Read Dr. Seetha by writerscaste in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
  • Dr seetha

    తను సీత…కానీ నేను రాముడిని కాదు.సీత కథ అనగానే,అందరూ ఇటువైపు...

  • మై ఈవిల్ లవర్

    ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్...

  • MRS మాన్స్టర్

    అది వైజాగ్ బీచ్ ఆ బీచ్ లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని తనలో త...

  • SLAVE

    మారుతున్న యువతఒకప్పుడు మన ఊళ్లలో ఉదయాన్నే పక్షుల కిలకిలారావా...

  • వేద - 12

    ముసుగు మనుషుల చేతిపై రుద్ర భైరవ యొక్క Cult of Chaos సంస్థకు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

Dr seetha



తను సీత…
కానీ నేను రాముడిని కాదు.

సీత కథ అనగానే,
అందరూ ఇటువైపు రాముడు ఉంటాడని అనుకోవడం ఎందుకు?

ఇక్కడ కథలోకి వస్తాడు **క్రిష్ – Krishna**.

మీరు ఒక్క కంక్లూజన్‌కి వచ్చారు కదా…
మరి ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా?

---

**సీత** 1984 జూన్ 16న నంద్యాలలో జన్మించింది.
మూడో తరగతి వరకు అక్కడే చదువుకుంది.
అక్కడి నుంచి కోయలకుంట్లకు వెళ్లి, ఏడో తరగతి వరకు విద్యానికేతన్‌లో చదివింది.

తర్వాత కర్నూలులో ఇంటర్ వరకు వాళ్ల అమ్మగారి ఇంట్లో ఉంటూ చదువు పూర్తి చేసింది.
వాళ్ల అత్తమామలకు పిల్లలు లేరు కాబట్టి సీతను తీసుకువచ్చి పెంచుకున్నారు.

అయితే సీత వచ్చిన కొద్దికాలానికే, అత్తమామలకు పిల్లలు పుట్టారు.
అప్పటివరకు ప్రేమగా చూసుకున్న అత్త,
“సీత వల్ల మన పిల్లలను సరిగ్గా చూడలేకపోతున్నాం” అని భర్తతో గొడవలు పడేది.

అంతే కాదు…
సీతతోనే అంట్లు తోమించేది,
ఇంటి పనులన్నీ సీతతోనే చేయించేది.
తన పిల్లల్ని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేది.

అలా మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు సీత జీవితం సాగింది.

---

ఇంటర్ పాస్ అయింది.
ఎంసెట్ కోచింగ్ తీసుకుంది.

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు.
అది చూసి మా నాన్న ఆనంద్ అన్నారు.

“ఏంటి డాడీ, వాళ్లు ఎవరు?” అని అడిగాను.
“మీ అమ్మ వాళ్ల సహోద్యోగి పిల్లలు.
నీకు పని లేదు కదా… వాళ్లకు హెల్ప్ చేసి రా” అన్నారు.

“ఏంటి రా, నువ్వు వెళ్తున్నావా? నేనూ వస్తాను” అన్నారు నాన్న.

---

“మీ పేర్లు?” అని అడిగాను.
“మధు” అని ఒక అమ్మాయి చెప్పింది.
మరి ఇంకో అమ్మాయి పేరు అడిగితే… సీత మౌనంగా ఉంది.

“కార్‌లో ఎక్కండి” అన్నాను.
ఇద్దరూ కూర్చున్నారు.

మధు ఫారమ్ ఫిల్ చేస్తోంది.
సీత మాత్రం మౌనంగా ఉంది.

“ఏంటి చూస్తున్నావు? ఫారమ్ ఫిల్ చేయి.
నీ పేరు ఏంటి?” అన్నాను.

సీత ఇంకా మౌనంగానే ఉంది.
“నాకు కాదు… వాళ్లకు తెలియాలి కదా” అంటే,
నెమ్మదిగా “సీత” అని చెప్పింది.

“ఏంటి? సీతా?” అన్నాను నేను.

---

కౌన్సెలింగ్ అయింది.
మధుకు **MBBS సీట్** వచ్చింది.
సీతకు మాత్రం ఒక్క మార్కుతో MBBS మిస్ అయింది.
**BDS సీట్** వచ్చింది.

