Read pushpaka vimaanam by Raparthi Anuradha in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

పుష్పక విమానం

మంచి కథ మనం అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉన్న కథ అందరికోసం ఉద్దేశించి
రాస్తున్న కథ మీరు చదవాలి అని నేను కోరుకుంటున్న కథ
ఇంత స్థిరంగా చెబుతున్న
ఇంతకీ ఏమిటా కథ అని మీలో అందరికీ డౌట్ వస్తుంది అవునా
సరే ఇప్పుడు కథలోకి వెళుతున్న .

తూర్పు గోదావరి జిల్లా
సఖినేటిపల్లి మండలానికి
చెందిన కొండల రావు కొడుకు
ఈ కథలో హీరో ,
అతడి పేరు బుచ్చి బాబు
అంతా అతడ్ని బుచ్చి అని పిలుస్తుంటారు... 
కానీ మన బుచ్చి బాబు కి 
ఆ పేరు అంటే అస్సలు నచ్చదు.

అందుకే భార్గవ్ అని మార్చుకున్నాడు
కాలేజ్ నుండి జాబ్ లో జాయిన్ అయిన సాఫ్టు వేర్ కంపెనీ వరకు అన్ని చోట్ల అతడి పేరు భార్గవ్ గా చెప్పుకుంటూ ఉంటాడు
కానీ రికార్డ్ లో బుచ్చి బాబు అనే ఉంటుంది. 

ఉద్యోగ రీత్యా చెన్నై లో ఉంటున్న సెలవులకి ఊరుకి వచ్చాడు
అంటే చాలు ఊరిలో కుర్రాళ్ళు అంతా ఎరా బుచ్చి బాగున్నావా ఎప్పుడు వచ్చావ్ అని అతడి చుట్టు చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తారు.

ఇంటికి చేరుకునే మార్గం లో దారి పొడుగు నా అతడు లేని ఇన్ని రోజులు జరిగిన ఊరిలో విశేషాలు కబుర్లు చెప్పడం చేతిలో బ్యాగు మాకు ఇవ్వరా అంటూ ఎంతో ఆప్యాయత చూపించడం 
చేస్తూ ఉంటారు, 

ఇంటికి చేరుకున్న వెంటనే ఇంట్లో అమ్మ నాన్న అత్త మావయ్య బామ్మ తాతయ్య చిన్నన్న పెదనాన్న ఇలా తన వాళ్ళు అంతా ఆనందంగా అతడి చుట్టు చేరి
గాబరా గాబరా గా వంటలు వండి తినమని హడావిడి పెడుతూ ఉంటారు
రేయ్ బుచ్చి ఈ శనక్కాయలు తినరా ఈ కొబ్బరి బొండం తాగర తాటి త్యగలు కాల్చుకు వచ్చాం పెరట్లో బొప్పాయి కొసుకు వచ్చాం పుచ్చకాయ తిను సలవ మజ్జిగ తాగు ఇంకా సలవా అంటూ
అతడి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ ఎప్పుడు గుంపులు గుంపులు గా అతడి చుట్టు చేరి గొడవ గొడవ గా మాట్లాడుతూ ఎంతో
సందడి గా ఉంటారు.

అదంతా వాల్ల అభిమానం ఆప్యాయత తమ బిడ్డ ఊరు కానీ ఊరిలో ఉంటున్నాడు 
ఎప్పటికో గాని రాడు అని వచ్చి రాగానే ప్రేమ అంతా చూపిస్తూ ఉంటారు 

బుచ్చి మరదలు సుందరి కి బావ అంటే చాలా ఇష్టం అతడే తన మొగుడు అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యింది అందుకు బుచ్చి బాబు కూడా ఓకే అని చెప్పాడు
కానీ ఆ పల్లెటూరి వాతావరణం ఇంటి నిండా జనం అస్సలు ప్రశాంతత లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ తనకి ఆకలి ఉందా అసలు తినే ఇంట్రస్ట్ ఉందా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇబ్బంది పెట్టడం అతడికి అస్సలు నచ్చదు.

