మన కథానాయిక అన్విత, ఆమెకు చదువంటే ప్రాణం, అదే ఆమె జీవితానికి ఆనందం. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పాఠాలు చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా, సరళంగా ఉంటుంది. పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమెకు "ఉత్తమ ఉపాధ్యాయురాలు" అవార్డు కూడా వచ్చింది. అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర. ఎందుకంటే, ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది, ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడం సులభం అవుతుందని సునీత నమ్మకం. అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది.
నా మనసు నీ కోసం - 1
మన కథానాయిక అన్విత, ఆమెకు చదువంటే ప్రాణం, అదే ఆమె జీవితానికి ఆనందం. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పాఠాలు విధానం చాలా ఆసక్తికరంగా, సరళంగా ఉంటుంది. పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కూడా వచ్చింది.అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర. ఎందుకంటే, ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది, ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడం సులభం అవుతుందని సునీత నమ్మకం. అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది.ఇక మన కథానాయకుడు రౌద్రవర్మ. అతని పేరులోనే ఉంది అతని స్వభావం – అతనికి కోపం, ...మరింత చదవండి
నా మనసు నీ కోసం - 2
హేమంత్ (రౌద్ర తమ్ముడు) హాస్పిటల్‌లో..."నర్సు, ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఉండను. నా పేషెంట్స్‌ని అక్షితకు ఫార్వర్డ్ చేయండి. నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది," డాక్టర్ హేమంత్."ఓకే డాక్టర్," అంది నర్సు."హేమంత్ తన ఫోన్ తీసుకుని, శాలిని నంబర్ ఎలాగైనా కనిపెట్టాలి. అతని మనసులో ఆలోచనలు మొదలవుతాయి."'శాలిని ఏం చేస్తుందో? ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే నా ప్రేమ విషయం చెప్పి ఉండాల్సింది. తను ఏమో ఫారిన్ వెళ్ళిపోయింది, కాంటాక్ట్‌లో కూడా లేదు. ఎలా అయినా తనని కనిపెట్టాలి. నాకు ఇప్పుడు తను చాలా అవసరం,' అనుకుంటూ ఉండగా, అతని ఫోన్ రింగ్ అయ్యింది. అతని అన్నయ్య రౌద్రవర్మ కాల్ చేస్తున్నాడు."హలో అన్నయ్య, చెప్పు," అన్నాడు హేమంత్."ఈరోజు వెళ్ళాలి గుర్తుందా? తొందరగా రా," రౌద్రవర్మ అడిగాడు."ఎందుకు లేదు అన్నయ్యా, వస్తా," అన్నాడు హేమంత్."సరే, బై," అని రౌద్రవర్మ ఫోన్ పెట్టేశాడు.నర్సు వచ్చింది. "డాక్టర్, పేషెంట్స్ వచ్చారు, పిలవనా?" అని అడిగింది."ఓకే, ...మరింత చదవండి
నా మనసు నీ కోసం -3
అన్విత చాలా అందంగా రెడీ అవుతుంది. ఆకుపచ్చ రంగు చీరలో ఆమె మరింత తేజస్సుతో మెరిసిపోతోంది. అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి, "అక్కా, నువ్వు ఈ చాలా బాగున్నావు తెలుసా?" అని ప్రశంసించాడు."అవునా? థాంక్స్ రా," అన్విత నవ్వింది."అక్కా, ఫంక్షన్‌కి స్వప్న కూడా వస్తుంది," కిరణ్ చెప్పాడు."అవునా? సరే అయితే," అన్విత అంది. "రెడీ అయిపోయా. స్కూల్‌లో కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి, వెళ్తాను," అంది."సరే అక్కా, నేను కూడా వస్తాను," అన్నాడు కిరణ్."అమ్మా, బై. వెళ్తున్నాం," అని అన్విత తల్లికి చెప్పింది."హ్మ్మ్, నైట్ లేట్ అవుతుందిగా, జాగ్రత్తగా రా. కిరణ్‌తోనే రా," తల్లి సునీత ఆందోళనగా చెప్పింది."సరే అమ్మా, వెళ్లొస్తా," అని ఇద్దరూ బయలుదేరారు.కారులో రౌద్రవర్మ కుటుంబం..."ఎలా ఉంది హేమూ, హాస్పిటల్? ఏమైనా డబ్బులు అవసరమవుతాయా?" రౌద్రవర్మ తమ్ముడిని అడిగాడు."వద్దు అన్నయ్యా, సరిపోతాయి. హాస్పిటల్ బాగా రన్ అవుతోంది," హేమంత్ అన్నాడు."నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి స్వప్నా? బాగా చదువుకుంటున్నావా?" ...మరింత చదవండి