Read Mother's love by srivarsha in Telugu Women Focused | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అమ్మ ప్రేమ

ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు, నిత్య జీవితంలో జరిగిన కథ,ఒక అమాయకురాలైన అమ్మ కథ.

ఇక కథలోకి వెళ్తే అనగనగా ఒక తల్లి తండ్రి వలకు సంతానం కలగక ఎంతో బాధ పడేవారు. ఒక కూతురిని దత్తతకు తీసుకున్నారు, ఆ కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకునే వారు, గారాబంగా చూసుకునే వారు. ఆ కూతురికి తండ్రి అంటే చాలా ఇష్టం, ఆ కూతురు రోజు స్కూల్ కి వెళ్ళేది తనకు చదువు అంటే చాలా ఇష్టం,అలా తను 10 తరగతి రానేవచ్చింది.మంచిగా చదువుకుంది అందరికి 10 తరగతి పరీక్షలు అంటే భయమే ఉంటుంది, తనకు కూడా అంతే భయంవేసింది,పరీక్షలు దగ్గరకు వచ్చేసరికి పరీక్షలకు సిద్ధం అయింది. అన్ని పరీక్షలు మంచిగా రాసింది కానీ గణితం లో కొంచం డౌట్ గా ఉండే, తను అనుకున్న లాగే రిజల్ట్ వచ్చింది బట్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యింది, చాలా బాధ పడింది ఏడ్చింది, తన తండ్రి ఆమెను దగ్గరికి తీసుకుని బాధ పడకు మళ్ళీ రాయు అని ఓదార్చాడు.

అప్పుడు ఆమె సంతోషించింది అలా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసింది కాని ఒక్క మార్క్ తో ఫెయిల్ అయ్యింది,ఇక ఓపిక పోయింది, ఎంతో గారాబంగా చూసుకున్న తండ్రికి నేను ఏమి చేయలేకపోయాను అని బాధ పడింది,అలా కొన్ని రోజులు గడిచింది. తను వయసుకు వచ్చింది, కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని డిసైడ్ అయ్యారు.అలానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.చిన్నపటినుంచి గారాబంగా పెరిగిన ఆమె అన్ని కొత్తగా అనిపించింది 

 నాన్న చెప్పిన మంచి మాటలు మంచి విషయాలు గుర్తుతెచ్చుకొని.తన భర్త ఏ సర్వస్వం అనుకుంది,కుటుంబాన్ని మంచిగా చూసుకునేది,అలా తనకు ఇద్దరు కూతుర్లు పుట్టారు,అలా వలు పెద్దగా  అయ్యారు, వలకు ఒకటే చెప్పేది ఆ అమ్మ,నాకు చదువు అంటే చాలా ఇష్టం నాకు అలా అయ్యింది, మీరు మంచిగా చదువుకోవాలి అని,తను చెప్పిన లాగానే వలు ఉండే వారు ఇద్దరు మంచిగా చదివేవారు, ఆ అమ్మకు ఒకటే నా పిల్లలు ఆరోగ్యం మంచిగా ఉండాలి సంతోషం గా ఉండాలి అని.అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేనిది ఇంకా, తండ్రికి కూడా ఉన్నది కానీ అమ్మ అంత కాదు, నాన్నకు ఎలా అంటే అనవసరంగా ఖర్చు చేయకూడదు మనము ఉన్నవలం కాదు ఉన్నంతలోనే సర్దుకోవాలి అని నాన్న.వలకు అలా చిన్న చిన్న గా గొడవలు అయ్యేవి, బాధ పడే వలు పిల్లలు బాధపడుతుంటే చూడని తల్లి నా పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి దగ్గర్లో ఉన్న కంపెనీ లో పని చేసింది.తన పిల్లలను కష్టపేటకూడదు రేపు పెళ్లి చేసుకుంటే పిల్లలు అక్కడ కూడా పని చేయాలి,వలె చదువుకుంటే ఏదైనా జాబ్ తెచ్చుకుంటారు,చదువు పట్ల ఎలాంటి డిస్టబెన్స్ చేసేది కాదు, కాలేజీ నుండి వస్తె వలకు టీ పెట్టేది బస్ లో వస్తారు నా కూతుర్లు అలసిపోతారు ఏదైన చేద్దాం స్నాక్స్ లాగా అని ఏదొ ఒకటి చేసేది ఆ అమ్మ. ఆ అమ్మకు ఒకటే ధ్యాస నా పిల్లలు మంచిగా ఉండాలి అదే ధ్యాస అమ్మకు ఎప్పుడు.తను కూతుర్లకు కూడా మా అమ్మ మా కోసం చాలా చేస్తుంది అని,వల నాన్న కు పోదున్నే లేవకుంటే నచ్చకపోయేది, ఇష్టం ఉండేది కాదు, ఊకె గలుగుతారు కానీ వాళ్ళ అమ్మ మాత్రం నా పిల్లలు అలిసిపోయి వస్తారు కొద్దిసేపు పడుకొని తీయి అనుకునేది. ఆ అమ్మ అమాయకత్వ ఏమిటి అంటే నా పిల్లలు నా దగ్గరే ఫ్రీ గా ఉంటారు రేపు అత్తారింటికి వెళ్తే అక్కడ ఉండరు కదా  అక్కడ అలా వుంటుందో అని అనుకునేది.అలా సాగుతున్న జీవితం లో పెద్ద అమ్మాయి కి జాబ్ వచ్చింది,తండ్రికి చేదోడు వాడొదుగా నిలిచింది, చాలా మంది అన్నారు పెళ్లి వయసుకు వచ్చింది పెళ్ళి చేయండి అని, అవి ఎవి పాటించుకోలే ఆ అమ్మాయి,తన పెళ్ళి వరకల్ల తను చిట్టి పెట్టుకుంది. తనే బంగారం చేయించుకుంది, అమ్మకు కూడా బంగారం చేయించింది, అమ్మ ఎంతో సంతోష పడింది, చిన్న కూతురికి కూడా మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది.

అమ్మ దీవెనలు ఉంటే ఏదైనా సాధించొచ్చు కదా,ఈ అదృష్టం అందరికీ ఉండదు. అమ్మ నువ్వు గ్రేట్ అమ్మ నీ లాంటి తల్లి ఉంటె ఏ కూతురు సాధించకుండా ఉంటుంది.


ఈ కథ ప్రతి ఒక్కరికీ స్పూర్తిస్తుంది.ప్రతి ఒక్క అమ్మాయి, వాళ్ళు ఫ్యూచర్ లో తల్లి కాబోయే అమ్మ కు మీ పిల్లలను కూడా మంచి మార్గం లో పెంచాలి. పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి, వారిని మంచి మార్గం లో ఉంచాలి.

ఈ అమ్మ లాగా తను కోల్పోయిన జీవితాన్ని వాళ్లు కూతుర్లకు అలా జరగాకూడదు, వాళ్ళు దేంట్లోనూ తక్కువ చేయకూడదు, మంచి స్థాయిలో ఉంచింది, బయటవలు ఎన్ని అన్న ఆ తల్లి పటించుకోలె,తన ప్రపంచం మొత్తం తన కుటుంబం.

ఈ కథ చదివిన ప్రతి ఒకరికి.....thank you♥️