Featured Books
  • వసంతకేళి –హోళి!

    వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త స...

  • క్షమించు (ప్రేమ కథ)

    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" ఎనిమిది సంవత్సరాల కిందట...

  • మనస్సు మెచ్చిన మగువ

      "అమ్మా వెళ్ళొస్తా! అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బ...

  • అలసిన అరుగులు

    పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగ...

  • కలల కడలి

    నా పేరు శివ నేను ఒక ట్రవెల్లెర్ ని. ఎక్కడ మంచి ప్లేస్ వున్నా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షమించు (ప్రేమ కథ)

"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" ఎనిమిది సంవత్సరాల కిందట మొదలైన ప్రశ్న. ప్రేమలో ఉన్నప్పుడు పదే పదే అడగాలనిపించిన ఒకే ఒక్క ప్రశ్న.

"ఎందుకు అంత నమ్మకం లేకపోతే తనకి లవర్గా ఉండడం. నీకు ఎం తక్కువ, ఖచ్చితంగా ఇంకా మంచి లవర్ దొరుకుతాడు కదా?" అందరు అడుగుతూనే వుండేవారు నన్ను.
"నమ్మకం అయితే అందరికన్నా తన మీదే ఎక్కువ ఉంది. తనని నేను నమ్మినంత తను కూడా తనని నమ్ముండడు. తను అంటే చెప్పలేనంత ప్రేమ. ఇష్టం. ప్రాణం... అయినా ఎక్కడో ఒక చోట మనసుకి తను ప్రేమిస్తున్నాను అని చెప్తే విని అనందించాలనేే కోరిక"....

2016 , ఆగస్టు

ఇంజనీరింగ్ 1స్ట్ ఇయర్, అల్ ఉమెన్స్ కాలేజీ. భీమవరం.

"మీను, నువ్వు ఎవరిని ప్రేమించలేదా?" రూమ్ లో సరదాగా అడిగిన ప్రశ్న.
(మళ్ళీ గతాన్ని గుర్తు చేసింది. అది తెలిస్తే నన్ను చాలా జడ్జి చేస్తారు. ఇప్పుడు తను ఎలా వుండి ఉంటాడో. నన్ను క్షమించి వుంటాడా? నన్ను మార్చిపోయుంటాడా? తెలిసి తెలియని వయస్సులో ప్రేమ మిగిల్చే జ్ఞాపకాలు ప్రతీసారి అందంగా ఉండాలని లేదు.) నా ఆలోచనలు రెండేళ్ల క్రితం ఇంటర్ చదువుతున్న రోజుల లోకి వెళ్లిపోయాయి.

