Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా ప్రేమను ప్రేమించిన నా భార్య

నా ప్రేమను ప్రేమించిన నా భార్య 

                               కొత్త గా పెళ్లి అయిన జంట.. శోభన గది లో మంచం మీద కూర్చు ని దీర్ఘం గా ఆలోచిస్తున్నా భర్త...(అర్జున్) 

తలుపు అవతల, బంధువులు స్నేహితురాలు మధ్య, సిగ్గు పడుతూ.. వస్తున్న కొత్త పెళ్లి కూతురు (అపర్ణ)..

 

తలుపు అవతల సిగ్గు పడుతున్న ఆమె, తలుపు లోపలికి రాగానే భయం తో కాళ్ళు, చెతులు వణకటం మొదలయ్యాయి.. ధైర్యంతో తలెత్తి భర్తను చూడడానికి కూడా సాహసం చేయలేక పోతోంది...!

 

అర్జున్ ఆమె కాళ్ళ వైపు చూస్తూ. చిరాకుగా  ఒక్కసారిగా నిలబడి, మంచం మీద ఉన్న 'తల దిండు' ను అలా తీసుకో బోతున్నాడు... అది గమనించిన అపర్ణ. పాల గ్లాసు అలా పడేసి, సడన్గా తల దిండు ను, బెడ్ షీట్, తీసుకొని అవతల కి తిరిగి కింద పడుకుంటుంది...! ఇక అర్జున్ అలా మంచం మీద పడుకుని కళ్ళు తెరిచే దీర్ఘ ఆలోచన చేస్తాడు..!

   ‌‌      

అపర్ణ సౌండ్ రాకుండా ఏడుస్తుంది.. కళ్ళు మూసుకొని, అర్జున్ ను మొదటిసారిగా కలుసుకున్న చోటు. (సముద్ర అలల ముందు). అర్జున్ అన్న మాటలను తలచుకుంటూంది. 

అర్జున్ ;- ఏయ్.. నీకు చెప్పేది అర్థం కావడం లేదా, (గట్టిగా) నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇంత చెప్తున్నా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే, నీ మెడలో తాళి మాత్రమే పడుతుంది. నా చేయి కూడా నీ మీద పడదు. ఇక నీకు నరకమే. తర్వాత నీ ఇష్టం...! 

అపర్ణ (శోభనపు గదిలో) కళ్ళు తెరచి ఇంకా బాగా ఏడుస్తుంది.. మరో సారి కళ్ళు మూసుకొని.. ఈ సారి వాళ్ళ బామ్మ చెప్పిన మాటలను తలచు కుంటూంది..!

 

ఆమెకు చిన్నతనం నుంచి పెద్దయిన వరకు వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు కొన్ని గుర్తు కు వస్తాయి.. అవి 

(చిన్నతనంలో) నీకు రాజకుమారుడు లాంటి మొగుడు వస్తాడు... వాడు నిన్ను మహారాణి లాగ చూసుకుంటాడు...! 

(అపర్ణ మధ్య వయసులో) మన ఆడవాళ్ళకి అన్ని బంధాల కన్నా, భార్య, భర్తల బంధం. ఎంతో ముఖ్యమైనది. చివరిదాకా ఒకరికొకరు తోడు ఉంటారు కాబట్టి..! అందుకే మన భర్త ని మనం. అమితంగా ప్రేమించాలి. వాడు ఎలాంటి వాడైనా సరే. మన ప్రేమతోనే వాన్ని మార్చుకోవాలి..!

ఇలా వాళ్ళ బామ్మ చెప్పినది తలుచుకుని మెల్లగా కళ్ళు మూసుకుని అలా నిద్రపోతుంది అపర్ణ..!!

         

ఇక్కడ అర్జున్ తన 'ప్రేమించిన అమ్మాయి' ప్రేమ జ్ఞాపకాలను తలచుకుంటూ. చివరిలో వాళ్ల నాన్న పెళ్లికి ముందు అన్న మాటను తలుచుకుంటాడు.. 

నాన్న ; నీ కాళ్లు పట్టుకుంటాను రా ఈ పెళ్లికి ఒప్పుకోరా...! (దీనిని తలుచుకొని.. చిన్నగా కన్నీళ్ళతో అలా నిద్రలోకి జారు కుంటాడు)

         

మార్నింగ్, వేరే కాపురం పెట్టడానికి, హైదరాబాద్ కి, వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు అర్జున్. అది చూసి వాళ్ళ

నాన్న; ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండొచ్చు కదా రా..?

అర్జున్; నాన్న నేను మీకు ముందే చెప్పాను. పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడ ఉండలేను అని. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. నేను వెళ్తాను..! 

అని ఇద్దరు హైదరాబాద్లో ఉండె, ఇంటికి చేరుకుంటారు.. ఇంటి లోపలికి వచ్చాక అర్జున్ ఆమెను చూడకుండా వెనక్కి తిరిగి ఇలా అంటాడు.. 

అర్జున్; నువ్వంటే ఇష్టం లేదు, అని చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నవ్. ఇక నీతో నేను ఎలా ప్రవర్తించిన. అది నా తప్పు అయితే కాదు. ఒకే ఇంట్లో ఉన్నా, నువ్వు ఎవరో నాకు తెలియదు.. నీ దారి నీదే, నా దారి నాదే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను.. నీకు డబ్బులు కూడా ఒక్కపైసా ఇవ్వను. నువ్వే ఏదైనా పని చూసుకొని సంపాదించుకోవాలి..! ఇక్కడ నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు.. ఎంత ఫ్రీడమ్ అంటే, నువ్వు ఇంకో అబ్బాయిని ఈ రూమ్ లోకి తెచ్చుకుని. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు.. నిన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు...

       

ఈ మాటలకు షాక్ అవుతుంది అపర్ణ..!! ఇక మౌనంగా అలాగే ఉండిపోతుంది...!! ఇద్దరూ వేరు వేరు రూమ్ లో ఉంటారు. అర్జున్ రూమ్ నిండా. అతన్ని ప్రేమించిన అమ్మాయి, ప్రియా ఫోటో లతో నిండి ఉంటుంది..అర్జున్ ఆ ఫోటోలను చూస్తూ. ఆమె కు సంబంధించిన వీడియోలను చూస్తూ. కొత్త గా, మందు అలవాటు చేసుకొని. ఆమెతో గడిపిన క్షణాలను తలచుకుంటాడు... (చిన్న ఫ్లాష్ బ్యాక్)

 

            అర్జున్, ప్రియ, ఇద్దరు కాలేజీ డేస్ నుంచి మంచి లవర్స్, ఒకరంటే ఒకరు కి ప్రాణం..! వీళ్ళ ప్రేమకు సంబంధించిన మధురక్షణాలు ఎక్కువగా వీళ్ళ college back side, building terrace.. పైనే ఉండేది..! చదువు కంప్లీట్ అయిన తర్వాత కూడా. వీలు ఆ కాలేజ్ టెర్రస్ పైన. రోజుకు ఒక్కసారైనా కలుసుకునేవారు..! తర్వాత వీళ్ళిద్దరికి ఒకే చోట మంచి జాబ్, కూడా వచ్చి ఉంటుంది..! వీళ్ళ ప్రేమకు అడ్డు చెప్పేవారు కూడా ఎవరూ లేరు. రెండు ఫ్యామిలీ ల నుండి పెళ్లికి అంగీకరించారు.. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ప్రియా కు అర్జున్ పక్కన ఉండగానే యాక్సిడెంట్ అవుతుంది..!

 

             రక్తపు మడుగులో కొన ఊపిరి లో ఉన్న ప్రియని చూసి తట్టుకోలేక పోతాడు అర్జున్. ప్రియా ప్రియా అంటూ గట్టిగా అరుస్తాడు. ఏడుస్తాడు. చివరిక్షణంలో ప్రియా అర్జున్ దగ్గర నుంచి ఒక మాట తీసుకుంటుంది..

ప్రియా ; అ.ర్జు..న్.. ఇక నేను.. వెళ్ళి..పోతున్నాను.. రా..!

అర్జున్ ; No..No...No... నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను.. (అని పైకి ఎత్తుకోడానికి ట్రై చేస్తాడు.. ప్రియా వద్దు అని ఆపి.. అర్జున్ చేతిలో చేయి కలిపి)

ప్రియా ; నాకు.. ఒక.. ప్రామిస్.. చేయరా...! 

అర్జున్ ; (బాగా ఏడుస్తూ) చెప్పు..! ఏమిటది..!

ప్రియా ; ముందు..ప్రా..మి..స్.. చేయరా...!

అర్జున్ ; ప్రామిస్ (అని తన చేయి ని గట్టిగా పట్టుకున్నాడు) 

ప్రియా ; (కొన ఊపిరితో) నాకు.. ఇ.లా. అయిందని..నువ్వు సూ..సై..డ్ లాంటివి.. చేసుకోకు.. నీ చావు.. నీ దగ్గరి..కి. వచ్చే.. అంత..వరకు నువ్వు..జీవించాలి...!(ఈ మాటకు ఇంకా ఎక్కువగా ఏడుస్తాడు అర్జున్) అలాగే నువ్వు ఇంకొకర్ని.... (అంటూ మధ్యలోని చనిపోతుంది)

       

              ఇక అర్జున్ బాధను ఆపడం, ఎవరి వల్ల కావడం లేదు. అర్జున్ వాళ్ళ నాన్న, ప్రియ అంత్యక్రియలు, అయిన వెంటనే హైదరాబాద్ నుండి తన ఊరికి పిలుచుకొని పోతాడు..! 

అయినా అర్జున్ కోలుకోలేక పోతాడు.. తన జ్ఞాపకాలతో ఇంకా కుమిలి. కుమిలి.. ఏడుస్తుంటాడు.. అది చూసి తట్టుకోలేక పోతారు.. అర్జున్ వాళ్ళ అమ్మానాన్నలు.. ఇలాగే కొంతకాలం అవుతుంది కానీ అర్జున్ లో మాత్రం ఏ మార్పు ఉండదు..! దీనికి ఎలాగైనా ఒక పరిష్కారం చూపించాలని అనుకుంటాడు అర్జున్ వాళ్ళ నాన్న..  అప్పుడు అర్జున్ దగ్గరికి వెళ్లి.

నాన్న ; అర్జున్... మా వల్ల కావట్లేదు రా..! నిన్ను ఇలా చూడటం...! 

అర్జున్ ; (నాన్న ని గట్టిగా కౌగిలించుకొని) సారీ.. నాన్న.. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను.. కానీ, నా వల్ల కూడా కావడం లేదు.. అందుకే నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను..!

నాన్న; వద్దురా..! నిన్ను ఈ టైం లో, ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. అందుకే దీనికి ఒక పరిష్కారం మార్గం వెతికాను.. నా మాట విని, నువ్వు నేను చెప్పినట్టు వినరా..?