అందుకే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్న కసురు కుంటు పెట్టిన తిండి సగం తిని చేయి కడుక్కోవడం ఆశగా కోసి పెట్టిన పల్లని నచ్చలేదు అంటూ అక్కడ ఉన్న ఆవులకి పడేయడం అమ్మ విసిగించకు ప్లీజ్ అంటూ స్టైల్ కొట్టడం 

ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా
ఫోన్ పట్టుకుని గంటలు గంటలు గడపడం తను పనిలో ఉన్నాను అని బిజీ అని వెతుక్కుంటూ
వచ్చిన చిన్ననాటి స్నేహితులని పట్టించుకోక పోవడం చేస్తూ ఉంటాడు.

వాళ్ళు మాత్రం మా బుచ్చి ఎంత పెద్దవాడు అయ్యాడు పెద్ద ఉద్యోగం మరీ ఎప్పుడు బిజీగా ఉంటాడు ఇబ్బంది పెట్టకూడదు అని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు...

సుందరి బావ కోసం పూతరేకులు సున్నుండలు చేసి పట్టుకుని వచ్చింది ఆమె రావడం చూసి చిన్న నవ్వు నవ్వాడు బుచ్చి 

ఎంటి సుందు నేను ఉదయం వచ్చాను నువ్వు ఇప్పుడా రావడం అని అడిగాడు

ఆమె సిగ్గు పడుతు సారి బావ నువ్వు వస్తున్నావు అని నీకోసం స్వీట్స్ చేసి తెచ్చాను అందుకే లేట్ అయ్యింది అయినప్పటికీ చాటుగా నిన్ను చూశాను లే అని చెప్పి అతడి ముందు వండిన వాటిని పెట్టింది.

బుచ్చి ఇంటి ఎదురిల్లే సుందరి వాల్ల ఇల్లు స్వయానా మేనమామ కూతురు ప్రేమగా వండి పెట్టిన స్వీట్స్ చూసి ఇష్టంగా తినకుండా బిల్డప్ ఇస్తు హు ఎందుకు సుందు వీటికోసం టైం వేస్ట్ చేశావ్ 
షాప్ లో దొరుకుతాయి గా
అయిన నాకు తినే ఇంట్రస్ట్ లేదు నువ్వు ఫీల్ అవుతావు అని చిన్న ముక్క తింటాను అని స్టైల్ గా తింటూ ఆమెతో కబుర్లు చెబుతూ అతడి ఆలోచన చెప్పాడు 

నాకు ప్రమోషన్ వస్తుంది త్వరలో అమెరికా వెళ్ళిపోతాను
అక్కడ అయితే ఎంత ప్రశాంతం గా ఉంటుందో ఈ జనం ఈ గోల విసుగు తెప్పించే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉండరు

అసలు ఇంటికి ఇంటికి కిలోమీటర్ల దూరం ఉంటుంది అంట
అస్సలు పొల్యూషన్ ఉండదు స్వచ్ఛమైన వాతావరణం ప్రకృతి అధిక రాబడి లగ్జరీ లైఫ్ తెలుసా నాకు అయితే ఎప్పుడు వెళ్లి పోతాన అని ఉంది అని పిడుగు లాంటి వార్త చెప్పాడు.

అంతే సుందరి ఏడుపు అందుకుని అంటే నన్ను విడిచి పెట్టీ వెళ్ళిపోతావా బావ అని ఏడుస్తూ అడుగుతుంటే 

అతడు ఆమెను ప్రేమగా దగ్గరకి తీసుకుని పిచ్చిదాన నిన్ను విడిచి నేను ఉండగలనా చెప్పు 

జాబ్ అయితే వస్తుంది అమెరికా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న 
అక్కడ ఒక ఆరునెలలు ఉండి అంతా సెట్ అవ్వగానే ఇండియా వచ్చి నిన్ను పెళ్లాడి నాతో తీసుకు పోతాను ఎంతో హాయిగా మన ఇద్దరం మాత్రమే అక్కడ ఉంటాం ఎవ్వరి డిస్ట్రబ్ ఉండదు కాబట్టి నాకు ఎంత సంతోషం గా ఉందో హు ఎలా ఉంది ప్లాన్ అన్నాడు.


