అమ్మాయి అన్న పదమే అందరికి ఆసక్తి కలిగిస్తుంది , ఎందుకు అంటే అమ్మాయి ప్రకృతి సహజ అందం కనుక...
అయితే అందులో కొంతమంది కి ఆ అమ్మాయి అంటే గౌరవం,మరి కొంత మంది కి చులకన. ఏది ఏమైనా ఎన్ని యుగాలు మారినా అమ్మాయిని చూసే చూపులు మాత్రం మారలేదు. అదే 'ఏదో సినిమా లో చెప్పినట్టుగా ఎపుడు చూడని చూపులు నన్ను వింతగా చూస్తున్నాయి' ఇలా ప్రతి అమ్మాయి తన జీవితంలో ఒకసారి అయినా భావిస్తుంది ... ఇదే భావన కి ఓ అమ్మాయి , మటుకు పదే పదే గురియైనది .
ఆమె ఆ చూపులని ఎల్లా ఎదురుకుంది, తన వెంట ఎవరు ఉన్నారు???
అమ్మాయి పేరు కీర్తన, తను నాగర్కర్నూల్ మండలం పుల్జల్ గ్రామం నివాసి. కీర్తన తలితండ్రులు వ్యవసాయ పనిని నమ్ముకొని ఊరిలోనే వుంటున్నారు. కానీ కీర్తన తలితండ్రులకి తాను ఒకతే కూతురు కావడం తో తనని ఉన్నత స్థితిలో చూడాలని వాళ్లు ఆశించారు. అలా కీర్తన తల్లీ పార్వతమ్మా,తండ్రి శివయ్యా తాను ఉన్నత స్థాయిలో బ్రతకాలంటే ఇంటర్మీడియట్ కంటే ఉన్నత చదువు ఎంతో ముఖ్యం అని నిశ్చయించుకొని కీర్తనని తన డిగ్రీ కోసం హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో B.A. చేరడానికి అక్కడే ఉండి చదవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వాళ్ల స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
కీర్తన మంచి మర్క్స్ తో డిగ్రీ పాస్ అయ్యింది. తరువాత మంచి ఉద్యోగం కోసం B.Ed కూడా పూర్తిచేసింది. కానీ ఉద్యోగాల వేట లో తన చదువు కి సంబంధించిన ఉద్యోగం రాకపోవడం తో పార్వతమ్మ ని,శివయ్యా ని ఆర్ధికంగా ఆదుకోవాలని తన హాస్టల్ కి దెగర్లో వున్న ఒక్క షాపింగ్ మాల్ లో సేల్స్ సూపర్వైజర్ గా చేరింది. ఇది ఇల్లా ఉండగా, ఓ రోజు కీర్తనకి పార్వతమ్మ నుంచి ఫోన్ వచ్చింది "నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాము ఏమంటావ్" అని తన అభిప్రాయాన్ని చెప్పమని కోరింది కీర్తన తల్లీ. మీ ఇష్టం అని కీర్తన దిగాలైనాగొంతు తో బదులించింది , పార్వతమ్మ కి తన కూతురు ఆంధోళన విని ఏమైంది?..అని ఫోన్ లోనే ఆరా తీసింది. కీర్తన తన చదువు కి తగ్గ ఉద్యోగం రాలేదు అని బదులిచ్చింది.అది విన్న పార్వతమ్మ ఈ ఉద్యోగం చేస్తూనే ప్రయత్నం చేయి , ప్రయత్నాలు ఆపకు మళ్ళి కృషి చేయి , కృషి చేస్తే తప్పక విజయం లభిస్తుంది అని తమ కూతురు కి తలితండ్రులు ఇద్దరు ధైర్యం చెప్పారు, వాళ్ళు చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలతో తన దిగులు పోగొట్టుకొని, తన ఉద్యోగానికి ఉపాయాయోగపడే టెట్ కోర్స్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో కీర్తనకి వాళ్ళ బంధువుల కు తెలిసినవాళ్ల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కాబట్టి పార్వతమ్మ,శివయ్యా కూడా తన కూతురు కి పెళ్లి చేద్దాం అని ఆలోచించి కీర్తనకి ఫోన్ చేసి తన అభిప్రాయం తెలుసుకుందాం అని అనుకున్నారు.
