓ పోలీస్ న్యూస్ చదువుకుంటాడు
ఫ్యాక్టరీల వలన వచ్చే పొగల వేడితో ఓజోన్ లేయర్ కి చిల్లు పడుతుంది....దాని వల్ల న్యూజిలాండ్ లో అగ్నిగోళం పేలి పదుల సంఖ్యలో మృతి "

"ఐతే ఆ బీడీ పట్టిన వాళ్ళని, సిగరెట్ తగినవాళ్ళని అరెస్ట్ చేయమంటావ్ ఆoతేగా.... "
అని పోలీస్ విష్ణుకి అడుగుతాడు

" అంతే కాదు పోలీసు సార్ "

" ఇంకేంటి, ఇంకేం ఉన్నాయ్ బాబు "

" ఆ వేడి తన వెంట్రుకలకి కూడ పాకింది... ఇప్పుడు వేడితో తన జుట్టు కూడ కాలిపోతుంది సార్ చాలా దారుణమైన స్థితి సార్....."

" అందువల్ల తన జుట్టులో ఉన్న పెన్లు అన్ని చచ్చిపోతున్నాయి కదా.... వెళ్ళవయ్యా వేళ్ళు....నీవి అన్ని చిల్లర కేసులు ( అని వెటకారంగా నవ్వుతాడు ఆ పోలీసు) "

న్యూస్ " ఆస్ట్రేలియా అడవుల లో భారీ కార్చిచ్చు మంటలు ... చాలా ధ్వంసం అవుతున్న అడవులు, కార్చిచ్చులో కొట్లాది జంతువుల హతం...ప్రపంచమంతా ఆస్ట్రేలియా పై సానుభూతి... "

పోలీస్ : " ఏంటయ్యా.... అన్ని తొక్కలో కంప్లైంట్లు పెట్టుకోని....నువ్వింకా ఇక్కడి నుండి పోలేదా... మా ధరనికి పుండ్లు అయ్యాయి, రక్తం ఒచ్చింది అనుకుంటూ.....అక్కడికి వెళ్లి మెడికల్ లో మందులు దొరుకుతాయి... తీసుకొని మీ దరనికి వెయ్యు పో "

" సార్...అంతే కాదు సార్... ఇంకా చాలా కేసులు ఉన్నాయ్ చెప్తా వినండి సార్ "

" ఏడవ్వయ్యా వింటా "( చిరాకుతో అంటాడు పోలీస్ )

" మొన్న మేం చిన్న మెడికల్ చేకప్ కోసమని హాస్పిటల్ పోయినం సార్.... అక్కడెవరో ప్రాణాపాయ స్థితిలో ఉంటే.... మా ధరణి రక్తం ఇచ్చింది..., బట్ తర్వాత రేయలస్ అయ్యాం.... వాళ్ళు తన ఒంట్లో నుండి మోతాదు ని మించి రక్తం తీసుకుని అమ్ముకుంటున్నారని.. "

న్యూస్ " లాభాల కోసo... భూమిలో నుండి మోతాదుని మించిన పెట్రోలియం ని తవ్వి తీస్తున్న దేశాలు....కన్నీరు కారుస్తున్న బుదేవి.. ఎండలతో నిప్పులు కక్కుతున్న సూర్యుడు "

ఏంటయ్యా నీ తిక్కతిక్క కంప్లైంట్ లు అన్ని.... న్యూస్ చూస్తున్నావ్ గా.... వాటికన్నా ఎక్కువనా నీ ధరణి, ఓ వైపు ఇన్ని సమస్యలు పెట్టుకొని నువ్ ధరణి, బటాణి అనుకుంటూ వెళ్ళవయ్యా ఇక్కడినుండి "

"సార్ ఇంకా ఉన్నాయ్ సార్.... వినండి సార్ ప్లీజ్ "

" నీకు నేను బలేగా దొరికాను రా... ఎర్రి పుష్పం లాగ.... చెప్పింకా వింటాను నాకేం పనీ ఇంకా "

"వాళ్ళు అలా మోతాదు ని మించి రక్తం తీసుకోవడం వల్ల ధరణి కళ్ళు తిరిగి పడిపోయింది సార్...."

న్యూస్ " చైనా, జపాన్ లలో భారీ భూకంపం.... రెక్టార్ స్కేల్ పై high రీడింగ్ నమోదు, వందల్లో ప్రజల మృతి "

" అలా జరిగినందుకు మా ధరణి చాలా ఏడ్చింది సార్, చాలా కన్నీళ్లు కూడ కార్చిoది సార్....."

న్యూస్ " విశాఖ పట్టణం లో భారీ సునామి.... ప్రళయానికి కొట్టుకుపోయిన చాలా మంది మనుషులు "

" ఇప్పుడేం చేయమంటావయ్యా నన్ను.... ఇలాంటి కేసులు తీసుకోబడవు... ముందు పో ఇక్కడినుండి "

" సార్....ఇలా మీరు యాక్షన్ తీసుకోకుండా.... నేను గాని యాక్షన్ తీసుకుంటే...
పరిస్థితి చాలా గోరఁగ ఉంటది సార్ "

" ఏం పీకుంటావో పీక్కో పో "

( వీళ్లిద్దరు మాట్లాడుకునేతప్పుడు పోలీస్ కి వెనక నుండి ఓ కానిస్టేబుల్... ఈ పోలీసుకి పెర్సనల్ గా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఈ పోలీస్, కానిస్టేబుల్ kiచెప్పే అవకాశం ఇవ్వడు, పట్టించుకొడు )

" రేప్ మీకే తెలుస్తుంది సార్...
అలాగే ధరణికి అన్యాయం చేసిన వాళ్లకి కూడ....

