Featured Books
  • జానకి రాముడు - 1

    జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా   న...

  • అంతం కాదు - 27

    నేలమీదకి దిగిన వెంటనే సామ్రాట్ తన చేతిలో ఉన్న చిన్న కట్టెపుల...

  • అంతిమ ప్రయాణం

    Chapter 1: చిన్న ఊరిలో పెద్ద కలలుఅన్వర్ చిన్న గ్రామంలో జన్మి...

  • ప్రాజెక్ట్ T

    టైటిల్ :ప్రాజెక్ట్  " T"                        అది 2027జూలై...

  • అంతం కాదు - 26

    ఇప్పుడు చెప్పండి నీ కొడుకు ఎలాంటివాడు అని తన నాన్నను అమ్మను...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జానకి రాముడు - 1






జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా   నీకోసం అక్కడ అందరూ ఎదురుచూస్తుంటారు అంటూ తన పన్నిండేళ్ల కూతుర్ని తొందర చేస్తుంది ప్రసూన...... 


పదే పది నిముషాలు అమ్మ... వచ్చేస్తాను అంటూ పైరు పచ్చ పట్టు లంగాకి.. బుంగరెట్టలు  ఉన్న మిరపపండు రంగు జాకెట్ వేసుకొని  మువ్వల పట్టీలు చేస్తున్న శబ్దం చేస్తుంటే అటు ఇటు తిరుగుతూ సమాధానం ఇస్తుంది జానూ....... 



ఎమ్ వెతుకుతున్నావ్ తల్లి... మాకు చెప్తే చూస్తాం కదా అంటూ కూతుర్ని చూస్తూ అడుగుతారు జగదీష్ గారు...... 


మామ కార్ కోసం మొన్న కొత్త కీ చైన్ కొన్నా నాన్న... అదెక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు.. అదే వెతుకుతున్నా అంటూ హాల్లో కప్ బోర్డ్స్ అన్నీ చూస్తుంటుంది జానూ.. 


అది నువ్వు స్కూటర్ లో పెట్టి మరిచిపోతే నేను జాగ్రత్త చేశా.... వెళ్లి నా టేబుల్ సొరుగులో చూడు ఉంటుంది అని కూతుర్ని రూమ్ కి పంపించి అన్నీ రెడీ నే కాదో చూస్తుంటారు జగదీష్ గారు...... 


నాన్న నా కీ చైన్ దొరికింది అంటూ లేడి పిల్లలా ఎగురుతూ వచ్చిన కూతురిని ప్రేమగా నుదిటిన ముద్దాడి వెళ్లి చెప్పులేసుకోమ్మా.... మీ మామ వచ్చేస్తున్నాడు అని చెప్తారు......



మాటల్లోనే భార్య మేరీ, కూతురు కేథరిన్ తో కార్ వేసుకొని  వస్తారు డేవిడ్ గారు........ 


మామ అంటూ  పరిగెత్తుకుని వస్తున్న జానూ నీ రెండు చేతుల్లో ఎత్తుకొని బుగ్గన ముద్దు పెట్టి..... నా లిటిల్ ఏంజెల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెచ్చిన చాకోలెట్స్ బాక్స్ నీ ఇస్తారు డేవిడ్ గారు....... 


థాంక్స్ మామ... యూ ఆర్ ది బెస్ట్ మామ ఇన్ హోల్ వరల్డ్ అంటూ డేవిడ్ గారికి కూడా ముద్దు పెడుతుంది జానూ...... 


అన్నీ మీ మామకేనా ఈ అత్తకి ఎమ్ లెవా అంటూ కార్ దిగిన మేరీ గారు..... తనే స్వయంగా చేసిన గులాబ్ జామున్ నీ జాను  కి తినిపిస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి అని ముద్దాడతారు...... 


మామ బెస్ట్ అయినపుడు నువ్వు కూడా బెస్ట్ నే కదా అత్త అంటూ రెండు బుగ్గల్లో రెండు జామూన్స్ పెట్టుకొని ముద్దుగా చెప్తుంది జాను..... 


