Read Siri 2.0 by Ravi chendra Sunnkari in Telugu ఏదైనా | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 48

    అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు కాదు, చెప్తా. పదండి," అంటూ అ...

  • అంతం కాదు - 47

    ఇప్పుడు విక్రమ్ వీర కుందేలు అందరూ ఒక చోట నిలబడి ఉంటారు ఇప్పు...

  • అంతం కాదు - 46

    ఏంటి అలా ఏడుస్తున్న అంత చిన్నదానికి మరి నాకేం జరిగిందో తెలుస...

  • అంతం కాదు - 45

    అతను అటు ఇటు చూస్తూ ఉన్నంత లేవవే నీళ్లు ఆవిరిపోయి చెట్లు చని...

  • Siri 2.0

    ముఖ్యమంత్రి (కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి):"హ్మ్… నేను తొందరగ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

Siri 2.0

ముఖ్యమంత్రి (కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి):

"హ్మ్… నేను తొందరగా మాట్లాడేశానేమో.

నువ్వు చెప్పింది లైట్ కాదు… అది ఒక తత్త్వం.

వాళ్లు తెలుసో, తెలీదో… కానీ మనం వాళ్ల దేశంలో మన ఆలోచనలను రుద్దగలిగితే – అది మనకో పెద్ద అవకాశం."వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలా చేయడం తప్పుగా అనిపిస్తుంది మనకు కేవలం మన యువశక్తిని పంపించి అక్కడ ఏదో రభస చేయడం కంటే మన దగ్గర ఉన్న తెలివైన వ్యక్తులను అక్కడికి పంపించి వాళ్ళ మనుషులను ఈ మాటను నింపడం మంచిదేమో కదా అని అంటున్నాడు ముఖ్యమంత్రి ఈయ కూడా అవును సార్ 2029 నాటికి ఆల్మోస్ట్ ఒక గ్రామం పిల్లలు లేకుండా ఖర్చుల బాధ పెరిగి అల్లకల్లోలమైన టైంలోనే వీర అనే ఒక టీమ్ మెంబర్ పిల్లలు పెళ్లి వద్దు జీవితంలో హ్యాపీగా ఉంటే చాలు అని గ్రామంలో యువతలు యువకులు అందరూ డబ్బు ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి సింగిల్ గా ఉండిపోయారు మెల్లమెల్లగా ఆ గ్రామం మొత్తం ముసలి వాళ్లు పెరిగిపోయారు యువకులు తగ్గిపోయారు అదే టైంలో వీర తన తెలివితేటలు ఉపయోగించి అక్కడ మీకు డబ్బు ఎందుకు అవసరం బ్రతకడానికే కదా మీ చుట్టూ ఎన్నో అడవులు చెట్లు సేవలు అన్ని ఉన్నాయి అలాంటప్పుడు మీకు డబ్బుతో బాధేందుకు పూర్వకాలంలో ఎవరైనా డబ్బు మీద ఆధారపడ్డారా వేటాడారు తీసుకొచ్చారు తిన్నారు పంచారు బ్రతికారు కానీ ఇప్పుడు డబ్బు విలువ అనేది మనిషిలో ఉంటుందేమో కానీ జీవితంలో కాదు నీ మనసు ఎలా కోరుకుంటే నీ జీవితం అలా ఉంటుంది నువ్వు డబ్బును కోరుకుంటే కష్టంగా ఉంటుంది డబ్బు వద్దు జీవితం కావాలనుకుంటే స్వేచ్ఛగా ఉండొచ్చు ఈ ప్రకృతి ఊరికే రాలేదు ఈ ప్రకృతి మానవ జీవితాలను నిలిపేందుకే వచ్చింది అని ఏదో స్పీచ్ ఇచ్చి ఆ గ్రామంలో యువకులకు కష్టం చేసి డబ్బు సంపాదించడం కంటే కష్టపడి జీవించడం మంచిది అని నేర్పించి ఆ గ్రామాన్ని మళ్లీ స్థిరపెట్టాడు అలాంటి వ్యక్తులు మనకు కావాలి అని మాట్లాడటం మొదలు పెట్టాడు పిఏ వెంటనే ది నిజంగా ఇలాంటి వ్యక్తి ఉన్నాడా అని ఆశ్చర్యపోయాడు ప్రతినిధి

ఫ్లాష్‌కట్ – వీధి దృశ్యం)

హైదరాబాదు/ఢిల్లీ/ముంబై లాంటి మెట్రోలో ట్రాఫిక్ అడ్డుగోడలా నిలిచిపోయింది.

