Featured Books
  • అంతం కాదు - 14

    విశ్వ దాడిఅదే సమయంలో విశ్వ, "ఇక నిన్ను బతకనివ్వకూడదు. ఇక బతి...

  • గౌతమి గమనం

    గౌతమి గమనంకాకినాడ పోర్ట్ స్టేషన్ వచ్చే పోయే ప్రయాణికులతో హడా...

  • గౌరవం కోసం ఒక పోరాటం

    టైటిల్: గౌరవం కోసం ఒక పోరాటంచాప్టర్ 1: డబ్బు మనిషి – కుటుంబా...

  • పాణిగ్రహణం - 7

    ఆ లెటర్ చదివిన సత్యవతి, శేషగిరి గారికి కన్నీరు ఆగడం లేదు.  ఎ...

  • తనువున ప్రాణమై.... - 21

    ఆగమనం.....ఎందుకో తెలుసా మనము ఎవరిమీదైతే... ఎక్కువ కోపం చూపిస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

గౌరవం కోసం ఒక పోరాటం

టైటిల్: గౌరవం కోసం ఒక పోరాటం

చాప్టర్ 1: డబ్బు మనిషి – కుటుంబానికి ఒక రక్షకుడు

పద్మనాభం, పేరుకు తగ్గట్టే డబ్బును పూజించేవాడు. కానీ అతని పిసినారితనం స్వార్థంతో కూడుకున్నది కాదు. అది తన కుటుంబం కోసం, వారి భవిష్యత్తు కోసం అతను వేసిన ఒక పటిష్టమైన ప్రణాళిక. చిన్నతనంలో అప్పులపాలై తమ ఇంటిని కోల్పోయిన బాధ, అతన్ని ప్రతి పైసాను పొదుపు చేసేలా చేసింది. తన అమ్మానాన్నలు, తమ్ముళ్లు – వీరందరినీ చూసుకుంటూ, వారికి ఆర్థిక భద్రత కల్పించడం తన బాధ్యతగా భావించాడు. తన భార్య, పిల్లల కోసం అయితే ఎంతైనా ఖర్చు చేస్తాడు. వారి ఆనందం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడడు. తన గురించి మాత్రం పెద్దగా పట్టించుకోడు. పెళ్లికి ముందు నుంచి తన సంపాదనలో సగం బ్యాంకులో దాచి, మిగతాది అవసరాలకు ఖర్చు చేస్తూ ప్రతి రూపాయి విలువను గుర్తించాడు. పెళ్లయ్యాక కూడా అదే అలవాటు. తన సంపాదనలో సగం తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు ఇచ్చి, మిగిలింది బ్యాంకులో వేసేవాడు. ఇది అతని దినచర్య.

కానీ, అతని జీవితంలో ఒక ఊహించని మలుపు తిరిగింది. బయట ఎంతమందిని చూసినా ప్రేమలా అనిపించేది, కానీ దగ్గరికి వెళ్లి మాట్లాడగానే అమ్మ ప్రేమ గుర్తొచ్చేది. ఎందుకో, ఆ లోతైన అనుబంధం ఏ అమ్మాయిలోనూ అతనికి దొరకలేదు. చివరికి, ఒక బ్రోతల్ హౌస్‌లో తనని తాను కోల్పోయి, నిరాశగా నిలబడిన ఒక అమ్మాయిని చూశాడు. ఆమె కళ్ళలో కనిపించిన బాధ, ఒంటరితనం అతన్ని కదిలించాయి. తన స్నేహితుడు ఎంత చెప్పినా వినకుండా, ఆ అమ్మాయిని తనతో తీసుకువెళ్ళాడు.

"మీ బాధ నాకు అర్థమవుతోంది మేడం. మీరొక తోడు లేక మానసికంగా నీరసంగా ఉన్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని ఎలాంటి మొహమాటం లేకుండా అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగా, "మీరు ఇప్పుడే చెప్పనక్కర్లేదు, ఈరోజు రాత్రి అంతా ఆలోచించండి. నా పేరు పద్మనాభం. నాకు నెలకు పదివేలు వస్తుంది. అందులో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, కానీ రెండు మూడు వేలు మాత్రం బ్యాంకులో ఉంటాయి. నా వాళ్ల కోసం, నా కాబోయే భార్య కోసం నగలు, చీరలు అన్నీ సిద్ధం చేశాను. కేవలం మా ఇంట్లో అడుగుపెట్టడానికి ఒక లక్ష్మీదేవి లేదు, మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది" అన్నాడు.