ఆమె కళ్ళు తుడుచుకుంటూ బావా నీకు ఎదీ సంతోషం అంటే నాకు అదే సంతోషం నీ సంతోషం కోసం నేను ఎం చేయాలి అన్నా చేస్తాను 
అని అతడి కౌగిలిలో కరిగిపోవలి అనుకుంది

బుచ్చి కూడా మరదలిని దగ్గరకు తీసుకొ బోయాడు 
అంతలో చిన్నన్న పిల్లలు అన్నయ్య అంటూ అక్కడికి వచ్చి అమ్మ చేగోడి చేసింది నీకు పెట్టమని చెప్పింది
హు ఇదిగో తిను అని ఇచ్చాడు.

సుందరి నవ్వుతూ పక్కకి తప్పుకుంది 
బుచ్చి కి మండింది 
ఆ పిల్లల మీద రంకెలు వేస్తూ గదిలోకి వచ్చే టప్పుడు తలుపు తట్టి రావాలి ఇలా వస్తె ఎలా నాకేం వద్దు తీసుకు పో అని అరిచి చెప్పాడు
ఆ పిల్లలు ఏడుపు మొహం పెట్టుకుని వెళ్ళిపోతూ 
వాళ్ళు తెచ్చినవి అక్కడే పెట్టేసి పోయారు

బుచ్చి వాటిని విసిరి కొట్టాడు... సుందరి దిగులుగా అదేంటి బావా తినే వాటిని విడిరికొట్టావు
అలా చేయకూడదు అని సర్ది చెప్పింది

మరుసటి రోజు ఇంట్లో అందరికీ విషయం చెప్పాడు 
అమెరిక లో జాబ్ చేయాలి అనుకుంటున్నట్టు ఆరు నెలలు
ఇంక ఇండియా రాలేను అని వచ్చిన వెంటనే పెళ్లి ఆ వెంటనే సుందూ నీ తీసుకు పోతాను అని చెప్పాడు

బుచ్చి తల్లి తండ్రి దిగులుగా
అంత దూరం పోతే ఎట్టారా మాకు నువ్వు ఒక్కగానొక్క కొడుకు వి నిన్ను చూడాలి అనిపిస్తే ఇప్పుడు చేస్తున్న దగ్గరకి ఏ రైలు పట్టుకుని అయిన వచ్చి చూసుకుంటాం 
ఆ దేశాలు పోతే మేము
ఏ పుష్పక విమానం పట్టుకోవాలి చెప్పు అని విచారించారు.

బుచ్చి ముందే ఫిక్స్ అయ్యాడు కుటుంబ సభ్యుల గొడవ గోల గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని అందుకే స్థిరంగా చెప్పాడు
మీరు ఎక్కనవసరం లేదు ఆ పుష్పక విమానంలో నేను సుందు వెళ్ళిపోతాం
అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం రోజు ఫోన్ చేస్తాం వీడియో కాల్ చేస్తే రోజు మమ్మల్ని చూడొచ్చు
అప్పుడు మీకు బెంగే ఉండదు నన్ను మాత్రం అడ్డకండి అని అడిగాడు 

వాళ్ళు కొడుకు ఆశల గుర్రం ఎక్కి ప్రయాణం చేయాలి అని చూస్తున్నాడు
రెక్కలు వచ్చాక ఎగిపోతాను అంటుంది పక్షి
వద్దు అంటే మాత్రం ఆగుతుందా
నీ ఇష్టం అనేశారు 
కానీ వాళ్ళలో ఎవరికి సంతోషం లేదు 
ఇంట్లో అందరూ విచారంగా ఉన్నారు బుచ్చి వెళుతూ వెళుతూ నిన్నటి రోజు తిట్టిన చిన్నన్నా పిల్లలికి చేరో వంద ఇచ్చాడు
అంతే వాళ్ళు సంతోష పడ్డారు బుచ్చి అనుకున్నాడు
డబ్బులు ఉంటే సంతోషం అదే వస్తుంది అని.

