Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నెవెర్ జడ్జ్ ఏ Women - 5





మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.


ఒక వైపు టెర్రరిస్ట్స్ అటాక్స్ ఎలాగైనా ఆపాలి, మరోవైపు ఆర్మీ లో ఈ Scam. అందులో మొదటిది ఎంతో ముఖ్యమైంది అని నాకు బాగా తెలుసు. . హైదరాబాద్ లో కచ్చితంగా హేమంత్ సార్ ఉండాలి. 


అందుకే నేనే రష్యా వెళ్ళాలి అనుకున్న. నా పని కేవలం అక్కడికి వెళ్లి ఎవరికీ తెలియకుండా ఫొటోస్ తీయడం మాత్రమే అని మరి మరి చెప్పారు సార్.


సార్ కి నన్ను ఒక్కదాన్నే పంపించడం అస్సలు ఇష్టం లేదు కానీ ఇంకోదారి లేదు అని మాకు బాగా తెలుసు. నేను ఈ పని చేయగలను అని చాలా గట్టిగా నమ్మారు. 


"ఒకరు మనల్ని అంతగా నమ్మితే ఆ నమ్మకం కోసం ఎంత కష్టమైనా,ఎంత దూరం వెళ్లైనా ఆ పనిని  సాధించాలి  అనిపిస్తుంది. అందుకే నాకు ఆ పని పెద్ద కష్టం అనిపించలేదు".


ఒక్కసారి మేము సాక్ష్యాలు సంపాదిస్తే తరువాత ఏమి చేయాలో సార్ కి బాగా తెలుసు. అందుకే ఎప్పుడు తొందర పడలేదు. 


నేను రష్యా వచ్చిన తరువాత హేమంత్ సార్ హైదరాబాద్ వచ్చారు. 


నేను రష్యాలో మొదటి రెండు రోజులు ఆ కంపెనీ గురించిన వివరాలు తెలుసుకున్న, అక్కడికి ఎవరెవరు వస్తూఉంటారు, ముఖ్యమైన వారు ఎవరు ,మరియు ఆ బిల్డింగ్ ప్లాన్ గురించి తెలుసుకున్న. 


ఆ కంపెనీ పేరు “Anna Defense " ఆ కంపెనీ అసలు CEO అన్న ఇవాన్ (ANNA Ivan).  అతడిని బెదిరించి అక్కడి మాఫియా ఎంపరర్(Emperor) దిమిత్రి, అతని కంపెనీ ద్వారా చాలా అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు, అక్కడ అతనికి తిరుగు లేదు. 


మన దేశానికి రష్యాతో ఉన్న స్నేహబంధాల వాళ్ళ ఈ ప్రాజెక్ట్ ఆ కంపెనీ కి వెళ్ళింది. కానీ ఈ విషయంలో జరిగిన అవకతవకల గురించి అక్కడికి ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ప్రభుత్వానికి కానీ తెలియదు. 



అవి తెలుసుకోవడానికి నేను లోపలికి వెళ్లడం ఒక్కటే మార్గం అని నాకు అనిపించింది,ఎందుకంటే దివాకర్, దిమిత్రి మీటింగ్ జరిగేది ఇక్కడే కాబట్టి . ఆ రోజే లోపలికి వెళ్లుదాం అనే సమాయలంలోనే మంత్రి దివాకర్ కూడా అక్కడికి వచ్చాడు.


 అతని కార్ ని చెక్ చేసే సమయంలో అతనికి తెలియకుండా దివాకర్  కార్ కింద ఉండి లోపలికి వెళ్ళాను. 



దిమిత్రి మనుషులు కొంత మంది వచ్చి దివాకరుని లోపలికి తీసుకొని వెళ్లారు. కానీ నేను లోపలికి వెళ్ళాలి అంటే కచ్చితంగా Access కార్డు ఉండాలి. ఎలాగైనా లోపలి వెళ్ళాలి!!!.


అప్పుడే లోపలికి వెళ్తున్న ఒక అమ్మాయిని స్పృహ కోల్పోయేలాగా కొట్టి తన దగ్గర నుంచి కార్డు, డ్రెస్ తీసుకున్న. తను మైంటెనెన్సు(Maintenance) డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది అని డ్రెస్ చూస్తే తెలిసింది.ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసాను. 


ఒక స్పెషల్ మీటింగ్ రూములో దివాకర్, దిమిత్రి మరొకరు ఉన్నారు. అక్కడికి వెళ్లడం కష్టం అని నాకు బాగా తెలుసు. ఆ బిల్డింగ్ ప్లాన్ ముందుగానే చుసిన నాకు వేరే మార్గం దొరకలేదు ఒకే ఒక్క మార్గం తప్ప!!!


AC వెంటిలేటర్ ద్వారా!! వాళ్ళ రూమ్ దాకా వెళ్ళాను. వాళ్ళు మాట్లేడేది విన్నాను, రికార్డు చేశాను. 


