Read Vaishali - 1 by RED BULL in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వైశాలి - 1

వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు నీకే తెలుస్తుంది. బీటెక్ పూర్తీ చేసి పెళ్లి చేసుకుని మొగుడితో సంతోషంగా జీవిస్తుంది. భర్త చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వైశాలి మాత్రం కాలీగా ఇంటిదగ్గరే ఉంటూ ఇంటిపని చూసుకుంటుంది. వైశాలి ఉండే ఇల్లు టెర్రస్ మీద రేకుల ఇల్లు. దానికి అద్దె 6 వేలు ఓనరు వచ్చి రెంటు అడిగాడు  వైశాలీ భయం భయంగా పీల గొంతుతో ఎలా ఐనా ఈరోజు సాయంత్రానికి రెంటు ఇచ్చేస్తానండి అనింది వైశాలి. రోజు ఇలాగే చెప్తున్నావ్ ఈరోజు సాయంత్రానికి ఇవ్వకపోతే రాత్రికి వస్తా అప్పుడైనా ఇస్తావా అన్నాడు ఓనరు. ఓనరు మనసులో ఉద్దేశం ఏమిటో వైశాలికి అర్ధమయింది కానీ ఏమీ అనలేక రాత్రికి వద్దులెండి సాయంత్రానికి నేనే తీసుకొచ్చి ఇస్తా అనింది వైశాలి. ఎలా ఐనా సాయంత్రానికి రెంట్ ఇవ్వాలని మనసులో అనుకునింది కానీ సాయంత్రానికి డబ్బు ఎలా వస్తుంది అని బాగా అలోచించి చేతికి ఉన్న బంగారు ఉంగరం అమ్మేయాలని ఇంటికి తాళం వేసి అలా మార్కెట్ కి వెళ్లి ఎక్కడ అమ్మాలా అని రోడ్డుపక్కన నిలబడి షాపుకోసం వెదుకుతుంది. ఇంతలా తన స్నేహితురాలు సుభద్రని చూసింది వైశాలి. ఇదేంటి ఇక్కడుంది దీనికి కనిపించకూడదు అని తల దించుకుని సైలెంట్ గా ఓ బస్సు చాటుకి వెళ్లి నిలబడింది వైశాలి. సుభద్ర కూడా వచ్చి అదే బస్సు పక్కన నిలబడి వైశాలిని  చూసింది. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.  సుభద్ర వైశాలిని చూసి ఆశ్చర్యంగా  వైశాలి నువ్వెంటి ఇక్కడ ఎన్నేళ్లయింది నిన్ను చూసి, అసలు ఏమై పోయావ్ ఇన్నేళ్లు, ఎక్కడున్నావ్, అని అడిగింది ఇద్దరిమధ్య కుశల ప్రశ్నలు, పాతజ్ఞాపకాల ముచ్చట్లు అయ్యాక.. అప్పుడు సుభద్ర చెప్పుకొచ్చింది.. పనిమీద ఊరెళ్ళివస్తున్నానే.. నేను బస్ దిగేసరికి రెడీగా ఉండమనిచెప్పా మా ఆయనికి.. బస్ దిగి పావుగంట అయింది వస్తాడేమో అని పావుగంటనుండి బస్టాప్ లోనే నిలబడిఉన్నా ఐనా రాలేదు.  అసలు ఈ మగాళ్ళకి పెళ్ళాం తప్ప  మిగతావన్నీ ఇంపార్టెంటే.  పెళ్ళాం పనంటే చాలు పట్టించుకోనే పట్టించుకోరు అంటూ విసిగిపోయింది సుభద్ర. పాపం మగాళ్ళన్నాక బోలెడు పనులుంటాయి మనమే చూసి చూడనట్లు సర్దుకుపోవాలి అనింది వైశాలి.. నాసంగతి అలా పెట్టు నువ్వేంటి వైసు  ఫోన్ నంబర్ మార్చేశావ పాతది కలవడం లేదు, బోలెడు సార్లు మెసేజ్ చేశా ఇన్స్టా, ఫేస్ బుక్ లలో ఒక్కదానికి కూడా రిప్లై లేదు. పోనీలే ఇన్నేళ్లకి లక్కీగా దొరికావు అనింది సుభద్ర.. అదేం లేదు సుభద్ర పెళ్లయ్యాక ఈ చాటింగులు మీటింగులు మీద పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది అనింది వైశాలి. ఏంటి నీకు పెళ్లయిందా వైషూ! ఎప్పుడు, ఎక్కడ, మరి నన్ను పిలవనేలేదు అంటూ షాకయ్యిమది సుభద్ర.. అదంతా త్వర త్వరగా జరిగిపోయిందిలే అనింది వైశాలి. అలా ఇద్దరు రోడ్డుపక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా ఒక ముష్టావిడ చంటిబిడ్డతో వచ్చి అమ్మా ఓ రూపాయి ఉంటె ఇవ్వండమ్మా చంటి బిడ్డ ఆకలితో ఉన్నాడు అని జాలిగా అడిగింది. చిల్లర లేదమ్మా అనింది వైశాలి, సుభద్ర మాత్రం పరుసులోనుండి వంద రూపాయల నోటు తీసిఇచ్చి ముందు పసిబిడ్డ తినడానికి బ్రెడ్డు, త్రాగడానికి పాలు కొను చాటుకెళ్ళి గుట్కా కొనుక్కుని తిని చావకు అని కోపంగా చెప్పింది సుభద్ర . నేను