Part - 1
18వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై కూడా పడింది.
అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా.
ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు.
వీరఘాతకుడు ఖడ్గ యుద్డంలొ (sword fight) లొ ఆరితేరిన వాడు. తన చేతిలొ కత్తి ఉన్నంత సేపు తనని ఎవ్వరు ఏ ఆయుధం తోను దాడి చేయలేరు. బాగా తెలివైనవాడు. శత్రువు ఆలోచించె లోపు తను యుద్దం ముగించేస్తాడు.
అనుకున్నట్టు గానె ఆంగ్లేయులు కళింగ రాజధాని దంతపురం పై దాడి చేశారు. ఆ అంగ్లేయుల సేనకి నాయకుడు జనరల్ హెన్రీ మేనార్డ (General Henry Maynard).
హెన్రీ (Henry) వీరఘాతకుడిని తక్కువ అంచనా వేశాడు. కాని తన సైన్యం వీరఘాతకుడి ఖడ్గం ముందు నిలబడ లేక పోయారు. ఆంగ్లేయులు తూటాలు పేల్చేలోపె వాళ్ళ చేతులు తెగబడుతున్నాయి.
దాంతొ హెన్రీ (Henry) ప్రజల పై దాడి చేసి వాళ్ళను బంధిలుగా పట్టుకోమని తమ ఆంగ్లేయుల సేనకి చెబుతాడు. ప్రజలను అడ్డుగా పెట్టుకొని వీరఘాతకుడి సైన్యాన్ని ఎదురుకోవాలి అనేది వాడి ఆలోచన. ఇది చూసిన వీరఘాతకుడు మరియు తన సైన్యం యుద్దం ఆపుతారు.
తన వ్యూహం పని చేసిందని హెన్రీ (Henry) తెగ సంబర పడ్డాడు.
వీరఘాతకుడు: "మా ప్రజలను వదిలేయండి మేము లొంగి పోతాము"
అని చెప్పి వీరఘాతకుడు తన ఖడ్గాన్ని నేల మీద పెడుతున్నట్టు క్రిందకి వొంగుంటు హెన్రీ (Henry) వెనక వైపు చూసి తన తల తొ సైగ చేస్తాడు .
ఏంటా అని హెన్రీ (Henry) అటువైపు తిరిగి చూసి ఎవరు కనబడక మళ్ళి ముందుకు తిరిగే లోపు తన తల తెగబడి వీరఘాతకుడి కాళ్ళ దగ్గర పడుతుంది.
మిగిలిన ఆంగ్లేయుల సైన్యం ఏం జరిగిందొ తెరుకొనే లోపు వాళ్ళ శరీరాలలొ బాణాలు దిగబడతాయి.
ప్రజలందరు " జై వీరఘాతక " అని అరుస్తారు. యుద్దం ముగుస్తుంది. గెలిచిన విషయం రాజు ఇంద్రవర్మ కి తెలిసి చాలా సంతోషిస్తాడు.
ప్రజలలొ వీరఘాతకుడి కి విపరీతంగా ఆధరణ పెరుగుతుంది. అతడు తన సొంత ధనంతొ ప్రజలకు ఎన్నో మంచి పనులు కూడా చేస్తాడు.
వీరఘాతకుడు తమ రాజు గా ఉంటె బాగుంటుంది అని ప్రజలు అభిప్రాయపడతారు. ఇవి కాస్తా రాజు ఇంద్రవర్మ చెవిలొ పడతాయి. దాంతొ వీరఘాతకుడు పై ఈర్ష్యతొ రగిలిపోతాడు. ఎప్పిటికైన తన వల్ల తనకి ముప్పే అని తెలుసుకొని.
ఒక పథకం ప్రకారం ఆంగ్లేయులతొ చేతులు కలిపి ఈ రాజ్యాన్నీ వీరఘాతకుడు సొంతం చేసుకోవాలి అని చూస్తున్నట్టు ప్రజలలొ ఒక పుకారు శృష్టిస్తాడు. వాళ్ళని తనకు వ్యతిరేకంగా మారుస్తాడు.
తనపై రాజద్రోహం నేరం మోపి. తన గుఱ్ఱానికె తనని కట్టి రాజధాని దంతపురా మొత్తం తిప్పుతాడు. ప్రజలందరు అతనిపై రాళ్ళు వెస్తారు. తరువాత ఒక మఱ్ఱి చెట్టుకి కట్టి వెల్లాడదీసి అతని వొంటికి నిప్పు అంటిస్తారు.