కీర్తన పెళ్లి
కీర్తనకి తన పెళ్లి ప్రస్తావన తెచ్చి , సంబంధాలు వస్తున్నాయి, నువ్వు ఒకసారి మన ఊరికి రావాల్సివుంటుంది అని కోరింది సరే అమ్మ మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పగానే, శివయ్యా నీకు వచ్చిన సంబంధాలలో మాకు ఒకటి నచ్చింది అమ్మ, ఆ అబ్బాయి పేరు కౌశిక్,హైదరాబాద్ వాసి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు. కౌశిక్ కి ఓ అక్క, చెల్లి వున్నారు. వాళ్ళ ఇద్దరి వివాహాలు అయిపోయాయి.ఆ అబ్బాయి తలితండ్రులు కొమురమ్మ,నాగయ్య కూడా వ్యవసాయం చేస్తారు.ఏమంటావ్ తల్లి ? , నీ గురించి అబ్బాయి వాళ్ళకి చెప్పాము వాళ్ళు నిన్ను చూడడానికి మన ఇంటికి వస్తాం అన్నారు, నువ్వూ వస్తే మాటముచ్చట్ల పెట్టుకుందాం అని చెప్పాడు. సరే నాన్న నేను వస్తాను అని ఫోన్ పెట్టేసి, ఊరికి వెళ్లడానికి ప్రయాణించింది కీర్తన. అన్ని బాగా కుదరడం తో అబ్బాయి కి,అమ్మాయి - అమ్మాయి కి అబ్బాయి నచ్చడం తో ఊరిలోనే పెద్దలు పెళ్ళిచేసారు .
కీర్తన,కౌశిక్
కీర్తన,కౌశిక్ వివాహానంతరం, హైదరాబాద్ చింతల్ లో నివాసం వుంటూ, ఇద్దరు తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూ, హాయిగా రోజులు గడుపుతున్నారు.
ఇంతలోనే, కీర్తనకి ఓ ఊహించని సంఘటన ఎదురు అయింది.
నరరూపరాక్షసుడు, కీర్తన
ఓ రోజు ఎప్పటిలాగే, తన ఉద్యయోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుతుండగా ఓ నరరూపరాక్షసుడు చూపు కీర్తన మీద పడింది. ఇంతవరకు తనని చుసిన చూపులు ఒక్క అమ్మాయి కాబట్టి చుస్తునారు లే అని తన మనసు కి సర్ది చెపుకున్న , కీర్తన ఆ రోజు మాత్రం ఒక్క విషం నిండిన రాక్షస వాంఛ చూపు అని పసిగట్టింది, ఆ రాక్షసుడు తనను ఎలాగైనా తగ్గించుకోవాలని వెంటపడి మరి బలవంతంగా అనుభవించి అక్కడ నుంచి పరార్ అయ్యాడు.
ఇంతలో కౌశిక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేవరకు కీర్తన లేకపోవడం తో, కీర్తనకి ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం తో, కంగారు గా తనని వెతకడానికి బయలుదేరాడు. కౌశిక్ వెళ్లే మార్గంలో కీర్తన, అపస్మారక స్థితిలో ఉండడం చూడలేని కౌశిక్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎమి జరిగింది అని ఆరా తీయకుండా వెంటనే కీర్తనని దెగర్లో వున్నా ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకవేళాడు.