మెల్లిగా తిను  లేదంటే పొలమారుద్ది అంటూ  జాను నీ హాగ్ చేసుకొని తను కూడా విష్ చేస్తుంది కేథరిన్..... 


థాంక్ యూ కేట్..... మీ అందరి విషెస్ కి నా పొట్ట నిండిపోతే అమ్మ చేసిన  ఐటమ్స్ అన్నీ ఎలా తినాలి నేను అంటూ అమాయకంగా అడుగుతున్న జాను నెత్తిన చిన్నగా కొట్టి.... నీ కోతి వేషాలు అమ్మవాళ్ల దగ్గర వెయ్యి నా దగ్గర కాదు.... స్కూల్ లో నువ్వు చేసే అల్లరి అంతా చూస్తూనే ఉన్న... అత్తకి చెప్పమంటావా అని బెదిరిస్తుంది కేట్..... 



నేనంటే నీకు చాలా ఇష్టం కదా.... నువ్వు చెప్పవు లే....  నాకు తెలుసు.... నువ్వు నా మంచి ఫ్రెండ్ వి కదా........ 


ఏంటే అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.... పదండి ఇంక వెళ్దాం అంటూ బాక్స్ లు అన్నిటిని డిక్కీ లో  సర్దాకా తొందర చేస్తారు  ప్రసన్న గారు....... 


డేవిడ్ గారు డ్రైవింగ్ చేస్తుంటే జగదీష్ గారు పక్కన కూర్చుంటారు..... ఇంక వెనకాల ఏమో అటు ఇటు మేరీ, ప్రసన్న గార్లు కూర్చుంటే మధ్యలో జాను, కేథరిన్ కూర్చుంటారు....... 


డేవిడ్ జగదీష్ గార్లు ఇద్దరు ఒకే అనాథాశ్రమంలో కలిసి పెరిగారు చిన్నప్పటి నుండి...... మతం, ఆచార వ్యవహారాలు వేరైనా ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒక్కటి కావడంతో  ఇద్దరి మధ్యన గట్టి స్నేహ బంధం ఏర్పడి ఇన్నేళ్ళైనా చేరగకుండా అలానే పటిష్టంగా ఉంది......... 



ఇద్దరు చదువుతూనే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ కొంత మొత్తాన్ని కూడబెట్టి.... డిగ్రీ చేతికి వచ్చిన వెంటనే ఆ కొద్ది మొత్తం తో..... ఇద్దరి ఇష్టానికి, అభిరుచికి తగ్గట్టు చిన్న చిన్న కాఫీ షాప్ ని స్టార్ట్ చేస్తారు....... 


మొదట్లో బయటి కాఫీ ఎవరు తాగుతారులే అని వాళ్ళని చూసి నవ్విన వాళ్ళ నోరు మూయించేలా బిజినెస్ లో రోజురోజుకి ఒక్కో మెట్టు ఎక్కడం మొదలెట్టరు డేవిడ్ జగదీష్ గార్లు...... 


వాళ్ళ ముందు చూపుగా యూనివర్సిటీ కి, పక్కన ఉన్న LIC ఆఫీస్ కి మధ్యలో ఉండేవిధంగా షాప్ ని పెట్టడం తో అటు కాలేజ్ వదిలాక స్టూడెంట్స్, ప్రొఫెసర్స్,  ఇటు  ఆఫీస్ వర్క్ తో, తలనొప్పితో సేదతీరాలి అనుకున్న ఉద్యోగస్తులతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు జరుగుతుంది ఫ్రెండ్స్ బిజినెస్...... 



సంవత్సరం తిరిగే సరికి వేరే వీధిలో ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకొని మెల్లిగా ఇద్దరు ఆర్థికంగా నిలదొక్కువడం మొదలుపెడతారు..... 


తమతో పాటు ఆశ్రమం లో పెరిగిన మేరీని డేవిడ్ ఇష్టపడటంతో.......  తనే పెద్దై జగదీష్ గారు..... ఇద్దరికీ చర్చ్ లో పెళ్లి చేసి స్నేహంలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు....... 