కొద్ది రోజుల తరువాత బుచ్చి అమెరికా ప్రయాణం అయ్యాడు అక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని జాబ్ ఇష్టంగా చేస్తూ బాగానే సంపాదిస్తూ ఒక్కో వస్తువు కొనుక్కుంటున్నాడు
అమెరికాలో సొంత ఇంటిని కొనే ప్లాన్ చేస్తున్నాడు
అనుకున్నట్టే ఒక హోస్ సేల్ చేస్తున్నారు అని ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని 
వెళ్లి చూసాడు ఎంతో అందమైన ఇల్లు అరెకరం ప్లెసు లో అందంగా కట్టారు చుట్టు పచ్చటి గార్డెన్ పూల మొక్కలు పల్లు వెజిటేబుల్ లాంటి ప్లాంట్స్ తో అందంగా ఉంది

ఆ ఇంటికి చుట్టు ప్రక్కల మరే ఇల్లు లేవు ఎవరి డిస్ట్రబ్ లేదు 
సిటీ కి కాస్త దూరం లో ఎంతో అద్భుతమైన వాతావరణం లో 
కను చూపు మేర మరే ఇల్లు మనుషులు లేకుండా బలే బాగుంది అనుకున్నాడు 

నాకు నా వైఫ్ కి ఇక్కడ ఎలాంటి డిస్ట్రబ్ ఉండదు అని ఈ ఆరు నెలలు సంపాదించిన సొమ్మును లెక్క చూసుకుంటే ఇంకో పది లక్షలు చాలలేదు వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు 

అంతే ఆ పెద్దలు ఏడుస్తూ భయ పడిపోయారు
అక్కడే సొంతిల్లు అంటే ఇంక మన ఇంటికి రావా అని అడిగింది 
అతడి తల్లి 

బుచ్చి విసుక్కుంటూ ఎంటంమ్మ ఉన్నన్నాల్లు అద్ధి ఇంట్లో ఉంటే వచ్చిన జీతం అద్దేకే సరిపోతుంది కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను మరీ మంచి ఇల్లు దొరికింది వదులుకుంటే ఎలా అని అన్నాడు

అక్కడి వాళ్ళు ఆలోచించి సరే బాబు డబ్బు ఏర్పాటు చేస్తాం అన్నారు అనుకున్నట్టే ఇల్లు కొనేసాడు హమ్మయ్య ఇండియా వెళ్లి పెళ్లి చేసుకుని రావడమే అని హ్యాపీగా ఇండియా చేరుకుని మరదలు సుందరిని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కూడా అమెరికాలో ఇక్కడ కాదు మన స్వగృహం లో అని చెప్పి ఆమెతో వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కాడు 

అతడి ఫ్యామిలీ అంతా విచారిస్తూ ఉన్న పిండివంటలు వండి ప్యాక్ చేస్తాము అని చెప్పిన లగేజ్ ఎక్కువ అయ్యింది అని అవసరం లేదు అని చిరాకు పడి మరి పెళ్ళాన్ని తీసుకుని అమెరికా వెళ్ళాడు

