ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో అమ్మ, నాన్న లేకుండా ఒక అబ్బాయి ఉండేవాడు. అతను అక్కడే ఉన్న ఒక హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. అతను ఒక rent ఇంట్లో ఉంటున్నాడు. అతను పెద్దగా చదువుకోలేదు..
అతను రోజు ఆ హోటల్ కి వెళ్లి పని చేసుకుని. ఇంటికి వెళ్తూ జీవనం సాగించేవాడు…. ఒక రోజు హోటల్ లో పని చేస్తుండగా.. ఆ హోటల్ కి ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు.
ఆ అమ్మాయి కి చాలా ఆస్తి ఉంది. ఆలా ఆ అమ్మాయి రోజు ఆ హోటల్ కి వచ్చి తిని పోతుంటుంది.. అతను కు ఆ అమ్మాయి ఇష్టం ఉన్న… ఆమె ది పెద్ద స్తాయి అని అలా చూస్తూ ఉంటాడు.
కానీ ఆ అమ్మాయి ఏ ఆర్డర్ అడిగిన ఇతనే తెచ్చేవాడు.
ఒక రోజు ఆమె అతనిని కాఫీ తెమ్మని అడిగింది. అతను తీసుకొని వస్తాడు కానీ. అతని వెనక వేరే అతను అతనిని గుద్దడం వలన ఆ కాఫీ ఆమె పై పడుతుంది. ఆమె కోపంతో అతని ని కొడుతుంది. అతను నేను కావాలని చెయ్యలేదు మేడం అంటాడు… కానీ ఆమె నువ్వు కావాలనే చేసావ్ అని మళ్ళీ కొట్టి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకో రోజు మళ్ళీ వస్తుంది ఆ హోటల్ కి ఈ సారి ఆర్డర్ తీసుకోవడానికి అతను వస్తాడు.. ఆమె అతనిని చూసి మళ్ళీ ఏమి చెయ్యాలని అనుకుంటున్నావు. నాకు నీ మొహం చూపించకు అంటుంది.
ఇంకోసారి చూసానో… నీ జాబ్ నీకు లేకుండా చేస్తా.. అని అనుటుంది.
అతను బాధపడుతూ… అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అప్పటినుంచి ….రోజు ఆమె కి కనపడేది వేరే వెయిటర్ ఏ అయినా… ఆర్డర్ రెడీ చేసేది మాత్రం ఇతను.
ఆలా ఒక రోజు ఆమె,… అతను వచ్చే దారిలో హోటల్ కి వస్తుండగా ఆమె కి ఒక ఆక్సిడెంట్ అవుతుంది.
అప్పుడే అతను ఆమె ను కారు లో నుంచి కోన ఊపిరితో ఉండటం గమనిస్తాడు. అతను వెంటనే ఆమె ని ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి. అక్కడ అతని బ్లడ్ ని ఇచ్చి ఆమె ని కాపాడుతాడు.
అతను అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి ఆమె ని చూసి డాక్టర్ ని అడుగుతారు… అప్పుడు ఆ డాక్టర్ ఏమి టెన్సన్ పడకండి ఒక అతను time కి తీసుకురావడం వలన మీ అమ్మాయి ప్రాణాలకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు అని ఆ డాక్టర్ చెప్తాడు….! అప్పుడే ఆ అమ్మాయి స్పృహలో నుంచి బయటకి వచ్చి అమ్మ నన్ను కాపాడిన అతని కి బుజం మీద ఒక పెద్ద పుట్టు మచ్చ ఉంటుంది. అమ్మ అతనిని వెతకండి అతనికి నేను thanks చెప్పాలి అని వాళ్ళ అమ్మ, నాన్న లను అడుగుతుంది.
కానీ అమ్మాయి కూడా అతని పేస్ చూడదు. అతని పుట్టుమచ్చని మత్రమే చూస్తుంది.
అతను… హాస్పిటల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ…వెళ్తుంటాడు అలా వెళ్తుండగా!
