Read MRS Monster by NANDHINI in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • Dr seetha

    తను సీత…కానీ నేను రాముడిని కాదు.సీత కథ అనగానే,అందరూ ఇటువైపు...

  • మై ఈవిల్ లవర్

    ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్...

  • MRS మాన్స్టర్

    అది వైజాగ్ బీచ్ ఆ బీచ్ లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని తనలో త...

  • SLAVE

    మారుతున్న యువతఒకప్పుడు మన ఊళ్లలో ఉదయాన్నే పక్షుల కిలకిలారావా...

  • వేద - 12

    ముసుగు మనుషుల చేతిపై రుద్ర భైరవ యొక్క Cult of Chaos సంస్థకు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

MRS మాన్స్టర్

అది వైజాగ్ బీచ్ ఆ బీచ్ లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని తనలో తనే బాధ పడుతుంది.




ఆ బీచ్ లో పెద్దగా జెన సంచారం లేదు ..


బాధపడుతున్న అమ్మాయి దగరికి వచ్చి ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అమ్మాయి కొంచెం మరోచ్చుగా అన్న మాటకి 




వెనక్కి తీరగకుండానే నేను ఇంతే అబ్బాయి వెళ్ళిపో మళ్ళీ నన్ను కలవాలి అనీ చూడకు అంటుంది కోపంగా.




అంత కోపం ఎందుకు సనా నీకు కొంచెం ప్రేమగా మాట్లాడితే నీ సొమ్ము ఏమన్నా పోతుందా అంటాడు ఆ అబ్బాయి చాలా ప్రేమగా.




అతని మాటలకి కోపం వచ్చి పైకి లేచి చూడు ఇప్పటికే చాలా చేసావు ఇక ఆపేయి.




ఆపకపోతే...??



నీ కర్మ.... అనీ ఆ వ్యక్తి నే కోపంగా చూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది సనా.



వెళ్తున్న సనా నీ చూసి నువ్వు వద్దు అన్న కాదన్న నిన్నే ప్రేమిస్తా సనా. నువ్వు నాకు మాత్రమే సొంతం,


నీ గతం ఏది అయినా అది నాకు అనవసరం, నిన్ను పొందటమే నా లక్ష్యం మై డియర్ సనా. 



నువ్వు కేవలం ఈ యశ్వంత్ కీ మాత్రమే సొంతం అనుకోని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.యశ్వంత్





కోపంగా ఇంటికి వెళ్లిన సనా  ఫ్రెష్ అయి వచ్చి ఎవరికో కాల్ చేసి రుది అంత ఓకే నా.. టికెట్ కన్ఫర్మ్ అయిందా అనీ అడుగుతుంది.


హ సనా అంత రెడీ నువ్వు  ఈవినింగ్ వెళ్లిపోవచ్చు.



ఓకే థాంక్ యు రుది నీ మేలు జన్మలో మరిచిపోలేనే థాంక్స్ ఏ లాట్ అంటూ ఎమోషనల్ అవుతుంది సనా.



చా అవేం మాటలే నువ్వు నా ఫ్రెండ్ వీ నీ కోసం ఆ మాత్రం చేయులేనా.... థాంక్స్ అన్న మాట మన మధ్య వద్దు...



అది నీ మంచితనమే కానీ నేను చెప్పకపోతే నాథి సీలిఫిషనెస్  అవుతుందే...




ఎం అవ్వదు కానీ నా ఫ్లాట్ కీ వచ్చేయి.. నేను నిన్ను సేఫ్ గా స్విజర్ల్యాండ్  పంపిస్తాను.



థాంక్ యు నే.... వస్తా బాయ్ అనీ కాల్ కట్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని. 


ఇంటి ఓనర్ కీ ఇంటి తాళాలు ఇచ్చి క్యాబ్ బుక్ చేసుకొని రుది దగ్గరికి వెళ్తుంది సనా.




రుది దగ్గరికి వెళ్లి. తను ఇచ్చిన పాస్ పోర్ట్ తీసుకోని మళ్ళీ క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కీ వెళ్ళిపోతుంది సనా.