అక్కడికి చేరాక ముందు ఉన్న ఇంట్లో వస్తువులు కొత్త పర్నిచర్ తో పాటు ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ ప్రొడక్ట్స్ పార్సిల్ చేయించి మొత్తం ఒక ఏజెన్సీ కి అప్పచెప్పి
తాను తీసుకున్న ఇంటి అడ్రస్ పేపర్ అందించి అక్కడికి చేర్చమన్నాడు తామిద్దరూ కార్ లో వెళతాం అని చెప్పి వాళ్ళని ముందుగా పంపించాడు 
వాళ్ళే పర్నిచర్ అంతా సర్ది పెట్టేస్తారు ఆలోగా కొత్త జంట అమెరికాలో షికారు చేస్తూ సరదాగా గడిపారు సుందరి బావ చూపే ప్రేమలో ఆనందంగా మునిగిపోయింది
ఇద్దరు ఎంతో సంతోషం గా రాత్రి పది గంటలకు కొత్త ఇంటికి చేరుకున్నారు
మరో వైపు చీకటిలో తెల్లటి మంచు కురుస్తూ ఎంతో అందంగా ఉంది సుందరి చలికి వణికిపోతూ
బావను చుట్టి పట్టుకుని అక్కడి సౌందర్య దృశ్యం చూసి ఆశ్చర్య పోయింది 

బుచ్చి నవ్వుతూ అమెరికా అంటే ఏమనుకున్నావు ఆఫిస్ లీవ్ పెట్టాను కొద్ది రోజులు వరకు నేను ఎక్కడికి వెళ్ళను 
ఇక్కడే ఉంటాను సో కార్ లో ఫెట్రోల్ అయిపోతే ఏమైంది బైటకు వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉంటాయి గా మన ఏకాంతం కి ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను అని భార్య సమేతంగా కొత్త ఇంట్లో అడుగు పెట్టాడు 

కానీ అతడు ఊహించని షాక్ ఎదురైంది తమ ఇంట్లో ఎలాంటి వస్తువులు అమర్చి లేవు ఏజెన్సీ వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదు అంటే మేమే ముందు వచ్చామా వాళ్ళు ఇంకా రాక పోవడం ఏమిటి విసుక్కున్నాడు సుందరి సర్ది చెప్పింది 
మంచు కురుస్తుంది గా బావ అందుకే రాలేదు ఏమో మరునాడు వస్తారు లే ఆవేశ పడకు అని అతడ్ని తీసుకుని గదిలో నేలమీద కూర్చో పెట్టింది 
అక్కడ ఇంకే వసతులు లేవు చలిగా ఉంది
కిచెన్ లో పొయ్యి వెలిగించే గేసు ఉన్నాయి కానీ వంట సామగ్రి లేదు రెండు మూడు వంట పాత్రలు ఉన్నాయి అంతే ఆ రాత్రికి ఎలాంటి ఫుడ్ అవసరం లేదు అని భార్యతో చెప్పి నిద్ర పోయాడు కొత్త మంచం మీద మన ఫస్ట్ నైట్ అని చెప్పి సుందరి అర్థం చేసుకుని బావ పక్కనే నిద్రపోయింది.

*' ఏజెన్సీ వాళ్ళు ట్రక్ నడుపుతూ ఉన్న వాల్ల వద్ద ఉన్న అడ్రస్ మిస్ అయ్యింది 
గుర్తున్న వరకు ప్రయాణిస్తూ ట్రక్ నడుపుతూ బుచ్చి మొబైల్ నంబర్ కి కాల్ చేస్తున్నారు
కాని వాళ్ళు చేస్తున్న నంబర్ రాంగ్ అని వస్తుంది
ఆ ట్రక్ లో ఇద్దరు ఉన్నారు 
ఒకర్ని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు నువ్వే అడ్రస్ మిస్ చేశావ్ అంటే నువ్వే చేశావ్ అని మొత్తానికి వాళ్ళు సిన్సియర్ గా ట్రక్ బుచ్చి ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

*" మరునాడు ఉదయం సుందరి నిద్ర లేచి బైటకు పోయి చూసింది చాలా విశాలమైన స్థలం చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు ఇరుగు పొరుగు అనే మాటే లేదు 

తన ఊరిలో అయితే ఇంట్లో పాలగిన్నే మాడితే పదిల్లకి వాసన పోయి ఎవరింట్లో పాలు మాడిపోతున్నాయి చూడండి అని హడావిడి హడావిడి చేస్తారు