గుట్కా  తిననమ్మ అని  ముష్టావిడ వెళ్ళిపోయింది,  ఇంకేంటి వైషూ ఎక్కడ ఉండేది అని అడిగింది సుభద్ర.. ఇక్కడే ఈ పక్కనే అనింది వైషూ.. ఇన్నేళ్ల తరువాత కలిశాం నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు అనింది సుభద్ర. అబ్బా ఇలా తగులుకుందేంటి ఇది అని మనసులో అనుకుని వద్దంటే ఏమనుకుంటుందో ఏమిటోఅని  సరే రా మా ఇంటికి వెళదాం అనింది వైశాలి. అలా నడుచుకుంటూ ఇద్దరూ వైశాలి ఉండే అపార్టుమెంటు ముందుకి వెళ్లారు.. ఆ అపార్టుమెంట్ చాలా పాతది పైగా ఆ ఏరియాకుడా ఏమంత బాగోలేదు.. నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కి టెర్రస్ మీదకి వెళ్లారు ఇద్దరు. ఆ టెర్రస్ మీదే ఉంది రేకులషెడ్డుతో చిన్న ఇల్లు చూడ్డానికి చిన్నగా ఉన్నా ఒక బెడ్రూము,  ఒక హాలు అందులోనే కిచెనూ ఉన్నాయి. అది చూసి ఏంటి ఇలాంటి ఇంట్లో ఉంటుంది ఈ పిల్ల అని మనసులో అనుకునింది  సుభద్ర. కూర్చోవడానికి సోఫాలు లేవు కనుక ఒక కుర్చీ ఇచ్చి అందులో కూర్చోమని గ్లాసులో నీళ్లు ఇచ్చింది వైశాలి.. అవి తాగుతూ మీ ఇల్లు చాలా బావుంది చిన్నగా ఉన్నా అందంగా ఉంది అనింది సుభద్ర మొహమాటానికి,.. వైశాలి మాత్రం సాయంత్రానికి రెంట్ ఎలా అరేంజ్ చేయాలా అని మనసులో దిగులుపడుతూ మౌనంగా ఉంది..  సుభద్ర వైశాలి వైపు చూసి వైషూ నువ్వు కొంచెం సన్నబడ్డావే.. చూడ్డానికి అప్పటికంటే ఇప్పుడే చాలా బావున్నావ్ అనింది సుభద్ర .  నన్ను చూడు కాలేజీలో సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు డ్రమ్ములా అయ్యా అనింది సుభద్ర. వైశాలి ఆ పొగడ్తకి చిన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చి మౌనంగా ఉంది. నీకు గుర్తుందా వైసు మన కాలేజీ రోజుల్లో నీకెంత ఫాలోయింగు ఉండేదో క్రొత్తగా ఫస్టియర్లో జాయినయ్యిన కుర్రాడి దగ్గరనుండి ఫైనలియ్యర్ వాడి వరకు అందరూ నీకు సైటు కొట్టేవారే నేను నీ పక్కనే తిరుగుతున్నా మమ్మల్ని ఎవడూ దేకడే.. అది కాదుగాని ఆ లెక్చరర్ పాండు రంగారావు గారైతే మరీను ఆయని భార్య చనిపోయిందిపైగా ఇద్దరు పిల్లలు . ఆ పిల్లల కోసం మరలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అందుకే వైశాలిని చేసుకుందామనుకుంటున్నా నువ్వే ఎలాగోలా సెట్ చెయ్యాలి అని రోజూ నాతో చెప్పుకునే వాడు.. పాపం నువ్వంటే పడి చచ్చిపోయేవాడనుకో.. నాదగ్గరకొచ్చి నీ ఫ్రెండ్ కి నువ్వైనా చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటా అని నస పెట్టేవాడు. ఓ రోజూ ఆయని నస భరించలేక నాకు పిచ్చ కోపం వచ్చి “సార్ మీకసలు బుర్ర పనిచేస్తుందా వైశాలి కోసం ఈ కాలేజీలో ఉన్న ప్రతి కుర్రాడు పడిచస్తుంటే పోయి పోయి నీలాంటి రెండో పెళ్ళివాన్ని ఎలా చేసుకుంటుంది” అని గట్టిగా ఇచ్చేసా అప్పటి నుండి ఆయనిపోడు కొంచెం తగ్గింది. అంటూ చేతిలో ఉన్న గ్లాసు పక్కన పెట్టి రేకుల ఇంట్లో ఉక్కపోసినట్టు అనిపించి అలా బయటికొచ్చి చుట్టూ విశాలంగా కనిపిస్తున్న సిటీని చూస్తూ అబ్బా టెర్రస్ మీద ఇల్లు ఎంత బావుంటుందో అనింది సుభద్ర.. మా ఆయనికి కూడా అదే ఇష్టం అందుకే ఇలా పెంట్ హౌస్ తీసుకున్నాడు అనింది వైశాలి ఏం చెప్పాలో తెలియక. అన్నట్టు మీ వారి ఫోటోస్ చూయించవా నాకు, నీ పెళ్ళికెలాగూ పిలవలేదు, కనీసం మీ పెళ్లి ఆల్బమైనా చూయించు అనింది సుభద్ర.. సరిగ్గా అప్పుడే వైశాలి భర్త వచ్చాడు, వైశాలి , సుభద్రలని  చూసి షాకయ్యి నిలబడిపోయాడు. సుభద్ర అతన్ని చూసి షాకయ్యింది. షుమారుగా ఆరేళ్ళ క్రితం..