బస్సులు, కార్లు, బైకులు—ఒకదాని వెంట మరొకటి వేగంగా వెళ్తున్నాయి.

ప్రజలు ఎవరో పనికోసం పరుగులు, ఎవరో ఎంజాయ్ కోసం హడావిడి.

అక్కడ మధ్యలో, ఒక వ్యక్తి ప్రశాంతంగా నిలబడి గమనిస్తున్నాడు.

అతని చూపుల్లో ఒక ఆలోచన, ఒక చిన్న స్మైల్.

వీర (మనసులో):

"ఇదేనా మన దేశం అద్భుతం…

ఒకపక్క కష్టానికి వెళ్తున్నారు, మరోపక్క చిన్న చిన్న చిల్లర విషయాల్లో నవ్వుతున్నారు.

ఇలాంటి జీవితం ఇంకెక్కడ దొరుకుతుంది?"

వెంటనే అతనికి ఫోన్ కాల్ వస్తుంది.

అతను రోడ్డుమధ్య నడుస్తూ ఫోన్ ఎత్తుతాడు.

కార్లు బస్సులు ఆగిపోవాలి అనిపిస్తుంది… కానీ అతను ముందుకు నడుస్తుంటే ఎవరికీ అడ్డంకి కనిపించదు.

ప్రజలు సహజంగానే సైడ్‌కి తిప్పుకుని వెళ్తారు.

వీర (ఫోన్‌లో, చిన్నగా నవ్వుతూ):

"ఏంటి? మరో మిషన్?

ఇక్కడా కాదా… సరే, వస్తా.

కలిసి మాట్లాడుదాం."

అతను ఫోన్ కట్ చేసి, కారు ఎక్కి బయలుదేరుతాడు.

గాజు అద్దంలో తన కళ్లను చూసుకుంటూ నెమ్మదిగా అంటాడు:

"వీళ్ళ మిషన్‌లో ఇప్పుడు నేను కూడా చేరిపోయాను."

క్యామరా జూమ్ – అతని కళ్ళలో ఒక కొత్త మిషన్ స్పార్క్ మెరిసిపోతుంది.(ఆఫీస్ గేట్ ముందు)

కారు ఆగగానే గార్డులు క్రమశిక్షణతో సెల్యూట్ కొడతారు.

లోపలికి అడుగుపెడుతున్నాడు వీర.

అతని అడుగులు కట్టుదిట్టమైన ఆఫీస్ వాతావరణంలో ఒక ప్రత్యేక రిథమ్ సృష్టిస్తాయి.

సిబ్బంది (చిన్నగా నవ్వుతూ, గమనిస్తూ):

"వీరా… నీ లక్కు బాగుంది రా!

ఈసారి ఏదో పెద్ద మిషన్ దొరికింది.

వినేంత వరకూ… దేశాలకి వెళ్లే అవకాశం… సూపర్ ట్రిప్ కదా!"

వీర చిన్నగా స్మైల్ చేస్తాడు.

"పని పెద్దదా లేదా చిన్నదా అన్నది నాకు కాదమ్మా…

ఎంత విలువైనదో అదే ముఖ్యం." అని లోలోపల అనుకుంటూ ముందుకు వెళ్తాడు.

---

(బాస్ ఆఫీస్ లోపల)

డోర్ తీయగానే ఒక గంభీర వాతావరణం.

డెస్క్ వెనకాల SP (సీనియర్ ఆఫీసర్) కూర్చున్నాడు.

వీర సూటిగా ముందుకు వెళ్లి సెల్యూట్ కొడతాడు.

వీర:

"చెప్పండి సార్."

SP (కఠినమైన టోన్ లో):

"వీరా… నీకు సూటిగా చెప్పేస్తున్నా.

నువ్వు ఢిల్లీకి వెళ్లాలి.

అక్కడ ఒక ముఖ్యమంత్రి అసిస్టెంట్ ఉంటాడు – పేరు లక్ష్మణ్.

ఆయనతో కాంటాక్ట్ అవ్వు.