ఒక అరగంట కీ అనౌన్స్ మెంట్ రావటం టీజెక్ లోపలికి వెళ్లి చెకిన్ అయి స్విజర్ల్యాండ్  ఫ్లైట్ ఎక్కేస్తుంది సనా.




ఫ్లైట్ లో ఎక్కెసి తన సీట్ లో  కూర్చొని సీట్ వెనక్కి వాలి కళ్లు మూసుకొని ఏడుస్తూ ఎందుకు అస్సలు ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు రా.




నేనేం పాపం చేశాను అనీ అంత పెద్ద శిక్ష  వేశావు. నీ ప్రేమ తో ఈ ప్రపంచాన్నే మరిపించావు.



తీరా అన్నీ అయ్యాకా నేనే నిన్ను వదులుకునేలా చేసావు.నేను వద్దు అన్న వెంట పడ్డావు. ఇప్పుడు ఎంత దూరం అవుదామన్నా అవ్వలేకపోతున్న.




కానీ నిన్ను క్షమించి మళ్ళీ నీ లైఫ్ లోకి రావాలి అనుకోవట్లేదు అందుకే నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియకూడదు.



అందుకే వెళ్తున్న మళ్ళీ నీకు కనపడను గుడ్ బాయ్ మిస్టర్ రాక్షసుడా.... ఐ హేట్ యు.. బట్ ఐ లవ్ యు అనీ.



ఎవరినో తలుచుకొని ఏడుస్తుంది సనా.. (రాక్షసుడు కాదు.. హీరో... (యశ్వంత్. కాదు..లెండి..



సనా ప్రేమ ఎవరికీ దక్కుతుంది... యశ్వంత్ కా.. లేక సనా రాక్షసుడు అంటుందే అతనికా.



రాక్షసుడు సనా కోసం వెతుకుతున్నాడా...???



సనా వైజాగ్ వదిలి వెళ్ళింది అనీ యశ్వంత్ కీ తెలిస్తే..??



అస్సలు సనా.. ఆ రాక్షసుడికి ఎందుకు దూరం వెళ్ళాలి అనుకుంటుంది..???
అందుకే వెళ్తున్న మళ్ళీ నీకు కనపడను గుడ్ బాయ్ మిస్టర్ రాక్షసుడా.... ఐ హేట్ యు.. బట్ ఐ లవ్ యు అనీ.



ఎవరినో తలుచుకొని ఏడుస్తుంది సనా.. (రాక్షసుడు కాదు.. హీరో..


(యశ్వంత్. కాదు..లెండి..మన హీరో వేరే ఉన్నాడు.)




నైట్ నైట్ దేశం ధాటి వెళ్లిపోయింది సనా. ఆ విషయం ఇటు యశ్వంత్ కీ కానీ.. మన రాక్షసుడుకి కానీ తెలీదు. (అదే మన హీరో కీ )




సనా స్విజర్ల్యాండ్ లో ల్యాండ్ అయి తనకి జాబ్ ఆఫర్ చేసిన కంపెనీ కీ వెళ్తుంది.



అక్కడ వాళ్లే ఫ్లాట్ ఇస్తారు సనా కీ.జాబ్ ఓకే అయి ఫ్లాట్ దగ్గరికి వెళ్లి తన థింక్స్ అన్నీ సర్దుకొని ఫ్రెష్ అయి వచ్చి. వండుకోవటం స్టార్ట్ చేసింది.



వంట చేస్తున్న సనా కీ ఫోన్ వస్తుంది, కాలింగ్ ఫ్రమ్, రుది.



వంట చేస్తున్న సనా రుది ఫోన్ చేయటం తో కాల్ లిఫ్ట్ చేసి హ చెప్పే అంటుంది సనా.



హే సనా నువ్వు వైజాగ్ లో ఇన్నిరోజులు ఉన్నవని  ఆ రాక్షసుడికి తెలిసిందే... అనీ చెప్తుంది రుది కంగారుగా.