వీరఘాతకుడు ఆ మంటల్లో కాలిపోతు "మీ అందరిపై పగ తీర్చుకుంటాను. ఎవ్వరిని వదిలి పెట్టను " అని అరిచి చనిపోతాడు.
............................................................
" ఆ తరువాత ఏమైంది అమ్మా ?" అని 9 ఏళ్ళ అనిరుద్ వాళ్ళ అమ్మ శాంతిని అడుగుతాడు.
అప్పుడు శాంతి " ఆ తరువాత కొన్ని రోజుల కి రాజ కుటుంబంలొ ఒక్కొక్కరు వొంటినిండా కత్తిగాట్లతొ చనిపోవడం మొదలు అవుతుంది. అందరికంటె ముందు రాజు ఇంద్ర వర్మ చనిపోతాడు"
"రాజధాని దంతపురా లొ కూడా చాలా మంది కత్తిగాట్లతొ చనిపోతుంటారు".
"ఏం జరుగుతుందొ తెలియని రాజు ఇంద్ర వర్మ కొడుకు యువరాజు అనంతవర్మ రాజ పండితులను పిలిచి దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతాడు."
"యువరాజా దీనంతటికి కారణం మీ పూర్వ సేనాధిపతి వీరఘాతకుడు. మీ తండ్రిగారు అతనిని అన్యాయంగా చంపించినందుకు పగ తీర్చుకుంటున్నాడు" అని రాజ పండితులు చెబుతారు.
"మరి ఇప్పుడు ఏం చేయాలి" అని యువరాజు అడిగితే
"చనిపోయిన వీరఘాతకుడి కి కర్మకాండ చేసి. రాజధాని దంతపురా నడిబొడ్డున అతని విగ్రహం పెట్టి శాంతి హోమం జరిపించాలి"
" ఆ తరువాత ప్రతి రోజు మీతో పాటు రాజ్య ప్రజలందరు అతని విగ్రహం ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి"
" ఇలా ప్రతి రోజు క్షమాపణ చెబుతున్నంత కాలం మీకు మరియు మీ రాజ్య ప్రజలకి ఎటువంటి ఆపదా రాదు" అని చెబుతారు.
" యువరాజు అనంతవర్మ వాళ్ళు చెప్పినట్టుగానె చేస్తాడు. " అని చెప్పి శాంతి కధ ముగిస్తుంది.
అప్పుడు అనిరుద్ "అంటె అమ్మా మన ఊరు దంతపురం కళింగ రాజ్యం రాజధానా?"
"అవును బాబు ఒకప్పుడు."
" మరి ఇప్పుడు" అని అనిరుద్ అడగుతాడు.
"ఇప్పుడు దేనికి రాజధాని కాదు. శ్రీ కాకుళం జిల్లాలొ ఒక ఊరు అంతె. ఇక పొడుకొ బాబు".
అని చెప్పి శాంతి తన కొడుకు ని నిద్రపుచ్చి తాను కూడా పడుకుంటుంది.
ఆ రోజు రాత్రి పెద్ద గాలి, వర్షం. జాతీయ రహదారి (National Highway) వైపు కి వెళ్ళె మార్గం లొ చెట్లు పడిపోవడంతొ మూసుకు పోతుంది.
" ఛా ఇలా జరిగింది ఏమిటి " అని కారు లొ వెళుతున్న మహేష్ అంటాడు.
"అర్ఝెంటుగా (Urgent) భువనేష్వర్ వెళదామనుకుంటె ఇలా జరిగిందేమిటి." అని మహేష్ అనుకుంటూ ఉండగా.
అక్కడ పడి పోయిన చేట్లను తీయిస్తున్న అధికారి ని చూసి.
"భువనేష్వర్ కి ఇంకొ దారి లేదా" అని అడుగుతాడు.
అప్పుడు అతను "దంతపురా ఊరిలోంచి వెళ్ళండి" అని చెబుతాడు.
మహేష్ దంతపురా ఊరి వైపు కారు తిప్పి ఊళ్ళోకి పోనిస్తాడు. వర్షం కారణం కరెంటు వైర్లు తెగిపోవడంతొ ఊరంతా కరెంటు పోతుంది. మొత్తం చీకటి.
అలా మహేష్ వెళుతూ ఉండగా అనుకోకుండా ఒక ఆవు ఎదురు రావడంతొ వెంటనే కారు పక్కకి తిప్పుతాడు. దాంతొ చూసుకోకుండా కారుని ఒక దానికి గుద్దుతాడు.
కాసేపటికి మహేష్ తేరుకొని కారునుంచి బయటికి దిగి చూస్తాడు. అక్కడ వీరఘాతకుడి విగ్రహం తల విరిగి క్రింద పడి ఉంటుంది.