Featured Books
  • థ జాంబి ఎంపరర్ - 2

    అతని చేతిలోని గ్లాసు టేబుల్‌పై పగిలిపోయింది."నాకు తిరిగి అక్...

  • ఓ మనసా... - 4

    చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆ...

  • అరవై ఏళ్లకు పెళ్లి

    అరవై ఏళ్లకి పెళ్లి"మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడి...

  • అంతం కాదు - 3

    ఉలిక్కిపడి లేచిన రుద్ర ఏదో పట్టుకోవడానికి ఆపుతున్నట్టుగా, ఒక...

  • థ జాంబి ఎంపరర్ - 1

    జాంబి ఎంపరర్ (The Zombie Emperor) అలా కట్ చేస్తే... ఒక నిశ్శ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరవై ఏళ్లకు పెళ్లి

అరవై ఏళ్లకి పెళ్లి

"మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడిగింది అరవైఏళ్ల పరమేశ్వరరావుని హాలు లోంచి కోడలు సుజాత. 

"మీకు పంచికట్టుకోవడం అయితే నేను వచ్చి నుదుట నామం,
కళ్ళకి కాటుక బుగ్గన చుక్క పెడతాను అoది సుజాత.

అలాగేనమ్మా అన్నాడు! పరమేశ్వరరావు. ఇంతలో పరమేశ్వరావుకి కూతురు రమ్య గొంతు గట్టిగా వినిపించింది మేడ మీద నుంచి. " అమ్మ తయారయ్యావా! పంతులుగారు పిలుస్తున్నారు అని అంది రమ్య.

అయిపోయిందమ్మా! అని సమాధానం ఇచ్చింది పరమేశ్వర రావు భార్య రాధిక. ఎంత బాగున్నావ్ అమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో నా దిష్టి తగిలేలా ఉంది అని తల్లిని చూస్తూ రమ్య. పద పద అంటూ తల్లి చెయ్యిని పట్టుకుని మేడ దిగి వస్తుంటే నిజంగానే సుజాత కొత్త పెళ్ళికూతురు అనిపించింది హాల్లో ఉన్న బంధువులకి స్నేహితులకి.

అందమైన చిలకాకుపచ్చ ఎర్ర అంచు బోర్డర్ ఉన్న పట్టుచీర, రంగు వేసిన జుట్టు, కాళ్ళకి చేతులకి గోరింటాకు, నుదుటన పెళ్లి బొట్టు, కళ్ళకి కాటుక బుగ్గన చుక్క జడలో మల్లెపూలు ఇది యాభై ఎనిమిది ఏళ్ల పెళ్లి కూతురు అలంకరణ. 

పెళ్లికూతురు ఆ పక్క ఈ పక్క రాధిక కూతురు సుమ , సుమ భర్త సుధాకర్ కూర్చుని ఉన్నారు. పెళ్లికూతురు తల్లిదండ్రి హోదాలో. అంటే ఆడ పెళ్లి వారన్నమాట 

ఇంతలో గదిలోంచి అరవై ఏళ్ల పెళ్ళికొడుకుని ఒకపక్క కొడుకు రఘు మరొక పక్క కోడలు సుజాత తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టారు. తెల్లటి పట్టుపంచి పైన కండువా నుదుట తిలకం బుగ్గన చుక్క , తెల్లటి జుట్టు చూడ ముచ్చటగా ఉన్నాడు పెళ్లి కొడుకు. పెళ్ళికొడుకు తండ్రిగా పరమేశ్వర రావు కొడుకు రఘు కోడలు సుజాత పరమేశ్వర రావు పక్కన కూర్చున్నారు. 

చూడండి ! అప్పుడే తెల్లారిపోయింది . మగ పెళ్లి వారికి కాఫీలు లేవు టిఫిన్ లేవు అన్నాడు మగ పెళ్లి వారి హోదాలో రఘు .