"మీనుకి ఖచ్చితం గా లవర్ వుండే వుంటాడు. మన అందరిలోకి మీను చాలా యాక్టివ్" పక్కన రూమ్ మేట్ మాటలకి ఎలా బదులు ఇవ్వాలో తెలీలేదు.
"చెప్పడం ఇష్టం లేకపోతే ఎందుకు ఫోర్స్ చేస్తారు తనని" స్పందన నన్ను వెనకేసుకొని వచ్చింది. (స్పందన చాలా భిన్నం అయిన మనస్తత్వం కలిగి వుంటుంది. అందరిలా చిన్న చిన్న విషయాలకు జడ్జి చేయదు. చాలా విషయాలలో మేము ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నం అనిపిస్తుంది. అందుకే అనుకుంటా, తను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది పరిచయం అయిన కొన్ని నెలలకే.)
స్పందన మాటలకి ఒకోక్కరు ఒక్కో ఎక్రెషన్ ఇచ్చారు.
ఇంక ఏదో ఒకటి చెప్పాల్సిందే. తప్పదు. ఈ రోజుకి ఎలా ఐనా తప్పించుకోవాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆలోచిస్తుంటే గుర్తొచ్చాడు మా అత్త వాళ్ళ అబ్బాయి ప్రమోద్. అత్త వాళ్ళ అబ్బాయి అనే కంటే కూడా నా ఫస్ట్ క్రష్ అన్నొచ్చు. సినిమాల ప్రభావం అనుకుంటా చిన్నప్పటి నుంచే "ప్రేమ" అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది. నా జీవితం లో మొట్ట మొదటి సారి ప్రేమ అనే పదం విన్నది ప్రమోద్ నోట నుంచే.
---- చిన్న ఫ్లాష్ బాక్ ---
అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతూ వుంటాను... మా కుటుంబం అంతా కలిసి ట్రెయిన్ లో తిరుపతి వెళ్తున్నాం. ఒక వయస్సు వాళ్ళు కదా మాట్లడుకోండీ అని నన్ను, ప్రమోద్ ని లోవర్ సైడ్ బెర్త్ లో కూర్చోబెట్టారు. కొంచెం సిగ్గు, ఏం మాట్లాడాలో తెలియని కంగారు. కిటికీ లో నుంచి బయటకి చూస్తూ వుండిపోయాను. ప్రమోద్ మాత్రం నన్ను చూసి నవుతున్నాడు. చాలా అందగాడు అని చెప్పలేను. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఆలోచిస్తే కొంచెం కలర్ తక్కువే అని చెప్తనేమో. గానీ ఆ ఏజ్లో నిజంగా నాకే కాదు ఎవరికీ అందం గురించి గానీ ఫీలింగ్స్ గురించి గానీ ఏమీ తెలీదు.
"స్కూల్ ఎలా వుంది మీను? నువ్వు ఆ స్కూల్ ఏ కదా... చాలా స్ట్రిక్ట్ అంట కదా?" ప్రమోద్ అడిగాడు సూటిగా నా వైపు చూస్తూ. చిన్న నవ్వు తన పెదవుల పైనే ఇంకా వుంది. తను నవ్వుతున్నప్పుడు అందంగా ఉన్నాడనే చెప్పాలి.
"ఔను భావ" సిగ్గుగా అనిపించింది భావ అని పిలిచినప్పుడు. ఇప్పటికీ గుర్తొస్తే సిగ్గు గానే అనిపిస్తుంది. బుగ్గలు ఎర్రబడ్డాయి. అయ్యో, నేను కూడా ఇలా సిగ్గు పడగలనా?
కొద్ది సేపు మౌనం. ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం. కింద నుంచి పై వరకు. ఇద్దరికీ ఇదే మొదటిసారి ఇలా భావ అనే పిలుపు.
"మీ స్కూల్ లో ప్రేమ, ప్రేమ లేఖలు లాంటివి వుంటాయా? అంటే అది.. నేను చదివేటప్పుడు వుండేవి కాదు.. ఊరికినే తెలుసుకుందాం అని." తడపడుతూ , నేను ఏం అనుకుంటానో అనే ఒక చిన్న బిడియంతో, చిలిపి నవ్వు నవ్వుతూ అడిగాడు ప్రమోద్.
ఒకసారి నేను ఏం విన్నానా అని నాకే కొత్తగా అనిపించింది. ప్రమోద్ ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడా? అదీ నాతో? నిజంగా ఇది నిజమా? ప్రేమ అనే పదం డైరెక్ట్గా కూడా వినడం ఇదే మొదటిసారి.. ఏం చెప్పాలి? ఇంతకీ ఏం అడిగాడు.. వినపించలేనట్టు వుండిపోదమా? ప్రపోజ్ చేయలేదు కదా ... క్యాజువల్ గానే ప్రశ్న అడిగాడు... మీను, ఏదో ఒకటి చెప్పు... చెప్పు మీను......
"మీను, ఇలా రా .. వచ్చి భోజనం చేయు" మా అమ్మ పిలిచేసరికి సమాధానం ఇవ్వకుండానే లెగిసిపోయాను...
తరువాత ఆ ట్రిప్ లో ఇంక మాట్లాడుకునే అంత టైం దొరకలేదు.. నేను ప్రమోద్ వైపు చూసినా, తాను నా వైపు చూడలేదు... లేదా ఇద్దరం ఒకేసారి ఒకరిని ఒకరం చూసుకోలేదు అని కూడా అనుకోవచ్చు...
కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాం. గానీ తను పెద్ద అయిపోయాడు అనుకుంటా.. నాతో కనీసం మాట్లాడం కాదు కదా, నా వైపు కూడా చూడలేదు.
-------
ఇంక తప్పేదేమీ లేక చెప్పాను నా ఫ్రెండ్స్కో తియ్యటి అబ్బద్ధం
"నన్ను కొంతమంది ప్రేమిస్తున్నారు అనుకోండి. వాళ్ళలో ఎక్కువ సంవత్సరాల నుంచి వెంటపడ్తున్నది మాత్రం ఒకే అబ్బాయి. మా అత్త కొడుకు ... పేరు ప్రమోద్"
అందరు "అహా....." అంటూ సౌండ్లు చేశారు.
"మరి నీ సంగతి ఏంటి మీను, నీకు ఇష్టం లేదా తను అంటే?" మళ్ళీ ఒక కొత్త ప్రెశ్న.
"తను వట్టి బోర్ టైప్. నాకు నచ్చలంటే తను సరిపోడు." ఇది ముగించాలి అనే విధం గా చెప్పాను సమాధానం. గానీ నాకు అప్పటికి తెలీదు భవిష్యత్తు నా కోసం ఏం ప్లాన్ చేసింది అనేది.

                                                                                                                                                                      - టూ బీ కంటిన్యూడ్