వాడే నీకు ఈ మిషన్ వివరాలు చెబుతాడు.

ఆ తర్వాత నీ అసలు పని మొదలవుతుంది."

SP టేబుల్ మీద ఫైల్ వేస్తాడు.

"ఢిల్లీ టికెట్లు, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. Take it and move."

వీర ఫైల్ తీసుకుంటాడు.

చిన్నగా తల ఊపి –

"ఓకే సార్." అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడుఎయిర్‌పోర్ట్ – ఢిల్లీ)

వీర ఫ్లైట్ దిగుతాడు. చుట్టూ బిజీ వాతావరణం – పర్యాటకులు, ఆఫీసర్స్, సైనికులు.

వీర బ్యాగ్ తీసుకొని బయటికి అడుగు పెడుతుంటే ఫోన్ రింగవుతుంది.

శర్వా (స్పీకర్‌లో నవ్వుతూ):

"వీరా, నీ ఫైల్ చూశాను.

నువ్వు త్వరలో జపాన్‌కి వెళ్ళాలి అంటారు.

కానీ… నీకు జపనీస్ వచ్చా?"

వీర (స్మైల్ చేస్తూ):

"రాదు… నేర్చుకోవాలి."

శర్వా (జోక్ చేస్తూ):

"ఏమండీ! వారం రోజుల్లోనే బయలుదేరాలి అంటున్నారు.

అంతలో నువ్వు భాష నేర్చుకుంటావా?"

వీర (ఆత్మవిశ్వాసంగా):

"30 రోజులు పుస్తకాలు ఇచ్చి ఉంటే 30 రోజుల్లో నేర్చుకుంటా.

ఇప్పుడు వారం లో బయలుదేరినా… అక్కడ 10-20 రోజులు ఉండాల్సిందే కదా.

అంతలో basics నేర్చేసుకోవచ్చు.

అసలు మనం మాట్లాడేది కేవలం పని కోసం మాత్రమే.

భాష కంటే మన మాటలలోని నిజాయితీ ముఖ్యం."

శర్వా చిన్నగా సైలెంట్ అయ్యి:

"హ్మ్… నిజమే. కానీ జాగ్రత్తగా ఉండు. అక్కడ నువ్వు చేసే ప్రతి action రికార్డ్ అవుతుంది."

---

(ఢిల్లీ – ఒక భారీ ప్రభుత్వ భవనం ముందు)

వీర కారు నుండి దిగుతాడు.

ముందు అద్భుతమైన తెల్లటి భవనం – జాతీయ చిహ్నాలతో మెరిసిపోతూ.

భవనం ముందు గట్టి సెక్యూరిటీ. గేటు దగ్గర పోలీసులు, లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు.

వీర సైలెంట్‌గా తన ఐడీ చూపిస్తాడు. వెంటనే సల్యూట్ చేసి లోపలికి అనుమతిస్తారు.

(లోపల)

గొప్పగా మెట్ల మీద ఎరుపు కార్పెట్.

చుట్టూ పోలీస్ ఆఫీసర్లు, సెక్రటరీలు, స్టాఫ్ ఒక్కొక్కరిగా కదులుతున్నారు.

వీర క్రమంగా మెట్లు ఎక్కుతూ లోపలికి అడుగు పెడతాడు.

అతని మనసులో ఒకే ఆలోచన –

"ఇక్కడి నుంచి అసలు మిషన్ స్టార్ట్ అవుతుంది."భారీ హాలులో – లోపలికి అడుగు పెట్టిన వెంటనే)

వీర నెమ్మదిగా లోపలికి నడుస్తూ వస్తాడు.

అక్కడ ఎదురుగా లక్ష్మణ్ (ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్) ముందుకు వచ్చి అతన్ని ఆపుతాడు.

లక్ష్మణ్ (ఆతురంగా):

"రా వీర… ఇప్పుడు కేవలం మన భారతదేశం కాదు.

అంతే కాదు, ఐదు దేశాల భవిష్యత్తు కూడా నీ మాటలపై ఆధారపడింది.

ఏదో ఒకటి చేయాలి.

నీ తెలివైన మాటలతో… నీ నిర్ణయాలతో… నువ్వే ఈ ప్రపంచాలను రక్షించాలి."