వెంటనే మేరీ గారు ప్రెగ్నెంట్ అవ్వడం, అది కూడా కాంప్లికేషన్స్  తో కూడుకున్నది అవ్వడంతో డేవిడ్ గారి పనులు కూడా జగదీష్ గారే చూసుకుంటూ.... మేరీని జాగ్రత్తగా చూసుకోమని డేవిడ్ గారిని మేరితో పాటే ఉంచుతారు...... 


అటు ఇటు రెండు షాప్స్ చూసుకుంటూ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని జగదీష్ గారికి తోడుగా ప్రసూన గారిని పెడతారు డేవిడ్ గారు...... ఆవిడకి కూడా రేపో మాపో అనే బామ్మ తప్ప ఎవరు లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే మేరీ గారికి  బాగా దగ్గరవుతారు...... 



కొద్దినెలలకి పండంటి కేథరిన్ కి జన్మనిచ్చి.... బాలింత గుణంతో చావు అంచుల వరకు వెళ్లిన మేరీ గారికి తోడుగా డేవిడ్ గారు హాస్పిటల్ లో ఉండిపోతే.... చంటి బిడ్డ అని కేథరిన్ ని అమ్మలా దగ్గరుండి చూసుకుంటారు ప్రసూన గారు......  


మూడునెలలకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన మేరీ గారికి..... అందంగా, ఆరోగ్యం గా దబ్బపండులా మెరుస్తున్న కూతుర్ని చూస్తుంటే.... ప్రసూన గారు చేసిన సాయానికి చేతులెత్తి మొక్కలనిపిస్తుంది....   


మేరీ గారికి కుదుటపడ్డాక డేవిడ్ గారు కూడా తిరిగి షాప్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తారు......  పని తీవ్రత తగ్గడం తో జగదీష్ గారికి కొంచెం  విశ్రాంతి లభిస్తుంది..... 


అలా రోజులు గడుస్తున్నా కొద్ది....  ఉన్న రెండు షాప్స్ ఇద్దరు చూసుకుంటూ....  రెండు చేతుల సంపాదిస్తూ  తమ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటుంటారు సమిష్టిగా...... 



వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో ప్రసూన గారి  బామ్మ మరణిస్తే అన్నీ తామై దగ్గరుండి .... అన్నీ పనులు చేస్తారు స్నేహితులు ఇద్దరు.... వారసుడు ఎవరు లేకపోవడంతో జగదీష్ గారే దహన సంస్కారాలు చేసి  ఆవిడకి మోక్షం కలిగిస్తారు....... 


ఉన్న ఒక్కతోడు పోయి ఒంటరిగా ఉన్న ప్రసూన గారిని తమతోనే ఉంచుకొని సంవత్సరం తిరిగేసరికి జగదీష్ గారికి ఇచ్చి వివాహం జరిపిస్తారు డేవిడ్ మేరీ గార్లు... 


అనాధలుగా ఉన్న తమ జీవితాల్లోకి పెళ్లి పేరుతో ఒకరు......బిడ్డ పేరుతో ఒకరు వచ్చి చేరి స్నేహితుల మోహన నవ్వుగా నిలుస్తారు...... 


పిల్లలు పుట్టే వరకు ఒకే ఇంట్లో అద్దెకు  ఉన్న డేవిడ్ జగదీష్ గార్లు..... తరువాత బిజినెస్ లో వచ్చిన లాభాలతో సొంతంగా ఓ చిన్నపాటి డుప్లెక్స్ ఇంటిని కొనుగోలు చేసి..... భార్య బిడ్డలతో అక్కడే కలిసుంటారు ఆనందంగా......... 


కేట్ పుట్టినరోజు గుర్తుగా ఇల్లుని కొన్న స్నేహితులు, జాను పుట్టినరోజు గుర్తుగా ఈరోజు కార్ ని కొని.... అదే కార్ లో తాము కలిసి పెరిగిన ఆశ్రమం లో జాను బర్త్డే సెలెబ్రేట్ చెయ్యడానికి వెళ్తున్నారు....... 


