నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా
నిరుపమ - 1
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా ...మరింత చదవండి
నిరుపమ - 2
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?” కుర్చీలో వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్. “ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది.” ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు రంగనాథ్. “ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా.” రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ ...మరింత చదవండి
నిరుపమ - 3
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “నీ గురించే ఎదురుచూస్తూ వున్నాను. మాటిచ్చానుగా నువ్వు వచ్చేవరకు నీ ఇల్లు కాస్తానని.” నిరంజన్ లేచి నిలబడి నవ్వాడు. “మరింక నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను.” “థాంక్స్ నిరంజన్.” అన్నాక స్మరన్ వైపు తిరిగింది నిర్మల. “కానీ …..” స్మరన్ మొహంలోకి ప్రస్నార్ధకంగా చూస్తూ అంది. “తాను నా క్లోజ్ ఫ్రెండ్ స్మరన్. ఇప్పటివరకు విదేశాల్లో వుండి ఈ మధ్యే స్వదేశానికి వచ్చారు.” రంగనాథ్ అన్నాడు. తన గురించి ఆవిడకి ఎలా పరిచయం చెయ్యాలో ఆల్రెడీ రంగనాథ్ కి చెప్పి వుంచేడు స్మరన్ “నీ క్లోజ్ ఫ్రెండా? ఈ పేరుతో మీకు ఓ క్లోజ్ ఫ్రెండ్ వున్నట్లుగా మీరు నాకు ఎప్పుడూ చెప్పనేలేదు.” నిర్మల భృకుటి ముడిపడింది. “చెప్పే వుంటాను నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను ఒక వ్యక్తిని నా క్లోజ్ ఫ్రెండ్ అని ...మరింత చదవండి
నిరుపమ - 4
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీకు ఆల్రెడీ పరిచయం చేసేసానుగా ఈ అమ్మాయి మా అక్క కూతురని." వైపు చూస్తూ మొదలుపెట్టాడు స్మరన్. " మా అక్క బ్యాంకు మేనేజర్. కొన్ని రోజులపాటు అర్జెంటు పనిమీద వేరే వూరు వెల్తూ వుంది. తనెప్పుడూ మేనకని ఒక్కర్తినీ ఇంట్లో వదలి వెళ్ళలేదు. నా దగ్గర వుంచుదామన్నానేను నా అసైన్మెంట్స్ మీద తిరుగుతూ వుంటాను. మీకు అభ్యంతరం లేక పోతే మా మేనకని మీ ఇంట్లో కొంచెం రోజులు ఉంచుదాం అనుకుంటాన్నాను. మీరు కాదనరనే ఉద్దేశంతో నేను మా అక్కకి చెప్పేసాను కూడా తన కూతుర్ని మీ ఇంట్లో వుంచుతానని. నా స్నేహితుడి ఇంట్లో తన కూతురిని ఉంచడానికి మా అక్కకి ఎటువంటి అభ్యంతరం లేదు." "ఇది నిజంగా మీరు ఇలా అడగాల్సిన విషయమా? సింపుల్గా మేనక మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని ...మరింత చదవండి
నిరుపమ - 5
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీరు నిరుపమ ఆత్మహత్యకి సంభందించి ఏదైనా క్లూ దొరుకుతుందని నాతో మాట్లాడడానికి కానీ మిస్టర్ స్మరన్ ఆ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ కాలేనేమో అనిపిస్తూంది." మరోసారి నిట్టూర్చాడు నిరంజన్. "నిరుపమ మీకు చాలా క్లోజ్ కదా. మీరంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేది." నిరంజన్ అన్నది తను విననట్టుగానే అన్నాడు స్మరన్. "నేను అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నేను తనకీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో జాయిన్ అయింది." నవ్వుతూ అన్నాడు నిరంజన్. "తను తన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేదా?" "తన తండ్రి తరువాత ఏ అరమరికలు లేకుండా ఇంకెవరితోనైనా తన విషయాలు షేర్ చేసుకుందీ అంటే అది కేవలం నాతోనే. తనకీ సంభందించిన ప్రతి విషయం ...మరింత చదవండి