రుది మాటలకి షాక్ అయి, ఏ ఏం మాట్లాడుతున్నవే , తనకేలా తెలుసే. అనీ టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి. సనా కీ.





ఏమో తెలీదే.. కానీ నీకోసం నా దగ్గరికి వచ్చారు అతని మనుషులు.



నన్ను అడిగితే... లండన్ వెళ్ళావు అనీ.చెప్పను..



అవునా నమ్మరా.. మరి..?


నమ్మినట్టే ఉన్నారు...,??



అంటే నమ్మలేదా...?



ఐ థింక్ సో... బట్ నమ్మే వెళ్లారు అనుకుంటున్నా ఈ సారి వస్తే ఎం చెప్పనే....?



వేరే కంట్రీ చెప్పు ప్లీజ్..... అనీ భయం తో చెప్తుంది సనా.



ఓకే ఓకే... చెప్తాలే నువ్వు కంగారు పడకు అండ్ నువ్వు నెంబర్ చేంజ్ చేయి... అండ్ నేను కూడా చేస్తా...



ఓకే. ఓకే నువ్వు కూడా మన కాల్ కన్వర్షషన్ డిలేట్ చేయి....


ఓకే నేను చేస్తా బాయ్....??



హ్మ్మ్ బాయ్ నువ్వు జాగ్రత్త....?అనీ చెప్పి కాల్ కట్ చేస్తుంది సనా.



కాల్ కట్ చేసి దేవుడా... ఎవరికీ అయితే దొరకకూడదు అనుకున్నానో అతనికే దొరికేలా ఉన్న.

నువ్వే నన్ను కాపాడు స్వామి ప్లీజ్ అనీ ఏడుస్తుంది సనా.



సనా జాడ కోసం చాలా వెతుకుతున్నాడు  రాక్షసుడు. కానీ లీడ్ దొరకలేదు అతనికి..



చిన్ను ఎం ఆలోచిస్తున్నావు రా...???



ఎం లేదు మా.... అనీ ఆకాశములోకి చూస్తున్నాడు రాక్షసుడు.


ఎం లేదా.... ఆలా చెప్పటానికి కొంచెం కూడా సిగ్గుగా లేదు రా నీకు అనీ కొడుకుని తిడుతుంది., కాత్యాయిని గారు.



మా ప్లీజ్... ఇప్పటికే సగం చచ్చాను నీ మాటలతో నన్ను పూర్తిగా చంపకు అంటాడు రాక్షసుడు బాధగా.




అవునా ఆది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రా నీకు మరి నీ మాటలతో, నీ ప్రవర్తన తో సనా నీ బాధ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ ఈ బాధ.. నీ ఆరాటం.





మా ప్లీజ్ అది నన్ను వదిలి వెళ్లిన దగ్గర నుండి నరకం అనుభవిస్తున్న ఇప్పటికే పశ్చితాపం తో కుమిలి పోతున్న.




ఇంకా నువ్వు నీ మాటలతో చంపకు మా ప్లీజ్ అంటాడు రాక్షసుడు కన్నీళ్లతో.



కొడుకు బాధ చూడలేక... మరి ఏం చేయాలి రా. దాని కోపం పోదు. కోపం. పోతే గాని అది రాదు..


దాని కోపం పొవాలి అంటే ఎం చేయాలి మా చెప్పు చేస్తా అంటాడు.



ఒక్కటే దారి..... దాని కోపం పోవాలి అంటే..



ఏంటి మా అనీ ఆతృతగా అడుగుతాడు ధ్రువు ధృవాన్ష్ నందన్ మన రాక్షసుడు.



చెప్తా అనీ... @@@@@@కొడుకు కీ ఏదో చెప్తుంది కాత్యాయిని.



మా... ఇలా చేస్తే అది అస్సలు రాదు మా. ఇంకా నన్ను అసహ్య  ఇంచుకుంటుంది....