పరగడుపున కాఫీ తాగితే గ్యాస్ వస్తుందండి బావగారు! అందుకే కాస్త వేడి నీళ్లు పెట్టించాను. ముందు వేడి నీళ్లు తాగండి అంటూ గ్లాస్ అందించాడు పరమేశ్వర రావు అల్లుడు సుధాకర్ 
మరి టిఫిన్ మాటేమిటి ! ఎప్పుడో తెల్లారి గట్ల లేచాం. ఆకలి దంచేస్తోంది అన్నాడు రఘు.   

కంగారు పడకండి అన్నయ్యగారు! ఇదిగో ఇప్పుడే నూక కొలిచి ఇచ్చాను. పోపు వేగుతోంది. ఉప్మా తయారు చేస్తున్నారు వంట వాళ్ళు. అది కాస్త పొయ్యి నుంచి దింపగానే ఇంక మన విజృంభించడమే అంది సుమ నవ్వుతూ.

ఏమిటి ఉప్మా నా! ఇంకేమీ దొరకలేదా మీకు! మా పిల్లాడి పరమేష్ కి అరగదు అన్నాడు రఘు . 

అరగకపోవడం ఏంటండీ అన్నయ్యగారు! మా పిల్ల అల్లుడు గారికి ఉప్మా అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అందుకే చేస్తున్నాము అంది రమ్య.

అసలే పెళ్లికొడుకు పెళ్ళికూతురు ముస్తాబులో సిగ్గుపడుతూ కూర్చున్న పరమేశ్వరరావు , సుజాత వాళ్ళ సంభాషణ వింటూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. బంధువులు స్నేహితులు కడుపునిండా నవ్వుకుంటూ ఆ ముచ్చట్లు వింటూ కూర్చున్నారు. ఇవన్నీ గమనిస్తున్న పరమేశ్వరావు తల్లి కామేశ్వరమ్మకి పది రోజుల కిందట జరిగిన సంభాషణ ఒకటి.
 గుర్తుకు వచ్చింది.

పరమేశ్వరరావు గవర్నమెంట్ ఆఫీసులో చిరుద్యోగి. పరమేశ్వరం సుజాతలకు ఇద్దరు పిల్లలు. సుమ, రఘు ఇద్దరికీ కూడా పెళ్లిళ్లు అయిపోయి ఆ ఊర్లోనే కాపురాలు చేసుకుంటూ ఉంటారు. పరమేశ్వరావుకి ఆ నెలలో అరవై ఏళ్లు నిండిపోతున్నాయి. ఎలాగైనా అరవై ఏళ్ల పెళ్లి చేయాలని కొడుకు కోడలు కూతురు అల్లుడు సంకల్పం. కానీ పెద్దవాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. 

"అయినా నాన్న ఈ పెళ్లి వెరైటీగా చేద్దాం నేను మీ కోడలు మగ పెళ్లి వారం, చెల్లి బావ గారు ఆడపెళ్లి వారు
అన్నాడు రఘు." ఒప్పుకో నాన్న అని కూతురు సుమ. మొత్తానికి రంగం సిద్ధమైంది.

"బావగారు టిఫిన్లు రెడీ అయిపోయాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు పెడతామన్నాడు సుధాకర్. ఉప్మా ఒక్కటే కదా! టిఫిన్లు అంటారేమిటి! అన్నాడు రఘు. అబ్బా ఏదో మాట వరసకు లెండి! అన్నాడు సుధాకర్. 

ఉప్మాలో జీడిపప్పు లేదు ఏమిటి అన్నయ్యగారు అంది సుజాత సుధాకర్ తో. నువ్వు కూడా ఏమిటమ్మా చెల్లెమ్మా! బావగారికి అసలే కొలెస్ట్రాల్ ఎక్కువ అని జీడిపప్పు నేనే వేయొద్దు అన్నా. డబ్బాడు జీడిపప్పు గూట్లో ఉంది. కావాలంటే చూసుకోండి అన్నాడు సుధాకర్. 

