ఒకరోజు రాత్రి ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. కరెంటు కూడా పోతుంది. (హీరో పేరు:కేశవ)
(హీరో నాన్న పేరు:జగదీష్)
(హీరో అమ్మ పేరు:పద్మ):
(హీరో అన్న పేరు:రాఘవ)
కేశవ కరెంటు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. అంటే కరెంట్ వస్తే అందరూ కలిసి అన్నం తినాలని కానీ ఎంతసేపు ఎదురుచూసిన కరెంటు రాదు. ఇంతసేపు కి కరెంటు రాకపోవడంతో కేశవ వాళ్ళ అన్న రాఘవ
(రాఘవ): రేయ్ కేశవ ఈ కరెంటు వచ్చేలా లేదురా. ఇంకా అందరం కలిసి అన్నం తిందాం పదరా. అని రాఘవ కేశవ చెప్పుతాడు.
(కేశవ): వస్తుంది ఏమోరా కొద్దిసేపు చూద్దాం అని కేశవ రాఘవ తో చెప్పుతాడు.
(రాఘవ): కరెంటు వస్తుందో లేదో నాకు తెలియదు. రా నాకు అయితే అన్నం ఆకలి వేస్తుంది. రా నేను అయితే అన్నం పెట్టుకుని తింటాను. మీరు వస్తే రండి. లేకపోతే లేదురా.
అలా ఈ విధంగా కరెంటు వస్తుందో రాదో తెలియకపోవడంతో అందరూ కలిసి అన్నం తింటారు.
అందరు కలిసి అన్నం తిన్న తర్వాత కరెంటు లేకపోవడంతో కేశవ మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దీంతో కేశవ కరెంట్ వచ్చాక మొబైల్ ఛార్జింగ్ పెడతాను లే. అని మొబైల్ పక్కన పెట్టుకొని పడుకుంటాడు. కొద్దిసేపు ఉన్నాక కేశవ కి వాష్ రూమ్ అర్జెంట్ కావడంతో రాత్రి 3 గంటల కి నిద్ర లేస్తాడు. కేశవ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. కేశవ కి ఇంటి బయట అంత వర్షంలో ఒక చిన్న కుక్క పిల్ల వర్షంలో తడుస్తూ అంత చలిలో వణుకుతూ కేశవ కనబడుతుంది. అలా కేశవ ఇంట్లో వాళ్ళందరిని నిద్ర లేపుతాడు. ఇంట్లో వాళ్ళు బయటికి వచ్చి వర్షంలో తడుస్తున్న కుక్క పిల్లని చూస్తారు.
( అలా కేశవ వాళ్ళ అమ్మ పద్మ )
( పద్మ ): రేయ్ కేశవ ఆ కుక్క పిల్లని వాష్ రూమ్ పక్కన ఉన్న చిన్న రూమ్ లో పెట్టు రా. వర్షం తగ్గాక రేపు ఉదయం ఎక్కడైనా వదిలేసి రా రా.
( కేశవ ): ఏంటి అమ్మ కుక్క పిల్లని ఉదయం వదిలేసి రావాలా వదిలేయడం ఎందుకు? చెప్పు అమ్మ ఈ కుక్కపిల్ల చూడడానికి చాలా బాగుంది. అమ్మ చాలా ముద్దుగా కూడా ఉంది అమ్మ. ఈ కుక్క పిల్లని మనమే పెంచుకుందాం. అమ్మ దయచేసి
( పద్మ ): నేను చెప్పింది చేయి రా. నా మాట విను రా. ఈ కుక్కపిల్ల రేపు ఉదయం ఇక్కడైనా వదిలేసి రా రా.
( కేశవ ): లేదు అమ్మ ఈ కుక్కపిల్ల నాకు కావాలి అమ్మ
ఇంతలో కేశవ వాళ్ళ నాన్న కేశవ తో మాట్లాడుతాడు.