ఇక్కడ మనుషులు మాడిపోయిన తెలిసే అవకాశం లేదు
బావ ఇలాంటి ఒంటరితనం ఎందుకు ఇష్ట పడుతున్నాడు 
అని విచారిస్తూ గార్డెన్ లో కనిపించిన నిమ్మ చెట్టు వద్దకు వెళ్లి ఒక నిమ్మకాయ కోసుకు వచ్చి
నీళ్ళు మరగ పెట్టీ అందులో నిమ్మ రసం పోసి లిమన్ టి అంటూ బావాకి ఇచ్చింది నేలమీద పడుకున్న బుచ్చి ఒళ్లంతా నొప్పులు పెడుతుంటే మరదలు టి తెచ్చి ఇచ్చింది అని సంతోషం గా అందుకుని తాగాడు

చి స్వీట్ లేదు ఏమిటే అయిన ఇదేం టి అని చివాట్లు పెట్టాడు

సుందరి విచారం గా సారి బావ ఇక్కడ ఏమీ లేవు గా అందుకే అని చెప్పింది బుచ్చి సీరియస్ గా ఆ ఏజెన్సీ వాల్ల కంపెనీ కి ఫోన్ చేసి ఇంక మా పర్నిచర్ రాలేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమీ బాలేదు అన్నాడు 

వాళ్ళు క్షమాపణ చెబుతూ అతడు ఉంటున్న అడ్రస్ చెప్పండి మా ఏజెంట్స్ కి మెసేజ్ పాస్ చేస్తాం అన్నారు బుచ్చి విసుగ్గా అడ్రస్ చెప్పాడు

అవతలి వ్యక్తి ఓకే సర్ వెంటనే యాక్షన్ తీసుకుంటాం అని ట్రక్ నడుపుతున్న వాళ్ళకి కంపెనీ మేనేజ్మెంట్ కాల్ చేస్తున్నారు 

కానీ కాసేపటి క్రితం డ్రైవర్ అతడి హెల్పర్ గొడవ పడి మొబైల్ విరక్కొట్టారు అందుకే లైన్ కలవలేదు...!

ఆరోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి ఫుడ్ లేదు బుచ్చి కి కడుపులో విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి

దాన్నే ఆకలి అంటారు అని తెలియలేదు

బావ కోసం ఆలోచన చేసి సుందరీ గార్డెన్ వైపు వెళ్ళింది చూస్తే ఒక అరటి చెట్టు కనిపించింది

దానికి అరటి గెల ఉంది కానీ ఒక్కే పండు పండి ఉంది

మిగిలినవి అన్ని కాయలు అయినప్పటికీ వాటిని కోసుకు వచ్చింది బావ ఈ అరటి పండు తిను అని ఇచ్చింది

అంతే బుచ్చి గబగబా సగం తిని అమృతం లా వుంది సుందు
ఇంకో రెండు ఉంటే ఇలా పడెయ్ అన్నాడు

సుందరి దిగులుగా ఒక్కటే పండు ఉంది బావ మిగిలినవి కాయలే అని చెప్పింది బుచ్చి ఫీల్ అయ్యాడు

చ ఎంతో సంతోషంగా గడపాలి అని వస్తె ఇలా జరిగింది ఎంటి 
అని సగం తిన్న అరటి పండు భార్యకి ఇచ్చి నువ్వు తిను నిన్నటి నుండి నువ్వు ఏమీ తినలేదు అని ఆమె వద్దు నువ్వు తిను అంటున్నా తినిపించాడు

కానీ వాల్ల ఆకలి తీరలేదు అందుకని సుందరి ఆ కాయలు ముక్కలు గా కోసి ఉడక పెట్టి సాల్ట్ జల్లి తీసుకు వచ్చింది

ఆ మిశ్రమం ఎదో పరమాన్నం లా తిన్నాడు బుచ్చి

ఆ క్షణం అతడికి అమ్మ ప్రేమగా దగ్గర కూర్చుని అరిసెలు తినిపించడం గుర్తుకు వచ్చింది

వేడినీళ్లలో పుదీనా ఆకులు వేసి ఇచ్చింది సుందరి వాటిని తాగుతూ ఉంటే నాన్న గుమ్మపాలు తెచ్చి బలవంతం గా తాగిస్తున్నప్పటి
రుచి తెలిసింది... 

