Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కేశవ s o కృష్ణ - 1

కేశవ 
                                S/o 
                                       కృష్ణ                             



" ఆహ్ " బాధతో ఒక అరుపు ఆ అరుపు నుండి పుట్టిందే మన కథ....

ఇంకొద్ది నిమిషాల్లో నా ప్రాణం పోతుంది అని నాకు అర్థం అవుతుంది..... చిన్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు చనిపోయే ముందు మన జీవితం మొత్తం మన కళ్ళ ముందు కనిపిస్తుందట..... నిజమే ఇప్పుడే నాకు తెలుస్తుంది.... నా జీవితం తెరలు తెరలుగా కనిపిస్తుంది......

నా చావు నన్ను పిలుస్తున్న నాకు ఈసారి సంతోషంగా ఉంది.... ఏమి సాదించలేకుండ పోతానేమో అని బాధ పడ్డాను కానీ ఇప్పుడు ఆ బాధ లేదు.... ఎందుకో తెలుసా రండి చెప్తాను....

ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ మీకు..... నా పేరు " కేశవ్ " నాకో ఇరవై ఏడు ఏళ్ళు..... ఇప్పుడు ఏజ్ ఎందుకు చెప్పానో తెలుసా ఇన్ని సంవత్సరాలలో నేను ఏమ్ సాధించానో మీకు చెప్పలిగా అందుకే.....


అబ్బా గుండెల్లో నొప్పిగా ఉంది..... అది దెబ్బ తాలూకు నొప్పి కాదు బాధతో వస్తున్న నొప్పి ఇన్ని ఏళ్ళు గా మోస్తున్న నొప్పి ఇప్పుడు ఎక్కువ అయ్యి తట్టుకోలేకున్న..... అయిన ఇదేం కొత్త కాదు నా ఐదేళ్ల నుంచి నాకు అలవాటు..... ఐదేళ్ల నుంచి అని ఎందుకు అన్నానో ఇప్పుడు నా కథతో మీకు చెప్తాను..... మీకు చెప్తే అయిన ఎవరికి తెలియని విషయాలు నేను మోస్తున్న భారాన్ని దించేసుకుని ప్రశాంతంగా చనిపోవాలి అని ఉంది


మాదో చిన్న హ్యాపీ ఫ్యామిలీ..... నేను అమ్మ నాన్న అంతే.... " నాన్న "  ఈ పేరు వింటే అందరికీ ప్రేమ ఆప్యాయత.... నాకు మాత్రం బలం ధైర్యం...... ఏ మగ బిడ్డ అయిన తల్లిని ఇష్ట పడతాడట.... కానీ నాకు నా నాన్న అంటేనే చాలా ఇష్టం......

పొద్దున్నే డ్యూటీ కి వెళ్లి సాయంత్రం వచ్చి నాతో కాసేపు ఆడుకుని.... అమ్మతో ఏదో గుస గుసగా మాట్లాడుతూ..... నైట్ కి అమ్మ కలిపి నాకు నాన్నకు అన్నం పెడుతూ తను తినేది.... నాన్న గుండెల మీద పడుకుని కథలు చెప్పుకుంటూ అమ్మ జో కొడుతుంటే నిద్రపోయే వాణ్ణి..... అలా నాన్న గుండెల మీద తల వాలిస్తే ఆ ధైర్యం ఇంకెక్కడ దొరకదేమో..... 


అలాంటిది ఒకరోజు నేను అప్పటిదాకా ఆడి బాగా దాహం ఆకలి అనిపిస్తుంటే పరిగెత్తి ఇంటికి వచ్చాను..... ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు తెల్లటి దుప్పటి కప్పి ఎవరో పడుకుని ఉంటే.... అమ్మ పక్కన కూర్చుని ఏడుస్తుంది..... చుట్టూ అక్కడ అక్కడ జనం తప్ప ఎవ్వరూ లేరు..... లేలేత పసి ప్రాయం నాది ఆ ఏడుపుకు అర్దం అప్పుడు తెలీలేదు.... 


భయంగా అనిపిస్తుంటే గబుక్కున అమ్మ దగ్గరకు చేరి తన కన్నీళ్లు తుడిచి ఆమె గుండెల్లో మొహం దాచేసాను...... అమ్మ నన్ను పట్టుకుని ఇంకా పెద్దగా ఏడుస్తుంది.....


పక్కన వాళ్ల మాటల్లో నాన్న పేరు వినిపిస్తుంటే వింటున్న " పాపం కరెంట్ పని చేసేవాడు ఆ కరెంట్ ఏ మింగేసింది ..... చాలా మంచి వాడు ఎవరి జోలికి రాడు...... ఇప్పుడు ఈ భార్య బిడ్డ సంగతి ఏంటో " అని అంటున్న వాళ్ల మాటల్లో నాన్న పేరు తలచుకోగానే ఏడ్చేసాను.... ఆరోజు ఏమ్ అర్దం అయ్యిందో ఇప్పటికీ నాకు గుర్తు లేదు.....