కీర్తన ప్రాణాల తో బయటపడింది కానీ, తన కి జరిగిన విషయాన్ని రోజు గుర్తుచేసుకుంటూ కౌశిక్ కి చెప్పాలా - వద్దా ?, చెప్తే ఎల్లా స్పందిస్తాడు?, లేదా అమ్మా కి చెప్తే ఏదైనా సలహా ఇస్తుందా అని ఇళ్లా రకరకాల ఆలోచనతో తనలో తానే కుమిలిపోతుంది.అమ్మా వాళ్ళకి చెప్తే, వాళ్లకి పెళ్లి చేసిన సంతోషం కూడా దూరం చేసిన దాని అవుతాను.,
అయినా నాకు పునర్జన్మ ని ఇచ్చిన కౌశిక్ కి చెప్తే నన్ను అర్ధం చేసుకుంటాడు అని నిర్ణయించుకొని, కీర్తన తన భర్త కి - "ఓ రెండుకాళ్ళున మృగానికి నా జీవితం బలై పోయింది" అని చెప్పింది.ఇది విన్న కౌశిక్ ఒక్క ఇంత ఆంధోళన, ఆశ్చర్యానికి గురియైన .. తేరుకొని, కీర్తనకి ‘నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి మునుపట్టి జాబ్ కి నువ్వు మళ్ళి వెళ్తే నీ మానసిక స్థాయి ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పాడు’. కానీ కీర్తన తనకి జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుతెచ్చుకొని ఈ విష్యం సమాజం లో కొంత మందికి తెలుసు, వాళ్ళు నన్ను అనే మాటలు వింటే నేను తట్టుకోలేను అని చెపింది. "సమాజం లో వున్నా వాళ్ళు నీ గురించి కూడా , నీవు ఆ కామాందుడు చేతిలో నలిగిపోతున్నపుడు అలోచించి నిన్ను రక్షించించి ఉంటే నీకు ఆ పరిస్థిథి వచ్చేది కాదు కదా, కాబ్బటి ఆ సమాజం లో వున్నా వాళ్ళకంటే నీకు నువ్వూ గా ఎల్లా వాళ్ళ నోరుమూయించాలి అని ఆలోచించు" అని ఓ విధమైన కౌన్సిలింగ్ ఇచ్చాడు.దీనితో కీర్తన హైదరాబాద్ శి టీం వాళ్ళు జరిపిన సెక్యూరిటీ ఫర్ విమెన్ అండ్ సెల్ఫ్ డిఫెన్సె టెక్నిక్స్ కార్యక్రమం లో పాల్గొని ఆత్మరక్షణ కిటుకులు నేర్చుకొని తన సూపర్వైజర్ ఉద్యయోగానికి తిరిగి వెళ్ళింది.
కీర్తన - ప్రభుత్వ టీచర్
కీర్తన, ఓ కొత్త అందమైన జీవితం ఆశిస్తూ టెట్ పరీక్షా రాసింది. కౌశిక్ తోడుకు కీర్తన కృషి తోడై కీర్తన టెట్ లో మంచి మార్క్స్ సాధించడం తో, తనకి ప్రభుత్వా టీచర్ గా తన స్వస్థలము లో నే ఉద్యోగం వచ్చింది.
ఇదే విష్యం కౌశిక్ కి చెప్పగానే చాలా సంతోషించి తను వాళ్ళ తలితండ్రులు కి కీర్తన వాళ్ళ తలితండ్రులు కి చెప్పి, కీర్తన ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయించి టీచర్ ఉద్యోగం చేయబోయే పాఠశాల కి వెళ్లి అక్కడే ఉండి మరి కీర్తన ని ఉద్యోగం లో చెరిపించాడు.