"కానీ, నేను ఎక్కడున్నాను, ఏం పని చేస్తున్నాను అని మీరు మర్చిపోతున్నారు" అని ఆమె గుర్తుచేయగా, పద్మనాభం చిరునవ్వుతో, "పని దేముందండి, ఆకలి కోసం ఏ పనైనా చేయొచ్చు. అది మీకు ఇష్టమా కాదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీ మొహం చూస్తే ఇది మీకు ఇష్టం లేదనిపిస్తుంది. మా ఇంట్లో చాలామంది ఉన్నారు – మా అమ్మ, నాన్న, ఇంకా ఇద్దరు తమ్ముళ్లు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఆ మాత్రం గొడవలు పడటం, ఆ గొడవలను తగ్గించడం నాకు పెద్ద లెక్క కాదు. నేను బాహుబలిలో ప్రభాస్‌లా కాకపోయినా, మీ మీద ఈగ కూడా వాలనివ్వను. తలకాయలు కొయ్యలేకపోయినా, చేతులు మాత్రం నరికేస్తాను," అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అతని మాటల్లో కనిపించిన ధైర్యం, నమ్మకం ఆమెను కదిలించాయి. ఆమె అంగీకరించింది.

పద్మనాభం తన కుటుంబాన్ని కాదని, సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీనితో అతని తమ్ముళ్లు, తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. సమాజంలో ఇది మంచిది కాదని, తమ పరువు పోతుందని వాళ్ళు అతనితో మాట్లాడటం మానేశారు. పద్మనాభం తన దగ్గరున్న డబ్బుతో చిన్నగా పెళ్లి చేసుకుని, తన భార్యతో విడిగా ఉన్నాడు. ప్రతి నెలా తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు ఇస్తూ, ఇంకా ఎక్కువ అడిగితే "మీకేంటి, మీకు నెల నెలకు పింఛన్ వస్తుంది, అది మాకంటే ఎక్కువ. మీ చిన్న కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా" అని మొహమాటం లేకుండా అనేవాడు.

ఒకరోజు ఆఫీస్‌లో ఎవరూ తన గురించి ఏమన్నా పట్టించుకోని పద్మనాభం, తన భార్య గురించి ఒక్క మాట మాట్లాడగానే కోపంతో ఆఫీస్ అంతా గందరగోళం చేసి బయటకు వచ్చేస్తాడు. తన భార్య పట్ల అతనికున్న ప్రేమ, రక్షణ స్వభావం ఎంత లోతైనదో అది చూపించింది.

కొన్నాళ్ళకు, అతని తమ్ముళ్లు ఏదో గొడవలో ఇరుక్కుంటారు. సరిగ్గా అదే సమయంలో పద్మనాభం భార్య అక్కడికి చేరుకుంటుంది. తన భర్త తమ్ముళ్ల కోసం ప్రాణాలకు తెగించి, రౌడీలతో పోరాడి, వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె తలకి దెబ్బ తగిలి పడిపోతుంది. హీరో తమ్ముళ్లు దెబ్బలతో పారిపోతుండగా, రోడ్డుపై వెళ్తున్న పద్మనాభం వారిని చూస్తాడు. వారి గాయాలు చూసి మరింత కోపంతో, "ఏం జరుగుతోంది?" అని అడుగుతాడు. అదే టైంలో దూరంగా తన భార్య పడిపోయి ఉండడం చూసి, ఉగ్రరూపంతో అక్కడున్న రౌడీలందరినీ కొట్టేస్తాడు. దెబ్బలు తగిలిన తమ్ముళ్లను హాస్పిటల్‌కు పంపించి, తన భార్య దగ్గరికి వెళ్లి ఆమెను చూసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. కానీ, తమ్ముళ్లను హాస్పిటల్‌కు పంపించిన తర్వాత మళ్లీ వాళ్ళను చూడలేదు.

చాప్టర్ 2: గౌరవం కోసం యుద్ధం

తన భార్య మెలుకు వచ్చిన తర్వాత చాలా బాధపడింది. "ఇప్పటికైనా అంత కోపం వచ్చినప్పుడు దూరంగా ఉన్నావు కదా, ఎందుకు ఇలా జరిగింది?" అని పద్మనాభాన్ని అడిగింది. "ఒక మనిషిని ఎలా చూడాలో వాళ్ళకు తెలియదు. అది తెలిసినంత వరకు నేను వాళ్ళతో మాట్లాడలేను. వాళ్ళు వచ్చి ఒప్పుకున్నా నేను ఒప్పుకోలేను. ఒక మనిషిని తను చేసే పనిని చూసి కాదు, తను చేసే ప్రయత్నాలను, మాటలను చూసి కనుక్కోవాలి. ఆ పని ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి," అన్నాడు పద్మనాభం.