నిరుపమ - 6
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "అయితే తన మీద" తన రెండు మోచేతులు మధ్యలో వున్నబల్ల మీద చేసుకుని, స్మరన్ మొహంలోకి చూసింది మేనక. "రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ జరిగి ఉండొచ్చా? అంతకన్నా పెద్ద కంపెల్లింగ్ రీజన్ ఈ అమ్మాయి విషయంలో నాకు కనిపించడం లేదు." "లేదు. అది కారణం కాదని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూంది." తనెలా అంత ఫ్రీగా అడగ గలుగుతోందో స్మరన్ కి బోధపడలేదు కానీ ఆ విషయం గురించి తన మేనకోడలు తో మాట్లాడడానికి స్మరన్ కి ఇబ్బందిగానే వుంది. "తన బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?" మరో ప్రశ్న వేసింది మేనక. "జరిగింది. అటువంటిది ఏమీ లేదు." నవ్వాడు స్మరన్. "ఇక్కడ మరొక్క విషయం. ఎక్కువ రోజులు గడిస్తే రేప్ అయినా గ్యాంగ్ రేప్ అయినా బయటపడవు. ప్రూవ్ చెయ్యడం కష్టం. ...మరింత చదవండి
నిరుపమ - 7
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఒకవేళ బాధ పడితే తను ఎందుకు బాధ పడి వుంటుంది? ఇంట్లో జరిగి వుంటుందా?" " అలా జరిగేందుకు అవకాశమే లేదు. నిరుపమ పేరెంట్స్ అంతగా తమ పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ ఉంటారని నేను అనుకోను. ఏ రకంగాను వాళ్ళు తనని హర్ట్ చెయ్యరు." "ఒకవేళ కాలేజీ లో కానీ, వచ్చే దారిలో కానీ ఏమైనా జరిగి వుంటుందా?" "ఆ రోజు కాలేజీ జరగనే లేదు. మా ఇళ్ళకి కాలేజీకి పెద్దగా దూరం ఏమి లేదు. వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మేము వెళ్లే రోడ్ అంతా కూడా జనాలతోటి, ట్రాఫిక్ తోటి వుంటుంది." "మీ కాలేజీ ఎన్ని గంటలకి స్టార్ట్ అయి ఎన్ని గంటలకి పూర్తవుతుంది?" " పధి గంటలకి ప్రారంభం అవుతుంది. ఐదు గంటలకల్లా అయిపోతుంది. మేము మార్నింగ్ నైన్ థర్టీ అలా ఇంటిదగ్గర ...మరింత చదవండి
నిరుపమ - 8
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "జస్ట్ ఆలా నా ఫ్రెండ్ ని కలుసుకుని మాట్లాడదామని వెళ్ళాను." మేనక ఇంటికి వెళ్లేసరికి నిర్మల ఒక్కర్తీ మాత్రమే ఇంట్లో వుంది. "సారీ ఎక్కువ సమయం బయట గడిపేసినట్టుగా వున్నాను." "ఏం పర్లేదులే. నిరుపమ కూడా ఇంతే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందంటే, ముఖ్యంగా ఆ సమీర ఇంటికి వెళ్లిందంటే సమయం తెలియదు. ఎంత సేపైనా అక్కడే ఉండిపోతుంది." కుర్చీలోనుంచి లేస్తూ అంది నిర్మల. "నువ్వు కాస్త నీ రూంలో రెస్ట్ తీసుకుంటూ వుండు, నేను వంటింట్లో పనిపూర్తి చేస్తాను." "మీరు ఏమి అనుకోకపోతే ఆంటీ నేను మీకు వంటింట్లో సాయం చేస్తాను." ఆమె మొహంలోకి చూస్తూ అంది మేనక. "నాకు వంట ఏమీ రాదు. మామ్ నేర్చుకోమంటుంది. కానీ నాకే నేర్చుకోవాలనిపించదు. కానీ మామ్ కి మాత్రం వంటింట్లో సాయంగా వుంటూ వుంటాను." "నీకు నిరుపమకి ...మరింత చదవండి