ఏడ్చి అలాగే నిద్రపోయిన నేను మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి చీకటిగా ఉండి ఏమ్ కనిపించలేదు..... గబుక్కున లేచి చూస్తే దూరంగా నాన్న ఫోటో ముందు దీపం పెట్టీ దాని పక్కన అమ్మ గోడకు ఆనుకుని కూర్చుని ఏటో చూస్తుంది.....


పరిగెత్తి అమ్మను చేరి ఆమె కన్నీళ్లు తుడిచి " అమ్మ ఆకలి " అన్నాను....

అప్పుడే ఆ రూమ్ లో లైట్ వెలిగింది వెనక్కి తిరిగిన నాకు అమ్మమ్మ కనిపించి " అమ్మమ్మ " అంటూ వెళ్లి ఆవిడను హత్తుకున్నాను..... నన్ను గట్టిగా చుట్టేసి ఏడుస్తుంది అమ్మమ్మ.... ఆకలి అన్నాను ఆవిడతో అంతే లేచి నన్ను తీసుకుని వెళ్లి పాలు బ్రెడ్ ఇచ్చి తనే తినిపించింది....

రోజు ఆ టైం కి నాన్న వస్తారు కదా నేను గుమ్మం వైపు చూస్తూ " అమ్మమ్మ నాన్న ఎప్పుడు వస్తాదు ఈరోజు ఇంకా రాలేదు ఏమ్ " అని అడిగాను.... ఒక్కసారిగా అమ్మమ్మ ఏడ్చేసి " మీ నాన్న లేడు రా ఆ దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు..... పోతూ పోతూ నా బిడ్డ ను అన్యాయం చేసి పోయాడు " అని ఏడుస్తూ తల కొట్టుకుంటుంది

నేను ఏడ్చేసాను ఎంతలా అంటే గుక్క తిప్పలేనంత..... అమ్మమ్మ కంగారు పడిపోయి బయటికి తీసుకుని వెళ్లి చందమామను చూస్తూ లాలిస్తుంది..... " నాకు నాన్న కావాలి " ఇదే నా పాట..... " ఇదిగో ఇక్కడ ఉన్నాడు " అనింది చివరకు..... 

" ఎక్కడ "

నా గుండెల మీద చెయ్యి పెట్టీ నాకు నాన్న అంటే ఇష్టం కదా అని నేను నా గుండెల్లో దాచేసి భద్రంగా దాచుకుంటున్న అని చెప్పింది.... ఆ మాట నా చిట్టి బుర్రలో నిలిచిపోయింది కాదు నాటుకుని పోయింది.....


మళ్ళీ అమ్మ దగ్గరకు పరిగెత్తి నాన్న ఇక్కడ ఉన్నాడు అని నా గుండెలు చూపిస్తూ ఆమెను ఎంత మాట్లాడించిన మాట్లడకపోయేసరికి చిన్న ముద్దు పెట్టీ మళ్ళీ అమ్మ వొడిలోనే పడుకున్నాను.....


పది రోజులు పాటు ఇదే తంతు పదకొండో రోజు మళ్ళీ అందరూ వచ్చారు నా మేన మామ తో సహా..... ఇంట్లో పంతులు గారు వచ్చి ఏదో చేయిస్తూ ఉంటే నాకు స్నానం చేయించి కూర్చోమన్నారు.... నాకు భయం వేసి ఎడ్చేసి అమ్మ దగ్గర నుంచి రాలేదు....


" వాడు చిన్నపిల్లాడు శేఖరా కొరివి నువ్వే పెట్టావ్ కదా ఇది కూడా నువ్వే చెయ్ " అనేసరికి కూర్చున్నాడు నా మేన మామ.... నాన్న ఫోటో పెట్టీ మంత్రాలు చదువుతూ " శ్రీ కృష్ణ " అని నాన్న పేరు చెప్తున్నారు....

నాన్న సైడ్ రిలేటివ్స్ ఎవరు లేరు అందరూ నేను పుట్టక ముందు బస్ లో వస్తుంటే దానికి నిప్పు అంటుకుని చనిపోయారట..... మా నాన్న కు తన నాన్న అంటే ఎక్కువ ఇష్టం ఉండి.... నేనే తన తండ్రిగా మళ్ళీ పుట్టాను అని వాళ్ల నాన్న పేరు పెట్టీ నన్ను అల్లారు ముద్దుగా పెంచారు.....


అన్ని అయ్యేసరికి చాల టైం పట్టి మామ ఏదో తీసుకుని బయటికి వెళ్ళిపోతే అమ్మమ్మ నన్ను తీసుకుని పక్కకు వెళ్ళింది.... ఈ లోపు అమ్మను తీసుకుని వెళ్లి తెల్ల చీరలో తెచ్చారు ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మను చూసి మళ్ళీ ఏడ్చి నిద్రపోయాను.... ఇలా సంవత్సరం గిర్రున తిరిగింది.....


అమ్మమ్మ పిలిచిన పోనని మిషన్ కుడుతూ నాకు బువ్వ పెట్టేది.... ఇక నాన్న నా గుండెల్లో ఉన్నాడు అని నా బుజ్జి బుర్రలో నాటుకుని పోయి అమ్మను ఏడిపించడం మానేసాను....