అర్జున్; ఏంటి నాన్న ..?

నాన్న ; (తడబడుతూ) నువ్వు వెంటనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోరా..!

అర్జున్ ; (గట్టిగా) నాన్న నీకు ఏమైనా పిచ్చి పట్టిందా. తను చనిపోయి కొన్ని నెలలు కూడా కాలేదు ఇంతలో మీరు ఇలా ఎలా (అంతలో వాళ్ళ నాన్న)

నాన్న ; (ఇంకా గట్టిగా) అవును నాకు పిచ్చి పట్టింది.. (ఏడిస్తు) ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న కొడుకు, ఇలా కళ్ళముందే కుమిలి పోతూ ఉంటే, ఏ తండ్రి కి అయినా పిచ్చి పడుతుంది రా..! ( దగ్గరికి వచ్చి అర్జున్ బుగ్గ మీద చేయి వేసి ఆప్యాయంగా) ఒరే నాన్న, నీ గురించి నాకు బాగా తెలుసు రా..! నువ్వు చిన్నప్పుడు ఏదైనా ఇష్టపడిన వస్తువు పోయినప్పుడు, నువ్వు చాలా బాధపడే వాడివి. అప్పుడు నేను అలాంటి వస్తూనే ఎక్కడున్నా సరే దాన్ని తీసుకుని వచ్చి నీకు ఇచ్చేవాడిని. అప్పుడు నువ్వు చాలా హ్యాపీ గా ఉండేవాడివి. 

అర్జున్ ; (గట్టిగా) అయ్యో నాన్న అది వేరు ఇది వేరు..

నాన్న ; (ఇంకా గట్టిగా) మాకు ఒకటే రా..! మాకు ఒకటే..! (బాగా ఏడుస్తూ) మాలాంటి తండ్రులకు ఒకటె. మీరు ఏదైతే కోల్పోతారొ. అలాంటిదే మీకు తెచ్చి ఇస్తే,సంతోషంగా ఉంటారు.. అని చిన్న ఆశ మకు.. నీకు అలాంటి మంచి అమ్మాయిని, అంతకు మించి అందమైన అమ్మాయిని, తీసుకొని వస్తాను రా..! 

అర్జున్ ; మీరు ఎన్నైనా చెప్పండి నాన్న.. నేను దీనికి అసలు ఒప్పుకోను..! (అని వెనక్కి తిరుగుతాడు అప్పుడు తండ్రి వెంటనే కాళ్ల మీద పడి కాళ్లను గట్టిగా పట్టుకుంటాడు)

అర్జున్ ; (షాక్ అయ్యి) అయ్యో నాన్న.... ఏం చేస్తున్నారు వదలండి..! (అని క్రింద కూర్చొని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు) 

నాన్న ; (బాగా ఏడుస్తూ కాళ్లను అలాగే గట్టిగా పట్టుకొని) ప్లీజ్.. రా... ఒప్పుకోరా... నిన్ను ఇలా చూడటం.. నా వల్ల కావడం లేదు రా... ప్లీజ్ రా...!

అర్జున్ ; (బాగా ఏడుస్తూ) ఒప్పు కుంటాను నాన్న..! ముందు మీరు నా కాళ్లు వదలండి.. వదలండి..! 

      

అప్పుడు వాళ్ల నాన్న కాళ్లు వదులుతాడు.. అర్జున్ ను గట్టిగా కౌగిలించుకొని ఇద్దరూ బాగా ఏడుస్తూ...

నాన్న ; thanks..రా. thank you so much... (ఫ్లాష్ బ్యాక్ ఓవర్)

       

ఇలా అర్జున్ తన రూములో కంటినిండా కన్నీళ్లతో గతాన్ని గుర్తు చేసుకుంటాడు.. మందు కూడా అయిపోతుంది...! 

మార్నింగ్ అపర్ణ ఇల్లును, చీపురు తో క్లీన్ చేస్తూ ఉంటుంది. అర్జున్ లేచి. తన బార్డర్లో పనిచేస్తుందని చూసి. కోపంతో తన దగ్గరికి వెళ్లి, చీపురును తంతాడు.. అపర్ణ వైపు కోపంగా చూస్తూ చాలా అసహ్యించుకొని.. తను ఇంకో చీపురుతో క్లీన్ చేస్తాడు.. ఇలా తనకు సంబంధించిన పనులన్నీ తనే చేసుకుంటాడు..! ఇలా అర్జున్ పనిచేసే ప్రతి సారి. అపర్ణ, అర్జున్ కి కనబడేలా లాగా, వినపడేలా లాగా, బాగా ఏడుస్తూంది. అయినా అర్జున్ పట్టించుకోడు.. టెర్రస్ పైన, అర్జున్ తన బట్టలను ఉతుకుతూ ఉంటాడు. అప్పుడు అపర్ణ కొంచెం దగ్గర నిలబడి ఏడుస్తుంది. ఈసారి అర్జున్ కూడా చిరాకు వస్తుంది..

అర్జున్ ; ఏ ఎందుకు ఏడుస్తున్నావ్. ఇప్పుడు నిన్ను ఏమైనా తిట్టినా.. కొట్టినా.. నీకు అంతలా ఏడవాలని ఉంటే, నాకు కనిపించకుండా, వినిపించకుండా, ఎలాగైనా ఎడు నాకు అనవసరం.. ఇలా నా ముందు ఏడిస్తే నాకు చాల అసయ్యంగా ఉంది..

అపర్ణ ; (అర్జున్ చూడకుండా తలదించుకుని ఏడుస్తూ) నా వల్ల కావట్లేదు అండి. చాలా కష్టంగా ఉంది నాకు, ఇలా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే..! ప్లీజ్.. మీ పనులు చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి. ఎంత బాధ వచ్చినా సరే, మీ ముందు ఎప్పుడు ఏడవను...! 

అర్జున్ ; కుదరదు పరాయి మనిషి తో నా పనులు చేయించుకోవడం, నాకు అస్సలు ఇష్టం లేదు.

అపర్ణ ;(తలదించుకుని)  పని మనిషి అనుకోండి.. నేను కూడా పని మనిషి లాగానే పని చేస్తా...!

అర్జున్ ; అలా అనుకోవడం కూడా కుదరదు..!

అపర్ణ ; కుదురుతుంది. తాళి కట్టిన భార్యని పరాయి స్త్రీ గా అనుకునే మీకు, పనిమనిషిగా అనుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. అందుకే మీ పనులు నేనే చేస్తాను దయచేసి అడ్డు పడకండి. (అని అలా బట్టలు ఉతకడానికి ముందుకు వెళుతుంది)

అర్జున్ ; ఎంత కావాలి..? ఈ పనిమనిషికి జీతం..?

అపర్ణ ; మీ దగ్గర నుండి నా దగ్గరికి వచ్చేది, ఏదైనా సరే నాకు అది వెలకట్టలేనిది. ఎంత ఇచ్చినా సంతోషమే..!

      

ఈమాటకు అర్జున్ ఏమీ అనక కిందకు వెళ్ళిపోతాడు. ఇక అపర్ణ, అర్జున్ పనులు చేయడం మొదలుపెడుతుంది. ఈ పనులు చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అర్జున్ అవసరాలను ముందే తెలుసుకొని, చక, చకా చేసేది. ఇది తన మొదటి విజయంగా భావించింది. అపర్ణ ఇంటి అవసరాల కోసం ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే అర్జున్ తనకు ఒక్క రూపాయి ఇవ్వను అని ముందే చెప్పాడు కాబట్టి. కొంతదూరంలో అపర్ణ ఫ్రెండ్, ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ద్వారా ఆ స్కూల్ లోనే,పార్ట్ టైం, టీచర్ గా చేరుతుంది. 

          అపర్ణ తన ఫ్రెండ్ దగ్గర అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. దాంతో తన ఫ్రెండ్ ఇలా అంటుంది.

Friend ; పెళ్ళాన్ని ప్రేమగా ఎలా చూసుకోవాలో, వాడికి తెలియదు. నా మాట విను వాడికి విడాకులిచ్చేసెయ్ అని సలహా ఇస్తుంది..! 

అపర్ణ ; (కోపంగా) ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావు అంటే ఇక నుంచి నాతో మాట్లాడొద్దు..! (అని వెళ్ళి పోతూ ఉంటుంది. తర్వాత)

ఫ్రెండ్ ; స్వారీ. స్వారీ.. (అని బ్రతిమలాడితుంది. అపర్ణ కూల్ అవుతుంది.)

అపర్ణ ; నా భర్తకు ప్రేమించే మనసు ఉంది. కానీ ఆ ప్రేమించే అమ్మాయి వేరే ఉన్నారు. ఆ అమ్మాయి స్థానంలో నేను వచ్చాను. అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారు.. అందులో నాకు తప్ప అనిపించడం లేదు..!

Friend ; ఇలా ఎంత కాలమే...?

అపర్ణ ; నా ప్రేమను తను గుర్తించెంత వరకు... తర్వాత అంతా బాగా ఉంటుంది...! 

అంతలో ఒక యంగ్ టీచర్ (బాయ్) అపర్ణ ని చూసి. పరిచయం చేసుకోవాలని, హాయ్ ఐ యాం రాజ్. అని షేక్ హ్యాండ్ ఇస్తాడు..! 

అపర్ణ ; (బాగా కంగారుపడి) నమస్తే (అని చేతులతో మెఖి, తల దించుకొని వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకి వెళ్ళాక )

ఫ్రెండ్ ; ఎందుకే నువ్వు బాయ్స్ తో అసలు మాట్లాడవు.

అపర్ణ ; మా ఆయన నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అది నేను ఎవరినైనా సరే రూమ్ తీసుకొచ్చి. నా ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అంట.

ఫ్రెండ్ ; ఆ..! ప్రపంచంలో ఏ మొగుడై నా ఇలాంటి ఆఫర్ ఇస్తాడా..? 

అపర్ణ ; అందుకే, నేను ఎవరితోనైనా మాట్లాడితే, అది చూసి. తను అదే అనుకుంటాడు అన్నా ఊహ నే, భరించలేక పోతున్నాను. అందుకోసమే ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని. నేను ఎవరితో మాట్లాడను..!