సువిశాలంగా ఉన్న ఆ ఆశ్రమ ప్రాంగణంలో జాను తో కేక్ కట్ చేయించి...... అక్కడ ఉన్న పిల్లలందరికి తినిపిస్తారు...... ఆ తరువాత తమతో తెచ్చిన ఆహారాన్ని కూడా అందరికీ దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి.... ఆ పిల్లల మోహంలో కల్మషం లేని చిరునవ్వు ని చూస్తారు...... చివరగా జాను, కేథరిన్ చేతుల మీదుగా పిల్లలందరికీ బట్టలు స్వీట్స్ పంచిపెట్టి...... ఆశ్రమ నిర్వహణకు తమ వంతు సహాయంగా ఇరవై వేల రూపాయలను విరాళంగా అందజేస్తారు జగదీష్, డేవిడ్ గార్లు........ 


వాళ్ళిచ్చిన మొత్తాన్ని అందుకుంటూ..... ఇక్కడే పెరిగిన మీరు ఇంత ఉన్నత స్థితికి చేరుకొని... మీరు పెరిగిన ఆశ్రమానికే సాయం అందించడం చాలా గొప్ప విషయం.... మీ ఇద్దరి స్నేహం కలకాలం ఇలానే ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా అంటూ ఇద్దర్ని దీవిస్తారు ఆశ్రమాన్ని నడుపుతున్న బాబా గారు... 


మా ఈ స్థితికి మీరే కారణం బాబా.... దిక్కులేకుండా మీ పంచన చేరిన మమ్మల్ని క్రమశిక్షణ తో పెంచారు... మీరు చేయగలిగినంత కంటే ఎక్కువే చేసి మమ్మల్ని చదివించారు.... మేమిలా ఉన్నామంటే దానికి కారణం మీరే..... అంటూ ఇద్దరు బాబా గారికి నమస్కారం చేస్తారు........ 



మీ స్వయం కృషిలో నన్ను కూడా కలపడం మీ గొప్పతనం..... 


సరే బాబా... మేమింకా బయలుదేరుతాం.... ఇక్కడ ఉంటే టైమ్ గడిచేది కూడా తెలియదు మాకు... ఇప్పటికే సాయంత్రం అయిపొయింది ఇంటికి చేరేసరికి చీకటి పడుతుందేమో..... మాకు సెలవిప్పించండి బాబా అని మరోసారి ఆయన పాదాలకి కుటుంబ సమేతంగా  నమస్కరించి  తిరుగు ప్రయాణం అవుతారు జగదీష్ డేవిడ్ గార్లు.....   


వెళ్తున్న వాళ్ళని చేస్తుంటే బాబా గారికి ఓ నిమిషం ఎందుకో తెలియని ఆందోళన చెలరేగి బాధగా మారుతుంది మనసంతా...... ఆ ప్రాణ స్నేహితులని, రెండు కుటుంబాలకి ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి అని ప్రార్ధించడం మినహా ఇంకేం చేయలేకపోతారు బాబా గారు.. ...... 



ఆశ్రమ పిల్లలతో ఆడుకున్న  విశేషాలను తమ తల్లులకి చెప్తూ కార్ గ్లాస్ నుండి సాయంత్రం పూట కనువిందు చేస్తున్న చుట్టుపక్కల పరిసరాలని మైమరిచి చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు జాను, కేథరిన్..... 


బిజినెస్ విషయాలని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న జగదీష్ గారికి ఎదురుగా పెద్ద లారీ రోడ్ కి అడ్డదిడ్డంగా  వస్తుండటంతో..... కార్ ని ఓ సైడ్ కి తీసి ఆపి ఉంచుతారు కంగారుగా....... ఆ లారీ వీళ్ళని దాటి వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకొని తిరిగి కార్ స్టార్ట్ చేసేంతలో వెనక నుండి వచ్చిన ఇంకో లారీ వీళ్ళ కార్ ని అమాంతం తోసుకుంటూ తీసుకెళ్లిపోతుంది రోడ్ మీద...... జగదీష్ గారు పక్కకి వెళ్లాలని ఎంత ట్రై చేస్తున్న కార్ వెనక భాగం లారీ బంపర్ లో ఇరుక్కొనిపోవడంతో ఆ పని చెయ్యలేక నిస్సహాయంగా డేవిడ్ గారి వైపు చూస్తారు......ఆ లారీ డ్రైవర్ ఫుల్ గా తాగి ఉండటంతో తన బండి ముందు ఓ కార్ ఉందన్న విషయాన్ని అంతగా పట్టించుకోకుండా స్పీడ్ ని పెంచేస్తుంటాడు..... 



