మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్

(1)
  • 291
  • 0
  • 3.9k

ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ .. నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక రోజు పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.మా నాన్న సాధారణమైన కూలి.ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.చిన్న వయసులోనే ఒక కిరాణా

1

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 1

ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ ..నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.మా నాన్న సాధారణమైన కూలి.ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.చిన్న వయసులోనే ఒక కిరాణా ...మరింత చదవండి

2

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 2

ఈ కథ రాయడానికి ముఖ్య ఉద్దేశం. గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం కాకుండా వెనుకబడిన వర్గాల వారి జీవిత చరిత్ర తెలుసుకొని వారి విధానం ఎలా ఉంది .వారు పడిన బాధలు ఎలా ఉన్నాయి. వారు వారి జీవితంలో వచ్చే ఆటుపోటులను అడ్డుకొని ఎలా నిలబడ్డారు. అని అందరికీ తెలియడం కోసమే ఈ మట్టిలో మాణిక్యం కదా రాస్తున్నాను.భాగం 1 తరువాత,అమ్మానాన్న దగ్గర నుంచే మేము పేకాట ఆడడం నేర్చుకున్నాము.అందరి దృష్టిలో అది ఒక వ్యసనం లాంటి ఆట కానీ మాకు మాత్రం అది ఒక కాలక్షేపం కోసం ఆడే ఆట మాత్రమే.పని లేని టైం లో గుడిసెల వుండే మిగితా వారు డబ్బులు పెట్టీ పేకాట ఆడేవారు .ఇక్కడ వున్న వారు అందరు వారి వయసు తో సంబంధం లేకుండా అందరూ ఆడే వారు.ఈ ఆట అమ్మ వాళ్ళ దగ్గరి నుంచి నేర్చుకున్నాం. కానీ నాన్నకు ...మరింత చదవండి

3

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 3

నా చేతులుంచి ఫోన్ కింద పడగానే నాన్న నా దగ్గరకు వచ్చారు.వచ్చి నన్ను కొట్టబోయాడు..ఇంతలో అమ్మ వచ్చి ..."అనుకోకుండా పడిపోయింది ఏం అన్నాకు" అని నాన్న చెప్పింది.నాన్న ఎత్తిన చేయిదించి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు.నేను ఏడుస్తూ మూలకు కూర్చున్నాను.తరువాత అమ్మ వచ్చి నన్ను బుజ్జాగించింది.నాన్న ఆ ఫోన్ తీసుకొని షాప్ కి వెళ్లి మళ్ళీ వేరే కొత్త ఫోన్ తెచ్చాడు.ఈసారీ నాన్న నాకు అసలు ఫోన్ ఇవ్వలేదు.నేను కూడా అడగలేదు ఇకా..ఇలా కొన్ని రోజులు గడిసిన తర్వాత నాన్న పని చేసే ఒక సారు ద్వారా ఒక పెద్ద పని వచ్చింది.ఈ పని వల్లనా మా జీవితాలే మారిపోయాయి.ఆ పని కోసం అమ్మనాన్న పని జరిగే వేరే వూరికి వెళ్లాల్సి వచ్చింది.మమ్మల్ని తీసుకొని వెళ్తే మా చదువు పాడవుతుంది అని..పక్కన ఉన్న గుడిసెల వాళ్లకు చెప్పి,అమ్మ–నాన్న ఇంకా మిగతా వాళ్లు కలిసి ..మొత్తం పదిమంది దాకా అక్కడికి వెళ్లారు.అక్కడికి వెళ్లి ...మరింత చదవండి

4

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 4

నాన్న చాలా మంచి వాడు.. చిన్నపటి నుంచి మమల్ని ఎంతో ప్రేమ గా పెంచాడు.మేము ఏమి అడిగిన..కాదు అనకుండా తనకు వున్న దాంట్లో మమ్మల్ని ప్రేమ చూసుకొనే వాడు.ప్రతి పండుగకు అక్కకు,నాకు కొత్త బట్టలు కొనిచేవాడు.మా అన్నలు ,అక్కలతో పోలిస్తే మా జీవితాలు చాలా మంచిగా వుండేవి.కానీ నాన్న కొంచం మా భవిషత్తు గురించి భయ పడ్డాడు.అందుకే నాన్న అక్కను పనికి పెట్టాడు.అక్క కూడా నాన్న మాటకు అడ్డు చెప్పకుండా పనికి వెళ్ళేది.అక్క కూడా తెలుసు ..మాకు ఒక అన్న వుంటే నాన్న కు బరువు బాధ్యతలలో తోడుగా వుండే వాడు అని..అందుకే నాన్నకు కొడుకు లేకున్నా నేనే పెద్ద కొడుకును అయ్యి తనకు సాయం చేయాలి అని అక్క అనుకొని ...పనికి వెళ్ళేది.అప్పుడు అక్కకు కేవలం 13ఏళ్లు మాత్రమే అయిన పేద్దవారికి సమానంగా పని చేసేది.అక్క మగ వాడిలా ..మగ వారికి సమానంగా పని చేసేది.అందరు అక్కని.. పని ...మరింత చదవండి

5

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 5

అమ్మతో తో గొడవ చేసిన నాన్న మాత్రం... అక్క ను నన్ను మాత్రం ఏం అనేవాడు కాడు.కానీ అమ్మ కళ్ళ నుంచి వచ్చే కన్నిలను చూసి కళ్లలో కన్నీలు వచ్చేవి.తెలిసి తెలియని వయసులో అమ్మ ను ఎలా ఓదార్చాలో తేల్చేది కాదు.కానీ అమ్మ,నాన్న గొడవ తరువాత త్వరగానే కలిసిపోయి మాట్లాడుకునే వారు.ఇటు పక్కనా మూడో తరగతి చదువు సాఫీగా సాగిపోయింది.ఎండాకాలం హాలిడేస్ కూడా వచ్చాయి.ఎండాకాలం అన్ని రోజులు అమ్మ వాళ్ళతో సంతోషంగా ఆడుతూ పాడుతూ పనికి వెళ్ళేది.మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఒక డీవీడీ ప్లేయర్ కొనుక్కొని వచ్చి మేము వున్న ఇంట్లో పెట్టాడు..ప్రతి రోజూ మా అన్న పెట్టే పాటలతోనే మేము నిద్ర లేచే వాళ్ళము.మా అందరికి పాటలు అంటే చాలా ఇష్టం వుండేవి.ఎక్కువగా మేము అక్కడ బంగారం,జై చిరంజీవ , లక్ష్మి మూవీ సాంగ్స్ వింటూ కాలక్షేమం చేసేవాళ్ళము.నేను మాత్రము ఇలా ఎంజాయ్ చేస్తూ వుంటే ...మరింత చదవండి