ఆరేళ్లకు స్కూల్ లో వేస్తే పోతూ వస్తూ ఉండేవాన్ని.... అమ్మ దగ్గరకు అందరూ వచ్చి కుట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే విడో అని వచ్చే కొన్ని డబ్బులు మాకు ఒక్క పూట బోజనానికి వచ్చేవి.... అప్పుడే నాకు ఆకలి విలువ తెలిసింది.......


అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను.... పొద్దునే స్నానం చేసి గుడికి వెళ్లడం అలవాటు చేసుకున్నాను.... భక్తితో అనుకునేరు... పూజారి తాత నాకు బాగా తెలుసుగా ఆయనను అడిగి ప్రసాదం తెచ్చుకుని నేను అమ్మ తినే వాళ్ళం..... మధ్యానం భోజనం రాత్రి భోజనం రెండిటికీ అంటే తినలేము కాబట్టి నాలుగు గంటలకు బడి నుంచి రాగానే తినే వాళ్ళం......


అమ్మ రెండు పూటలా తినమని గోల చేసిన కొట్టిన తినే వాడిని కాదు అందుకే చూసి చూసి తనే మారింది..... పొద్దున్నే ప్రసాదం సాయంత్రం ఒంటి పూట భోజనం..... ఇలా కొన్ని ఏళ్ళు సాగాయి మా జీవితాల్లో.... అప్పుడప్పుడు మాత్రమే అమ్మ మొహంలో నవ్వు  చూసే వాడిని


అమ్మమ్మ మావయ్య ఎన్ని సార్లు వచ్చి పిలిచిన వెళ్లదు వాళ్ల డబ్బులు తీసుకోదు.... ఎందుకో అప్పుడు తెలీలేదు కానీ తను ప్రేమించిన వాడిని కాకుండా నాన్నను ఇచ్చి పెళ్లి చేసి తన గొంతు కోశారు అని కోపం అట....

ఇలాగే జరుగుతూ 10త్ ఎగ్జామ్స్ రాశాను.... బాగా రాకపోయినా పాస్ అయ్యాను కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చింది....ఇంటర్ చదువుకు డబ్బులు ఎట్టా అని..... 

కానీ అమ్మ ఫీస్ కట్టి చేర్పించింది..... సైకిల్ తీసిచ్చి మంచి బట్టలు కొనింది.... తిండికి కూడా డబ్బు లేని మాకు అంత డబ్బు ఎక్కడిది అని అడగలేదు..... ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ కోరికలు తీరకుండా ఉన్న నాకు అవి చూసే సరికి ఆనందం అంత ఇంత కాదు..... అమ్మ కూడా నాకు చెప్పలేదు


బహుశా చెప్పుంటే ఈరోజు ఇలా ఉండే వాడిని కాదు ఏమో..... సైకిల్ వేసుకుని కాలేజ్ కి వెళ్ళడం.... దాన్ని చూసుకుని అందరి ముందు పోస్ కొట్టేవాడిని.... అలా ఒకడితో గొడవ పెట్టుకుని సస్పెండ్ అయ్యాను అమ్మకు చెప్తే బాధ పడుతుంది అని రోజు కాలేజ్ కి అని పోతూ బయట ఆడుకుని ఇంటికి వెళ్ళే వాడిని.... అదే నా జీవితాన్ని మార్చేసింది.... అమ్మకు లోక జ్ఞానం తెలీదు.... మందలించే తండ్రి లేడు 


ఆటకు మరిగి కాలేజ్ ఎగొట్టి 1స్ట్ ఇయర్ లో పాస్ మార్క్స్ అయిన వస్తె సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాను.... ఎప్పుడు కొట్టని అమ్మ నన్ను చితక బాదింది..... అప్పుడే సేటు వచ్చి డబ్బులు కట్టలేదు అని ఇంటిని లాక్కుని మమ్మల్ని రోడ్లో నెలబెట్టాడు..... అంటే ఇల్లు తాకట్టు పెట్టీ డబ్బులు నా చదువుకు వాడిందనమాట......


ఎటు పోవాలో తెలీదు ఇద్దరం రోడ్ మీద చెట్టు కింద ఉన్నాం అమ్మ ఏడుస్తుంది..... ఎందుకు ఏడవదు కొడుకు ఉద్దరిస్తాడు తమ కష్టాలు తీరిపోతాయి అని నమ్మి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెడితే.... నేనేం చేశాను నా సంతోషాలు కోసం అమ్మ ఆశలు పేక మేడ లాగా కూల్చేసాను......


అప్పుడే తన తండ్రితో అటుగా పోతున్న నా స్కూల్మెట్ రాగిణి నన్ను చూసి దగ్గరకు వచ్చీ " కేశవ్ " అని పిలిచింది.... ఎందుకో ఆ గొంతు ఎప్పటికీ నేను మర్చిపోలేను నా మనసులో ముద్ర పడిపోయింది.....


వెంటనే తల ఎత్తి చూసేసరికి తను వాళ్ల నాన్న ఉన్నారు..... మా పరిస్థితి తెలుసుకుని మమ్మల్ని తీసుకుని వెళ్ళారు..... అమ్మ రానంటే రానంది.... " మీ ఆయన చనిపోయింది నా పొలం లో కరంట్ పని చేస్తూనే " అని " ఇలా అయిన నా బాధ తగ్గుతుంది " అని ఒప్పించి తీసుకుని వెళ్ళాడు.....