పరిస్థితి అర్థమైన డేవిడ్ గారు పిల్లలిద్దరినీ వెంటనే కార్ లో నుండి బయటికి వేసిరెయ్యమని చెప్తూ.... కార్ ని తను కంట్రోల్ చేయడానికి చూస్తారు...... 


తమకి ఏదైనా పిల్లలు క్షేమంగా ఉంటే చాలు అనుకోని నిద్రలో ఉన్న జాను కేథరిన్ లని డోర్ ఓపెన్ చేసి రోడ్ పక్కనున్న పొదల్లోకి కష్టంగా పడేస్తారు  ప్రసూన మేరీ గార్లు...... 


ఏమండి మనం కూడా దూకేద్దాం అంటూ ఏడుస్తున్న మేరీ గారికి.... ముందు సైడ్ డోర్స్ లాక్ అయిపోయాయి ఫస్ట్ మీరు దూకేయండి తరువాత మేము వస్తాం.... మేము మీతో పాటు వస్తే కార్ అస్సలు కంట్రోల్ లో ఉండదు... అది మనకి ప్రమాదం అని నచ్చజెపుతూ ప్రసూన మేరీ గార్లని కూడా బయటపడేలా చేస్తారు డేవిడ్ గారు ....... 


చివరగా స్నేహితులు ఇద్దరు కూడా వెనక సీట్ కి వచ్చేంతలో లారీ స్పీడ్ ఎక్కువవ్వడం తో.... వాళ్ళ  కార్ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి రోడ్ పక్కనున్న కరెంట్ పోల్ ని గుద్దుకుంటుంది వేగంగా..... ఆ ప్రమాదంలో లారీ కి, కార్ కి మధ్యనున్న లింక్ కూడా తెగిపోవడం తో.... లారీ డ్రైవర్ తన మానాన తను వెళ్ళిపోతాడు...... 


బలంగా పోల్ ని గుద్దుకోవడంతో డేవిడ్ జగదీష్ గార్లకి  బలమైన గాయాలై రక్తం కారుతుంటుంది...... పరుగు పరుగున అక్కడికి చేరుకున్న మేరీ  ప్రసూన గార్లు తమ భర్తలని బయటికి తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం ప్రారంభం అవ్వకముందే ఇంజిన్ ని నుండి మంటలు చెలరేగి కార్ తో పాటు నలుగురు ఆ మంటల్లో చిక్కుకుంటారు....... 



తమ ఒంటికి తగిలిన చిన్న చిన్న గాయాలని చేత్తో అదుముకుంటూ..... తల్లిదండ్రులని వెతుక్కుంటూ వచ్చిన జాను, కేట్ లకి తగలబడిపోతున్న కార్ తో పాటు కాలిపోతున్న తమ అమ్మానాన్నలు కూడా కనిపించడంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ పరిగెడతారు మంటల దగ్గరికి..... 


మంటల వేడికి కరిగిన కరెంట్ వైర్ కూడా ఆ రగులుతున్న కార్ ని తాకడంతో హాహాకారాలు చేస్తూ నిమిషాల వ్యవధిలో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయి..... ఆ మంటలలో సజీవ దహనం అయిపోతారు........... 


కళ్ళముందే జరిగిన ఆ దారుణానికి షాక్ అయ్యి జాను స్పృహ తప్పి పడిపోతే...... అటు కుటుంబాన్ని ఇటు స్నేహాన్ని అలాంటి పరిస్థితుల్లో చూస్తున్న కేట్ గుండెలు పగిలేలా ఏడుస్తుంది........ 


నలుగురి ఉసురు తీసుకున్న ఆ రాత్రి.... ఆ పసిమనసులు చేస్తున్న రోదనని తనలో కలిపేసుకుంటూ నిస్సహాయంగా చూస్తుంది  జాను కేథరిన్ లని.......... 


సశేషం..........