ఎం కాదు ఇలా అయితేనే అది వింటుంది.... నేనే చెప్తున్నా గా... ధైరంగా వేళ్ళు అంటుంది.. కాత్యాయిని.




మా కానీ... అనీ ఇంకా ఏదో అంటున్నా కొడుకు మాటలని మధ్యలోనే ఆపేస్తు...



చూడు... చిన్ను, నేను చెప్పిందే ఫైనల్... నువ్వు వస్తే సనా తోనే రా.... ఒంటరిగా వస్తే.... చంపేస్తా అనీ.. ధ్రువు కీ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది కాత్యాయిని.



ఉఫ్ దేవుడా.. ఎక్కడ ఉన్నావే... కనపడు మా ఒక్కసారి.. నా తప్పు తెలుసుకున్న  కూడా ఇలా బిహేవియర్ చేస్తున్నావేందుకే...




6 నెలలు అవుతుంది.. నేను పట్టుకుందామన్నా ప్రతి సారి నా నుండి తప్పించుకున్నావు.



ఈ సారి నీన్ను వదిలేదే లేదు... వస్తున్న  నీకోసం ...నువ్వు వద్దు అన్న.. సరే బలవంతగా నైనా నీన్ను తెచ్చుకుంటా అనీ కన్నీళ్లతో అక్కడ నుండి బయటికి వస్తాడు ధ్రువు.




రాక్షసుడు సనా నీ వేటడటానికి వెళ్తున్నాడు....



సనా ఎక్కడ ఉందొ కనుకుంటాడా.



సనా తనకి మాత్రమే సొంతం అనీ ఫీల్ అవుతున్న యశ్వంత్. సనా ధ్రువ... ఆల్రెడీ లవర్స్ అనీ తెలుస్తుందా.


ఈ సారి నీన్ను వదిలేదే లేదు... వస్తున్న  నీకోసం ...నువ్వు వద్దు అన్న.. సరే బలవంతగా నైనా నీన్ను తెచ్చుకుంటా అనీ కన్నీళ్లతో అక్కడ నుండి బయటికి వస్తాడు ధ్రువు.



సనా గురించి ఒక్క ఆధారం కూడా దొరకలేదు ధ్రువు కి, ఆలా ఆమె గురించి ఏదన్నా క్లూ దొరికితే బాగుండు అనీ అన్నీ వైపులా వెతుకుతున్నాడు.



సనా స్విజ్ర్లాండ్  వెళ్లిన 2 డేస్ కి యశ్వంత్ కి తెలుస్తుంది సనా వైజాగ్ నుండి వెళ్లిపోయింది అనీ.



కానీ ఎక్కడికి వెళ్ళింది అనేది అతనికి కుడా తెలియదు, అతనికి తెలిసిన ప్లేసెస్ లో చాలా ట్రై చేస్తాడు కానీ ఏ క్లూ దొరకధు.



ఆలా అలా 1 మంత్ పైనే సనా కోసం తిరుగుతారు, ధృవ్, యశ్వంత్.....




వెతికి వెతికి అలిసిపోయోన ధ్రువు ఒక చోట కూర్చొని  తన చుట్టూ ఉన్నారు అందరిని చూస్తూ ఏదో ఆలోచనల ప్రవాహములో మునిగిపోతాడు.



అది ఒక పార్క్, ఆ పార్క్ లో ఒక బెంచ్ పై కూర్చొని సనా గురించి ఆలోచిస్తున్నాడు. 



ఆమె గురించి తలుచుకోగానే వద్దు అన్న అతని కళ్ళు  ఆమె కోసం వర్షిస్తున్నాయి.


చాలా సేపు ఒంటరిగా పార్క్ లో కూర్చొని సనా గురించే ఆలోచిస్తున్న ధ్రువు కి కాల్ వస్తుంది.



ఫోన్ సౌండ్ రాగానే ఆలోచనలు పక్కన పెట్టి కాల్ లిఫ్ట్ చేసి హ చెప్పు అంటాడు...