వాళ్ళదే ఊరికి చివరగా ఒక చిన్న గది బయట అంతకన్న చిన్న బాత్ రూమ్ ఆరోజు అదే మాకు ఇంద్రభవనం.... అమ్మ మళ్ళీ మిషన్ కుట్టేది.... ఈసారి డబ్బులు కొంచం ఏక్కువ వచ్చేవి.... చదువు అబ్బలేదు కదా ఏదయినా పని చేసుందాం అని బయటికి వెళ్ళిన నాకు తెలిసిన అన్న కనిపించి మాట్లాడుతుంటే.....


ప్రోగ్రాం కి పోతున్న నువ్వు కూడా నాతో రా టైం పాస్ అవుతుంది అని తీసుకుని వెళ్ళాడు.... ఎవరికి తెలుసు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే అవుతుంది అని


ఏదో బారసాల ఫంక్షన్ అన్న ఓపికగా ఫొటోస్ తీస్తున్నాడు నేను చూస్తున్న.... ఆ బిడ్డ తండ్రి అన్నకు ఫ్రెండ్ అయ్యేసరికి తనను వచ్చి ఫోటో తీసుకోమన్నారు..... " రాహుల్ అన్నా " నా చేతికి కెమెరా ఇచ్చి ఇలా క్లిక్ చేయాలి అని చూపించి వెళ్ళాడు.... అదే నేను కెమెరా పట్టుకోవడం.... చేతులు షివర్ అవుతుంటే చిన్నగా ఫోటో తీసి ఇచ్చేసాను.... కానీ ఆ అనుభవం నచ్చింది


ఇంటికి వచ్చిన ఇంకా నా చేతిలో కెమెరా ఉన్నట్టే అనిపిస్తుంటే.... నేనూ ఫోగ్రఫర్ అయితే...... ఆ ఊహే నాకు నచ్చింది

పక్క రోజే అన్న దగ్గరకు వెళ్లి అడిగితే ఈజీగా ఒప్పుకుని నాకు నేర్పించేసాడు..... చాల ఫాస్ట్ గా నేర్చుకున్నాను కూడా ఎంతయినా నచ్చిన పని మీద ధ్యాస బాగా వుంటుంది మనకు.....


అన్నకు అసిస్టెంట్ గా పోయేవాడిని నేను.,..... అన్న లేనప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కు వెళ్ళే వాడిని.... అలా ఒకరోజు రాగిణి చుట్టాల ఇంట్లో ఫాంక్షన్ కి రమ్మంటే వెళ్ళాను.... ఫొటోస్ తీస్తున్న నా చేతులు కాసేపు ఆగిపోయాయి రాగిణి నీ చూసి.....


ఎల్లో కలర్ లంగా బ్లౌజ్ కు పింక్ వోణి వేసుకొని పెద్ద జాడ కు మల్లెలు పెట్టీ చెవికి బట్టలు , మాటీలు , చెంపసారలు , పాపిటి లో పాపటి బిళ్ళ పెట్టీ మెడలో చంద్ర హారం చేతికి బంగారు గాజులకు జతగా మట్టి గాజులు వేసుకుని అందంగా నవ్వుతూ వస్తుంటే.... నా హార్ట్ హై స్పీడ్ లో కొట్టుకుంది మొదటి సారి..... 


అప్పటికే యవ్వనం లో ఉన్న నాకు అది ఎట్రాక్షన్ ఆ లేక ప్రేమ అని తెలీదు రాగిణి నా కంటికి నచ్చింది అంతే.....


నా దగ్గరకు వచ్చి పలకరించి వెళ్ళింది..... ఆమె మేని పరిమళం నా వొంటి మీద గూస్బంస్ రప్పించాయి.... నా కళ్ళు తన నుంచి తిప్పుకోలేదు....


ఫంక్షన్ ఫోటోస్ కంటే తనవే ఎక్కువ తీసాను..... స్టూడియో కి వెళ్లి అన్న వచ్చే కంటే ముందే తన ఫొటోస్ పెండ్రైవ్ లోకి కాపీ చేసుకుని సిస్టమ్ లో డిలీట్ చేసాను....


సిస్టమ్ ఎలా తెలుసు అనుకోకండి అంతా రాహుల్ అన్న చలవ....


అది మొదలు రాగిణి వెంట పడడం స్టార్ట్ చేసాను దూరం నుంచి చూసి మురిసిపోయేవాన్ని.... గిర్రున సంవత్సర కాలం తిరిగింది.... నాలో పుట్టిన ప్రేమ విత్తనం చిగుర్లు ఇచ్చింది....


ఇప్పుడు నేను చాలా వరకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా తయారయ్యాను స్టూడియో స్టార్ట్ చేయడానికి అంత మనీ లేదు కాబట్టి అన్న తోనే తిరుగుతూ డబ్బులు కూడబెడుతున్న....