చుట్టూ ఉన్న అధికారులు, పోలీస్ ఆఫీసర్లు ఒకేసారి వీర వైపు గమనిస్తారు.

ఒక క్షణం వాతావరణం సీరియస్‌గా మారుతుంది.

వీర (చిన్నగా నవ్వుతూ, కానీ గంభీరంగా):

"లక్ష్మణ్ గారు… నేనేమీ సూపర్ హీరోను కాదు.

నా చేతిలో అన్నీ ఉండవు.

నేను చేయగలిగేది ఒకటే – సత్యం చెప్పడం,

మనుషుల మనసులు గెలుచుకోవడం.

అది చాలదా?"

లక్ష్మణ్ కాసేపు నిశ్శబ్దంగా వీర ముఖం వైపు చూస్తూ:

"చాలుతుంది వీరా… అదే చాలుతుంది."(ఆఫీస్ లోపల – హై సెక్యూరిటీ రూమ్)

ఒక పెద్ద టేబుల్ మీద ఫైళ్లు, మ్యాప్స్, స్క్రీన్ల మీద ఐదు దేశాల డేటా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

వీర కుర్చీలో కూర్చుంటే, లక్ష్మణ్ అతని ముందర ఫైల్ ఉంచుతాడు.

లక్ష్మణ్ (గంభీరంగా):

"వీరా… నువ్వు సూపర్ హీరో కాదు అని నిజం.

కానీ మేము చెప్పిన పని నువ్వే చేయాలి.

ఎందుకంటే నువ్వు ఇంతకుముందు చేసినది మిగతావాళ్లు ఎవరూ చేయలేకపోయారు.

హ్యూమన్ ట్రాఫికింగ్… వర్కర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్…

ఎన్నోసార్లు విన్నాం, కానీ నువ్వే ఆ సమస్యలను రూట్‌లోంచి సాల్వ్ చేశావు."

వీర ఫైల్ ఓపెన్ చేస్తూ, డేటా, ఫొటోలు గమనిస్తాడు.

వివిధ దేశాల్లో తగ్గిపోతున్న జనాభా, ఖాళీ గ్రామాలు, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం – అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

లక్ష్మణ్ (కొనసాగిస్తూ):

"ఇప్పుడు అంతకంటే గొప్ప పని.

ఐదు దేశాల భవిష్యత్తు, వారి సమాజపు బలహీనతలు,

మనతో చేయబోయే ఒప్పందాలు – ఇవన్నీ నీ నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి."

వీర (ఫైల్ చదువుతూ, చిన్నగా నవ్వుతూ):

"ప్రతిసారి ఈ ఫైళ్లలో వ్రాసినదాన్ని నేను చదివి,

ఆ విషయం చెప్పడానికి భగవద్గీత రాసుకోవాల్సిన అవసరం లేదు కదా?

సమస్య సింపుల్‌గా ఉంటుంది…

కానీ మనుషులు దాన్ని కాంప్లికేట్ చేస్తారు."

లక్ష్మణ్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంటాడు.

అతనికి తెలిసిపోతుంది – వీర already ప్లాన్‌లోకి దిగిపోయాడు.

(ఆఫీస్ – రహస్య గది)

లక్ష్మణ్:

> “వీరా… ప్లాన్ ఏంటో నాకు చెప్పవా?”

వీర కిటికీ వైపు తిప్పి చూస్తాడు.

అక్కడ రెండు కళ్ళు — దొంగ చూపుగా లోపలికి చూస్తున్నాయి.

ఒక్క క్షణంలోనే అవి మళ్లీ మాయం అయ్యాయి.

వీర (శాంతంగా):

> “చెప్తాను.

కానీ ఫస్ట్ నేను ఏ దేశానికి వెళ్ళాలో ఫిక్స్ చేయాలి.

మొదట జపాన్‌కి వెళ్ళాలి.

అక్కడి నుంచి తవ్వకాలు మొదలు పెడతాను.

నేను వచ్చిన ప్లాన్ వేరు… మీరు ఇచ్చిన పని వేరు…

కానీ రెండు సింక్ అయ్యేలా ఎలా చేయాలో నేను చూసుకుంటాను.”

అని చెప్పి వీర ఎస్పీకి సెల్యూట్ కొట్టి పక్కకు వెళ్ళిపోతాడు.