కౌశిక్ - పార్వతమ్మ, శివయ్యా వాళ్ళ ఇంటికి వెళ్లి తన తలితండ్రులు అయిన కొమురమ్మ,నాగయ్య ని కూడా పిల్చి , తను ఒక్క నిర్ణయం తీస్కున్నాను. మీ అందరికి చెపుద్దాం అని ఇక్కడికి పిల్చాను అని చెప్పాడు. కీర్తన తన ఉద్యోగం నుంచి వచ్చాక చెర్చిడం బాగుంటుంది అని చెప్పి అందరు భోజనం చేసి కీర్తన గురించి ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో కీర్తన వచ్చి రాగానే కౌశిక్ తన బాలికల కోసం స్వీయ రక్షణ మరియు విద్య కేంద్రం మొదలు పెట్టాలని ఆలోచన ఉంది అని చెప్పగానే కీర్తన చాలా సంతోషం గా కౌశిక్ ఇది చాలా మంచి ఆలోచన ఈ రోజుల్లో చదువు కంటే స్వీయ రక్షణ చాలా అవసరం , నువ్వూ విద్య కూడా అంటున్నావ్ ఇంకేంటి ప్రతి ఇంట్లో ఒక్క రుద్రమదేవి & సునీతవిలియంస్ కలిస్తే ఎల్లా వుంటారు - అల్లా వుంటారు అని తన ఆలోచన చెప్పింది.నేను కూడా నాకు వీలుకుదిరినపుడు మీ కేంద్రానికి వచ్చి బాలికలకు నేను శి టీం కార్యక్రమం లో నేర్చుకున్నది నేర్పిస్తాను. ఈ జంట ఇద్దరి ఆలోచన లు ఏకం కావడం తో ఇరు వైపు పెద్దలు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపకుండా ఒప్పుకున్నారు.
కౌశిక్ కి కీర్తనలో వున్న పట్టుదల ప్రతి అమ్మాయి లో రావాలని తన పేరు తోనే కీర్తన బాలికల స్వీయ రక్షణ మరియు విద్య కేంద్రం - అని కీర్తనస్వస్థలం లోనే ప్రారంభించాడు.
కొమురమ్మ,నాగయ్య ఈ జంట కి మేము సహాయం చేస్తాం అని హైదరాబాద్ వదిలేసి వాళ్ళు కౌశిక్ కి సహాయం చేద్దాం అని నిశ్చయించుకొని రోజు రామాయణాన్ని,భగవత్ గీత తెలుసుకోవాలని కోరిక వున్నా పిల్లలు కు నాగయ్య, కొమురమ్మ బోధించండం మొదలు పెట్టారు.పార్వతమ్మ, శివయ్యా వాళ్ళు చేసే పొలం పనులు మనం తినే ముందు తెలుసుకోవాలి , ఆ ఆహారం ఎల్లా వచ్చింది అనే అంశం మీద ఆ పనుల్లో ప్రధానమైన వి నెరిపించారు,.కీర్తన వృత్తి రీత్యా టీచర్ కాబ్బటి తన పాఠశాల లో వచ్చే పిల్లలు కు కీర్తన చదువు & సెల్ఫ్ డిఫెన్సె టెక్నిక్స్ గురించి ప్రేరణ తెపించి అందులో చేర్చే లాగా చేసింది. కౌశిక్ వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ కాబ్బటి కంప్యూటర్ నేర్చుకోవాలని అన్ని వూన్న పిల్లలకు అది నెరిపించాడు.
ఈ విధానంగా నేటి జంట సమాజాన్ని కి ఒక్క మంచి రూపం తెద్దాం అని ఆలోచన తో ప్రయత్నించారు.
ఈ ప్రయత్నం సఫలం అవుతే – అప్పడు మన దేశం అవుతుంది:-
మార్టిన్ లూథర్ కింగ్ అన్నట్టు - "నేను వేరే దేశాలకు ఒక్క యాత్రికుడు లాగా వెళ్తాను కానీ భారతదేశానికి మాత్రం ఒక్క భక్తుని లాగా వస్తాను".
కనుక మన దేశాన్ని కి ముందుగా మనం భక్తులు లా మారాలంటే
ఈ మార్పులు సమాజం లో అవసరం. ఈ మార్పు కోసం ఆశిస్తూ అందరం ప్రయత్నిదాం.
జై హింద్,
జి.చంద్రిక గణేష్.