పెళ్ళికొడుకు ,పెళ్ళికూతురు కి ఏమి పెట్టకండి అని అరిచారు పంతులుగారు గట్టిగా. వాళ్లతో పాటు మీకు కూడా ఉపవాసమా! అన్నాడు సుధాకర్. లేదండి బాబు నాకు అసలే షుగర్. ఏవి తినకపోతే ప్రాణం మీదికి వస్తుంది అంటూ ఆత్రంగా ప్లేట్ అందుకుని తినేసాడు పురోహితుడు 

 కొడుకు పెళ్లి ,కూతురు పెళ్లి చేసి ఎంతో అనుభవం సంపాదించిన పరమేశ్వరరావు తను పెళ్ళికొడుకు హోదాలో తన భార్య పెళ్లికూతురు హోదాలో కూర్చోవడం ఆనందంగానూ కొత్త అనుభవంగాను ఉంది.

ఎన్నో షష్టిపూర్తులు చూసిన బంధుజనం, స్నేహితులకి వియ్యాలవారిగా ఆ దంపతులు కొడుకు, కూతుర్లు వ్యవహరించడం చూడముచ్చటగాను ఆనందంగాను ఉంది.

ఆ బావగారు పొద్దున కాపీ అడిగారు కదా! మీకోసం స్పెషల్ గా గోదావరి నీళ్ళతో పెట్టించాను అన్నాడు సుధాకర్. 

"అంటే కాఫీ నీళ్లలో ఉంటుందా ఏమిటి అన్నాడు రఘు. మీరు ఎన్నో కాఫీలు తాగే ఉంటారు. కానీ గోదావరి నీళ్ళతో పెట్టిన కాపీ ఎక్కడైనా దొరుకుతుందా! అన్నాడు సుధాకర్. 

అమ్మా ! పెళ్లి తంతు మొదలు పెట్టాలి. ఆడపిల్ల వారు మగ పెళ్లి వారు వచ్చి కూర్చోండి. మళ్లీ వర్జ్యం వచ్చేస్తోంది. అలాగే వచ్చేటప్పుడు నాకు కూడా ఒక కప్పు కాఫీ అన్నాడు పురోహితుడు.

కప్పు కాఫీ లాగించేసి పెళ్లి తంతు మొదలుపెట్టాడు పురోహితుడు. పెళ్లి పీట మీద పరమేశ్వరరావు పెళ్ళికొడుకు హోదాలో వెలిగిపోతున్నాడు. పరమేశ్వర రావు గారు ఇలా చూడండి అలా చూడండి అటు ఒకటే ఫోటోలు వాళ్ళు గోల.
పరమేశ్వర రావు గారి ఇల్లు అంతా దద్దరిల్లిపోతుంది సన్నాయి మేళం తో. గుమ్మాలకి పచ్చటి మామిడాకు తోరణాలు, హాల్లో అధునాతనమైన డెకరేషన్, లైట్లు, వీధిలో తాటాకు పందిరి నిజం పెళ్లిలా ఉంది. హడావిడి అంతా. పట్టుచీరలో సూట్లలో బంధువులు స్నేహితులు మెరిసిపోతున్నారు. పిల్లలు గోల చేస్తూ ఇల్లంతా తిరుగుతున్నారు.

అమ్మా ! సుముహూర్తం టైం అవుతుంది. అమ్మగారిని తీసుకురండి . తెర పట్టుకోండి అంటూ పురోహితులు కంగారు పడిపోతూ జీలకర్ర బెల్లం యాభైఏళ్ల అమ్మాయి తల మీద పెట్టించాడు ( అసలు షష్టిపూర్తిలో ఈ తంతు ఉంటుందో లేదో నాకు తెలియదు. కథ కోసం రాసా). ఒక్కసారి ఆ జీలకర్ర బెల్లం రాధిక తల మీద పెట్టగానే వయసు ముప్పై ఐదుసంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయినట్లు అనిపించింది పరమేశ్వరరావు కి. ఒకపక్క సన్నాయి వాళ్ళ వాయిద్యం, గట్టిగా చదువుతున్న మంత్రాలు, వర్షంలా కురుస్తున్న అక్షంతల ఆశీర్వాదం వెరసి ఇద్దరు కళ్ళల్లో సిగ్గు తొంగి చూసింది. బంధువుల ఆశీర్వాదంతో పాటు ఏదో చేతిలో పెడుతున్నారు. తీసుకోవడానికి సిగ్గుగా అనిపించింది పరమేశ్వరావుకి, రాధిక కి. అరవై ఏళ్ళ వయసులో పెళ్లికి రకరకాల యాంగిల్ లో అరవై ఫోటోలు తీసాడు ఫోటోగ్రాఫర్.