అతని నుంచి కొంత దూరంలో… ఒక తోక చుక్క ఆ అడివిలో పడుతుంది. అతను ఏంటి ఏదో పడినట్టు ఉంది. అని ఆ అడవిలోకి వెళ్తాడు… అది పడిన దగ్గరకు వెళ్లి చూడాగా… అక్కడ ఒక పెద్ద size Ball ఆకారం లో ఉన్న స్పేస్ షిప్ విరిగి పడి రెండు సాగాలుగా కనపడుతుంది… అందులో red కలర్ లో ఒకటి మెరుస్తూ కనపడుతుంది. ఇతను దాని దగ్గరకు వెళ్తాడు దాన్ని అతని చేతుల్లోకి తీసుకుంటాడు. అది ఒక కాయిన్ లా పూర్తి red కలర్ లో ఉంటుంది. ఇంకా ఆ షిప్ లో చాలా కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయి అంటే (ఒక Alian ఒక షిప్ తో మన భూమి మీద కి వచ్చినట్టు.) ఉంటుంది.
ఇతను ఆలా చూస్తుండగా అక్కడికి పోలీస్ లు అక్కడి ప్రజలు వస్తుంటారు. ఇతను వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆలా అతను ఇంటికి వచ్చి. ఆ కాయిన్ size లో ఉన్న red కలర్ క్రిస్టల్ ని ఆలా చూస్తూ అక్కడున్న టేబుల్ మీద పెడతాడు… అతను స్నానం చెయ్యడానికి వెళ్లి స్నానం చేస్తుండగా… ఆ టేబుల్ మీద ఉన్న క్రిస్టల్ కి ఒక స్పైడర్ లా కాళ్ళు వచ్చి అతని దగ్గరకు వెళ్లి అతని వెనుక ఉన్న వీపు నుంచి అది అతని బాడీ లోకి వెళ్ళిపోతుంది.
అప్పుడు అతని కి ఒక సారిగా తలనొప్పి మరియు ఏదో ఒక గందరగోళంగా ఉంది. అతను చనిపోతానా అనేలా ఏదేదో అయింది.
అతను స్నానం అయ్యాక… వెంటనే వెళ్లి పడుకున్నాడు.!
మార్నింగ్ నిద్ర లేచాక అతను చాలా యాక్టీవ్ మరియు అతనికి చాలా శక్తీ వచ్చినట్టు ఉంటాడు అతను అవి ఏమి పట్టించుకోకుండా రోజులానే హోటల్ కి వెళ్తాడు.. పని చేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. కానీ పనులు అని అతనికే తెలియకుండా చాలా ఫాస్ట్ గా చేసెయ్యడం మరియు.
అతను తెలియకున్నా దేన్నీ ఢీ కొట్టిన. అది విరిగి లేదా వంగిపోవడం బరువు గా ఉన్న వస్తువులను చాలా తేలికగా లేపడం అతను గమనించేవాడు. అతని కి ఆ కాయిన్ నా లోపల ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. అని ప్రతిరోజు అలసిపోకుండా పనిచేస్తుంటాడు ఆ హోటల్ లో….
అలా ఒక రోజు… ఆ హోటల్ ముందు ముగ్గురు రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటారు… అప్పుడు అతను చూస్తూ ఉండలేక.. ఆ రౌడీలను ఆపుతాడు కానీ రౌడీలు ఆగకుండా… అతనిని ఒక దెబ్బ కొడుతారు…. కొంచం వెనుకకు వెళ్తాడు.
అతనికి కోపం వస్తుంటుంది. అతని ముందే రౌడీలు ఆ అమ్మాయి చున్నీ ని లాగేసి ఆమె బట్టలు మీద చేయపెడుతుంటారు తీసేయ్యడానికి.
అప్పుడు అతనికి ఇంకా కోపం వచ్చింది. ఊరికినే.. ఆ రౌడీల్లో ఒకడిని నెట్టుతాడు ఆ రౌడీ దెబ్బకి 10 అడుగుల దూరం పడుతాడు.. మిగిలిన్నా ఇద్దరు రౌడీలు కూడా వస్తారు.. వాళ్ళని కూడా బాగా చుక్కలు కనపడేలా కొడుతాడు. ఆ దెబ్బకి ఆ రౌడీలు అక్కడినుంచి పారిపోతారు.