ఒక రోజు


రోజూ లాగే రాగిణిని ఫాలో అయ్యాను కానీ తను బస్ స్టాప్ కి కాకుండా చిన్న వీధిలోకి వెళ్ళేసరికి నేను వెళ్ళాను కొంత దూరం వెళ్ళక తను కనిపించలేదు పరిగెత్తినట్టే వెళ్ళేసరికి సడన్ గా ఎవరో నా చేతిని పట్టుకుని లాగినట్టు అయ్యింది.....


అంతే కొట్టడానికి చేతిని పైకి ఏత్తేసరికి బెదిరి పోయి కళ్ళు గట్టిగా మూసేసి పిడికిళ్లు బిగించేసింది రాగిణి


నా గుండెల దాకే ఉంటుంది తను..... మూసిన చిట్టి కళ్ళు సన్నగా ఉండే ముక్కు బుజ్జి పెదాలు శఖం లాంటి మెడ నాజూకు అయిన శరీరాకృతి నా ముందు మొహం బిగించి నిలబడి ఉంది..... లేలేత గులాబి పెదాలు అదురుతుంటే మొదటి సారి వాటిని అందుకోవాలి అనే కోరిక కలిగింది నాకు.... అంతలోనే ఛా అనుకుంటూ తనని చూస్తూ అలాగే నిల్చున్నాను..... 


ఎంత సేపు చూసినా తనివి తీరదు నాకు అంత బాగుంటుంది తను.... చుట్టూ ప్రపంచం చీకటి అయినట్టు తను నేను మాత్రమే ఉన్నట్టు బాక్గ్రౌండ్ లో ఇళయరాజా గారి పాట వినిపిస్తున్నట్టు ఇలా నా ఊహల ప్రపంచంలో తనను ఊహిస్తూ చూస్తుండిపోయాను......


కాసేపటికి చిన్నగా కళ్ళు తెరిచి చూసి నేను తననే చూస్తుండటంతో ఒక్క క్షణం సిగ్గు పడి అంతలోనే కోపం తెచ్చేసుకుంది.....


ఆమె మారుస్తున్న భావాలకు ఆ కళ్ళు చిన్నవి అవుతూ మల్లి పెద్దవి చేయడం చూస్తుంటే నా మనసు అదుపు తప్పుతుంది.... తను తోసిన తోపుకు ఈ లోకం లోకి వచ్చి పడ్డాను 


ఒక్క అడుగు వెనక్కి వేసి ఇంకా నా గుండెల మీద ఉన్న తన చేతిని ఒకసారి చూసి తనని చూసాను..... కోపంగా తిడుతుంది కానీ నా చెవులకు వినపడలేదు నన్ను తాకిన ఆమె చేతి స్పర్శ లో మునిగిపోయి.....


స్కూల్ లో ఎన్ని సార్లు ఆడుకున్నమో ఎన్ని సార్లు కొట్టుకున్నమో కానీ ఏనాడు నాకు కలగని ఈ ఫీలింగ్ ఈరోజు తేలుస్తుంటే వొంటి మీదకు ఈడు వచ్చేసింది అని వయసు గుర్తు చేసింది.....


నన్ను తిట్టి తను వెళ్లిపోయింది కూడా గుర్తించలేదు నేను... ఎలా నడిచి ఇంటికి వెళ్ళానో తెలీదు.... వచ్చి మంచం మీద పడిపోయి నాలో నేను నవ్వుకుంటుంటే... అమ్మ నన్ను పిచ్చి చూపులు చూసి ఒక్కటి పీకితే కానీ సృహా లోకి రాలేదు....


" రేయ్ ఏమయిందిగా కళ్ళు తెరిచి కలలు కంటున్నవా....  సాయంత్రం నీ ఫ్రెండ్ రాగిణి ఉందిగా తన ఇంటికి వెళ్లి ఈ బట్టలు ఇవ్వాలి ఏ పనులు పెట్టుకోకు " అని అమ్మ తన దొరని లో చెప్పుకుని పోతుంటే.... నేను మాత్రం మళ్ళీ రాగిణి పేరు దగ్గర ఆగిపోయాను


ఈరోజు మళ్ళీ రాగిణి నీ చూస్తాను అని పిచ్చి ఆనందం లో " థ్యాంక్ యూ అమ్మ " అని ముద్దు పెట్టుకుని బాత్ రూం లోకి దూరాను నీట్ గా రెడీ అవ్వను.....


నా పిచ్చి కానీ సాయంత్రం వెళ్ళడానికి ఇప్పుడే స్నానానికి వెళ్లిన నా లాంటి మెంటల్ కేస్ ఎవరు ఉండరేమో.....


మధ్యానం భోజనం కూడా తూ తూ మంత్రంగా చేసేసి వొంటి గంటకే టైం చూస్తూ కూర్చున్నాను ఐదు ఎప్పుడు అవుతుందా అని.... చూసారా మళ్ళీ పిచ్చే నాకు నా కోసం టైం ఫాస్ట్ గా తిరుగుతుందా లేదుగా.... నాలో ఆత్రం గాడు బయటికి వచ్చాడు ఆరోజు అందుకే ఇలా చేస్తున్న....