       ఒకరోజు అపర్ణ ఇంటిని శుభ్రం చేస్తుండగా, అర్జున్ లేని టైంలో, అర్జున్ రూమ్ లోకి వెళ్లి, ప్రియా ఫోటోలను, ప్రియా వీడియో లను చూసి, అర్జున్ కు ఇచ్చిన గిఫ్ట్స్ లను చూస్తూ, నవ్వుతూ వాటిని శుభ్రం చేస్తూ ఉంటుంది... అప్పుడు అర్జున్ అక్కడికి సడన్ గా వస్తాడు. అపర్ణ చేతిలో ఆ గిఫ్ట్ ను చూపి. ఒక్కసారిగా ఆమె మీద కోపం గా వెళ్లి చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ ని లాక్కొని

అర్జున్ ; ఎయ్.. ఇవి నా ప్రాణం. వీటిని ముట్టుకునే అర్హత నీకు లేదు. అది ఎప్పటికీ రాదు. పనిమనిషి వి, పనిమనిషి లాగానే ఉండాలి. ఇలాంటివి ఇంకోసారి చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. గెటవుట్... (అపర్ణ కి చాలా బాధ అనిపిస్తుంది అక్కడినుంచి తలదించుకుని మౌనంగా తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతుంది)

        

         ‌      ఆ తర్వాత అర్జున్ కు మందు తాగడానికి డబ్బులు అయిపోతున్నాయి అని భావించి. మళ్లీ జాబ్  చేయాలనుకుంటాడు. జాబ్ కి వెళ్తాడు. తన ఫ్రెండ్స్.. బాసు, మళ్ళీ జాబ్ లోకి వచ్చినందుకు మెచ్చుకుంటారు... తన చెర్ లో కూర్చుంటాడు. పనిచేయడం మొదలు పెడతాడు. కానీ అదే ఆఫీసులో ప్రియ కూడా వర్క్ చేయడం వల్ల, ఆమె జ్ఞాపకాలు ఇంకా ఎక్కువగా వేధిస్తాయి  అర్జున్ కి. అది భరించలేక వెళ్ళి పోతూ ఉంటాడు. 

అది గమనించి వాళ్ళ బాస్, అర్జున్ ఎక్కడికి అంటాడు... ఈ క్వశ్చన్ చాలా చిరాకు అనిపిస్తుంది అర్జున్ కి, ఒక్కసారిగా బాస్ మీద కు కోపంగా ముందుకు వచ్చి. నేను రిజైన్ చేస్తున్నాను. అని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి. ఐడెంటి కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు... దీనికి బాస్ షాక్ అవుతాడు. అర్జున్ ఫ్రెండ్ తో నేను ఏమన్నాను. జస్ట్ ఎక్కడికి వెళుతున్నావ్, అని అడిగాను.. దానికే ఇలా చేయాలా.. ఫ్రెండ్, వదిలేయండి సార్ వాడు చాలా బాధలో ఉన్నాడు. తర్వాత నేను మాట్లాడి పిలుచుకొని వస్తాలే..! అంటాడు.

       

అర్జున అక్కడ నుండి సరాసరి. ప్రియా, తను చదివిన కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. ఈ కాలేజ్ 8 అంతస్తులు ఉంటుంది.. దీనికి వెనుక నుంచి కూడా ఒక గేటు ఉంటుంది. (సాయంత్రం కావడంతో, కాలేజ్ వెనక సైడు కావడంతో, అక్కడ జనాలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎక్కువగా ఉండరు). ఆ వెనుక గేటు ద్వారా అర్జున్ ఆ కాలేజ్ పూర్తి పై భాగానికి వెళ్లి. ఒక సైడ్ వాళ్ దగ్గర నిలబడి.  ఆకాశం వైపు చూస్తూ ప్రియతో ఇలా మాట్లాడుతాడు... 

అర్జున్; ప్రియా నా వల్ల కావట్లేదు ప్రియా. నువ్వు లేని క్షణం నుంచి నరక యాతన అనుభవిస్తున్నాను ప్రియా. అందుకే నేను నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను... కానీ నువ్వు, నన్ను. సూసైడ్ చేసుకోవద్దని ప్రామిస్ తీసుకున్నావు. నేను ఆ ప్రామిస్ కి కట్టుబడి ఉంటాను ప్రియా. అందుకే నేను సూసైడ్ చేసుకొను. కానీ నేను నీ దగ్గరికి వస్తాను. ఎలా అంటే, నువ్వు ఏమన్నావు, నీ చావు నీ దగ్గరికి వచ్చే వరకు నన్ను జీవించు అన్నావు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను...! ప్రియా నీకు గుర్తుందా..? మనం రోజు ఈ టెర్రస్ మీద కలుసుకునేవాళ్ళం.. ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. నువ్వు ఈ సైడ్ వాల్ పైకి నిలబడి. నా చెయ్యి పట్టుకొని పరిగెత్తే దానివి. నీకు ఈ సైడ్ వాల్ పైన నుంచి సిటీ ని చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే నేను నీ దగ్గరికి రావడానికి ఈ కాలేజ్ సైడ్ వాల్ ని ఎంచుకున్నాను..!  నేను ఇప్పుడు. దీని మీద నిలబడి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, నీ జ్ఞాపకాలను తలుచుకుని నడుస్తాను..! మధ్యలో కానీ, చివర్లో కానీ, నేను కిందకి పడిపోతూ ఉన్నాను అని అనిపిస్తే, నేను ఆగి పోతాను..! అలా నాకు అనిపించకుంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రియా..!  ఇది నా దృష్టిలో సూసైడ్ మాత్రం కాదు ప్రియా. ఇది ఒక ఆక్సిడెంట్.. ఎందుకంటే నేను నీ ప్రేమలో మైమరిచి, ముందు చూసుకోకుండా కిందకి పడిపోతాను..! నా అదృష్టం బాగుంటే నేను ఈరోజే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఒకవేళ మిస్ అయితే,  రోజు ఈ టైం కి ఇలానే చేస్తాను. ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాను ప్రియా. ఇక స్టార్ట్ చేస్తున్న...! 

అని ఆ ఎనిమిది అంతస్తుల కాలేజ్ బిల్డింగ్ పైన ఉండే సైడ్ వాల్ మీద నిలబడతాడు ప్రియా నీ తలుచుకుంటూ, ఆకాశం వైపు చూస్తూ. ముందుకి అడుగు వేసాడు. ప్రియా బాగా గుర్తుకు వస్తుంది ఆమె జ్ఞాపకాలతో ఆ గోడ పైన అలాగే ముందుకు నడుస్తాడు...! సగానికిపైగా నడిచిన తర్వాత, ఇంకా కొంత దూరంలో ఉండగానే, అర్జున్ కు ఫోన్ వస్తుంది. ఆ వైబ్రేటింగ్ రింగ్ టోన్, వల్ల ప్రియా జ్ఞాపకాల నుండి బయటకు వస్తాడు. ఓ ప్రియా అని బాధతో అనుకొని క్రిందకు దిగుతాడు. ఎవరు ఫోన్ చేశారు, అని ఫోన్ చుసుకుంటాడు. ఆ ఫోన్ చేసింది వాళ్ళ నాన్న..  ఎందుకు నాన్న నేనంటే నీకు ఇంత ప్రేమ. ప్రియ దగ్గరికి వెళ్లకుండా చేశావు కదా..! అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.. కొద్దిసేపు వాళ్ళ నాన్న తో మామూలుగా మాట్లాడు..! ఫోన్ పెట్టాక.. కొంచెం బాధతో పైకి చూస్తూ.. ఈరోజు కుదరలేదు ప్రియా రేపు మళ్ళీ ట్రై చేస్తా... అని ఇంటికి వెళ్తాడు ...! 

ఇక నెక్స్ట్ డే, కూడా ట్రై చేస్తాడు. ఈసారి ఫోన్ స్విచాఫ్ చేస్తాడు... ప్రియా నీ తలుచుకుంటూ. గోడపైన నడవడం మొదలు పెడతాడు. ఈసారి మరి కొంత దూరం వెళ్ళాక బెలూన్స్ పగిలిపోయిన శబ్దం వినబడుతుంది. దానివల్ల డిస్టర్బ్ అయి మళ్లీ కిందకు దిగుతాడు.. ఏంట్రా ఈ శబ్ద అని పక్కకు చూస్తే కొంత మంది పిల్లలు బెలూన్ తో ఆడుకుంటున్నారు... 

ఇలా అర్జున్ కు రోజు ఏదో ఒక కారణం వల్ల డిస్టర్బ్ అయి. తను ప్రియ దగ్గరికి వెళ్లడం పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి సారి డిస్టర్బ్ అవ్వడం, అసలు నచ్చదు అర్జున్ కు. తనమీద తనకి చాలా కోపం వస్తుంది...

       ఆ కోపంతోనే రోజు కన్నా ఈసారి బార్ లో మందు ఎక్కువగా తాగుతాడు, అర్ధరాత్రి దాటింది. అపర్ణ ఇంట్లో బాగా టెన్షన్ పట్టుకుంది.. అప్పుడు కాలింగ్ బెల్ మోగుతోంది. కొంత రిలాక్స్ అయి తలుపు తీస్తుంది అపర్ణ. ఎదురుగా అర్జున్ ఫుల్ గా తాగి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంటాడు.. తూలుతూ లోపలికి వస్తాడు. అందువల్ల కిందకి పడిపోతూ వుంటాడు.. అపర్ణ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది. అది గమనించి అర్జున్. 

అర్జున్ ; ఏయ్ డోంట్ టచ్, డోంట్ టచ్, (గట్టిగా) నీకు ఆ అర్హత లేదు.. (లేచి చొక్కా బటన్స్ విప్పుతూ తన రూమ్ లోకి వెళుతూ.) నువ్వంటే ఇష్టం లేదు అన్నా వినకుండా పెళ్లి చేసుకున్ని నన్ను టార్చర్ పెడుతున్న దయ్యాని వీ నువ్వు.. నీకు నన్ను ముట్టుకుని అర్హత లేదు..

( అని చొక్కా ని విప్తి అలా విసరి. అలా బెడ్ మీద పడతాడు. ఆ షట్టు, ప్రియా, ఇచ్చిన గిఫ్ట్ మీద పడుతుంది. అందువల్ల అవి కింద పడి కొన్ని విరిగిపోతాయి) అర్జున్ నిద్రమత్తులో ఏదో పడినట్లు ఉన్నాయి. అని అనుకుని అలాగే నిద్రపోతాడు..

       

అపర్ణ వెంటనే వాటిని సరి చేయడానికి వెళ్తుంది. సరిగ్గా ఆ గిఫ్ట్ ను ముట్టుకునే సమయానికి, అపర్ణ కి అర్జున్ అన్న మాట గుర్తుకు వస్తుంది. (ఇవి నా ప్రాణం వీటిని అందుకునే అర్హత నీకు లేదు. అని అన్న మాట) అపర్ణ చేతి వేళ్ళను ముడుచుకొని, బాధతో కన్నీళ్లు కారుస్తూ, అర్జున్ వైపు చూస్తూ. కన్నీళ్లతో తన రూమ్ లోకి వెళ్ళింది.