అప్పుడు ఆ అమ్మాయి అతనికి thanks చెప్పి అక్కడిని నుంచి వెళ్లి పోతుంది.
ఇది అంత…. చూస్తూ ఉంటుంది ఆ బాగా ఆస్థి ఉన్న అమ్మాయి అంటే ఆక్సిడెంట్ అయింది కదా అలాగే రోజు ఆ హోటల్ కి వస్తూ పోతుంటుంది కదా ఆ అమ్మాయి.
ఆ ఆమయిని కాపాడడం చూసాక అతని మీద కొంచం కోపం తగ్గుతుంది. తనకి!
అప్పుడు ఆమె హోటల్ లో వెయిటర్ ఎవరైనా ఉన్నారా అని గట్టిగ అరుస్తుంది.
అప్పుడు ఒక వెయిటర్ హ చెప్పండి మేడం అని అంటాడు.
ఒక coffe తెమ్మని ఆ వెయిటర్ తో చెప్తుంది.
ఆ వెయిటర్ అలాగే మేడం అని అతని దగ్గరకు వెళ్లి కాఫీ ready చెయ్యమని చెప్తాడు.!
ఆలా చేస్తుండగా.. ఆ అమ్మాయి అక్కడికి వచ్చి చూస్తుంది.
అతను అది గమనించకుండా…అరేయ్ ఈ కాఫీ త్వరగా వెళ్లి ఇచ్చేయ్ రా అని అంటాడు. ఆ వెయిటర్ వెనకకు తిరిగిన చూడగా…
అక్కడ ఆ అమ్మాయి ఉంటుంది. అప్పుడు అతను షాక్ లో ఉంటాడు ఆ పక్కన ఉన్న ఆ వెయిటర్ మేడం ఈ కాఫీ మీకు కాదు మేడం ఇది వేరే వాళ్లకు మీకు నేను త్వరగా ready చేసి తీసుకొని వస్తాను అని అంటాడు.
అప్పుడు ఆ అమ్మాయి ఆ కాఫీ నాకే అని తెలుసు. రోజు నాకు కాఫీ ready చేసేది ఇతనే అని కూడా తెలుసు!
అప్పుడు అతను అంటే మేడం…. నా మొహం చూపించొద్దు అని చెప్పారు అందుకే ఇలా.. చేస్తున్నాను!
ఆ పక్కన ఉన్న వెయిటర్ కూడా అవును మేడం.. అంతేకాకుండా ఈ కాఫీ ఇతను చేస్తేనే బాగా టెస్ట్ వస్తుంది. ఇంకా వేరే కాఫీ తెస్తే మీరు ఇష్టపడరు అని
ఇలా చేస్తున్నాం మేడం అని అంటారు!
అప్పుడు ఆ అమ్మయి ఏమి పర్లేదు రేపటి నుంచి నువ్వే నా ఆర్డర్ తీసుకో అని అతని తో చెప్తుంది.
అప్పుడు అతను సరే మేడం అని అంటాడు.
ఆ అమ్మయి కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అతను పని పూర్తి చేసుకొని బయటకు వస్తాడు. సడన్ గా ఒక సాదువు వచ్చి అతన్ని నువ్వు ఈ ఈ ప్రజలని రక్షించడానికి వచ్చావ్ అని అంటాడు!
అప్పుడు అతను నేను ఎవర్నించి ఈ ప్రజలని కాపాడాలి అని ఆలోచన తో పడిపోయి వింటికి వెళ్లి పోడుకుంటాడు… అప్పుడు అతనికి విచిత్రమైన కలలు మరియూ చెవిలో ఎవరో అరుస్తున్నట్లు విన్పిస్తుంది అతను వెంటనే నిద్ర లేచి అటు ఇటు చూస్తాడు.!
ఓహ్ పీడకళ నా ఇంకా నేను నిజం అనుకున్నాను. అని అనుకుని మళ్ళీ నిద్రపోయి లేచి హోటల్ లో పనికి వెళ్ళడానికి ready అవుతాడు..?