అన్నిటికన్నా విచిత్రం ఏదో నిజం పెళ్లి లాగా పెళ్ళికొడుకు వచ్చిన గిఫ్ట్లుని రఘు భార్య, పెళ్లికూతురుకు వచ్చిన గిఫ్టుల్ని సుధాకర్ భార్య ఎవరికి వాళ్లే జాగ్రత్తగా దాచుకుంటున్నారు. 
ఇది చూస్తే నవ్వుగా ఉంది.

అమ్మాయి సుమ! ఈ మంగళసూత్రం అందరికీ చూపించరా అమ్మ అన్నాడు పురోహితుడు. అలా ఆడవారందరికీ చూపించి వచ్చిన తర్వాత సుమ మంగళసూత్రాన్ని పురోహితుడు చేతికి అందించింది. మంగళసూత్రధారణ టైమ్ అయిందని సన్నాయి వాళ్ళ పాట మార్చారు. పరమేశ్వర తన చేతికి ఇచ్చిన మంగళసూత్రాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఇంతలో సుమ పెళ్లికూతురు రాధిక జడ ని ఎత్తి పట్టుకోగా వణికే చేతులతో మూడు ముళ్ళు వేశాడు పరమేశ్వర రావు. అవును పొద్దున్నుంచి కడుపులో ఏమీ లేదు నీరసం రాకేమవుతుంది. అందుకే ఆ వణుకు. 

మంగళసూత్రం కడుతున్నప్పుడు పరమేశ్వరావు పరిస్థితి గమనించి రాధిక సుమ చెవిలో ఏదో చెప్పింది. "మా అల్లుడు గారికి పాయసం నా పెళ్ళి కానుకంటూ పరమేశ్వరావుకి పాల గ్లాస్ అందించింది సుమ.

ముప్పై ఏళ్ల క్రితం మంగళసూత్రం విలువ తెలియని రాధిక కి ఇప్పుడు తన మెడలో కొత్తగా వేలాడుతున్న మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంది. 

అప్పుడు అనుభూతి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే అనుభూతి. ఏదో తెలియని ఆనందం. మాటల్లో చెప్పలేని మమకారం.

పంతులుగారి గట్టిగొంతు మళ్లీ వినిపించింది —
"ఇప్పుడు తలంబ్రాలు తంతు.హాల్లో ఉన్న అందరూ ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది రాధిక చేతిలో చిన్న పళ్లెంలో తలంబ్రాలు — పసుపు కుంకుమలతో కలిపిన బియ్యం — రెడీగా ఉన్నాయి. 

"అయ్యో నాయనా! ఇంతకీ ఎవరు ముందుగా వేయాలి?" అన్నది కోడలు సుజాత, నవ్వుతూ.

"నెత్తి మీద మొదటి తలంబ్రాలు వేయడం హక్కు పెళ్లికూతురిదే" అని ఖరాఖండిగా చెప్పింది సుమ.

రాధిక చేతిలో తలంబ్రాలు తీసుకుని పరమేశ్వరరావు తల మీద మెల్లగా చల్లింది. ఒక చిరునవ్వు ఆమె పెదవులపై పరుచుకుంది.
అవును... అప్పట్లో మూడవ రోజు పెళ్లిలో తలంబ్రాలు వేయలేదేమో... కానీ ఇప్పుడు మాత్రం ఒక కొత్త ఆరంభం!

ఆత్మీయంగా పరమేశ్వరరావు కూడా తలంబ్రాలు తీసుకుని రాధిక తల మీద వేసాడు. బియ్యంతో పాటు ముసిముసిగా నవ్వులు, మధుర జ్ఞాపకాలు, మూడు దశాబ్దాల ప్రేమ కూడి అక్కడ పడిపోయాయి.