ఈ ఆలోచనల లోనే ఎప్పుడు పడుకున్నానో ఐదు గంటలకు అమ్మ అరుస్తుంటే మెలుకువ వచ్చింది.... అప్పటికే పిలిచి విసిగిపోయింది ఏమో తనే వెళ్ళడానికి బయలుదేరింది.....


గబుక్కున లేచి చేతిలో బ్యాగ్ లాక్కుని " నేను ఇస్తా " అని ఒక్క మాట చెప్పి బయట పడ్డాను ఇంట్లో నుంచి.... మెస్సీ గా ఉన్న హెయిర్ నీ సైడ్ కి అనుకుంటూ రాగిణి ఇంటికి వచ్చాను.....


ఇక్కడికి వచ్చాక కానీ తెలియలేదు నేను ఫాలో అవుతున్న విషయం రాగిణి కి తెలుసు కదా ఇప్పుడు అంకుల్ కి చెప్పేస్తే అనే ఊహ రాగానే అప్పటిదాకా హుషారుగా పడిన నా అడుగు తడబడింది.... వెళ్ళిపోదాం అని వెనక్కి తిరిగిన నా పాదాన్ని ఎవరో లాగినట్టు ముందుకే పడింది.....


ధైర్యం చేసి లోపలికి వెళ్లి " అంకుల్ " అని పిలిచాను.... అటు పక్క నుంచి నో సౌండ్ ఎందుకు వస్తుంది అసలు నా నోట్లో నుంచి మాట వస్తేగా.... ఈసారి గట్టిగ ఊపిరి తీసుకుని పిలిచాను......


కిచెన్ నుంచి పట్టీలా సౌండ్ వస్తుంటే అటు చూసాను నాప్కిన్ కి చేతులు తుడుచుకుంటూ వైట్ నైట్ డ్రెస్ లో వస్తుంది రాగిణి.....


ఏంటో నైట్ డ్రెస్ లో కూడా దేవ కన్యల కనిపించింది నా కంటికి నా కళ్ళు తన నుంచి పక్కకి పోకుండా స్ట్రక్ అయిపోయి అలాగే చూస్తుంటే.... తను నా దగ్గరకు వచ్చి నాప్కిన్ నా మొహాన దులిపినట్టు దులిపేసరికి ఈ లోకం లోకి వచ్చాను.....



ఎంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది.... తన ముందు బ్యాగ్ పెట్టీ తన కళ్ళు చూస్తూ నిల్చున్న..... నా చేతిలో బ్యాగ్ లాక్కుని అన్ని చూసుకుని అన్ని ఉన్నట్టు తల వూపింది.....


కాసేపు అయిన చూసుకోవచ్చు అనుకున్న నాకు తను భావం వెళ్ళిపోమనట్టు ఉండేసరికి నిరాశగా వెనక్కు అడుగులు వేసాను


" ఒక్క నిమిషం " అని తన గొంతు వినిపించింది హుషారుగా వెనక్కు తిరిగి తన ముందు నిల్చున్న....


నా చర్యకు వియర్డ్ గా చూసి " ప్రేమిస్తున్నావా " అని సూటిగా అడిగింది..... 


అంతే నాకు ఒక పక్క ఆశ్చర్యం ఇంకో పక్క భయం రెండు వచ్చాయి ఇంట్లో ఎవరూ అయిన ఉన్నారు ఏమో అని చుట్టూ చూస్తుంటే..... " ఇటు చూసి చెప్పు " అని గద్దించింది.....


గబుక్కున ఆమె చేతిని పట్టుకుని కింద ఉన్న ఏదో రూమ్ లోకి లాక్కుని పోయి " ఎంటి నువ్వు అలా అడిగేసావ్ ఎవరైనా వింటే " అన్నాను


తను కూడా " వింటే " అనింది సీరియస్ గా


" వింటే అంటావ్ ఎంటి అలా జరిగితే " అంటూ అసలు తను ఎందుకు సీరియస్ అవుతుంది అనుకుంటూ..... " వింటే ఏముంది నా బాధ తప్పుతుంది నీకు " అన్నాను దిగాలుగా మొహం పెట్టీ


" నువ్వు నన్ను బాధ పెడుతున్నవు , పీడిస్తున్నావ్ అని చెప్పనా " అనింది


" ఏమో పొద్దున నుంచి దొంగను చూసినట్టు చూస్తున్నావ్ అందుకే ఇక నీ వెంట పడకూ....... " అంతే నా మాట ఆగిపోయింది కళ్ళు పెద్దవి అయ్యాయి షాక్ తో సడన్ గా తన స్పర్శ నా వొళ్ళంతా తెలిసేసారికి 

( అదేనండి హగ్ చేసుకుంది 🙈🙈)

" రేయ్ ఇడియట్ సంవత్సరం నుంచి నీ ప్రేమ ఇదేనా ఎవరయినా అరిస్తే వదిలేస్తారా..... చూసి చూసి విసుగొచ్చి పొద్దున తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటే అసలు మాట్లాడకుండా ఆగిపొయావ్.... ఇప్పుడు కూడా నువ్వు వెల్లిపోతుంటే నేను ఓపెన్ గా అడిగిన తేలీనట్టు ఉంటావ్ ఎంటి రా..... అసలు నీది ప్రేమేనా " అని గట్టిగా అడుగుతూ ఇంకా గట్టిగా నన్ను చుట్టేసింది