సాయంత్రం అవుతుంటే ఇద్దరిలో నీరసం మొదలైంది గార్డెన్ లో ఏమీ తోచక తిరుగుతుంటే టమాట చెట్లు కనిపించాయి

ఎర్రగా పండిన టమాటాలు గబగబా కోసి టి షర్ట్ కి తుడుచుకుని అతడు తింటూ భార్యకి తినమని ఇచ్చాడు అవి తింటున్న బుచ్చి కి పెరట్లో బొప్పాయి పండు తీయదనం తెలిసింది

అంతే అతడికి తెలియ కుండానే కన్నీళ్లు వస్తున్నాయి
అంతలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది నాన్న చేస్తున్నారు
వీడియో కాల్ ఆన్ చేసి చూసాడు ఇంట్లో అందరూ హడావిడి చేస్తూ బాబు ఎలా ఉన్నారు అంతా క్షేమంగా చేరుకున్నారు గా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు గా అని అడుగుతుంటే అమ్మ కలుగు చేసుకుని

ఉరే బుచ్చి మన మచ్చలావు ఈనింది రా రెండు రోజులు ఉండి వెళ్లి ఉంటే జున్ను వండి పెట్టే దాన్ని అని అమ్మ అంటుంది

ఇంట్లో వాళ్ళు అంత వాళ్ళని చూసి ఆనంద పడిపోతూ ఉన్నారు

ఇప్పుడు వాల్ల ఆప్యాయత ఏమిటో బుచ్చికి తెలుస్తుంది 
అయినప్పటికీ ఇక్కడి పరిస్తితి చెప్పి భాద పెట్టకూడదు అని చిరు నవ్వు నవ్వుతూ అంతా బాగున్నామ్ అన్నాడు

సుందరి కూడా అవును మేము బాగున్నాము అని అబద్ధం చెప్పి కొంత సేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు,


బుచ్చి భాద పడ్డాడు సారి ఏ నిన్ను ఇబ్బంది పెడుతున్న నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు

ఆమె విచారిస్తూ ఎదో ఒకటి చెయ్యి బావ నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కార్ తీసుకు రమ్మని చెప్పు సిటి లోకి వెళ్లి కావలసిన సరుకులు తీసుకుందాం అని అడిగింది

బుచ్చి కి అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు అడిగితే హెల్ప్ చేసే వాళ్ళు లేరు కానీ ఆఫిస్ లొ స్టాఫ్ కి అడగాలి అని ప్రయత్నం చేస్తుంటే

వాళ్ళు బిజీ అని వెంటనే రాలేము అని చెబుతున్నారు 

అమెరికాలో మనిషి మనిషి కలుడుకోవాలి అంటే ఎంతో ఇంపార్టెంట్ వర్క్ కేన్సిల్ చేసుకుని రావాలి అందుకే విచారిస్తూ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు అనుకున్నాడు

ఆ రోజు అంతటికీ నాలుగు టమాటా ఉడకపెట్టిన బనానా తప్ప ఇంకేమీ తినలేదు దొరక లేదు కడుపు మాడిపోతుంటే

తన ఊరిలో ఇంట్లో వాళ్ళు తినిపించే తిను పదార్థాలు గుర్తు వస్తూ అతడ్ని ఊరిస్తూ ఉన్నాయి

అతడికి అర్థం అయ్యింది తాను ప్రేమానుబంధాలు విడిచి పెట్టి పుష్పక విమానం ఎక్కి ఈ సున్యంలో పడ్డాడు 

ఇక్కడ చస్తే శవాన్ని కూడా ఎదో పరిశోధన లో కనుగొంటారు తప్ప బ్రతికి ఉండగా చూసి పలకరించే వాళ్ళు ఆపద అంటే ఆదుకునేవాల్లు లేరు తాను ఊరినుండి సొంత ఊరికి వస్తుంటే మార్గం మధ్య ఫ్రెండ్స్ అడ్డుకుని చేతిలో లగేజీ లాక్కుని ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయత చూపించే తీరు 
గుర్తుకు వస్తుంది

ఆరోజు అంతా అతడు చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు....