అతను ఇంకా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగానే, బయట నుండి "అన్నయ్యా!" అని ఒక పిలుపు వినిపించింది. పద్మనాభం కళ్ళు క్షణకాలం మెరిశాయి. "నిజంగా వచ్చారా?" అని ఆనందం, "ఎందుకు వచ్చారు?" అని భయం అతనిలో మెదులుతూ ఉంటాయి. వచ్చిన తమ్ముళ్లు నేరుగా లోపలికి వచ్చి, "వదినమ్మ ఎక్కడున్నావ్? ఆకలేస్తుంది!" అంటూ దర్జాగా కూర్చున్నారు. పద్మనాభం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. "ఏంట్రా వీళ్ళు? అన్నయ్య అని పిలిచి నాతో మాట్లాడకుండా వాళ్ళ వదినతో మాట్లాడుకుంటున్నారు? అంతేలే, కాపాడింది నువ్వు, వాడు దూరమయ్యాడు. వాళ్ళ వల్ల చావుకు దగ్గరైన వాళ్ళు మిత్రులయ్యారు. ఏంటో ఈ సమాజం!" అని తనలో తాను కుమిలిపోతూ ఒక పక్కకు ముడుచుకొని కూర్చున్నాడు.

"అయినా, అందరికీ నచ్చినట్టు ఉండాలి కదా వదిన. మాకు నువ్వు ఇప్పుడు వదిన అనిపించావంటే మమ్మల్ని కాపాడినందుకు. అలాగే ప్రజలు కూడా నిన్ను గౌరవంగా చూడాలంటే వాళ్ళకు నువ్వు సహాయం చేయాలి. అలాగని నువ్వు పూర్తిగా సహాయం చేయక్కర్లేదు. నీ మొగుడు, నా అన్న వేస్ట్ గాడు ఉన్నాడు కదా, కొట్టడం కాదు, గౌరవం ఎలా తెప్పించుకోవాలో నేర్చుకోవాలి. వాడికేం కానీ ఎలా చేయాలో తెలియదు. అసలు మీ ప్రేమ ఎలా జరిగిందో నాకు తెలియాలి వదిన, లేదంటే ఇప్పుడు భోజనం వదిలేసి వెళ్ళిపోతాం!" అని తమ్ముళ్లు వదినతో మాట్లాడటం మొదలుపెట్టారు.

"ఆ విషయాన్ని మీ అన్నయ్యని అడగొచ్చు కదా?" అని పద్మనాభం భార్య అడిగితే, "లేదు, వానితో మేము మాట్లాడం. వాడికేం అవసరం ఉండేది? మాకు వాని కంటే నాలుగింతలు రోషం ఉంది. చెప్పు వదిన!" అన్నారు.

"ఏమబ్బా, మీ అన్నయ్య చెప్పాలి రాజుగారు. మీ తమ్ముళ్లు ఏదో అడుగుతున్నారు కదా, చెప్పొచ్చు కదా?" అని ఆమె పద్మనాభాన్ని అడిగింది.

"నేను వాళ్ళతో మాట్లాడను, కానీ నీ కోసం నేను చెప్తాను," అని పద్మనాభం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళాడు. ఆ కథ విన్న తర్వాత, తమ్ముళ్లు "అన్నా, అమ్మాయిలతో మాట్లాడినంత ఈజీ కాదురా సమాజాన్ని బెదిరించడం అంటే. వాళ్ళకు కట్టుబాట్లు, పనికిరాని విశ్వాసాలు, ఎందుకు పనికి వస్తాయో తెలియదు. అలాంటి వాళ్ళని నువ్వు బెదిరించాలంటే ఒక పెద్ద మాస్ డైలాగ్ ఒకటి కొట్టాలిరా. నీ తెలివికి ఇది తెలిసింది కాదు కానీ నేను చెప్తున్నా. నిన్ను కాదు, మా వదినమ్మను!" అని చిన్నగా నవ్వుతూ, సాంబార్ పోయించుకుంటూ, చికెన్ ముక్కలు తింటూ మాట్లాడసాగారు. "నేను చెప్పేది ఏంటో అర్థం అవుతుందా వదినమ్మ? మీ ఆయనకి ఇప్పటికైనా చెప్పు, ప్రజల్లోకి తిరగడం అంటే మాట్లాడినంత ఈజీ కాదు అని!" అన్నారు.