ఇద్దరికీ నెల్లూరు నారాయణలో హాస్టల్ వచ్చింది.
సీత చాలా పేద కుటుంబం.
వాళ్ల మామయ్య ఒక బెడ్‌షీట్ ఇచ్చి, హాస్టల్ చూపించి వెళ్లిపోయాడు.

---

సీత చాలా కష్టపడి చదివే అమ్మాయి.
BDS ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యాయి.
సెలవులకు క్రిష్ ఇంటికి వచ్చారు.

సెలవుల తర్వాత ఫలితాలు వచ్చాయి.
సీత ఏడుస్తూ తన మామయ్యకు ఫోన్ చేసింది.

“ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను” అని చెప్పింది.

ఫెయిల్ అయ్యినందుకు
₹35,000 ఫీ కట్టాలి,
రెండో సంవత్సరం స్కాలర్‌షిప్ రాదు,
హాస్టల్ ఫీ ₹65,000 కట్టాలి.

సీతకి వేరే దారి లేదు.

వాళ్ల నాన్న రైతు.
ఏడాది పొడవునా కష్టపడ్డా, వచ్చే డబ్బు చాలా తక్కువ.

వాళ్ల అత్త తన భర్తతో
“సీతకు ఒక్క పైస కూడా ఇవ్వొద్దు” అని చెప్పింది.

మామయ్య ఫోన్ చేసి,
“హాస్టల్ ఫీకి నా దగ్గర డబ్బు లేదు” అని చెప్పాడు.

---

డాక్టర్ అవ్వాలి అన్న ఎన్నో ఆశలు…
అన్నీ కళ్లముందే కూలిపోయాయి.

సీత హాస్టల్ నుంచి బయటకి వచ్చి
RTC బస్టాండ్‌లో కూర్చుని ఏడుస్తోంది.

పక్కన ఉన్న కాయిన్ బాక్స్‌లో కాయిన్ వేసి,
క్రిష్ వాళ్ల డాడీకి, మమ్మీకి ఫోన్ చేసింది.

“ఇందిరా ఆంటీ… ఆనంద్ అంకుల్…”
అని అన్నీ చెప్పింది.

“థాంక్యూ ఆంటీ… థాంక్యూ అంకుల్…”
అని కన్నీళ్లతో చెప్పింది.




సీత ఎన్నో ఆశలతో డాక్టర్ అవ్వాలి అనుకుంది.
కానీ అది జరగలేదని గ్రహించి,
ఏడుస్తూ హాస్టల్ నుంచి బయటకు వచ్చి
RTC బస్టాండ్‌లో కూర్చుంది.

పక్కన ఉన్న కాయిన్ బాక్స్‌లో కాయిన్ వేసి,
క్రిష్ వాళ్ల డాడీకి, మమ్మీకి ఫోన్ చేసింది.

“ఇందిరా ఆంటీ… ఆనంద్ అంకుల్…”
అని జరిగినదంతా చెప్పింది.
“థాంక్యూ ఆంటీ… థాంక్యూ అంకుల్…”
అని కన్నీళ్లతో చెప్పింది.

సీత బస్టాండ్‌లో కూర్చుని ఏడుస్తూ ఉంది.

అంతలో క్రిష్ వాళ్ల నాన్న ఆనందరావు బస్టాండ్‌కి వచ్చారు.
“సీతా… కోటేశ్వర మామయ్యతో మాట్లాడావా?” అని అడిగారు.

“నాకు ఏమి సంబంధం లేదు” అని మామయ్య అన్నారు అని చెప్పింది సీత.

“సరే… ముందు మా ఇంటికి రా.
ఫెయిల్ అయిన సబ్జెక్ట్‌కు కావాల్సిన ₹35,000 నేను కడతాను”
అని ఆనందరావు ధైర్యం చెప్పారు.

అంతలో క్రిష్‌కి కాల్ వచ్చింది.
“హా… చెప్పు నాన్న.”
“నానమ్మ గది శుభ్రం చేసి పెట్టు.”
“అలాగే నాన్న.”


---

సీతను ఆనందరావు ఇంటికి తీసుకువచ్చారు.
“ముందు అన్నం తిని పడుకో.
రేపు ఉదయం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టి వస్తాం.
ఏమీ ఆలోచించకు” అని చెప్పారు.