ఇప్పుడు కూడా అంతే ఏమ్ వినపడలేదు పొద్దున చేతికే ఫ్రిజ్ అయిన నేను ఇప్పుడు ఏకంగా హగ్ చేసుకునేసరికి వొళ్ళంతా ఒణుకు వచ్చేసింది నాకు మాట రావట్లేదు....... ఏదో ఆస్తమా పేషంట్ లాగా ఆయాసంగా బ్రీతింగ్ తీసుకుంటుంటే..... గొంతు తడారి పోయి వెక్కిళ్లు వస్తున్నాయి....

తను దూరం జరిగి " రేయ్ ఏమయింది " అని కంగారుగా అడిగింది


వాటర్ అని సైగ చేసాను పక్కన బెడ్ మీద కూర్చుంటూ.... గబుక్కున తీసుకొచ్చి నాకు తాగించి నా గుండె నిమురుతుంది..... కొంత సేపటికి సర్దుకునీ ఇంకా నా మీద ఉన్న తన చెయ్యి తీసేసి వెంటనే లేచి దూరం జరిగాను......


" రేయ్ " అంటూ దగ్గరకు వస్తుంటే " నువ్వు దూరంగా ఉండు బుజ్జి " అని చెప్పాను.... నన్ను అనుమానంగా చూస్తూ " ఎందుకు " అనింది


" నువ్వు దగ్గర ఉంటే చలి జ్వరం వచ్చినట్టు ఉంది నాకు కొన్ని రోజులు దూరంగా ఉండు " అని అంటుంటే తను గట్టిగా నవ్వేసింది ఎంతలా అంటే తన కంట్లో నీళ్ళు వచ్చే అంతలా 


తన నవ్వు చూస్తుంటే అబ్బురంగా ఉంది నాకు.... అలాగే చూస్తూ వుండిపోయాను.... కాసేపటికి తేరుకుని " ఎంటి హగ్ కే ఇలా అయిపోతే మరి అసలు మ్యాటర్ కి ఏమ్ అయిపోతావ్ రా " అని కొంటెగా అనింది.....


తన మాటకు కళ్ళు పెద్దగ చేసాను నేను..... " బుజ్జి నువ్వేనా ఇది..... "

" ఏమ్ నేను అయితే మాత్రం మాట్లాడకూడదని లేదుగా " అనింది దగ్గరకు వస్తూ


తను వస్తుంటే నేను మళ్ళీ ఫ్రిజ్ మోడ్ లోకి పోతున్నాను.... " రేయ్ ఛా ఆపు ఇంకా 90స్ లో ఉండకు " అంటూ " సరే చెప్పు " అనింది 


" ఎంటి " 

" అదే రోజూ దేని గురించి అయితే నా వెంట పడుతున్నావో దాన్ని బయటపెట్టు " అనింది 


ఎందుకో అలా చెప్పాలి అనిపించలేదు స్పెషల్గా చెప్పాలి అనిపించింది.... కానీ రాగిణి కళ్ళలో నేను చెప్తాను అనే ఆశ కనిపిస్తుంటే చెప్పకుండా ఉండలేకపోయాను....


తన కళ్ళు చూస్తూ ఉంటే ధైర్యం వచ్చినట్టు అనిపించి ఒక అడుగు దగ్గరకు జరిగి " బుజ్జి " అని ప్రేమనంత ఒకేసారి పెట్టినట్టు పిలిచాను....


ఆమె నుంచి ఈసారి సిగ్గు తెరలు కనిపించి ఓరగా నన్ను చూసి తల దించేసింది.....


తన మొహం కనిపించకపోయేసరికి నేనే ఒక కాలు మడిచి ఇంకో కాలును బ్యాలన్స్ చేసుకుని కింద కూర్చున్నట్టు మోకాలి మీద కూర్చుని ఆమె మొహం లోకి చూస్తూ..... నా కుడి చేయి ముందుకు చాచి" ఈ చేతిని పట్టుకుని నా మిగిలిన జీవితానికి నీ తోడును అందిస్తావా " అని అడిగేసాను....


నాకే తెలీదు అలా అడుగుతాను అని ఈ వన్ ఇయర్ లో ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసాను ఎలా ప్రపోజ్ చేయాలి అని కానీ ధైర్యం లేక ఆగిపోయాను..... ఇప్పుడు అసలు ఏమ్ చెప్పాను.... ఏమో.....  అంటారు కదా నిజంగా ప్రేమ ఉంటే భాష అవసరం లేదు భావం తప్పా.... ప్లేస్ అవసరం లేదు వాళ్ళు ప్రేమించిన వాళ్ళు తప్పా అని.... ఇప్పుడు అదే జరిగింది అనిపించింది నాకు


తను ఏమ్ అనుకుంటుంది అని ఆలోచించలేదు చెప్పేశాను కానీ టెన్షన్ మొదలైంది ఒకవేళ ఇప్పుడు తను కాదు అంటే  నా పరిస్థితి అని అనుకున్నంతలో తన సుకుమారమైన చేయి నా చేతిలో పెట్టి " నీ అడుగుకు నా అడుగు జత చేస్తాను " అని చెప్పింది

ప్రపంచం గెలిచిన ఫీలింగ్ నాది..... తనకు చెప్పలేను మూగ ప్రేమగా మిగిలిపోతుంది అనుకున్న నా ప్రేమ ఈరోజు తనకి చెప్పడం తను ఒప్పుకోవడం..... కలలో కూడా జరుగుతుంది అనుకోలేదు..... ఈ సంతోషం తట్టుకోలేకపోతున్నాను......