ఈ మాటలు చురుక్కున తగిలి, పద్మనాభం నరాల్లో రక్తం జువ్వమని పెరిగింది. "నాకంటే చిన్నవాళ్లు ఇలా మాట్లాడుతున్నారు! నేనంటే వీళ్లకు చూపించాలి. నా గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు!" అని చిన్నగా, క్రూరంగా నవ్వుకున్నాడు. తమ్ముళ్ళని చూసి, "రేయ్! మీరు లేవండిరా! మీరు ఊర్లోకి వెళ్లి చూస్తూ ఉండండి, మీ వదినను ఇంకెవడు వేలెత్తి చూపించకుండా చేస్తాను!" అని అన్నాడు. తన భార్యను నగలతో అలంకరించి, బొట్టు, కాటుకతో మహాలక్ష్మిలా, లక్ష్మీదేవిలా రెడీ చేసి ఊర్లోకి తిప్పడం మొదలుపెట్టాడు.

"చూడండి, చెప్పేది వినండి! ఇప్పుడు మనం అలా వెళ్తే మీ పరువు పోతుంది. అంతో కొంత ఉన్న మీ మర్యాద పోతుంది," అని ఆమె భయపడుతూ చెప్పింది.

"పదా! వీళ్ళకి ఒక మాస్ వార్నింగ్ ఇవ్వాలి. నా తమ్ముడు నాకే సలహా ఇచ్చాడు. వానికి మించి చెప్పాలి ప్రజలకు!" అని అంటూ మొదట ఊర్లోకి తీసుకువెళ్ళాడు. అందరూ చూసినప్పుడు "డబ్బు వల్లే వచ్చింది లేదంటే ఎలా వస్తుంది? దీనికి అప్పుడే వంద మంది సరిపోలేదు, ఇప్పుడు ఒకడితో ఇలా సర్దుకుపోతుంది" అని హీరోయిన్ గురించి తెలిసిన ప్రతి మగాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆడవాళ్లు కూడా "ఏంటిది? మామూలుగానే దీని చెంతకు వందల మంది పోతారు, ఇప్పుడు డైరెక్ట్ గా దుకాణం ఊర్లోనే పెట్టింది! ఇది ఎక్కడ వీడు దొరికాడో!" అని మాట్లాడుకుంటున్నారు.

అన్ని వింటూ ఒక రౌండ్ కొట్టిన తర్వాత, ఆ విషయం ఆ ఊరి పెద్దరాయుడుకి తెలిసిపోయింది. "నాకు తెలియని గుంట చూద్దాం," అని అతను రాగా, పద్మనాభం మరోసారి తన భార్యను మామూలు చీరలో, చిన్న బొట్టుతో, తాళిబొట్టు, కాళ్ళకు మెట్టెలతో తీసుకువెళ్ళాడు. ఈసారి కూడా అరుపులు తగ్గలేదు. ఈసారి చూసిన ప్రతి మగాడు ఆమె అందాన్ని కోరడం మొదలుపెట్టాడు.

ఊరి మధ్యలోకి వచ్చిన తర్వాత అందరి చూపులు ఆమెపై నిలబడ్డాయి. హీరోయిన్ కొంచెం సిగ్గుతో, "ఏం చేస్తున్నాడు వీడు? వీడికి తెలివితేటలు లేవని వీళ్ళ తమ్ముళ్లు నిజంగానే చెప్పారు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు వీడు కూడా అందరిలాగే చేయబోతున్నాడా?" అని భయపడుతూ ఉంటే, అక్కడికి పెద్దరాయుడు వచ్చాడు. "ఏంట్రా? ఇంట్లో ఉండాల్సిన మీ ఆవిడను ఊళ్ళోకి తెచ్చిపెట్టావు? ఏంటి సంగతి?" అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు. "సరే కానీ, ఎలాగో మధ్యలోకి తెచ్చావు కాబట్టి మీకు ఆరు ఎకరాలు రాసిస్తా. నీ భార్యను ఒక్కసారి పంపించు. చూడడానికి ఎంతమంది తగిలినా కరగని అందంతో, ఎర్రటి ఆపిల్ పండ్ల ఉంది!" అని అంటూ గుట్కాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు ఊర్లో ప్రజలందరూ ఉలిక్కిపడి, "ఈ అవకాశం నిజంగా వస్తుందా?" అనే ఊహల్లో తేలుతూ ఉంటే, పద్మనాభం తన జోబులోంచి పదివేల కట్ట బయటకు తీసి, హీరోయిన్ చుట్టూ తిప్పి, ఆమె కొంగుకు ఉన్న చీరను చింపి, దానికి కట్టి విసిరి కొట్టాడు.