       

మార్నింగ్ అవుతుంది... అర్జున్ నిద్ర లేచి వాటిని చూస్తాడు. ఏంటి ఇవి ఇలా అయ్యాయి. అని వాటి దగ్గరికి పోతాడు. ఒక గిఫ్టు పగిలిపోయింది చూసి. ఇది అపర్ణ చేసిన పని అయి ఉంటుందని భావించి. కోపంతో అపర్ణ..అపర్ణ..అని గట్టిగా అరుస్తాడు.. అపర్ణ ఆశ్చర్యంగా కంగారు.. కంగారుగా.. వంటగదిలో నుంచి వస్తుంది... 

అర్జున్ ; (కోపంగా) వీటిని ముట్టుకో వద్దని చెప్పాను కదా..! ఎందుకు ఇలా చేశావు. అని చెంపమీద గట్టిగా కొడతాడు. అపర్ణ, అర్జున్ నీ ఒకసారి చూసి. చెంప మీద చేయి వేసుకొని. మౌనంగా లోపలికి వెళుతుంది.

అర్జున్ ; చ.. ఇది నన్ను మనశాంతిగా ఉండనివ్వదు. (అని వాటిని సర్దుతూ ఉంటాడు. అప్పుడు అతనికి తన చొక్కా కనపడుతుంది. రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది..) ఓ.. (అని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు అతనికి అంతకుముందు, అపర్ణ తో, అన్న మాట కూడా గుర్తుకు వస్తుంది. అది వీటిని ముట్టుకునే అర్హత నీకు లేదు అని) చ... ఎంత పొరపాటు చేశాను.

అనుకొని గిల్టీగా ఫీలవుతాడు. అపర్ణ వెళ్లిన వైపు చూస్తూ.. స్వారీ చెబుదామా.. వద్దా.. అని ఆలోచిస్తుంటాడు.. 

        

లోపల అపర్ణ కొంచెం ఆనందంతో, తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్ ఫోన్ తీసి హలో అంటుంది.

అపర్ణ ; ఏయ్ ఈరోజు, నా లైఫ్ లో మర్చిపోలేని రోజు...! 

ఫ్రెండ్ ; అవునా..!  ఏమి జరిగింది...?

అపర్ణ (స్మాల్ ఎగ్జైటింగ్ ఫీలింగ్ తో) ఫస్ట్ టైం, మా ఆయన నన్ను పేరుతో పిలిచాడు. అలాగే ఫస్ట్ టైం, నన్ను టచ్ చేశాడు...! 

ఫ్రెండ్; సూపర్.. ఇంతకీ ఆ టచ్ ఫీలింగ్ ఎలా ఉంది...! ఆ

అపర్ణ ; (తన చేయిని చెంపమీద అలా నిమురుకుంటూ) చాలా బాగుంది..! 

ఫ్రెండ్ ; ఓ చాలా బాగుందా..! (కొంటెగా) ఇంతకీ ఎక్కడ టచ్ చేశాడు..? 

అపర్ణ ; నా బుగ్గమీద...

ఫ్రెండ్ ; కొట్టాడు కదూ..?

అపర్ణ ; అలాంటిదే. పర్లేదు అయినా అలా టచ్ చేసినా కూడా నాకు సంతోషం...! (కంటి నిండా నీళ్ళతో నవ్వుతూ)

ఫ్రెండ్ ; (కళ్ళలో నీళ్లు తిరుగుతాయి) ప్లీజ్ ఫోన్ పెట్టవే.. ఇంకొక్క మాట నీతో మాట్లాడిన నేను ఎక్కువగా ఏడుస్తాను.. ఫోన్ పెట్టు..

అపర్ణ ; ఎందుకే...?

ఫ్రెండ్ ; ఎందుకు అంటావ్, ఏంటే మెంటల్ దానా..! (చిన్నగా ఏడుస్తూ) మొగుడు కొట్టిన నన్ను తాకాడు.. అని ఆనంద పడె నీలాంటి దాన్ని తో.. మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు...

అపర్ణ ; అలా కాదు.. నేను హ్యాపీగానే... (అంతలో) 

ఫ్రెండ్ ; ప్లీజ్ ఫోన్ పెట్టు. అని ఫోన్ కట్ చేస్తుంది..

       

              ఈ మాటలన్నీ, గిల్టీ ఫీలింగ్ తో, సారీ చెప్పడానికి వచ్చిన అర్జున్ వింటాడు.. ఇక అర్జున్ కు ఏం మాట్లాడాలో తెలియక, అయోమయంగా అక్కడి నుండి వెళ్ళి పోతాడు.. స్వారీ చెప్పకుండానే...! అపర్ణ మంచి అమ్మాయి గా, అర్జున్ కొంచెం ఫీల్ అవుతాడు...

             సాయంత్రం అపర్ణ స్కూల్లో, తన స్టాప్ రూమ్ లో, కూర్చొని ఏదో రాస్తూ గోడ గడియారం ను చూస్తుంది. టైం 4:15 అయ్యుంటుంది. ఇంకా 15ని, టైం ఉంది అనుకొని అలాగే రాసుకుంటుంది...! అంతలో, కొంత మంది పిల్లలు అక్కడికి వచ్చి, అందులో ఒకడు, టీచర్ ఈరోజు ఆడుకోవడానికి మాకు బాణాలు ఇస్తాను అన్నారు...

అపర్ణ; దానికి ఇంకా టైం ఉంది గా.. మీ ట్యూషన్ అవ్వగానే వెళ్దాము..!

స్టూడెంట్ ; ట్యూషన్ అయిపోయి, చాలాసేపు అయింది గా...!

       

అపర్ణ షాక్ అవుతుంది. ఆశ్చర్యంగా గోడ గడియారం ని చూస్తుంది. టైం 4;15 అయి ఉంటుంది. టెన్షన్ తో తన మొబైల్లో టైం చూసుకుంటుంది. ఒక్కసారిగా కాళ్ళు, చేతులు వణకటం, మొదలయ్యాయి. మొబైల్ లో టైం 4;58 అయింది. అపర్ణ బాగా టెన్షన్ తో చెమటలు పడతాయి. ఓ మై గాడ్ మా ఆయన స్టార్ట్ చేసే టైం అయింది..

       

అక్కడ అర్జున్ ప్రియా, దగ్గరికి వెళ్లడానికి(అంటే చావడానికి) కాలేజ్ బిల్డింగ్ పైన, సైడ్ వాల్ ను ఎక్కుతూ ఉంటాడు... 

ఇక్కడ అపర్ణ O.. No... No... అనుకుంటూ. ఏడుస్తూ, పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్లేందుకు.. School, బయటకు వచ్చి. రోడ్ పైన పరిగెత్తుతూ.. అర్జున్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు ఇంకా స్పీడ్ గా ఏడుస్తు పరుగెత్తుతుంది. అపర్ణ స్కూల్ దగ్గర్లోనే, అర్జున్ కాలేజీ వెనుక వైపు ఉంటుంది... అపర్ణ ఆ కాలేజీ బ్యాక్ గేటు దగ్గరికి వచ్చి. పైకి చూసింది. అర్జున్ సగానికి పైగా ముందుకు వచ్చి ఉంటాడు. అపర్ణ కి ఏం చేయాలో తెలియక, చుట్టుపక్కల చూస్తుంది. ఎవరు ఉండరు. ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలని.  పరిగెత్తుకుంటూ కాలేజ్ మెట్లను ఎక్కుతుంది.. మద్యలో ఒక చోట క్రిందకు పడుతోంది. అందువల్ల తలకు గాయమై రక్తం కారుతుంది... అక్కడ అర్జున్ ప్రియా ను, తలుచుకుంటూ, చివరిదాకా వచ్చి ఉంటాడు..

 

ఇక్కడ అపర్ణ మళ్ళీ లేచి పరిగెత్తి మేడ మీదకు, చేరుకొని. అర్జున్ ను చూస్తుంది. అర్జున్ ఇంకో మూడు, నాలుగు, అడుగులు వేస్తే క్రిందకు పడిపోతాడు...!  అపర్ణ వెంటనే చేతితో గొంతును పట్టుకొని, ప్రియా లగా, మిమిక్రీ చేసి. అర్జున్... అని గట్టిగా.. అరుస్తుంది...! అర్జున్ చివరి అడుగులో, మేల్కొంటాడు..! అందువల్ల ఆగి పోతాడు...! అపర్ణ అది గమనించి. వెంటనే పక్కన ఉన్న పిల్లర్ దగ్గర, నోరు ను గట్టిగా పట్టుకుని దాక్కుంటుంది...! అర్జున్ దిక్కులు చూసి. ఇది ప్రియ వాయిస్ లాగానే ఉంది..! అనుకుంటూ... చుట్టుపక్కల చూస్తాడు. ఎవరూ కనిపించరు. అప్పుడు అర్జున్ ప్రియ తో చివరికి నీ దగ్గరికి రావడానికి, నువ్వే నన్ను ఆపుతున్నావా ప్రియా.. అనుకొని బాధతో కిందకు దిగు తాడు..! పిల్లర్ వెనకాల అపర్ణ అర్జున్ దిగింది గమనించకే... అప్పుడే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది.. తనకు...! గట్టిగా ఏడవాలని ఉన్న సౌండ్ రాకుంటగానే.. కన్నీళ్లు దారానంగా వస్తుంటాయి అపర్ణ కి...! 

అక్కడ చావ లేక పోయాను అని బాధతో అర్జున్... ఇక్కడ పిల్లర్ వెనకాల.. తన భర్తను కాపాడుకున్నాను అని, ఆనంద భాష్పాలతో అపర్ణ రిలాక్స్ అవుతుంది. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తూంటుంది... కళ్ళు మూసుకుని. మెల్లిగా జరిగిన సంఘటనలను, తలచుకుంటూంది..! 

(చిన్న ఫ్లాష్ బ్యాక్)

      

             ఆ రోజు అర్జున్, జాబ్ కి రిజైన్ చేసి. బాధతో కాలేజీకి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, స్కూల్ దగ్గర ఉన్న అపర్ణ, అర్జున్ ను చూసి, ఫాలో అవుతుంది.. అప్పుడు అర్జున్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి. సైడ్ వాల్ దగ్గర నిల్చొని. ఆకాశం వైపు చూస్తూ. ప్రియ తో మాట్లాడిన మాటలను అన్నీ ఒక చోట ఉండి వింటుంది. అపర్ణ..! 

     

                అర్జున్ ఇలా చనిపోవాలని అనుకుంటున్నాడని.. చాలా బాధపడుతుంది.. అపర్ణ. ఆపాలని ముందుకు పోతుంది.. అప్పుడు తనకి ఒకటే అనిపిస్తుంది.. నేను చెబితే వినడు.. ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి అయినా ఇలాంటివి చేస్తాడు.. కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే.. ఆగిపోతాడు.. 

ఇలా కొద్దిరోజులు డిస్టర్బ్ చేస్తే.. ప్రియ పైన ప్రేమ తగ్గిందని. ప్రతి సారి డిస్టర్బ్ అవుతుందని. ఏదో ఒకరోజు కంప్లీట్ గా దీన్ని మానుకుంటాడు. అని అనుకుంటుంది అపర్ణ..!  

       

అలా అనుకుంటూ ఉండగా.. అర్జున్ గోడా ఎక్కుతాడు. అది చూసి అపర్ణ బాగా టెన్షన్ కు లోనై, ఓ మై గాడ్ ఎక్కేస్తున్నాడు, ఇప్పుడు ఎలా ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపు తున్నాను అని. అతనికి తెలియకూడదు. ఎలా చేయాలి..? ఎలా.. ఎలా.. ఎలా.. అని అనుకుంటూ.. వెంటనే మొబైల్ తీసి. అర్జున్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, ఇలా అంటుంది...! మామయ్య.. ఆయన ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడొ..? ఫోన్ చేసి కనుక్కుంటా రా ప్లీజ్... అర్జెంట్..! అర్జున్ నాన్న, సరే అని. అర్జున్ కు ఫోన్ చేస్తాడు...! దాంతో డిస్టర్బ్ అయి, ఆగిపోతాడు అర్జున్...! అమ్మయ్య.. అని ఊపిరి పీల్చు కుంటుంది.. అపర్ణ. అప్పటినుండి రోజు ఆ టైం కి, అర్జున్ కంటే ముందే వచ్చి. సౌండ్ వచ్చేలాగా.. అర్జున్ డిస్టర్బ్ అయ్యేలాగా.. ప్లాన్ చేసుకొని.. తన భర్తను కాపాడుకుంటుంది అపర్ణ.. కానీ ఈరోజు జరిగింది మాత్రం తట్టుకోలేక పోతుంది...! 

       

నెక్స్ట్ డే, మార్నింగ్.. అర్జున్ టిఫిన్ చేస్తుండగా.. అలా అద్దం వైపు చూస్తాడు.. అద్దంలో అపర్ణ కనబడుతుంది... అందులో అపర్ణ తలకు ఒక బ్యాండేజ్, వేసుకొని ఉంటుంది..! అప్పుడు అర్జున్ తనకి ఈ గాయం ఎలా అయింటుంది..? అని ఆలోచిస్తూ.. నిన్న నేను కొట్టినందుకు అయిందా..? మరి అంత గట్టిగా కొట్టిన నా..? చ... నామీద నాకే అసహ్యం వేస్తుంది...!  అనుకొని. అపర్ణ కి స్వారీ చెప్పడానికి ముందుకు వెళతాడు..!

        

అపర్ణ అటు తిరిగి ఏదో పనిచేస్తు ఉంటుంది.. అపర్ణ అని పిలవడానికి ట్రై చేస్తాడు. కానీ మాట రాదు.. అప్పుడు అతను సారీ చెప్పడం పరిష్కారం కాదు.. దీనికి ఇంకొక మార్గం వెతకాలి.. అనుకొని తన బెస్ట్ ఫ్రెండ్ ని కలుస్తాడు..!  

      

అర్జున్ ఫ్రెండ్ కి, అర్జున్ గురించి. అపర్ణ గురించి. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న లైఫ్ గురించి. అంతా తెలుసు...! అందువల్ల అర్జున్ అపర్ణ కి విడాకులు ఇచ్చి. తన ఫ్రెండ్ తో రెండో పెళ్లి చేయాలని అనుకుంటాడు..! వాళ్ళ ఫ్రెండ్ ని బలవంతంగా ఒప్పిస్తాడు...! అప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు.. అపర్ణ వాళ్ళని చూసి తన రూమ్ లోకి వెళుతూ ఉంటుంది..! 

అర్జున్ ; అపర్ణ...! (అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు...) 

   

              ఆ పిలుపుకి అపర్ణ కి, గుండెల్లో సునామి మొదలవుతుంది.. పట్టరాని ఆనందంతో, ముఖం కళకళలాడుతుంది. ఆ ఆనందాన్ని అలాగే దిగ మింగుకొని.. అర్జున్ వైపు తిరిగి, తల దించుకొని. మెల్లగా చెప్పండి...! (అంటుంది)

అర్జున్ ;  నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా..! (అపర్ణ ముందుకు వస్తుంది. అర్జున్ తడబడుతూ) నీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..!  సూటిగా చెప్తున్నాను.. ఈసారైనా అర్థం చేసుకో...! (ఏం చెబుతాడో అని, అపర్ణ కు కంగారు మొదలవుతుంది) నువ్వు చాలా మంచి దానివి అపర్ణ.. నీలాంటి అమ్మాయికి ఇలాంటి కష్టం ఉండ కూడదు.. మన లాంటి జీవితం ఎవరికి ఉండకూడదు...! అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సునీల్..! 

(అపర్ణ ఒకసారి అతని వైపు చూస్తుంది) 

ఫ్రెండ్; హాయ్..! (అంటాడు)

అర్జున్ ; వీడికి మనిద్దరి లైఫ్ గురించి బాగా తెలుసు..!  వీడు చాలా మంచివాడు..! మంచి జాబ్ కూడా ఉంది..! అందుకే నాకు విడాకులు ఇచ్చి. వీడ్ని నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి..!

(గుండె బద్దలవుతుంది.. అపర్ణ కి, అర్జున్ మీద ఫస్ట్ టైం చాలా కోపం వస్తుంది..) 

అర్జున్ ; ప్లీజ్.. అపర్ణ... అర్థం చేసుకో. నీకు మంచి లైఫ్ ఉంటుంది.. నువ్వు ఒప్పుకుంటే, నాన్నకు తెలియకుండా.. సీక్రెట్ గా పెళ్లి చేసి. కొంతకాలం దా చూద్దాం.. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది..! 

(ఎందుకంటే నేను ప్రియా దగ్గరికి వెళ్తున్నాను.. అని మనసులో అనుకుంటాడు..) 

అపర్ణ ; (చాలా కూల్ గా) సరే నండి.. నీ ఇష్టం..! 

ఈమాట కి అర్జున్ చాలా సంతోష పడతాడు... ఫ్రెండ్ అయితే భారీగా షాక్ అవుతాడు...! 

అర్జున్; (సంతోషంగా) థాంక్యూ.. నువ్వు ఇంత ఈజీగా సరే అంటావు.. అని నేను అనుకోలేదు...?

అపర్ణ ; (మెల్లగా) కానీ నాకు ఒక చిన్న డౌటు.. మన లాంటి జీవితం. ఏ ఒక్కరికి రాకూడదని. కోరుకుంటున్నారు.. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇస్తున్నారు...?

అర్జున్ ; మన లాంటి జీవితం ఎందుకు అవుతుంది..! మీ ఇద్దరి మంచి వాళ్ళు కాబట్టి చాలా బాగుంటారు...! 

అపర్ణ ; కచ్చితంగా మన లాగే ఉంటుంది.. మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే..! నా స్థానంలో అతను. నీ స్థానంలో నేను ఉంటాను.. ఎందుకంటే అప్పుడు నాది కూడా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది.కాబట్టి..( అపర్ణ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి కోపంగా) మా ఆయన కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను.. కానీ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు.. ఫ్రెండ్ పెళ్ళాన్ని కోరుకున్నందుకు.. ఇంకా అసహ్యంగా ఉంది.. అయినా నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటే.. అప్పుడు నీతో, నేను, ఎలా ఉన్నా. అది నా తప్పు అయితే కాదు..( ఈమాట అర్జున్ కు తగులుతుంది) అప్పుడు నేను ఎలాగైనా ఉంటా..! మందు తాగుతా.. నిన్ను అసలు పట్టించుకోను... నీ మీద కోపంతో ఇంకొకరిని.... 

ఫ్రెండ్ ; (అంతలో ఆపి) అర్థమైంది సిస్టర్.. ఈ డైలాగ్ ఎంత పవర్ ఫుల్ లో, నాకు తెలుసు..! నీ గురించి, మీ క్యారెక్టర్ గురించి, నాకు బాగా తెలుసు సిస్టర్. వీడికి అర్థం కావాలనే ఇలా వచ్చాను.. స్వారీ సిస్టర్ నేను వెళ్తాను.. (అని వెళ్ళిపోతాడు..) 

   

అపర్ణ కోపంగా తన రూమ్ లోకి వెళుతూ ఉంటుంది...

అర్జున్ ; నువ్వు, నన్ను, ఎప్పటికీ అర్థం చేసుకోలేవు..!

అపర్ణ ; అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను... చివరిదాకా నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను...!

అర్జున్ ; ప్రేమించావా..? నన్ను ప్రేమించడం ఏమిటి అసహ్యంగా...! నేను ఏ రోజు నీకు ఆ ఫీలింగ్ కలిగేలా, నడుచుకో లేదు...! 

అపర్ణ; అందుకే ప్రేమించాను.. నువ్వు నాతో అలా ఉన్నందుకే, నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించాను... నా ప్రేమకు ఇన్స్పిరేషన్, ఏమిటో తెలుసా..? నీ ప్రేమ. నీ స్వచ్ఛమైన ప్రేమ..! (కొంచెం బాధతో) అరె.. ఒకరిని ఇంతగా ప్రేమించొచ్చా..? అని మిమ్మల్ని చూసే తెలుసుకున్నాను..! ఒకరి కోసం ఇంతగా బాధపడతారా..? అని మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను..! మీరు ప్రియా కోసం.. పరితపిస్తూ ఉంటే. నాకే చాలా బాధనిపించింది..! అందుకే మీరు నా దగ్గర ఎలా ఉన్నా.. నన్ను ఎంత ద్వేషించినా.. తిట్టినా.. కొట్టినా.. నాకు నీ తప్పు, కనపడేది కాదు. ప్రియ పైన ఉండే ప్రేమే కనబడేది...! అందుకే నేను మిమ్మల్ని ప్రేమించడం తప్ప. మరొకటి అనిపించేది కాదు...! ఇప్పుడు నేను నా ప్రేమను ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాను.. ఇందాక నన్ను, పేరుతో, పిలిచినప్పుడు. నా గుండెల్లో అలజడి మొదలైంది..! గుండె ఒక్కసారిగా బరువెక్కింది.. చాలా బాగుందండి ఈ ప్రేమ..!(లైట్ గా కన్నీళ్లు వస్తాయి) ఒక్కోసారి నామీద నాకే, చాలా గర్వంగా.. అనిపిస్తుంది.. ఎందుకో తెలుసా..? నేను ఒక గొప్ప ప్రేమికుడిని. ప్రేమిస్తున్నాను.. అని గర్వంగా ఫీల్ అవుతుం‌టాను.. ఈ జన్మకి ఇది చాలు నాకు...! 

 

ఈ మాటలకు అర్జున్ కూడా ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతాడు.... అపర్ణ అలా ముందుకు పోయి.. మళ్లీ ఆగి. అర్జున్ వైపు చూస్తూ...

అపర్ణ ; మరి నాకు మాట్లాడే అవకాశం. ఉంటుందో, ఉండదో, నాకు తెలియదు.. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పనా ..? (కళ్ళలో నీళ్ళు తో ) 

అర్జున్ ; చెప్పు ...! 

అపర్ణ ; (అర్జున్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ..) I Love You... I Love You So Much... ఎంతగా అంటే, ఈ ప్రపంచంలో దేనితో పోల్చా లేనంతగా... I Love You.. (అంటూ.. ఏడుస్తూ. రూమ్ లోకి వెళుతుంది..)

అర్జున్ ; (గట్టిగా ఊపిరి వదుల్తూ) దీన్ని కూడా ప్రేమ పిచ్చెక్కింది..! ఇక దీన్ని వదిలించుకోవడం కష్టమే...! 

     

ఇక తర్వాతి రోజు.. అర్జున్ రోజు లాగానే కాలేజ్ బిల్డింగ్ సైడ్ వాల్, పై నిల్చుని ఉంటాడు... కొంతదూరంలో అపర్ణ డిస్టర్బ్ చేయడానికి. ఒక ప్లాన్ వేసుకొని. పిల్లర్, వెనకాల దాక్కొని. అర్జున్ ను గమనిస్తూ.. ఉంటుంది...! అర్జున్ ప్రియ ని తలుచుకుని. నడవడం మొదలు పెడతాడు...! జస్ట్ ఒక అయిదారు అడుగులు వేసే లోపే, I Love You అని అపర్ణ చెప్పిన మాట.. గుర్తుకు వస్తుంది.. దాంతో డిస్టర్బ్ అయి, ఆగిపోతాడు...!

అర్జున్ ; ఇది గుర్తొచ్చింది ఏంటి...! (అని ఆ గోడ పైన కూర్చుని దీర్ఘంగా ఆలోచించాడు..)

      

ఇది గమనించిన అపర్ణ షాక్ అవుతుంది. ఏంటి నేను ఏమి చేయకుండానే ఇంత త్వరగా ఆగిపోయాడు..? అని మనసులో అనుకుంది..! నా ప్లాన్ వర్కవుట్ అయినట్టు ఉంది.. మెల్లమెల్లగా ప్రియా జ్ఞాపకాల నుండి కోలుకుంటున్నాడు.. అని సంతోషపడుతుంది అపర్ణ..! 

    

ఆ తర్వాత అర్జున్ ఇంట్లో ఉండగా అపర్ణ పైన అప్పుడప్పుడు ఒక లుక్కు వేసుకుంటాడు. అది గమనించి అపర్ణ లోలోపల చాలా ఆనందపడుతుంది...! ఆ తర్వాత అర్జున్ కు వాళ్ళ నాన్న నుండి ఫోన్ వస్తుంది..!

నాన్న ; (ఫోన్ లో) నేను హైదరాబాద్ లో ఉన్నాను.. ఇక్కడు క్యాంటీన్ దగ్గర ఉన్నాను.. నీతో కొంచెం మాట్లాడాలి.. వెంటనే రా.. ! (అర్జున్ వెంటనే అక్కడికి వెళ్తాడు)

నాన్న ; ఏరా ఎలా ఉన్నావ్..? అమ్మాయి ఎలా ఉంది...? 

అర్జున్ ; ఆ..బాగున్నం.. నాన్న, నేను కూడా తన తో బాగున్నాను.. అంతా హ్యాపీ...! 

నాన్న ; నిన్నా నీ ఫ్రెండ్ కి ఫోన్ చేశాను...! వాడు నాకు అంత చెప్పాడు...! ఎందుకురా..! ఆ అమ్మాయిని వదిలించుకోవాలని.. అనుకుంటున్నావు. ఆ అమ్మాయి చాలా మంచిది రా... నువ్వు అలా బాధ పెట్టడం, కొట్టడం, కరెక్ట్ కాదు...! 

అర్జున్ ;( కోపంగా) నాన్న ప్లీజ్ .. తనకి పెళ్లికి ముందే, అంత వివరంగా చెప్పాను.. అయినా వినకుండా. నన్ను పెళ్లి చేసుకుని, తప్పు చేసింది..  ఇప్పుడు తనతో నేను, ఎలా ఉన్నా.. అది నా తప్పు అయితే కాదు...! 

నాన్న ;  అర్జున్.. ఒక క్వశ్చన్.. అడుగుతాను.. సూటిగా సమాధానం చెప్పారా... నువ్వు ఎందుకు పెళ్లి కి ఒప్పుకున్నవు...? ( ఈ క్వశ్చన్ కి అర్జున్ సమాధానం. చెప్పడానికి సతమతమవుతాడు..)  పరవాలేదు చెప్పరా...? 

అర్జున్ ;  నీ కోసమే ఒప్పు కున్నాను..! 

నాన్న ; అంటే నేను ఒక మాట చెప్పగానే ఒప్పుకున్నావా..? లేదా నేను ఏదైనా చేస్తే ఒప్పుకున్నావా.. ?

అర్జున్ ; నాన్న ప్లీజ్.. దాన్ని వదిలేయండి.. దాన్ని తలుచుకుంటే భరించలేక పోతున్నాను...!

నాన్న ; నువ్వు చెప్పటానికి కూడా ఇబ్బంది పడ్డె, పని నేను చేశాను కదా..! పర్వాలేదు నేను చెప్తాను.. నేను నీ కాళ్లు పట్టుకొని.. బ్రతిమిలాడితే, ఒప్పుకున్నావ్... అవునా.. కాదా...?

అర్జున్; (గట్టిగా) నాన్న ప్లీజ్... ఇప్పుడు అది ఎందుకు..?

నాన్న ; (కొంచెం బాధ తో) ఎందుకంటే నిన్ను ఎలాగైతే, కాళ్లు పట్టుకొని బ్రతిమలాడి, ఒప్పించానో. అపర్ణ ని కూడా, అలాగే కాళ్ళు పట్టుకుని.. బ్రతిమిలాడి, ఒప్పించాను..!!!

(ఈమాటకు అర్జున్ గుండె చెరువు అవుతుంది..)

అర్జున్; ఏంటి నాన్నా మీరు చెప్పేది...?

నాన్న ; (కన్నీళ్లు తుడుచుకుంటూ) నువ్వు తనతో పెళ్లికి వద్దన్న.. తర్వాత, తను కూడా ఒప్పుకోలేదు.. నువ్వు ఇంతలా చెప్పిన, తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే బాగుండదు.. అని కూడా చెప్పింది..!  అప్పుడు నేను ప్రియా చనిపోయిన విషయాన్ని, నువ్వు పడే ఆవేదన నీ, నీ గురించి అంతా వివరంగా చెప్పాను...! ఏడుస్తూ, నా కొడుకుని. ఎలాగైనా బ్రతికించమని కాళ్లు పట్టుకొని వేడుకున్నాను..!  తను అప్పుడు నా బాధని, నీ ప్రేమను అర్థం చేసుకుని.. పెళ్లికి ఒప్పుకుంది..! 

అర్జున్ ; (ఏడుస్తూ) చ.. ఎందుకు నాన్న ఇలా చేసావు...? 

నాన్న ; ( బాగా ఏడుస్తూ ) నీ కోసం... నువ్వు బాగుండడం కోసం... నేను ఏదైనా చేస్తాను రా.... ఆఫ్ట్రాల్ ఈ కాళ్లు పట్టుకోవడం ఎంత..? (అప్పుడు ఇద్దరు కొద్దిసేపు ఏడుస్తారు) రేయ్ నువ్వు ఎలాగైనా అనుకోరా..! అపర్ణ మాత్రం.. చాలా.. మంచి అమ్మాయి రా.. ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం...!  భూదేవికి ఉన్నంత ఓర్పు తనకు ఉందిరా...! నేను కూడా తనని, బలవంతంగా ఒప్పించాను కదా అని, ఏమైనా ఇబ్బంది పడుతుందో, బాధ పడుతుందో నన్ని.. ఫోన్ చేసి అడిగితే తను ఏంచెప్పిందో తెలుసా రా...!?

అపర్ణ ; (ఆ రోజు అర్జున్ నాన్న తో ఫోన్లో మాట్లాడినప్పుడు..) మావయ్య.. నేను ఇప్పుడు ప్రేమలో ఉన్నాను...! మీకు తెలుసా..? ప్రేమలో ఉన్నవాళ్లకి.. మీరు చెప్పే ఇబ్బందులు... బాధలు.. కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి...! ఎందుకో తెలియదు. తను తాళి కట్టిన మరుక్షణం నుంచి తనని ప్రేమించడం మొదలుపెట్టాను...! తర్వాత తనని, తన ప్రేమను, అర్థం చేసుకున్న తర్వాత.. రోజురోజుకు ఆయన మీద, ప్రేమ ఇంకా ఎక్కువైంది..! ఎంతగా అంటే..? ప్రియ కూడా అంతగా.. ప్రేమించి ఉండదేమో..? అని అనిపిస్తుంది..!  ఇప్పుడు మీరు మా అబ్బాయి ని వదిలేయ్.. అని అంటే..! నేను మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతాను.. నాకు తనే కావాలి అని..! 

నాన్న ; (అర్జున్ తో కన్నీళ్లు తుడుచుకుంటూ) ఆ మాటలకు నాకు, పట్టా రాని... సంతోషం... వచ్చింది రా...! నువ్వు తనని ఎంత ద్వేషిస్తే... తను అంతకంటే ఎక్కువగా ప్రేమించింది..! ఎక్కడ దొరుకుతారు.. రా.. ఇలాంటి వాళ్ళు...!!! ఇక నీ ప్రేమ విషయానికి వస్తే.. ప్రియా చనిపోయింది రా..! మనం ఏం చేసినా, తను తిరిగి రాదు...! "మనకు ఇష్టమైన వాళ్ళు పోయినప్పుడు.. వాళ్లు గుర్తొచ్చినప్పుడు.. బాధపడాలి కానీ... బాధపడటం కోసమే వాళ్ళని గుర్తుకు చేసుకోకూడదు... రా"..!! నేను ప్రియని మర్చిపో అని అనను.. కానీ ప్రియుని అపర్ణ లో చూసుకో రా.. అపర్ణ ని, ప్రియా అనుకొని. తనతో హ్యాపీగా.. ఉండరా...! 

అర్జున్ ; అది ఎలా కుదురుతుంది నాన్న..? 

నాన్న ; కుదురుతుంది రా..! ఎందుకంటే అపర్ణ నిన్ను మాత్రమే ప్రేమించలేదు.. నీ ప్రేమను కూడా ప్రేమించింది...! ( ఈ మాట అర్జున్ గుండెను తాకుతుంది..) తను నిన్ను బాగా అర్థం చేసుకుంది రా... నువ్వే తనని అర్థం చేసుకోవడానికి.. జస్ట్ ట్రై  చెయ్ చాలు... అంతా సెట్ అవుతుంది..! నువ్వు త్వరగా కోలుకొని, నువ్వు బాగుండాలి అనే స్వార్థం తో, నేను అపర్ణ ని ఇచ్చి, పెళ్లి చేశాను..! అందులో తప్పేమైనా ఉంటే. అది నాది...! దయచేసి ఆ అమ్మాయినీ..ఇబ్బంది పెట్టకు రా.. ప్లీజ్.. అర్థం చేసుకో...! (అని వెళ్ళిపోతాడు) 

      

ఇక అర్జున్ కి ఏం చేయాలో అర్థం కాక, పిచ్చి పట్టింది..! ప్రియా కోసం చావా లా..? అపర్ణ కోసం బ్రతకాలా..? ఏం చేయాలి.. ఇప్పుడు..? అని అనుకుంటాడు... ఇలాంటి కన్ఫ్యూజన్ కి ఆవేశం కూడా తోడవుతుంది...! ఈ సమస్యకి పరిష్కారం.. ఇక్కడ కాదు...! కాలేజ్ దగ్గర చూసుకుందామని.. కాలేజీకి ఆవేశంగా వెళ్తాడు..! కాలేజ్ బిల్డింగ్ పైన ఎక్కి.. సైడ్ వాల్ దగ్గర నిలబడి. ఆకాశం వైపు చూస్తూ.. (రోజు కంటే కొంచెం ముందే రావడంతో అపర్ణ అక్కడ ఉండదు) 

అర్జున్ ; ప్రియా.. ఈరోజు నీ దగ్గరికి రాకపోతే. ఇక నేను ఏప్పుడు నీ దగ్గరికి రాలేను ఏమే.. అనిపిస్తుంది..! ఎందుకంటే ఒకవైపు మా నాన్న, మరోవైపు నా భార్య అపర్ణ, నన్ను వెనక్కి లాక్కున్నారు...!  అందుకే, ఈ రోజు చివరి రోజు ఇలా చేయటం. నా ప్రేమ గెలుస్తుందో వాళ్ల ప్రేమ గెలుస్తుందో చూద్దం..? 

       

అని పైకి ఎక్కి.. నిలబడి.. కళ్ళు మూసుకున్నాడు.. ప్రియ జ్ఞాపకాలను బాగా.. తలుచుకుంటున్నాడు...! కళ్ళు తెరిచి గోడపైన నడవడం మొదలు పెడతాడు..! ప్రియా జ్ఞాపకాల తో మొదలైన నడక, నాలుగు, ఐదు, అడుగులు.. అవ్వగానే.. అపర్ణ, అర్జున్ నాన్న.. జ్ఞాపకాలుగా మారిపోతాయి...! వాళ్ల నాన్న యొక్క బాధ, ఆవేదన... అపర్ణ  ప్రేమ, మంచితనం, తలుచుకుని.. వాళ్ళ మైకంలో.. అలాగే గోడ పైన నడుస్తూ ఉంటాడు..!

   

అప్పుడు.. అక్కడికి అపర్ణ వస్తుంది...! అర్జున్ గోడ పైన నడవడం చూసి. షాక్ అవుతుంది.. ఈ రోజు ఇంత త్వరగా వచ్చేసాడు అనుకొని టెన్షన్ కు లోనవుతుంది... అర్జున్ సగభాగానికి పైగా ముందుకు వచ్చి ఉంటాడు.. అపర్ణ కంగారు పడుతు.. ఫస్ట్ ఫోన్ చేసి చూద్దాం..! అని అర్జున్ కు ఫోన్ చేస్తుంది.. ఫోన్ రింగ్ అవుతుంది. అర్జున్ ఫోన్ రింగ్ టోన్, కూడా వినిపిస్తుంది.. దాంతో అపర్ణ డిస్టర్బ్ అవుతాడు అని కొంచెం సంతోషపడుతుంది.. కానీ అర్జున్ డిస్టర్బ్ అవ్వడు.. తన భార్య అపర్ణ తో జరిగిన సంఘటనలను.. తలుచుకుంటూ.. అలాగే ముందుకు వెళతాడు..! అపర్ణ ఇంకా కంగారుపడి.. ఆగటం లేదు ఏంటి..? అని అనుకొని.. కాలేజ్ కింద వైపు చూస్తూ... పిల్లలకి బాణాలు విడవమని, బెలూన్స్ పగలగొట్టు... అని సైగ చెబుతోంది...! పిల్లలు వెంటనే బాణాలను కలుస్తారు.. బెలూన్స్ ను పైకి విడిచి పగలగొడతరు.. గట్టిగా కేకలు కూడా వేస్తారు.. శబ్దం బాగానే వస్తుంది కానీ అర్జున్ ఆగడు..! 

       

అర్జున్ కి అపర్ణ, చెప్పిన మాటలు బాగా గుర్తుకు వస్తుంటాయి...! అవి, పనిమనిషి అనుకోండి...! నా ప్రేమకు ఇన్స్పిరేషన్ నీ ప్రేమే...! నేను గొప్ప ప్రేమికుడినె ప్రేమిస్తున్నాను..! ఇలాంటి మాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి...!  అలా నడుస్తూ.. చాలా దగ్గరికి వస్తాడు అర్జున్.. చివరి అస్త్రంగా అపర్ణ. తన గొంతు మీద చెయ్యి వేసుకుని.. ప్రియా లాగా మిమిక్రీ చేస్తూ.. అర్జున్... అర్జున్... అని గట్టిగా అరుస్తుంది...! అయినా ఆగడు అర్జున్...! అర్జున్ బాగా దగ్గరికి వచ్చి ఉంటాడు...!

      

ఇక లాభం లేదనుకుని.. అపర్ణ తనని పట్టుకోవాలని.. ఏమండీ... అని గట్టిగా అరిచి.. దగ్గరికి పరిగెడుతుంది...! అర్జున్ చివరి అడుగు వేసే టైంకి, అపర్ణ అంతకుముందు.. ఐ లవ్ యు సో మచ్... అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి క్రింద పడిపోతుంటాడు.. అప్పుడు కోలుకొని అర్జున్.. అపర్ణ అని గట్టిగా అరుస్తూ... గోడ పై నుండి క్రిందకు జారి తాడు...! 

అప్పుడు అపర్ణ ఏమండీ.. అని గట్టిగా అరిచి.. కిందకి పడిపోతున్న అర్జున్ ను, అర్జున్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది...! అర్జున్ 8 అంతస్తుల,  బిల్లింగ్ పైన, వేలాడుతూ ఉంటాడు...!

    

అపర్ణ గోడ పైన ఉండి. ఒక చేత్తో, అర్జున్ చెయ్యిని.. తనకు సపోర్టుగా.. మరో చేత్తో.. గోడను గట్టిగా పట్టుకుంటుంది...! 

అపర్ణ ; ఏమండీ... గట్టిగా పట్టుకోండి...! 

అర్జున్ ;(షాక్ అయ్యి) అపర్ణ నువ్వేంటి ఇక్కడ..? అంటే ప్రతి సారి నన్ను కాపాడెది. నువ్వేనా..? (అవును అన్నట్టు తల ఊపింది అపర్ణ...!) స్వారీ అపర్ణ. నిన్ను చాలా బాధ పెట్టాను..! 

అని అంటుండగా.. చెయ్యి జారుతుంది అర్జున్ కింద పడి పోతూ ఉంటాడు... ఏమండీ... అని గట్టిగా అరుస్తుంది అపర్ణ..! అర్జున్, అపర్ణ ని.. చూస్తూ.. కిందకు పడిపోతాడు..!  తలకు బలంగా దెబ్బ తగిలి.. రక్తం కారుతుంది... అది చూసి అపర్ణ మరు క్షణం ఆలోచించకుండా.. తను కూడా దూకుతుంది...! 

        

కొన ఊపిరితో ఉన్న అర్జున్.. అపర్ణ దూకింది.. గమనించి.. అపర్ణ క్రింద కు పడే సమయంలో... సరిగ్గా అర్జున్ అడ్డు వస్తాడు..! దాంతో అపర్ణ.. అర్జున్ మీద పడుతుంది...! అందువల్ల, అర్జున్ కు ఇంకా దెబ్బలు తగులుతాయి.. అపర్ణ నకు కొన్ని దెబ్బలు తగులుతాయి...! అపర్ణ కొంచెం కోలుకొని.. అర్జున్  వైపు తిరిగి.. దగ్గరికి పాకుతూ వచ్చి ఏడుస్తూ.. ఏమండీ.. ఏమండీ.. లేవండి.. అని తడుతుంది...!

     

అర్జున్ కొనఊపిరితో ఉంటాడు.. మెల్లగా కళ్ళు తెరిచి.. అపర్ణ ని చూసి..! Sorry... Aparna... I..I.. అంటూ... కళ్ళు మూసుకుంటాడు...! అపర్ణ ఇంకా గట్టిగా అరిచి..  సృహ కూలిపోతుంది..! అప్పుడే అక్కడికి కొంతమంది చేరుకొని.. ఇద్దరినీ హాస్పిటల్ కి తీసుకొని పోతారు...! 

          

అపర్ణ చిన్న చిన్న గాయాలతో త్వరగా  కోలుకుంటుంది...! అర్జున్ కి ఆపరేషన్ అవుతుంది... కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది...! ఇక అపర్ణ బాధ వర్ణించలేని విధంగా ఉంటుంది.. ఎంతమంది తనని ఓదార్చిన.. కన్నీళ్లు ఆగవు...! 

ఇలా రెండు రోజులు అయిన తర్వాత అర్జున్ సృహ వస్తుంది..! అప్పుడు అపర్ణ దగ్గరికి వస్తుంది.. కానీ తను గుర్తుపట్టడు...! తలకు దెబ్బ, బాగా తగ్గడం ద్వారా.. గతాన్ని మొత్తం మరచిపోయి ఉంటాడు...! ఎవర్ని గుర్తుపట్ట లేక పోతాడు..!! 

అపర్ణ షాక్ అవుతుంది... కానీ వాళ్ల నాన్న మాత్రం సంతోషపడి.. ఇదే మంచి అదునుగా భావించి.. ప్రియ కు సంబంధించిన వస్తువులు, ఫోటోలు, అన్ని ఒకచోట చేర్చి కాల్చి వెస్తుంటాడు...! అది గమనించిన అపర్ణ వెంటనే అడ్డుపడి..! 

అపర్ణ ; మావయ్య ఏం చేస్తున్నారు మీరు...???