అంతా కళ్లముందు తెర వేసి చూపిస్తున్నట్టు కనిపిస్తుంటే 
అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం అయ్యింది
ఆత్మీయులు నడుమ ఉన్న ప్రేమ ఇలా ఒంటరి తనం లో ఉండదు 
అని తెలుసుకున్నాడు 

నాకు నా వాళ్ళు నా ఊరు కావాలి ఈ పుష్పక విమానం స్వర్గం ఏమీ వద్దు అని భార్యని పట్టుకుని భోరున విలపించాడు
నాకు నాన్నని చూడాలి అని ఉంది అమ్మ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోవాలి అని ఉంది 

చిన్నన్న పిల్లలు తెచ్చే తినుబండారాలు తినాలి అని చావిట్లో కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ వేడి వేడి టి సమోస ఎంజాయ్ చేయాలి అని ఉంది సుందరి నాకు ఆకలి అమ్మ ఆత్మీయుల విలువ బాగా తెలిసింది ఇంక వద్దు ఇక్కడ ఉండొద్దు వెల్లిపోదాం  ఇండియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను వచ్చే కొద్ది జీతం అయినప్పటికీ మన వాల్ల మధ్య ఎంతో తృప్తి గా ఉండొచ్చు ఏమంటావు అని అడిగాడు


ఆమె కన్నీళ్లు పెట్టుకుంటు నీలో ఈ మార్పు రావాలి అని కోరుకున్నాను బావ కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు 
పోనీలే ఇలా జరగటం మంచికే అనుకుంది

అంతలో వాల్ల ట్రక్ వచ్చింది వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి మరీ అక్కడికి చేరుకున్నారు 

ముందు అయితే బుచ్చి వాల్ల మీద విరుచుకు పడ్డాడు తరువాత అర్థం చేసుకుని విడిచి పెట్టాడు 
వెంటనే ఇండియా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు 

జాబ్ ట్రాన్స్ఫర్ తో నేరుగా సొంత ఊరు చేరుకుని అమెరికా వద్దు అక్కడ ఇల్లు వద్దు అయినోల్ల మధ్య ఆనందం చాలు అని చెప్పాడు 

ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళు ఎంత సంతోష పడ్డారో చెప్పలేను 
పాత పందిరి మంచం మీద మొదటి రాత్రి పూల పానుపు సిద్ధం చేశారు ఎంతో హడావిడి సందడి పిండి వంటలు పాలు పళ్లు అని అన్నిటినీ ఏర్పాటు చేసి భార్య భర్త ను గదిలోకి పంపించారు 

బుచ్చి బాబు ఇప్పుడు పూర్తిగా బుచ్చి బాబు అయ్యాడు 
తన లైఫ్ హ్యాపీ నెస్ తన వాల్ల మధ్య ఉంది అని తెలుసుకున్నాడు

స్వర్గం ఎక్కడో లేదు అని తన చుట్టే ఉంది అని కనిపించని స్వర్గం కోసం మరే పుష్పక విమానం అవసరం లేదు అని బాగా అర్థం అయ్యింది.

ప్రేమగా భార్యని దగ్గరకు తీసుకుని ఆనందాన్ని అందుకుని అమ్మ నాన్న అత్త మామ నానమ్మ తాతయ్య ఫ్రెండ్స్ అంటూ అసలైన స్వర్గాన్ని అనుభవిస్తూ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక పాఠం గా మార్చుకుని
ఆనందంగా జీవిస్తున్నాడు.