విష్ణు అక్కడినుండి వెళ్ళిపోగానే...

పోలీస్ వ్యక్తి... " రేప్ నాకేదో తెలుస్తుంది అంట... బచ్చాగాడు... అని నవ్వుకుంటూ వెనకాల ఉన్నవాడికి " అప్పటినుండి తెగ గెలుకుతున్నావ్ ఏంట్రా విషయం చెప్పి చావు "

"సార్.... తప్పు చేశారు sir"

" నేనా...నేనేం తప్పు చేసాను రా "

"అతను రేప్ అపాంట్ అవ్వబొయె కలెక్టర్ సార్.... "

పోలీస్ షాక్ అయిపోతాడు...

*************************----

విష్ణు ఆ రాత్రి కి మల్లి ధరణి ఇంటికి వెళ్తాడు...

"ధరణి...నువ్వన్నట్టు సమస్య తీరేలా లేదు.... ఎవ్వరికి సోషల్ రెస్పాన్స్బిలిటీ లేదు ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులకి సైతం.... మనమే ఏదో ఒకటి చేయాలి ధరణి... ప్రజలకి బుద్ధి రావాలి ..."

"మనుషులు భయపడేలా చేద్దాం విష్ణు.... బుద్ధి వచ్చేలాగా.... వాళ్లంతాల వాళ్ళు మారేలాగా చేద్దాం, మారకపోతే బతకమేమో అన్నట్టు చెద్దాం.... వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతిలోనే పెట్టేలా చేద్దాం.... "

"ఔను ధరణి... నీవు సైంటిస్ట్ హే కదా... ఏదో ఒకటి చేసేయు ధరణి...."

"నాకూ ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది... "

" ఏమంటున్నావ్ ధరణి "

" ప్రపంచనికి ఎదో ఒకటి చేయడం కాదు ఆల్రెడీ చేసేసా "

( ఆశ్చర్యం తో చూసి )
" ఏం చేసావ్ ధరణి "

" మొన్న వాక్సిన్ కోసమని ప్రాణoతక కెమికల్ ఒకటి తయారు చేశా అన్నాను గా.... దానినే ఇంకా డెవలప్ చేసి ఫిల్టర్ చేసి... మనుషులకి సోకె ఓ అంటూ వ్యాధి వైరస్ లా దానికి రూపాంతరం కలిగించి...మొన్న చైనా కి వెళ్లినపుడు ఓ గబ్బిలాల మార్కెట్ లో వూహన్ ల్యాబ్ లో వర్కు చేసే ఓ వ్యక్తికి సోకించేసాను...."

" ఆ వ్యక్తికే ఎందుకు "

" అతను విష ప్రయోగశాలలో కనీస జాగ్రత్త కూడ తీసుకొని నిర్లక్ష్య శాస్త్రవేత్త అందుకే అతనికి సోకేలా చేశా "

"నువ్ చెప్పేది చైనాలో వచ్చిన కరొన గురించి అయితే కాదు గా ...??

" ఆవును...దాని గురించే ...."

" అది... నువ్ అనుకున్నట్ట్టు ప్రపంచం అంత వ్యాపిస్తుంద...?? "

" లేట్ అవుతుందేమో కానీ వ్యాపిoచడం మాత్రం కాయం "

" నిజంగాన "

" నాపైన నా కెమికల్ పైన నాకు నమ్మకం ఉంది "

" ప్రపంచనికి నిజం తెలిస్తే నిన్ను చంపేస్తారు ...."

" నేను ద్రోహం చేయాలి అని అనుకోలేదు.... మార్పు తేవాలి అని అనుకున్నాను అంతే "

" అయినా సరే నిజం తెలిస్తే నిన్ను చంపెస్తారు "

" ఆ డేంజర్ కెమికల్ కె అవార్డు ఇచ్చిన ప్రపంచం ... దీన్ని ఎలా కనిపెడతారు అనుకున్నావ్ విష్ణు ...అయినా నేను నేరస్తుణ్ణి కాదు.... సైంటిస్ట్ ని అంతే....ప్రపంచన్ని మార్చేలా చేసిన చిన్ని ప్రయోగం "

" నీవల్ల ప్రపంచమే అంతం అయిపోతుంది కదా ... "

" అవుతుంది అవ్వనిది నా కెమికల్ చేతిలో లేదు.... ప్రతి ఒక్కరి చేతిలో ఉంది.....ప్రతి ఒక్కరు పోరాటం చేస్తేనే నా కెమికల్ పైన మనుషులు గెలుస్తారు... ప్రపంచన్ని నాశనం చేసే వాళ్లకి ఇప్పుడు బుద్ధి వస్తుంది...."

"దానివల్ల నీకేం ప్రయోజనం..?? "

* రోడ్లపై రవాణ తగ్గి భూగోళం చల్లబడుతుంది...
* మనస్సుల్లో తప్ప నేలపై కలుషితం ఉండదు...
ప్రతి ఒక్కరు పోరాడితేనే గెలుస్తారు దీనిపై.. లేకుంటే లేదు... ప్రపంచం నాశనమై, భూమాత అయినా చల్లగా బతుకుతుంది ....

*************************

after సం days.....

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్...