“సీత, నీ నాన్నతో మాట్లాడాలి అనుకుంటే
ల్యాండ్‌ఫోన్ నుంచి కాల్ చేసుకో” అన్నారు.

అదంతా చూసిన క్రిష్,
“అమ్మా… ఇక్కడ ఏమి జరుగుతోంది?
వంట ఆపి నాకు చెప్పవా?
నాన్న గురించి మీకు తెలుసు కదా…
సీతకు మాట ఇచ్చాడు అంటే తప్పకుండా చేస్తాడు” అన్నాడు.

“అదే తెలుసులే…
మాట ఇస్తే, మాట మీదే నిలబడతాడు” అంది ఇందిరా.


---

సీత తన నాన్నకు కాల్ చేసింది.
కానీ చాలా దిగులుగా ఉంది.

“ఆంటీ, అంకుల్ ఫెయిల్ ఫీజు కడతానన్నారు.
కానీ హాస్టల్ ఫీజు ₹65,000 కావాలి.
నాన్న… నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.
మామయ్య చదువు ఇస్తాడని నన్ను వదిలి వెళ్లిపోయావు కదా…”
అని నాన్న అన్నాడు.

“సీత… ఏడవకు.
మా అంకుల్ వస్తే అన్నీ చూసుకుంటాడు” అని చెప్పింది ఇందిరా.

అంతలో ఆనందరావు వచ్చారు.
“ఇందూ… సీతకి భోజనం పెట్టావా?” అన్నారు.

“సీత, నీతో కొంచెం మాట్లాడాలి” అన్నారు.
“హా… చెప్పండి అంకుల్” అంది సీత.

“హాస్టల్ ఫీజుకు నాన్న డబ్బులు ఇవ్వనన్నారు.
మామయ్య కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు” అని చెప్పింది.

ఆనందరావు నెమ్మదిగా అన్నారు—
“సీత… అన్నీ మర్చిపో.
నీ పరీక్ష ఫీజు నేను కడతాను.
హాస్టల్ ఫీజు అవసరం లేదు.
రోజూ మా ఇంటి నుంచే కాలేజీకి వెళ్లి రా.
ఎవరూ నిన్ను డిస్ట్రబ్ చేయరు.
బాగా చదువుకో.”

ఆ మాటలు వింటే సీతకి కన్నీళ్లు వచ్చాయి.

చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి…
కానీ ఈసారి వేరే మార్గమే లేదని అనుకున్న క్షణంలో,
చదువుకోడానికి సెకండ్ ఛాన్స్ దొరికిందని
ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అవి.


---

“కృష్ణ…
రేపు ఉదయం కారు తీసుకుని నారాయణ కాలేజీకి వెళ్తున్నాం.
ఫీజులు, ఫార్మాలిటీలు పూర్తి చేసి వస్తాం.”
“అలాగే డాడ్.”

ఆ సాయంత్రం సీతకు ఫోన్ కాల్ వచ్చింది.

“Hello abba…”
“Achhee ke… Achhu baa…”

సీత వాళ్ల నాన్న:
“Chutra rajako ghare maa khuche aadi…”

సీత:
“Kai karu abba…
Mama mane madhyama chodan dargo.
Hostel fee bandhene kastam chakaran atte chodan dargo…”

సీత వాళ్ల నాన్న:
“Jagratta aadi…”


---

“రేయ్ క్రిష్…
ఏంట్రా ఆ అమ్మాయినే చూస్తున్నావు?
మా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.
మా వాళ్ల నాన్న ఏదో అన్నాడు” అంది సీత.

“ఏంటి ఈ భాష?
లిపి కూడా లేదు.
అవును… ఫారం ఫిల్ చేసినప్పుడు చూసాను.
నీ పేరు ‘సీతాబాయి’ అని ఉంది.
నువ్వు సుగాలి కదా?
ఇప్పుడు గుర్తొచ్చింది” అన్నాడు క్రిష్.


---

“క్రిష్… క్రిష్…”

రేపు ఉదయం—
“8:30కి ముత్తుకూరు బస్టాండ్ దగ్గర
సీతను ఆటో ఎక్కించి రా.”
“Ok డాడ్.”

సీత వాళ్ల నాన్న ఏమీ చెప్పలేదు…
సీత ఎందుకు ఏడ్చిందో…
సీతాబాయి కథ ఏమిటో…

తదుపరి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.