సార్ సనా మేడం ఎక్కడ ఉన్నారో క్లూ దొరికింది అంటాడు అవతల వ్యక్తి...



అవతల వ్యక్తి మాటలకి... నవ్వుతు అవునా అనీ ఎక్సయిట్ అవుతూ... ఎక్కడ ఉంధి అనీ అడుగుతాడు.



స్విజర్లాండ్ సార్....???


అవునా ఓకే.. నా ఎగ్జాక్ట్ అడ్రెస్స్ పెట్టు నేను వెళ్తున్న క్విక్ అంటాడు..



ఎస్ సార్ నేను మీకు 2 మినిట్స్ లో పెడుతాను అనీ కాల్ కట్ చెసి ధ్రువు కి అడ్రెస్స్ పెడుతాడు.



అడ్రెస్స్ చూసి.... హ్యాపీ గా ఫీల్  అయి వస్తున్న మా. నువ్వు ఎక్కడ ఉన్న వదలను అనీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ధ్రువు.



   @@@@@



ఏం అయింది మిస్టర్ సనా ఇక్కడ ఉందొ కనిపెట్టారా..??



లేదు సార్ సెర్చ్ చేస్తున్నావు....??



ఇంకా ఎంత టైం తీసుకుంటారు సనా మిస్ అయి అప్పుడే నెల రోజులు అవుతుంది, క్విక్ అంటాడు యశ్వంత్... గంభీరంగా ?



ఎస్ సార్... చూస్తున్నాం అనీ సనా లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందో, లాస్ట్ లొకేషన్ ఎక్కడ ట్రేస్ అయింది సెర్చ్ చేస్తున్నారు..


చాలా అస్సలు ఎక్కడ ఉన్నావు సనా నేను అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు... ఇలా వెళ్ళిపోతావు అనీ.. కానీ ఒక్కసారి నువ్వు నాకు దొరికితే నిన్ని అస్సలు వదిలేదే లేదు.... అనీ సనా వెళ్లిపోయింది అనీ తెలిసిన యశ్వంత్.... చాలా కోపంగా సనా కోసం వెతుకుతాడు.



ధ్రువు ఇంటికి వెళ్లి రెడీ అయి అప్పటికప్పుడు, స్వీజర్లాండ్ కి టికెట్ బుక్ చేసుకొని కాత్యాయిని గారి దగ్గరికి వెళ్తాడు.



ఫ్రెష్ అయి..., డిన్నర్ కోసం బయటికి వస్తున్న కాత్యాయిని గారికి  ఎదురు వెళ్లి గట్టిగా హత్తుకొని మా.. ఐ ఫౌండ్ ఇట్ అనీ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతూ చెప్తాడు.



రేయ్ ఎం అయింది రా అంత ఎక్సయిట్ అవుతూన్నావు ఎం అయింది రా అనీ కాత్యాయిని గారు కూడా చాలా హ్యాపీ ఫిల్ అవుతారు కొడుకు సంతోషం చూసి.



మా... సనా... సనా.... దొరికిందా మా... నేను వెళ్తున్న దాని దగ్గరికి...


అవునా.. ఇక్కడ ఉంది రా అనీ కాత్యాయిని గారు కూడా ఎక్సయిట్ అవుతారు.



మా స్విజర్ల్యాండ్ లో ఉంది నేను తీసుకొస్తాను బాయ్ మా అనీ ఆమె రియాక్ట్ అయ్యే లోపు ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.



కొడుకు ఆనందాన్ని చూసి దేవుడా ఎప్పుడు వీడు ఇలానే ఉండాలి అనీ మనసులోనే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు కాత్యాయిని గారు.



ఒక ఆఫనౌర్ కి ఎయిర్పోర్ట్ కో వెళ్లి చెక్ ఇన్ అయి స్విజర్ల్యాండ్ కు ఫ్లైట్ ఎక్కేస్తాడు ధ్రువు..




ధ్రువు సనా నీ తీసుకెళ్తాడా.. 

సనా వస్తుందా....


మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి..