Featured Books
  • కాలంలో వెనక్కి వెళ్ళిన ప్రేమ కథ

    నాన్నా……మనము ఎక్కడకి బయలుదేరుతున్నాము. మా అమ్మ నాన్న  వాళ్ళ...

  • అంతం కాదు - 62

    శకుని విజృంభణ: మానసిక దాడినెగటివ్ ఎనర్జీ ప్రవేశించే కొద్దీ శ...

  • ఆత్మ ధైర్యం

    ఓపెన్ చేస్తే... అర్ధరాత్రి పండు వెన్నెల టైంలో... అలా నిండు చ...

  • నిజం - 2

    2వ - భాగంఆ సంఘటన జరిగిన తరువాత ఆ రోజు సురేష్ ఇంట్లొ అందరు బా...

  • సరయు

    అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కాలంలో వెనక్కి వెళ్ళిన ప్రేమ కథ

నాన్నా……

మనము ఎక్కడకి బయలుదేరుతున్నాము. మా అమ్మ నాన్న  వాళ్ళ ఇంటికి వెలుతున్నాము.

(మరుసటి రోజు)

ఏమేవ్….

అబ్బాయి, కోడలు, మనవడు ఊరి నుంచి వచ్చారే ఎక్కడ వున్నావు , ఇలా రా.

వినోద్: నాన్న,అమ్మ ఎలా వున్నారు.నీరజ్: మేము బాగానే ఉన్నాము బుజ్జి: నానమ్మ ఎలా ఉంది..నీరజ్: మీ నానమ్మ బాగానే వుంది బుజ్జి.

తాతయ్య నువ్వు నిజముగానే శాస్త్రవేత్తవా? అవును బుజ్జి,

బుజ్జి ఎందుకు అడిగావు. ఏమి లేదు తాత నువ్వు 32 సార్లు నానమ్మ ని  ప్రేమించావంట కాని నానమ్మ ఆ 31 సార్లు వేరెవరినో పెళ్ళి చేసున్నాదంట.

నీకు ఎవరు చెప్పారు?

మా నాన్న చెప్పాడు. తాతయ్య నాకు ఒకసారి మీ కథ చెప్పవా.

  ఆ....ఆ.... చెప్తా సరే గాని నువ్వు ఎలా చదువుతున్నావు బుజ్జి , నేను ఇంటరులో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. మంచిది బుజ్జి.తాతయ్య మీ కథ చెప్పండి.నీరజ్: 2000 సంవత్సరంలో నేను నా స్నేహితులు కలిసి ప్రపంచానికి తెలియకుండా టైం మెషీన్ తయారు చెయ్యాలని నిర్ణయించుకున్నాము.ఆ పనిలో మేము నిమగ్నమైవున్నాం. ఈలోపు గేటు బయట నుంచి

ఆగండి సర్.

 మీరు లోపలకి వెళ్ళకూడదు.

 నేను నీరజ్ సహ శాస్త్రవేత్తను మరియు అతని స్నేహితుదీని ఎందుకు వెళ్ళకూడదు?

నీరజ్ గారు టైం మెషీను తయారు చేసే పనిలో నిమగ్నమైయున్నారు ఎవరనీ లోపలకి రావద్దన్నారండి. నీరజ్ స్నేహితుడను నా పేరు ఆనంద్ పైగా టైం మెషీన్ తయారు చేసే పనిలో నేను సహ శాస్త్రవేత్తను,  నన్ను లోపలికి పంపించు.అప్పుడు నేను సెక్యూరిటీ కెమెరా స్క్రీన్ లోంచి చూసి మా సెక్యూరిటీ గార్డ్ — రాజు—ఫోన్ చేసిరాజు ఆనంద్  లోపలకి పంపించు. ఆనంద్ లోపలికి రా, వీడే రానివ్వట్లేదురా;  అదా….వాడు కొత్తవాడు వాడికి నీ గురించి తెలియదు,  క్షమించండి ఆనంద్ గారు మీగురించి తెలియక  ఇబ్బంది పెట్టాను సార్ .పోన్లే ఇప్పటికైన తెలిసిందిగా, క్షమించండి సార్.

నేను ఆనంద్ తో అన్న సరిగ్గా 18 సంవత్సరాలు పట్టిందిరా మనం ఈ టైం మెషీన్ తయారుచేయడానికి ఇంకేటి సంగతులురా,వారం రోజులైంది అఫీసుకు వచ్చి ఏమైంది?మా ఇంట్లో సడన్ గా పెళ్ళిచూపులు అంటే మొన్న వెళ్ళాను నీరజ్ ,ఈ నెలాకరకు నిశ్చితార్థము నిన్ను పిలుద్దామని వస్తే ఈలోపు ఇదంతా జరిగింది. నీరజ్ నీకు ట్రీట్ ఇద్దామని అనుకుంటున్న పదా అలా బయటకు వెల్దాము, సరదాగా తిరిగి వద్దాము రేపే కదా దీన్ని పరిక్షించేది ఒక సరి అలా బయటికి వెళ్ళొద్దాము రా. సరే వెల్దాము అనంద్. రాజు జాగ్రత్తగా చూస్తూవుండు మేము బయటకు వెళ్ళొస్తాము. సరే నీరజ్ గారు.

నేను నా స్నేహితుడు అలా సముద్రపు ఒడ్డున నడుస్తుండగా నా కాలి కింద ఒక ఫోటో ఉండడము గమనించిన ఆనంద్….

నీరజ్ నీ కాలి కింద ఒక ఫోటో ఉన్నాది చూడు. వెంటనే ఆ ఫొటో చూసి, ఆనంద్ ఇదేదో పాతకాలపు ఫోటోలా ఉంది రా కాని ఈ ఫోటోలో వున్న అమ్మాయి ఎంత పద్దతిగా , అందంగా ఉంది ఇలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మనము తయారు చేసిన టైం మెషీన్ పరిక్షించాల్సిన సమయము ఆసన్నమైయినది. ఏమంటున్నావు నీరజ్, నువ్వు విన్నది నిజమే ఆనంద్ నాకు ఈ అమ్మయి నచ్చింది ఒకసారి ఎలాగైన కలవాలిరా. మనమిద్దరం తొందరగా తిరిగి వెళ్ళాలి. కాని నీరజ్ ఈ అమ్మాయి వివరాలు తెలియదు కదా ఎలా కలుస్తావు ? నాదగ్గరున్న అధారము ఒక్కటే ఆ ఫోటోలో వున్న తేది మాత్రమే ఇది 1959 లోనిదని ఫోటో వెనకనున్న ఒక గోడ మీద రాసివున్నాది కదా . నేను మన ఊరైన వైజాగ్ లో మన ప్రాంతము నుండి ప్రయత్నిస్తాను ఆనంద్. సరే ల్యాబుకు వెళ్ళీ పరిక్షిద్దాము  నీరజ్.

(ఆ రోజు సాయంత్రం)

ఆనంద్ నా ఫోనులోంచి ఒక వీడియో తియ్యు. ఎందుకు నీరజ్? ఏమి లేదురా నేను వెళ్ళేది టైం మెషీన్లో కదా వర్కింగ్  రికార్డ్ కోసం . నువ్వు చెప్పింది నిజమే తీస్తాను.

(వీడియో తీసిన తరువాత)

నీరజ్ నువ్వు తిరిగి వచ్చే సరికి నువ్వు ప్రేమించిన అమ్మాయితో రా..........అలా చూస్తూవుంటావేమి భయలుదేరు నీరజ్.

కొంతసేపటికి నేను తిరిగి రాగానే వెంటనే ఆనంద్ ఆ అమ్మాయి రాలేద, ఇంతకి కలిసావా, పేరు , ఊరు తెలుసుకొన్నావా? ఆనంద్ ఆనంద్ శాంతించు; నేను చెప్పినది పూర్తిగా విను, అలాగే నేను చెప్పింది మొత్తం రికార్డు చెయ్యి, నాకు ఆ అమ్మాయిని కనిపెట్టడానికి ఐదు నెలల సమయము పట్టింది.అవునా నీరజ్ మరి ఇన్నాళ్ళు ఎక్కడ వున్నావు, ఎలా వున్నావు, మాట్లాడావా? నేను చెప్పేది పూర్తిగా విను ఆనంద్.

నేను కాలంలో వెనక్కి వెళ్ళి ఆమె కోసము ఐదు నెలలు పిచ్చివాడిల  ఊరు ఊరు, వీది వీది, సందు సందు వెతికిన నాకు కనపడలేదు. కాని ఈ ప్రయణములో నాకొక స్నేహితుడు దొరికాడు అతనెవరోకాదు మీ తాతగారే ఆనంద్. ఆ.....ఆ.... నువ్వు చెప్పింది నిజమే నీరజ్, మా తాత చెపుతూ వుండేవాడు నాకొక స్నేహితుడుండే వాడు వాడి పేరు నీరజ్ అని చెపుతూవుండేవాడు ; ఆ నీరజ్ నువ్వేనన్నమాట. అవును ఆనంద్ నేనే. ఇంకేమైన చెప్పాడా నా స్నేహితుడు ,నా గురించి ఆనంద్?  నాకు గుర్తులేదుగాని  మా నాన్నకి తెలుసనుకుంట. ఇంతకీ ఆ అమ్మాయి కనిపించిందా నీరజ్?నేను మీ తాతను ఒక ప్రమాదం నుంచి కాపాడాను. అప్పుడు నుంచి నేను మీ తాత మంచి స్నేహితులయ్యాము. ఒక రోజు నేను మీ తాత ఒక ఫోటోషాప్  దగ్గరకి వెళ్ళి ఆ అమ్మయి ఫోటో చూపించి వివరాలు అడిగేలోపు వెనుకనుంచి వెళుతున్న ఒక ఆర్టీసీ బస్సులో తనని చూసినా వెంటనే బస్సు వెనుక పరిగెత్తాను నా వెనక మీ తాత. చివరగా ఆ బస్సు ఒక గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఆగింది. వెంటనే తను దిగి ఆ కాలేజులోకి వెళ్ళింది. తనని కలుద్దామని వెల్దామనుకున్నాను. కాని నా ఆ ఐదు నెలల అవతారముతో వెళ్ళలేకపోయాను.అందుకే మళ్ళీ ప్రస్తుత కాలానికి వచ్చి కొంచెము శుబ్రముగా తయారై  తనని కలిస్తే బాగుంటాదని తిరిగి వచ్చాను ఆనంద్. మాటలలో పడి మర్చిపోయాను నీరజ్ నాకు మెయిన్ ఆఫీసులో ఒక చిన్న పని ఉంది. నీకు నా పెళ్ళి ట్రీట్ ఇద్దామని ఇటు వచ్చాను.. టైం అయింది నేను నా పెళ్లి పనికోసం వెళ్లి వారం రోజుల తరువాత  నువ్వు చెప్పే శుభవార్త కోసం  మళ్ళీ వస్తాను.

(రెండు గంటల తరువాత)

నీరజ్ టైం మెషీన్ ద్వారా ఆ అమ్మాయి కళాశాలకు వెళ్ళాడు. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడడానికి అవకాశము కోసము ఎదురుచూ సాగాడు.ఆ అమ్మాయి కాలేజ్ నుండి రాగానే—నీరజ్: ఏమండి మీ పేరేంటండి,

ఎందుకండి?

నా పేరు నీరజ్; మరి మీపేరు?

 శారద.

ఈలోపు ఒక అమ్మాయి శారద.......... నిన్ను ప్రిన్సిపుల్ గారు పిలుస్తున్నారు తొందరగా రా. ఆ వస్తున్నా నిర్మల,వస్తాను నీరజ్ గారు.అని నీరజ్ కొంచెం గ్యాప్ ఇచ్చాడు.ఆగిపోయవేమి తాత,  ఆ తరువాత ఏమైంది తాతయ్య? చెప్పు నానమ్మతో మాట్లాడావా?

తొందరపడకు బుజ్జి చెపుతాను విను.

తను వెళ్ళిన గంట తరువాత మళ్ళీ వచ్చింది. తనతో మాట్లాడాలనే ఆసక్తితో తన దగ్గరకి  వెళుతున్నపుడు పక్కనే వున్న మరుగుతున్న నూనె నా చేయి తగిలి తన శరీరముపై పడినది. వెంటనే చుట్టూ వున్నవాళ్ళూ వచ్చిగుమిగూడారు. అందులో ఒకడు— రాజేష్ వచ్చి నాతో గొడవపడి ఆ ప్రదేశము నుండి బయటకు తోసేశాడు.నేను వెంటనే ప్రస్తుత కాలానికి వచ్చీ  మళ్ళీ గతానికి వెళ్ళాను. అపుడు తను ప్రిన్సిపాల్ గది నుంచి వచ్చింది. మొదటిసారి జరిగిన ప్రమాదాన్ని గుర్తుంచుకుని , తను ఆ మరుగుతున్న నూనె దాటగానే నేను తనని కలవడానికి ముందుకు వెళ్ళాను కాని తను నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే తన వెనుకే వెళ్ళీ తన చేయి పట్టుకుందామని అనుకుంటే పొరపాటున  తనని మురికినీటిలో తోసేసాను. అపుడూ  పెద్ద గొడవ జరుగుతుండగా ఆ రాజేష్ మళ్ళీ వచ్చి నన్ను బయటకు తోసేసాడు.

నేను వేంటనే ప్రస్తుత కాలానికి వచ్చీ  మళ్ళీ గతానికి వెళ్ళాను. మొదటి రెండు సార్లు జరిగిన తప్పులను మరలా చేయకుండా తన వెనుక వెళ్ళసాగాను.అపుడు రాజేష్ దగ్గరకి నేనే వెళ్ళి శారద గురించి అడుగుదామని వెళ్ళేలోపు శారద రెండు రోజులలో మద్రాసు వెళుతుందని తను వాడితో చెప్పుతుండగా వాడు వెనుకకు తిరిగీ నా దగ్గరకు వచ్చి నాతో వాదనకు దిగసాగాడు; అది కాస్త పెద్దగొడగా మారడంతో నేను అక్కడినుంచి వెనక్కివెళ్ళాను.

నేను వేంటనే ప్రస్తుత కాలానికి వచ్చీ  మళ్ళీ గతానికి వెళ్ళాను. ఈసారి నేను సరాసరి మద్రాసు రైల్వే స్టేషను దగ్గర తనకోసము ఎదురుచూసాగాను కాని రెండు రోజులైన తను రాకపోయేసరికి నేను తిరిగి వైజాగ్ కు వెళ్ళాను.ఆ కళాశాలకు వెళ్ళీ తనకోసము వెదకసాగాను. అప్పుడు తను రాజేషుతో చాలా సన్నిహితముగా మాట్లాడటం గమనించి చాల భాథపడ్డాను. అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది .

బుజ్జి: అదేమిటి తాతయ్య?

నీరజ్:మరేమిలేదు తను ఎవరని పెళ్ళిచేసుకుంటుందో తెలుసుకోవడానికి నా టైం మెషీన్ ఉపయోగించి భవిష్యత్తులో తను పెళ్ళిచేసుకున్న కాలానికి వెళ్ళాను.

బుజ్జి:ఎవరని పెళ్ళిచేసుకున్నాది తాతయ్య? నిన్నేనా?

నీరజ్:నన్ను పూర్తిగా చెప్పనివ్వు మద్యలో ప్రశ్నలు అడగవద్దు; సరేన?

బుజ్జి:సరే తాతయ్య.

అక్కడికి వెళ్ళి చూడగానే తను రాజేష్ ను పెళ్ళిచేసుకుంది.వెంటనే నేను కాలములో తిరిగి వెనుకకు వెళ్ళీ తనను ఎలగైన పెళ్ళిచేసుకుని మన కాలనికి తీసుకొని వద్దామని దృడ నిశ్చయముతో నా ప్రయత్నములు ప్రారంభించసాగాను. 32 సార్లు ప్రయత్నించిన తర్వాత తిరిగి ప్రస్తుత కాలానికి  వచ్చి నిరాశతో కుర్చీలో కూర్చున్నాను. వారము రోజుల తరువాత నా స్నేహితుడు ఆనంద్ నా దగ్గరకి వచ్చి నాపై ప్రశ్నల వర్షము కురిపించాడు.

 ఏరా అమ్మాయి ఏది? నీ ప్రేమను అంగీకరిందా? నీతో రానన్నాద? లేక......... కొంపదీసి వేరే ఎవరైనా పెళ్ళి చేసుకుందా? ఇంతకి నీతో గొడవ పడిన వారి పేరేమిటి? అసలేమైందిరా నీరజ్?

 వాడి పేరు రాజేష్.31 సార్లు ఎన్ని విదాలుగా ప్రయత్నించిన ఎదో ఒక చిన్న పొరపాటు జరగడము తనకు, నాకు మద్యలో ఆ రాజేష్ రావడము అది కాస్త పెద్ద గొడవగా మారడము శారద నా నుంచి దూరముగా వెళ్ళిపోవడము జరిగాయి. కాని 32వ సారి 31సార్లు జరిగిన 31 పొరపాట్లను నాకు ఆనుకూలముగా మార్చుకొని ప్రయిత్నిచగా శారద నన్ను ప్రేమించింది.అలా కొన్ని రోజులు గడిచిన తరువాత నా గురించి నిజము చెప్పి నాతో తీసుకొద్దామని తనని వైజాగ్ సముద్రము దగ్గరకు రమ్మన్నాను. తనతో గడిపిన ఆ కొన్ని నెలలు కొన్ని క్షణాలుగా గడిచిపోయాయి. నా గురించి తెలిసిన తరువాత నన్ను ద్వేషిస్తుందో లేదా ప్రేమిస్తోందో  అనే భయముతో ఆ రోజుకోసము నిరీక్షించేను. ఆ రోజు రానే వచ్చింది తనకు చెప్పిన సమయముకంటే రెండు గంటల ముందు వచ్చి వున్నాను,కొంత సేపటి తరువాత రాజేష్ మరియు కొంతమంది  నా పై గొడవకు వచ్చి నన్ను కొడుతుండగా శారద చూసి నా దగ్గరకు పరిగెత్తుకొంటూ వచ్చింది. ఆ గొడవలో ఆ రాజేష్ నన్ను చంపాలని కత్తిని తీయగా అది శారద కడుపులో దిగింది ఆ నొప్పిని భరించలేక నా ఒడిలో ప్రాణాలు విడిచింది ఆనంద్.

(కొంత సమయము తరువాత)

నీరజ్ ఈసారి మనమిద్దరము వెళ్ళీ ప్రయత్నిద్దామ?వద్దు ఆనంద్ మనము ఎన్నిసార్లు వెళ్ళి ప్రయత్నించినా తన ప్రేమ గెలవడము,తనను తీసుకు రావడము కష్టమే అని ఆనంద్ తో చెప్పీ నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

బుజ్జి: తాతయ్య మరి నానమ్మకు నీకు ఎలా పెళ్ళైంది?

అది మాములగా మా ఇంట్లో వాళ్ళ బలవంతంతో అయిష్టముగా పెళ్ళిచూపులకు వెళ్ళినపుడూ ఎవరికోసమైతే గతములోకి వెళ్లానో తననే నా పెళ్ళిచూపులో చూడగానే లోపల ఆశ్చర్యం,  అనందముతో గెంతులు వేసాగాను. నా ఆనందము నా కళ్ళలో చూసి తను ఒక చిరునవ్వు నవ్వి పెళ్ళికి ఆంగీకారం తెలిపినది.

కొన్ని రోజుల తరువాత తను నాదగ్గరకు వచ్చి నాకు బీచ్లో దొరికిన ఫోటో గురించి చూసి దాన్ని గురించి అడగగానే తనకి జరిగిన విషయమంతా వివరించాను. తను వెంటనే ఒక సారి నవ్వీ ఆ ఫోటో నాదీ,నా స్నేహితులది.ఒక సారి నేను నా స్నేహితులు పాతకాలపు సినమా షూటింగ్ లో తీసుకున్న ఫోటో ఆ తరువాత బీచ్ కి వెళ్ళినప్పుడు పడిపోయింది. అది మీకు దొరికిందా అని అక్కడి నుండి వెళ్ళింది.

(కొన్ని రోజుల తరువాత)

బుజ్జి:తాతయ్య మనం బయటకు వెళ్దాము. ఆ శారదగారి ఇల్లు నీకు తెలుసా?

నీరజ్:తెలుసు, ఏం?

బుజ్జి: ఒకసారి వెల్దామా, సరే వెల్దాము పదా.

ఈలోపు శారద వుంటున్న ఇల్లుని పడగొడుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైంది  సార్ ఈ ఇల్లును పడగొడుతున్నారు. ఏం లేదు సార్ కొత్త ఇల్లు కడుతున్నాము అందుకే పడగొడుతున్నాం.బుజ్జి ఆ పడగొడుతున్న ఇల్లే శారదది. నీ చేతిలో ఏమిటి బుజ్జి, ఇది ఒక డైరి, దీనిమీద శారద అని పేరు రాసి ఉంది. ఏది ఒకసారి డైరి ఇవ్వు బుజ్జి.ఆ డైరీలో శారద, నీరజ్ గురించి ప్రతీ విషయం రాసింది.

(కొంతసేపటి తరువాత)

ఏమైంది  అలా ఆగిపోయావ్ ఏముందా డైరీలో తాతయ్య? ఇదా మా అసంపూర్ణమైన ప్రేమ కథ .

ఒక రోజు సాయంత్రం నీరజ్ ఆ డైరీ మొదటి పేజీ చదివాడు, అందులో

1958 జనవరికి 4

ఈరోజు కాలేజ్ ప్రయోగశాలలో బయట నిలబడ్డ ఒక మనిషిని చూశాను. కళ్లలో విచిత్రమైన ఆకర్షణ. నన్ను చూస్తూ ఏదో తెలుసుకున్నట్టుగా చిరునవ్వు చిందించాడు. అతని పేరు నీరజ్ అని చెప్పాడు. ఈ పేరు ఎందుకో మనసుకు వెచ్చదనంగా అనిపించింది.

1958 జనవరి 22

ఈరోజు నేను లైబ్రరీలో పుస్తకం వెతుకుతుండగా నీరజ్ వచ్చాడు. శాస్త్రం, తారలు, సమయం గురించి మాట్లాడాడు. అతని మాటలు అంత కొత్తగా, అంత లోతుగా అనిపించాయి, నేను ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది. నా ఎదురుగా ఒక పుస్తకం కంపించిందేమో అనిపించింది.

1958 ఫిబ్రవరి 10

నిన్న నదీ తీరంలో మేము ఇద్దరం పొద్దున కలిశాము. గాలి చాలా చల్లగా ఉంది. కానీ అతడు పక్కన నిలబడడం మాత్రం వింతగా సురక్షితంగా అనిపించింది. అతడు వచ్చిందంతా యాదృచ్ఛికం కాదు అనిపిస్తోంది. అతని చూపుల్లో ఏదో చెప్పలేని బాధ దాగి ఉంది. అతడు నన్ను చూసిన ప్రతిసారి  ఎదురు చూస్తూ నిశ్శబ్దం అవుతాడు.

1958 మార్చి 2

రాజేష్ నన్ను మళ్లీ కలిసాడు. అతడు చాలా ఏళ్లుగా నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. కానీ నా మనసు మాత్రం అతని మాటల్లో లేదు. నాకు తెలియకుండా నా మనస్సు నీరజ్ ముఖం గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. నేను ఇంతవరకు ఎవరి గురించి ఇలా ఆలోచించలేదు.

1958 మార్చి 27

ఈరోజు నీరజ్ నీ నా  స్కెచ్ వేయమన్నాను. అతడు నవ్వుతూ ఒప్పుకున్నాడు. నేను అతన్ని చూడగానే నా గుండె దడ దడలాడుతోంది. అతడు నవ్వినపుడు అతడి కళ్ల మూలల్లో ముడుచుకునే చిన్న గీతలు చాలా అమాయకంగా కనిపిస్తున్నాయి. ఎందుకో అతన్ని చూస్తే సమయం కొంచెం ఆగిపోతుంది.

1958 ఏప్రిల్ 15

అతడు ఈరోజు చెప్పిన ఒక మాట నన్ను రాత్రంతా నిద్రపోనీయలేదు. “కొన్నిసార్లు… మనం ప్రేమించే వాళ్ళని సమయం విడిచిపెట్టినా, మనం వారిని వదిలిపెట్టం.”అతడు ఎందుకు ఇలా అన్నాడో అర్థం కాలేదు కానీ ఆ క్షణం  ఆ మాట నా హృదయపు లోతుల్లోకి దూసుకుపోయింది.

1958 మే 4

వైజాగ్ బీచ్‌కి వెళ్లాము. అలలు నన్ను తాకటానికి వచ్చినట్టుగా పరుగులు తీశాయి. నీరజ్ నడుస్తూ ఒక్కసారిగా ఆగి సముద్రాన్ని చూశాడు. అతడి చూపులో ఒక రహస్యం ఉంది. నేనడిగాను—“ఏమైంది?” అతడు నన్ను కోల్పోయే భయం ఉన్నట్టు అనిపించింది. కానీ ఎందుకు?

1958 జూన్ 12

రాజేష్ నన్ను ఈరోజు కాలేజీ గేట్ దగ్గర ఆపాడు.“నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో నాకు తెలుసు,” అని అన్నాడు. అతని కళ్లలో కోపం కనిపించింది. నేను ఏమీ చెప్పలేదు. నిజానికి, నాకు కూడా దాచలేనంత స్పష్టంగా మారింది — నా మనసు ఎక్కడుందో.

1958 జూలై 1

నా డైరీ మొదటిసారి ఎవరో చదువుతున్నట్టు ఈరోజు అనిపించింది. ఎందుకో నీరజ్ దగ్గర ఉన్న చిన్న నిశ్శబ్ద క్షణాలే నాకు ప్రపంచంలా అనిపిస్తున్నాయి. అతడికి మాటల్లో చెప్పలేని ఏదో ఉంది, అది నన్ను అతడి వైపు లాగిపోతుంది. నేను ఏమీ చెప్పకపోయినా… అతడు నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటాడు.

1958 ఆగస్టు 20

వర్షం పడుతోంది. నేను, నీరజ్‌తో పాత దేవదారు చెట్టు క్రింద తడిచిపోతూ నిలబడ్డాను. వర్షపు చినుకులు అతడి కళ్లపై జారుతున్నప్పుడు నా గుండె లోపల ఏదో కరిగిపోయింది. నేను ఎంతకాలం ఈ మాటను దాచిపెట్టగలనో తెలియదు. కాని అతడికి చెప్పడానికి ధైర్యం రావట్లేదు. అదే మాటను నా డైరీనే వింటోంది —అతడు చదివే రోజుకి మాత్రమే ఈ మాట బయటపడుతుంది.

1958 సెప్టెంబర్ 11

ఈరోజు రాజేష్ నన్ను బెదిరించాడు. “అతడిని దూరం పెట్టు,” అన్నాడు. నేను అతని మాటను వినలేదుకాని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అతడిని తప్పించుకునే బదులు… నేను నీరజ్ని చూసి నిజం చెప్పాలి. ఈ డైరీలోనే రాసుకున్న ఆ ఒక్క మాట…ఈసారి నా నోటితో చెప్పాలి.

1958 అక్టోబర్ 7

రేపు ఉదయం వైజాగ్ బీచ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడే అతడికి నా హృదయం ఏ వైపు ఉందో చెప్పాలి. రేపు నా జీవితంలో కొత్త ఉదయం రావొచ్చు. లేదా… ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు.

1958 అక్టోబర్ 8 — ఉదయం

నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సముద్రం మృదువుగా కదులుతోంది.అతడు రాబోతున్నాడని నాకు తెలుసు.అతడు వచ్చాక నా మాటలు అతడి జీవితాన్ని మార్చేస్తాయి. నా జీవితాన్ని కూడా. ఈ రోజు… పూర్తి చేయాల్సిన రోజు అదే I LOVE YOU అనే మాట.

నీరజ్ డైరీ మూసేశాడు. సముద్రం గట్టిగా కొట్టుకుంది.తను కాలంలో వెనక్కి వెళ్లి ప్రేమించిన అమ్మాయి, తనకు చెప్పలేని మాటను ఈ డైరీలో పెట్టి వదిలిపోయింది.అది మూడు పదాలు — కానీ ఈ విశ్వంలో అతడే చదవగలిగినవి.

ఆమె చివరి ఊపిరి… అతడి కథగా మారిన రోజు.