"చూడండి! మీ మాటలన్నీ ఇంతే కాగితాలు. అది ఎగురుతూ చెట్లకు తగులుకొని, పుట్టల మీద పడి చనిపోతాయేమో కానీ, నిజంగా తను అలాంటిదే అయితే ఈపాటికి ఎప్పుడో దుకాణం పెట్టాలి. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చింది మీరు మాట్లాడుతున్నారా? పక్కవాడి ఏంటి? ఊర్లో సంత ఏమనుకుంటున్నారు? మీ భర్తలకి ఇది తెలియదు అనుకుంటున్నారా? మీ భర్తలు ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటున్నారా?" అని ఆడవాళ్ళని ప్రశ్నిస్తూ, "ఇది విడ్డూరమా? మీరు చేసే దానికంటేనా? ఒక మనిషిని కాకుండా తుడిచి ఎలా చంపాలో మీ నుంచే నేర్చుకోవాలి!" అని అంటూ హీరోయిన్‌ని తీసుకొని బయలుదేరాడు. అప్పటి నుండి డబ్బులను ప్రజలందరూ చూస్తూ తలలు దించుకున్నారు.

ముగింపు

ఇంటికి వెళ్ళగానే, పద్మనాభం తమ్ముళ్లు అలాగే వాళ్ళ అమ్మానాన్నలు ఇంటి దగ్గర నిలబడి హారతి పళ్లెంతో, "రండి! ఇప్పుడు కచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. పనమ్మా! కోడలు పిల్ల! మన ఇంటికి వెళ్ళిపోదాం. వీటితో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు, దీని బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నేను నీకు అమ్మగా మారిపోతాను," అని అంటూ హీరోయిన్‌ని తీసుకువెళుతూ ఉన్నారు.

అయినా కోపం తగ్గని పద్మనాభం అందరినీ చడామడా తిడుతూ, "ఏంటి తీసుకువెళ్తారా? నా భార్యని దూరం చేశారంటే ఇల్లు తగలెట్టేస్తా! చంపేస్తా!" అన్నాడు.

అతని తమ్ముళ్లు అతని పక్కన వచ్చి నిలబడి, ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. "మీద ఒకటి ఇచ్చి ఏంట్రా నాకంటే పోటుగాడివా నువ్వు? తీసుకురావడం తప్పు, అలాగే ఇంట్లో ఉంచడం మరి తప్పు ఇప్పుడు. ఈ బుద్ధి తీసుకురావడానికి ఎన్ని రోజులు మేము వేచి ఉన్నా ఇప్పటికి అర్థమైందా? ఒక అమ్మాయిని తీసుకురావడం గొప్పకాదు. తనకు డబ్బులు, నగలు ఇవ్వడం గొప్ప కాదు, గౌరవాన్ని ఇవ్వడం గొప్ప! నీతో కలిసి వచ్చినందుకు తనకు ఏమిచ్చావు చెప్పు? డబ్బులు, సినిమాలు అన్నీ ఇచ్చావు. కానీ తను బయటికి వెళ్లాలంటే ఎంత సిగ్గుపడుతుందో నీకు తెలుసా? ఇప్పుడు అటువంటిదేమీ ఉండదు. ఇప్పుడు బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఈ విషయం తెలీదు కానీ అమ్మాయిని తీసుకువచ్చేస్తాడు బడవ ఎదవా!" అని అంటూ, "కోడలు! తమ ఇంటికి వెళ్లిపోతే రా! లేదంటే ఇక్కడే ఉండు!" అని అంటూ చెప్పి వెళ్ళిపోయారు.

ఇక చేసేది ఏమీ లేక పద్మనాభం తన భార్య కొంగు పట్టుకుని చకచకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆమె సంతోషంగా తన కొత్త కుటుంబంలోకి అడుగు పెడుతుంది.