"అయ్యయ్యో! తల ముడుచుకోకూడదమ్మా!" అంటూ పంతులుగారి హెచ్చరిక 

ఆ పక్క, ఈ పక్క కొడుకు కోడలు కూతురు అల్లుడు బంధువులు స్నేహితులు ఉత్సాహపరిస్తుంటే తలంబ్రాల తంతు అరగంట సాగింది. చివరిసారిగా పళ్లెం ఎత్తబోతూ ఒక్కసారి కంగారుపడిన రాధికను చూసి రఘు లోపల నుంచి ఒక గ్లాస్ తో పాయసం తీసుకొచ్చి రాధిక చేతిలో పెట్టి "మా కోడలికి తలంబ్రాలు సమయంలో మా కానుక అంటూ నవ్వేశాడు. గ్లాసుడు పాయసం తాగిన రాధికకి ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. పాపం అరిచి అరిచి పురోహితుడు కూడా నీరసం వచ్చినట్లు ఉంది "నాకు కూడా ఎవరైనా కానుక ఇస్తే బాగుండును అన్నాడు. సుమ గబగబా వెళ్లి గ్లాసుడు పాయసం పంతులు గారికి ఇస్తే అది తాగి పంతులుగారు ముఖంలో వెలుగు కనబడింది. 

ఆ తర్వాత అగ్ని చుట్టూ ఏడడుగులు భర్త చెయ్యి పట్టుకుని నడుస్తుంటే ఓ ముప్పై ఏళ్ళ క్రితం ఇదే సందర్భంలో పరమేశ్వర రావు చేసిన అల్లరి గుర్తుకొచ్చింది. ఏడు అడుగులు నడుస్తుంటే చేతిని గట్టిగా గిల్లేసాడు. పెళ్లికూతురు కదా ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు అదే కొత్త అనుభూతి. 

అప్పుడు పెళ్లిలో అరుంధతి నక్షత్ర దర్శనం అయిన తర్వాత కాపురానికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అత్తగారు కామేశ్వరమ్మ రోజు నక్షత్రాలు చూపిస్తూనే ఉంది రాధిక కి. ఇప్పుడు మళ్లీ ఆ నక్షత్రాన్ని చూస్తుంటే పాత రోజులు గుర్తుకొచ్చాయి. 

అలా పెద్ద వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టించి పక్కపక్కన భోజనానికి కూర్చోబెట్టారు షష్టిపూర్తి దంపతులను. పచ్చటి అరిటాకులో పదార్థాలను వడ్డించారు. బంతి ప్రారంభమైంది. 

ఇదేం పెళ్లి భోజనం , బిర్యానీ లేదు, ఒక మసాలా కూర లేదు, కూరలో ఉప్పు లేదు, బొబ్బట్టు లేదు ,పులిహార లేదు అన్నాడు రఘు తన బావ గారితో. బావగారు ఇది అరవై సంవత్సరంల వయసు వారి పెళ్లి. సీనియర్ సిటిజన్ పెళ్లి. వంటలు కూడా సీనియర్ సిటిజన్ వాళ్ళకి పెట్టవలసివే . ఇది సీనియర్ సిటిజనుల విందు అన్నాడు సుధాకర్ నవ్వుతూ. అయినా సీనియర్ సిటిజన్ల వరుసలో మీరు కూర్చున్నారు ఏమిటి పైన బోర్డు పెట్టాం కదా అన్నాడు సరదాగా. 

"అంటే మాకు సెపరేట్ భోజనాలు ఉన్నాయా అన్నాడు రఘు. లేక ఏవండీ విందు భోజనాలు ఆ పక్క అన్నాడు సుధాకర్ ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అరవై సంవత్సరంలో వయసులో జరిగిన పెళ్లి వెరైటీగా చేశారంటూ బంధుజనం మెచ్చుకుంటూ సెలవు తీసుకున్నారు.

(అసలు నిజానికి షష్టిపూర్తిలో ఈ తంతులన్నీ ఉంటాయో లేదో నాకు తెలియదు ఏదో సరదాగా కథ కోసం రాశా)

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279