వెంటనే తనను ఎత్తుకుని గిర గిర తిప్పేసి గట్టిగ హగ్ చేసుకున్నాను.... ఇంకా ఆనందం ఎక్కువగా అనిపిస్తుంటే.... మొహం అంతా ముద్దులు పెట్టేసాను..... తరువాత మొదటి సారి అతి కోమలమైన మృదువైన అంత కంటే సున్నితమయిన తన పెదాలు అందుకున్నాను....


ఇద్దరికీ ఇది తొలి ముద్దు ఎలా పెట్టాలో తెలీదు ఏమ్ చేయాలో తెలీదు ఎవరికి వారము పెదాలు కదుపుతున్నాం.... రెండు నిమిషాలకు అనుభవం వచ్చినట్టు ఓకే విధంగా సాగాయి మా జత పెదాలు.... తన కింద పెదవితో నేను ముచ్చట్లు పెడుతుంటే నా పై పెదవితొ తను ఆటలు ఆడుతుంది..... మా జత జంట పెదవులు కోడే నాగుల సయ్యాటల సాగుతున్నాయి.... ఎప్పుడు చేరిపోయిందో నా హైట్ కి తను సరిపోక నా కాళ్ళ మీదకు ఎక్కేసింది.....


కొత్త బిచ్చ గాడికి పొద్దు ఎరగదు అన్నట్టు అరగంట అయిన మా పెదాలు వీడలేదు.... ఇప్పుడు కొత్త పోయి ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటే..... తన యవ్వన గిరులు నా గుండెకు గట్టిగ అదుముకున్నాను.... " ఆహ్ " అని సన్నగా మూలిగింది తను.... ఈసారి ఆ సౌండ్కి నాలో వేడి పుట్టినట్టు నడుము మీద చేతులు బిగించి పట్టుకుని కొంచం లిఫ్ట్ చేసి తన కాళ్ళను నా నడుము చుట్టూ వేయించుకున్నాను.....


నాకే ఆశ్చర్యం ఇందాక తెగులు వచ్చిన కోడిలా వనికిన నేనేనా ఇప్పుడు తనతో అంత చనువుగా ఉంది అని...


తను కూడా కాళ్ళతో నన్ను చుట్టి ఒక చేతిని నా జుట్టులో పెట్టీ ఇంకో చేతితో నా మెడను పట్టుకుంది గట్టిగా.... తన నుంచి ఆ కోఆపరేషన్ ఊహించలేదు నేను..... కానీ తను అల ఇచ్చేసరికి తన నడుము మీద ఉన్న నా ఎడమ చెయ్యి తన ఎద మీదకు తీసుకుని వెళ్లి చిన్నగా నొక్కను.... తన పెదవుల కదలిక ఆగిపోయింది ఆమె చేతి పట్టు నా మీద పెరిగింది ఒక్కసారిగా జర్క్ ఇచ్చినట్టు గా కదిలింది.... నాది కూడా అదే పరిస్థితి ఎప్పుడు ముట్టుకోని ఆ సొగసుల స్పర్శ తెలిసేసరికీ తెలీకుండానే ఇంకా గట్టిగా నొక్కాను..... 

ఈసారి బాధతో అరిచింది రాగిణి.... అప్పటికి కానీ ఈ లోకం లోకి రాలేదు ఇద్దరం.... చప్పున తనని దింపి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను..... ఇంటికి వెళ్ళలేదు....  నాకు మాత్రమే తెలిసిన ఊరి చివర ఉండే ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళాను.... ఎంత ఒద్దు అనుకున్న ముద్దే గుర్తిస్తుంటే..... నిలబడలేక కూలబడి పోయాను....


ఏవేవో ఆలోచనలు తప్పు చేశానా.... కాదు మా ప్రేమకు మొదటి గుర్తు.... కానీ ముద్దుతో ఆగల్సింది...... నాకే ఇలా ఉంటే మరీ బుజ్జి అనుకోగానే వచ్చిన దారిలోనే పరిగెత్తాను.....


ఎంత వేగంగా అంటే 10 నిమిషాల దూరాన్ని 5 నిమిషాల్లో చేరుకునేంత.... డైరెక్ట్ గా ఇందాక ఉన్న రూమ్ లోకి వెళ్ళాను.... నేను వదిలినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది....

గబుక్కున తనను చేరి " బుజ్జి " అని ప్రేమగా పిలిచి తల ఎత్తాను....

----------------------------


  • తదుపరి భాగం చదవండి