దిమిత్రి, దివాకర్ సంభాషణ : 


దిమిత్రి: మరో 2 రోజుల్లో మేము ఇండియాకి వస్తున్నాం, మనం మొదట పంపించిన శాంపిల్ ఆర్మీ జాకెట్స్, Indian ఆర్మీ ఓకే చేసింది, అధికారంగా 1.2లక్షల జాకెట్స్ ఆర్డర్ మీద ప్రధాన మంత్రి ఆమోదంతో, ఆర్మీ చీఫ్ దాని మీద సంతకం పెట్టనున్నారు. అంతవరకు ఎటువంటి పొరపాటు జరగకుండా చూడాలి.


దివాకర్: కానీ ఇంతకీ అసలు ఆ పొరపాటు చేసింది ఎవరు?


దిమిత్రి: హాహా, పరిచయం చేయలేదు కదా, నువ్వు రావాలనే ఆగాను. వాడిని నీ ముందే గౌరవిస్తా చూడు.


*“అన్న"  కంపెనీకి 1.2 లక్షల జాకెట్స్ తాయారు చేయడానికి ఒప్పందం చేసుకుందాం అనుకుంటుంది ఇండియన్ ఆర్మీ, కానీ ముందస్తుగా ఒక 10 వేల జాకెట్స్ ను క్వాలిటీ టెస్టింగ్ కోసం తాయారు చేయమన్నారు. అది నచ్చితే ఒప్పందం కుదుర్చుకుందాం అనుకుంటారు. 


కానీ తయారు చేసే సమయంలో ఒక వ్యక్తి తెలియకుండా నాసిరకం జాకెట్స్ సెట్ ఒకటి ఇందులో కలిపేస్తాడు. అది ఎవరు పట్టించుకోరు. దిమిత్రి టీం నాసిరకం జాకెట్స్ తయారు చేసి దాని ద్వారా లాభాలు సొమ్ము చేసుకుంటున్నారు కొంత కాలంగా !!! 

* ఆర్డర్ ఓకే అయినా తరువాత 60% పైగా నకిలీ జాకెట్స్ పంపిద్దాం అనుకుంటారు, ఆలా అయితే ఎవరికీ అనుమానం రాదు అని. 


ఆ తప్పు చేసినవాడిని దివాకర్ ముందకు తీసికొనివచ్చి చంపేస్తాడు దిమిత్రి.


దిమిత్రి: నా దగ్గర తేడా వస్తే ఎలా ఉంటుందో అందరికి తెలియాలి మిత్రమా. 


గౌరవించడం అని చెప్పింది దీని గురించా అనుకుంటాడు దివాకర్.


దివాకర్: నీ దగ్గర తేడా ఎందుకు జరుగుతుంది, అంత తప్పు ఎందుకు చేస్తారు? ప్రాణాల మీద ఆశ ఉన్నవాడు ఎవడు చేయడు (లోపల కొంచెం బయపడుతాడు దివాకర్) 


దిమిత్రి: ఈ డీల్ OK ఐతే మనకి 300 క్రోర్స్ లాభం, డీల్ అయిపోయిన తర్వాత నీ వాటా నీకు చెందుతుంది.


దివాకర్: కానీ మనం చంపినా అబ్దుల్ హత్య కేసు విషయం లో అక్కడి పోలీస్ ఆఫీసర్ హేమంత్ కి సహాయ పడుతున్నాడు. శర్మ కేసు విషయం కూడా అతనే చూసుకుంటున్నాడు, మంచి విషయం ఏమిటి అంటే హేమంత్ కి ఇప్పటివరకు ఎటువంటి ఆధారం దొరకలేదు. 


దిమిత్రి: అబ్దుల్ చంపింది ఎవరో తెలుసుకునే అంత  వరకు వాడు మన దాకా రాలేడు .. అయినా దీని గురించి నేను ముందుగానే ఆలోచించాను..ఇంతకీ ఆ రిపోర్టర్ దొరకలేదా?? 


అప్పుడే దిమిత్రి ఒక కాల్ వస్తుంది, అది చాలా ముఖ్యమైంది అని దివాకర్ ని కూడా అతనితో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. 



తను వచ్చిన పని ఐపోయింది అని తెలిసి, అక్కడి నుంచి మౌనిక బయటకు వెళ్తుంది, వెళ్లే సమయంలో అక్కడ ఒకతను తనని గమనించి ఆపుతాడు. అతన్ని కొట్టి ఎవరికీ తెలియకుండా మౌనిక వెళ్ళిపోతుంది 


దివాకర్ కార్ లో బయటకి వెళ్లిన దిమిత్రి కారులో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాడు.


దిమిత్రి:శర్మ దగ్గర మనకి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు దొరకవు కాబ్బటి పోలీస్ ఆఫీసర్ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు.


