జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకెందరో రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు.
మన్నించు - 1
జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు.-------------------------------------------------------------------------------------------2013, ఇంటర్ చదువుతున్న రోజుల్లో..."మా అమ్మాయికి డాక్టర్ చదవాలనే కోరికతో ఉంది, కొంచం ఈ సర్టిఫికెట్లు చూడండి." మా నాన్నగారు నాపదో తరగతి మార్కుల సర్టిఫికెట్ చూపిస్తూ గొప్ప ఆనందపడ్తూ, గర్వంగా చెప్పారు."9.0 పాయింట్స్.... మ్మ్.. " తల అడ్డంగా ఉపుతూ నా వైపు చూసారు డెస్క్లో వున్న అతను. భయపడుతూ చిన్నగా నవ్వాను."అమ్మాయికి ఒకసారి కౌన్సెలింగ్కి పంపించండి." అని చెప్పి పక్కగా వున్న ఒక డోర్ వైపు చూపించారు అతను.మా నాన్నగారు సందేహంగా చూస్తూ "కౌన్సెలింగ్ ఎందుకు అండి, మేము బై. పి. సి అనే అనుకుంటున్నాం" అన్నారు."కౌన్సెలింగ్ కంపల్సరీ అండి. ...మరింత చదవండి
మన్నించు - 2
ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని లేదు అన్నప్పుడు, మనతోనే ప్రేమ ఆగిపోవాలని ఏం వుంది? మనం మొదటి ప్రేమ కానప్పుడు మనమే ప్రేమ అవ్వాలని మాత్రం ఏం వుంది? మనం లేకపోతే వాళ్ళ జీవితం ఆగిపోతుంది అని మాత్రం అనుకోడం మన తప్పు. తను లేకపోతే నేను ఏం ఐపోతానో అనుకోడం ఒక అపోహ.---------------------------------------------------------------------"అమ్మ నేను మొన్న కొన్న డిజైనర్ డ్రెస్ వేసుకొని వెళ్త కాలేజీకి" స్నానానికి వెళ్తూ మా అమ్మకి చెప్పాను."సరే నీ ఇష్టం" మా అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఈ రోజు అందరికన్నా నేనే అందంగా కనిపిస్తాను.స్నానం చేసి ముచ్చటగా కొనుకున్న డిజైనర్ గౌన్ వేసుకున్న. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ డ్రెస్ నాకు."అమ్మ జడ వేయు. కాలేజీకి లేట్ అవ్తుంది." మా అమ్మని పిలుస్తూ టిఫిన్ తిండానికి కూర్చున్నాను.మా అమ్మ బెడ్ రూంలో నుంచి వస్తూ దువ్వెనతో ...మరింత చదవండి
మన్నించు - 3
రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అయిన రంగు, రుచి, ప్రొఫెషన్.. ఏది ఇప్పుడు నచ్చవు. కాలంతో పాటు చాలా మారిపోతుంటాయి... ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు వున్నంత ఇష్టం ఇక ముందు కూడా అలానే వుంటుంది అనేది మనకి మనమే చెప్పుకునే నిఖార్సయిన అబ్బాధం. జీవితం అనే పెద్ద అబద్ధం ముందు ప్రేమ అనే చిన్న అబద్ధం కూడా అబ్బాధమే అని ఎవరూ కనిపెట్టలేరు.----------------------------------------------------------------------------"నా పేరు సిద్ధార్థ్. అందరూ సిడ్ అని పిలుస్తుంటారు. డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూసినప్పటి నుంచి ఇంకా చూస్తూ ఉండాలి అనే ఫీలింగ్. మా ఇంట్లో అందరికీ ఒకే... నీకు ఒకే ఐతే మనం ప్రేమించుకుందాం" అజయ్ చెప్పాడని మొన్న సీన్ క్రియేట్ చేసిన అబ్బాయిని పలకరిద్దాం కథ అనుకుంటే.. ఇలా డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టేశాడు.నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నా పక్కన ఉంటూ ఇది అంతా ...మరింత చదవండి