అర్జున్ నాన్న ; ఇదే మంచి సమయం అమ్మ మనకు... దీనికి సంబంధించిన వస్తువులను కాల్ చేస్తే.. ఇక అర్జున్ కి ప్రియా ఎప్పటికీ గుర్తు రాదు..! కేవలం మన ఫోటోలు మాత్రమే అతనికి చూపించి నువ్వే తనను ప్రేమించిన భార్య అని చెప్పి.. నీతో కలకాలం సంతోషంగా ఉండేలా చేస్తున్నాను..! అందుకే వీటిని కాల్చి వేస్తున్న అడ్డు తప్పుకో..!!

అపర్ణ ; మావయ్య మీరు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయడానికి వీల్లేదు..!! నేను తనతో నిజాయితీగా ఉండాలి.. అనుకుంటున్నాను.. రేపు అతనికి గతం, గుర్తు వస్తే, ప్రియా కు సంబంధించినది ఏది.. అని అడిగితే..? నా మొఖం అతనికి చూపించలేను.. ప్లీజ్.. వీటిని నాశనం చేయవద్దు...! 

అర్జున్ నాన్న ! (కొంచెం ఆలోచించి) సరే వీటిని ఏమీ చేయను.. కానీ వీటిని నేను ఒక చోట, భద్రంగా దాచి పెడతాను.. ప్రియ గురించి అర్జున్ కి ఇప్పుడప్పుడే చెప్పొద్దు.. కొంతకాలం మీ ఇద్దరు హ్యాపీగా.. ఉండండి..అంటాడు..! ఎందుకంటే మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక ప్లీజ్ దయచేసి వాడికి చెప్పొద్దు...! 

దానికి అపర్ణ కూడా అంగీకరిస్తుంది...! అర్జున్ కు, అపర్ణ కి సంబంధించిన పెళ్లి ఫోటోలు.. వీడియోలు, చూపించడం.. ద్వారా.. తన భార్యగా అర్జున్ అంగీకరిస్తాడు...! ఆ తర్వాత అర్జున్  అపర్ణ ని చాలా ప్రేమగా చూసుకుంటాడు... అప్పుడు వీళ్లు ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు... అపర్ణ తన భర్త ఎలా ఉండాలని కోరుకుందొ. అంతకుమించి ఉంటాడు అర్జున్..! ఒకరోజు ఫస్ట్ నైట్ కి ప్లాన్ చేసుకుంటారు...

  

అర్జున్ అపర్ణ తో రొమాన్స్ చేయడం మొదలుపెడతాడు... ముద్దు పెట్టడానికి వెళుతున్న సమయంలో.. అపర్ణ కి ప్రియ గుర్తొస్తుంది.. దాంతో పక్కకు లేచి, ఇప్పుడు వద్దు.. ఇంకొంత కాలం.. ఆగుదాం.. అంటుంది.. దానికి అర్జున్ కూడా సరే నీ ఇష్టం అంటాడు...!

       

అపర్ణ కి ఏదో తెలియని ఆవేదన, అందువలన డల్లుగా. స్కూల్ లో ఒక చోట కూర్చుని ఉంటుంది..! అక్కడికి తన ఫ్రెండు వచ్చి..!

ఫ్రెండ్ ; ఏంట్యె ఇలా ఉన్నావ్..? మీ ఆయనకు మళ్లీ బాగాలేదా...? 

అపర్ణ ; బాగున్నాడు.. నాతో కూడా చాలా బాగున్నారు.. చాలా ప్రేమగా కూడా చూసుకుంటున్నారు..!  

ఫ్రెండ్ ; మరి నువ్వు ఎందుకు అలా ఉన్నావ్..? 

అపర్ణ ; తెలియట్లేదు.. ఏదోలా ఉంది..! ఇంతకుముందు మా ఆయన నా ప్రేమని తెలుసుకొని.. తను ప్రేమగా నా దగ్గరికి వస్తే బాగుండేది అనిపించింది.. ఇప్పుడు అతను ప్రేమ గా, నా దగ్గరికి వస్తున్నా.. ఎవరో వేరే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నట్టుగా ఉంది..! అతను గతాన్ని, ప్రియని, మర్చిపోయి.. నా దగ్గరికి వస్తుంటే.. నేను కేవలం భార్యగానే మిగిలిపోయాను...! తన నీ ప్రాణం కంటే, ఎక్కువగా ప్రేమించిన, ప్రేమికురాలి గా..  మాత్రం.. అనిపించడం లేదు....! అంతేకాదు అతని చివరి క్షణంలో.. నాకు ఏదో చెప్పాలని అనుకున్నాడు.. అది ఏంటో కూడా తెలుసుకోవాలి..?

ఫ్రెండ్ ; మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావ్..?

అపర్ణ ; ఆయనకు గతాన్ని గుర్తు చేస్తాను..! ప్రియ ను ఆయన, ఎంత ప్రేమించారొ.. మొత్తం వివరిస్తాను ...! 

ఫ్రెండ్ ; అలా చేస్తే నీ కాపురం.. (అంతలోనే)

అపర్ణ; ఏమైనా కానీ.. నేను మాత్రం.. ఆ ప్రేమలోనే బ్రతకాలి అనుకుంటున్నాను...! 

     

అప్పుడు అపర్ణ, అర్జున్ ను ఒక ఇంటికి తీసుకు వెళుతుంది...! అక్కడ ప్రియా కు  సంబంధించిన.. ఫోటోలు, వీడియోలు, వస్తువులు ఒక బాక్స్ లో పెట్టి. ఒక చోట పెట్టినారు.. అపర్ణ అర్జునుని అక్కడికి తీసుకపోయి...

అపర్ణ ; ఏమండీ.. మీకు ఎంతో విలువైనది.. ఒకటి చూపించాలి ఇలా రండి..!

అర్జున్ ; అబ్బా.. అపర్ణ.. ఇప్పుడు ఏది చూసే మూడ్ లో లేను.. నాకు ఏది చూపించొద్దు...

అపర్ణ ; అందులో ఏమున్నాయో తెలిస్తే, వాటిని చూసి మీకు ఏమైనా గుర్తుకు వస్తే, మీరు షాక్ అవుతారు...! (అని ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తూ ఉంటుంది) 

అర్జున్ ; అందులో ఏమున్నాయో నాకు తెలుసు..!!!

అపర్ణ ; ( షాక్ అవుతుంది బాక్స్ ఓపెన్ చేయకుండానే) అందులో ఏమున్నాయో.. మీకు తెలుసా..? 

అర్జున్ ; తెలుసు.. నా ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు... ప్రియా ఫోటోలు...! 

అపర్ణ ; మీకు ఎలా తెలుసు..? అంటే మీకు..?

అర్జున్ ; అంత గుర్తుంది..! ఏది మర్చిపోలేను... గతాన్ని మర్చి పోయాను అని అబద్ధం చెప్పాను...! 

అపర్ణ ; అబద్ధం చెప్పారా ఎందుకు ...? 

అర్జున్ ; నీకోసం.. నువ్వు నన్ను.. మనస్ఫూర్తిగా.. ఏ కల్మషం లేకుండా గా ప్రేమించవు... అపర్ణ, నేను కూడా నిన్ను అలాగే ప్రేమించాలని.. అనుకున్నాను...! ఏ అమ్మాయి అయినా, తన భర్త వేరే అమ్మాయిని. తలుచుకుంటే, తట్టుకోలేరు.. నీకు ఆ బాధ ఉండకూడదని అనుకున్నాను.. అందుకే నేను గతాన్ని మర్చి పోయాను.. అని చెబితే.. నీకు నా మనసులో ప్రియా అనే అమ్మాయి ఉండేది.. అనే ఫీలింగ్ ఉండదు కదా...! అప్పుడు ఇద్దరు, కొత్తగా ప్రేమించుకొవచ్చు అని అనుకున్నాను... అది తప్పని నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది...! నువ్వు మనస్ఫూర్తిగా నన్నే కాదు నా ప్రేమను కూడా ప్రేమించావు.. అలాంటప్పుడు నేను నీతో ఇలా అబద్ధాలు చెప్పి. డ్రామాలు ఆడటం తప్పు అనిపించింది.. అందుకే నేను ఈరోజు చెబుతున్నాను...! నేను గతాన్ని.. మర్చిపోలేను.. కానీ..! నువ్వు ప్రియా నీ మైమరిపించే..లా చేశావు..! నీ ప్రేమ నాకు తెలిసేలా చేసావు.. అందుకే నేను చివరి క్షణంలో నీ పేరే తలుచుకున్న.. నా కళ్ళు మూత పడే టైం లో కూడా.. నీకు ఒక మాట చెప్పాలి.. అనుకున్నాను.. అప్పుడు చెప్పలేకపోయాను.. ఇప్పుడు చెబుతున్నాను... I Love You.. I Love You So Much Aparna....! 

(అపర్ణ ఈమాట కి సంతోష పడదు అనుమానంతో) 

అపర్ణ ; అంటే నువ్వు ప్రియ ని మర్చిపోయావా...?

అర్జున్ ; లేదు.. మర్చిపోలేదు.. ఎప్పటికీ మర్చిపోలేను.. ఎందుకంటే ప్రియా ఇప్పుడు నా ఎదురుగా ఉంది కాబట్టి....! (అపర్ణ కి అర్థం కాక అయోమయంగా చూస్తుంది..)  నువ్వే అపర్ణ.. ఇప్పుడు నీలో నేను ప్రియని చూసుకుంటున్నాను...! ప్రియా కి నీకు పెద్ద తేడా ఏమీ లేదు.. ప్రియా ఎలా నన్ను ప్రేమించిందో.. నువ్వు కూడా అలాగే ప్రేమించావు.. తను నన్ను చావకూడదు అని కోరుకుంది.. నువ్వు కూడా నా చావుని ప్రతిసారి ఆపు తు వచ్చావు..! అందుకే నీలో నా ప్రియని ఈజీగా చూసుకుంటున్నాను.. ఇప్పుడు నువ్వే నా ప్రియా వి... నా ప్రేయసి వి.. నా భార్య వి... నా ప్రాణాని వి...! 

అపర్ణ కి నోట మాట రాలేదు.. ఆనంద బాష్పలతో కన్నీరు కారుస్తోంది... అప్పుడు అర్జున్ రెండు చేతులు పైకి ఎత్తి.. కౌగిలించుకోమని పిలుస్తాడు... అపర్ణ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది...

అపర్ణ ; (ప్రియా లాగా మిమిక్రీ చేసి..) అయితే నాది ఒక కండిషన్.. ఇప్పటినుండి నా పేరు ప్రియా...!

(దీనికి అర్జున్ నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాడు..) అప్పుడు అపర్ణ గట్టిగా ఆనందంతో కౌగిలించుకుంది...! 

అర్జున్ ; I Love You Priya... Love You So Much.... 

                                                                    The End...!!!