తనలో సగమైన తన సతి చిటికిన వేలు పట్టుకొని తన ఇంటి ముందు కారు దిగుతాడు "పదిహేడు సంవత్సరాల అర్జున్ " పెళ్లి కొడుకు బట్టలలో...
అతని వెంటే కారు దిగి ఆశ్చర్యం గా చూస్తుంది ఆ ఇంటి నీ "పదహారు సంవత్సరాల వాహిని "పెళ్లి కూతురు ముస్తాబులో ....
రాజమహల్ నీ తలపిస్తున్న ఆ భవనం!!మైన్ గేట్ నుండి వంద అడుగుల దూరంలో ఉన్న ఆ ఇంటికి!! చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు!! ఇంటికి ఎడమ వైపు భాగం లో స్విమ్మింగ్ పూల్ దానికి కొంచం దూరం లో పని వాళ్ళ క్వార్టర్స్!! ఇంటి ముందు పెద్ద పౌంటెన్ లో కృష్ణుడి విగ్రహం!! ఇంటి పోర్టికోలో ఆగిన పది కార్లు వాళ్ళు ఎంతటి సంపన్నులో చెప్తున్నవి..
అలాంటి ఇంటిని తన తేనెలూరే కళ్ళతో అద్భుతాన్ని చూసినట్టు చూస్తది వాహిని ..
నవ వధువువరులు ఇద్దరు కొంగు ముడితో వచ్చి వాకిట్లో నిలబడగా!! హారతి పళ్ళెంతో ఎదురు వస్తారు అర్జున్ మేనత్త రజినీ గారు ...
ఇద్దరికీ హారతి ఇచ్చి, బొట్టు పెట్టీ !! పేర్లు చెప్పి ఇంట్లోకి రావాలి అని ముభావంగా చెప్తుంది రజినీ....
నేను నా భార్య వాహిని వచ్చాం లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వండి అత్తయ్య అని గంభీరం గా చెప్తాడు అర్జున్..
అర్జున్ చెప్పిన తరువాత వాహిని నీ చెప్పమని ఇంట్లో అందరు అడగగా!!నేను మా ఆయన వచ్చాం అని చిన్న గా చెప్తది వాహిని...
మీ ఆయనే లేమ్మా కాదని ఎవరు అనలేదు గానీ!! మీ ఆయన పేరు ఏంటో చెప్పు కోడలు పిల్లా అని పెళ్లి కి వచ్చిన చుట్టాలలో అత్త వరస అయ్యే వాళ్ళు అందరూ అడగగా బెరుకుగా అర్జున్ వైపు చూస్తది వాహి ...
కళ్ళతోనే బయపడుకు అని ఆమె కు చెప్పి వాహీ చెయ్యి చిన్నగా ప్రెస్ చేస్తాడు అర్జున్..
అర్జున్ సైగలు చూసిన అందరూ!! అబ్బో అప్పుడే పెళ్ళాం నీ బాగానే కంట్రోల్ చేస్తున్నావ్ కళ్ళతో అని ఆట పట్టిస్తారు అతనికి వరసైన ఆడ లేడీస్ అంతా ...
వాళ్ళ మాటలకు అర్జున్ చిన్నగా నవ్వితే!! వాహి మాత్రం బిక్క మొహం వేసుకొని చూస్తాది చెప్పే వరకు తనని వదిలేలా లేరని...
ఆమె బెరుకు గమనించిన అర్జున్ కళ్ళతోనే చెప్పు అన్నట్లు చూస్తాడు వాహి వైపు...
అలానే అని అర్జున్ కి కళ్ళతో చెప్పి (ఒరి మీ దుంపలు తెగా కళ్ళతోనే మాట్లాడుకుంటూ మా కళ్ళకి కాయలు కాయించేతట్లు ఉన్నారుగా )
"నేను మా ఆయన అర్జున్" వచ్చాం అని తల కిందకు దించి చెప్తది వాహి ...
ఇద్దరు పేర్లు చెప్పాక!! అమ్మాయితో ధాన్యం ఉంచిన కలశం తన్నమని అర్జున్ అమ్మ లలిత చెప్పగా!!తన శక్తి కొద్దీ కలశాన్ని వాహి తన్నితే!! ఆ వడ్లు ఇల్లంతా చల్లినట్లు పర్చుకుంటే !! ఆ కలశం మాత్రం ఎగిరి అర్జున్ నాన్నమ్మ నుదుటికి తగులుతుంది...
కలశం తగలగానే అమ్మా అంటూ అరుస్తారు జగదాంబ గారు!! ఆవిడ అరుపుకు అత్త గారి దగ్గరికి వెళ్లి ఏదో చిన్న పిల్ల తెలియక గట్టిగా తన్నింది!!కోపగించుకోవద్దు అత్తయ్య అని వేడుకుంటారు ఆవిడ మనస్తత్వం తెలిసిన లలిత గారు...
హ్మ్ అలాగే లే!! ముందు దేవుడు ముందు దీపం పెట్టించు కొత్త కోడలితో అని వాహి వైపు కొరకొర చూస్తారు జగదాంబ గారు...
ఆవిడ చూపులకు భయపడి అర్జున్ వెనకాల వెళ్లి దాక్కుంటది వాహి!! అత్త గారి దగ్గరి నుండి కొత్త జంట దగ్గరికి వచ్చి ఇద్దరినీ పళ్ళెంలో ఉంచిన కుంకుమ నీళ్లలో కాళ్ళు పెట్టీ కింద పరిచిన తెల్లటి బట్ట మీద ఒకే సారి కుడి కాలు పెట్టీ రమ్మని చెప్పి అర్జున్ వెనక ఉన్న వాహి నీ ముందుకు తీసుకొస్తారు లలిత గారు...
ఆవిడ చెప్పిన విధంగానే ఇద్దరు పళ్ళెంలో కాళ్ళు పెట్టీ ఒకేసారి కుడికాలు నీ కింద పరిచిన వస్త్రం పై పెడతారు...
కొత్త జంట గృహ ప్రవేశం చేశాక వారి ఇద్దరినీ దేవుడు గది దగ్గరికి తీసుకెళ్తారు లలిత గారు వాహి తో దీపం పెట్టించను
అందరూ తలా ఒక దిక్కు కు పోయాక హాల్ లోని ఉయ్యాలా బల్ల లో కూర్చొని ఉన్న జగదాంబ గారి దగ్గరికి వెళ్తారు రజినీ గారు...
కూతురి నీ చూసి నాతో ఏమైనా మాట్లాడాలా రజినీ అని అడుగుతారు జగదాంబ గారు..
అవును అమ్మ నువ్వు ఏం చెప్పావ్!!! ఇక్కడ ఏం జరుగుతుంది!! వచ్చిన రోజే ఆ పిల్ల నీ తలకి దెబ్బ తగిలించింది!! నా కూతురు ఉండాల్సిన స్థానం లో!! ఆ గుమాస్తా కూతురు తిరుగుతుంటే నాకు ఒళ్ళు మండు తుంది అంటది రజినీ..
చూడు రజినీ ఈ ఇంటికి ఎప్పటికైనా నా మనవరాలే కోడలు అవుతుంది!! "మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు" నువ్వు ఏమి టెన్షన్ పడకు అని కూతురికి ధైర్యం చెప్తారు జగదాంబ గారు..