( జగదీష్ ): రేయ్ చెప్పిన ప్రతి మాటకి నువ్వు ఎదురు సమాధానం ఇస్తూనే ఉంటావా ఇలా ఎప్పుడూ ఎదురు తిరుగుతూనే ఉంటావా. అమ్మ చెప్పింది చెయ్. రేపు ఉదయం ఈ కుక్క పిల్లని బయట వదిలేసి రా రా ఎక్కడైనా.
( కేశవ ): అమ్మ ఇందాక నీకు చెప్పాను. ఈ కుక్క పిల్లని వదిలేయాను. అని నాన్న ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను. అలాగే ఇప్పుడు అందరికీ కలిపి చెప్తున్నాను. నాన్న ఈ కుక్కపిల్ల ని వదిలేసి పరిస్థితే లేదు. నాన్న ఈ కుక్క పిల్ల నాకు కావాలి. ఈ కుక్క పిల్ల నాది.
ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట ఏమో కేశవ వినడు. కేశవ చెప్పిన మాటలను ఇంట్లో వాళ్ళు వినరు.
ఇంత లో కేశవ వాళ్ళ అన్న రాఘవ కేశవ తో మాట్లాడుతాడు.
( రాఘవ ): రేయ్ కేశవ ఇంతమంది చెప్తున్నారు కదరా. ఈ కుక్క పిల్లని వదిలేసి రా రా.
అని రాఘవ కేశవ తో చెప్పుతాడు.
( కేశవ ): వాళ్లకి అంటే ఇంత చెప్పినా అర్థం కాలేదు రా. కానీ చివరికి నీకు కూడా అర్థం కాలేదా రా.
అని కేశవ రాఘవ తో అంటాడు.
ఇలా చివరికి ముగ్గురు అంటే అమ్మ అలాగే నాన్న అలాగే అన్న ఈ ముగ్గురు ఆ కుక్క పిల్లని పెంచుకోవడానికి వద్దు అంటారు.
ఎంత చెప్పిన వాళ్ళు వినక పోవడం తో కేశవ వారితో ఇలా అంటాడు.
( కేశవ ): మీరు ఇలా చెప్తే వినరులే. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. లే. అని కేశవ ఆ కుక్క పిల్లని వాష్ రూమ్ పక్కలో ఉన్న రూమ్ లో నుండి బయటికి తీసుకుని వచ్చి కేశవ కూడా ఆ కుక్క పిల్ల తో కలిసి ఇంటి బయట ఉన్న మంచం మీద కూర్చొని అంత వర్షంలో తడుస్తూ ఉంటాడు.
( పద్మ ): రేయ్ కేశవ ఆ కుక్క పిల్లని వాష్ రూమ్ పక్కలో ఉన్న రూమ్ లో పెట్టి నువ్వు ఇంట్లోకి రా రా. నీకు అది కాక నీకు చిన్నప్పటి నుండి ఆయాసం ఉంది రా.
( కేశవ ): నాకు ఆయాసం ఉంది. చిన్నప్పటి నుండి ఉంది అని మీకు తెలుసు. నాకు తెలుసు. కానీ మీరు నేను అడిగింది కాదు అంటున్నారు. దయచేసి నాకు ఈ కుక్కపిల్ల కావాలి అమ్మ.
ఇలా కేశవ ఇంట్లో వాళ్ళని బ్రతిమిలాడుతున్నాడు. ఆ కుక్క పిల్ల కోసం ఇంట్లో వాళ్ళు ఆ కుక్క పిల్లని పెంచుకోవడానికి ఒప్పుకున్నారా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే వర్షం కురిసిన రాత్రి ఎపిసోడ్ 2 కోసం ఎదురుచూస్తూ ఉండాలి.
ఇంతటి తో అయిపోలేదు.
కొనసాగుతుంది. ఎపిసోడ్ 2 కోసం ఎదురుచూస్తూ ఉండండి.