కానీ హేమంత్ ఈరోజు కాకపోయినా రేపు ఐన దీని గురించి కనిపెడతాడు, ఇన్ని రోజులు వాడిని నేను తక్కువ అంచనా వేసా. కాబట్టి వాడు బతకడానికి వీలు లేదు.. అంతా చల్లబడిన తరువాత ఆ పోలీస్ వాడిని కూడా చంపేయండి, చిన్న సాక్ష్యం అయినా మనకి అంతా మంచిది కాదు ఈ సమయంలో.


దివాకర్: కానీ హేమంత్ ని చంపడం అంత సులభం కాదు, అతన్ని ముందుగా వెళ్లి దెబ్బ కొట్టే వాడు ఎవడు లేడు. అతని గురించి నాకు బాగా తెలుసు.


దిమిత్రి: ఆ పని చేయడానికి నా దగ్గర ఒకడు ఉన్నాడు, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని ఉహించి వాడిని ముందే అక్కడికి పంపాను. అంతా వాడు చూసుకుంటాడు మీరు ఏమి చేయకండి. ఎవరికీ తెలియకుండా పని చేసేస్తాడు.


ఇంతకీ ఆ రోజు మనవాళ్ళని చంపి ఆ రిపోర్టర్ అమ్మాయిని కాపాడింది ఎవరు? 


దివాకర్: అతని గురించి ఎవరికీ తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ కూడా తెలియదు, అక్కడ CC TV Footage కూడా మనకి దొరక కుండా జాగ్రత్త పడ్డాడు వాడు. 


దిమిత్రి(బాగా ఆలోచిస్తూ): బలం, తెలివి రెండు ఉన్నవాడు ఆ అమ్మాయితో ఉన్నాడు, ఆ రెండు ఉన్నవాడు అయితే మన వాడు అయిఉండాలి. లేదంటే వాడే  లేకుండా ఉండాలి.. 


నాకు వాడి గురించి అన్ని వివరాలు కావాలి, రెస్టౌరెంట్ కి వచ్చాడు అంటే ఆ దగ్గర ఎక్కడ ఉండి ఉంటాడు. మన వాళ్ళని అక్కడే కొంచెం జాగ్రత్తగా వెతకమను. 


ఇన్ని రోజులు బయటకి రాలేదు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు, వాళ్ళకి సాక్ష్యాలు దొరకకముందే వాళ్ళ శవాలు దొరకాలి. 



అదే సమయంలో కంపెనీ లోపల ఇద్దరు క్రింద పడిపోవడం దిమిత్రి మనుషులు గమనించారు ముఖం మీద గాయాలు ఉన్నాయ్. వెంటనే సీసీ TV Footage గమనించారు. ఇది అంతా చేసింది ఒక అమ్మాయి అని తెలుసుకుంటారు. 


వెంటనే ఆమె ఫోటో దిమిత్రి కి పంపిస్తారు, అది దివాకర్ చూసి గుర్తుపడుతాడు. అంతటా వాళ్ళ మనుషులు తన కోసం చాలా సేపు నుంచి వెతుకుతున్నారు, అప్పటికే చాలా ఆలస్యం చేసారు అని వాళ్ళకి అర్ధం కాలేదు. మౌనిక ఎయిర్పోర్ట్ లో ఉంది అని సమాచారం వస్తుంది చివరకి.


దిమిత్రి: మనం వెతికే అమ్మాయి మన గురించి తెలుసుకొని, ఇంత దూరం వచ్చిందా? అంటే తనకి మన గురించి తెలుసు. అది ఈ దేశం దాటకముందే నాకు ప్రాణాలతో కావాలి. కచ్చితంగా మన గురించి తన దగ్గర ఏదో ఒక సమాచారం ఉండే ఉంటుంది. 



ఇంకోవైపు:  మౌనిక హేమంత్ సార్ కి ఫోన్ చేస్తుంది. ఆ సమయం లో హేమంత్ సార్ సుభాష్ తో ఉంటాడు హైదరాబాద్ లో (టెర్రరిస్ట్స్ గురించి సమాచారం వచ్చిన రోజు). అప్పటికి సమయం రష్యా లో ఉదయం 7 కావస్తుంది, తను airport లో ఉంటుంది.


 జరిగింది అంతా చెప్తుంది మౌనిక, తనని హైదరాబాద్ కి రమ్మని చెప్తాడు. కానీ ఆ సమయంలో Direct Flights లేకపోవడంతో లండన్ వెళ్తుంది మౌనిక. అక్కడనుంచి హైదేరాబద్ ఫ్లైట్ రాత్రి 12 కి ఉంది.


(*జరిగిన విషయం గురించి సుభాష్ కి చెప్పాలి అనుకున్నాడు హేమంత్ సార్ కానీ అదే సమయంలో టెర్రరిస్ట్స్ గురించి సమాచారం వస్తుంది, చెప్పకుండానే  వెళ్ళిపోతారు)


దిమిత్రి మనుషులు ఎయిర్పోర్ట్ చేరుకొనే సరికి, అప్పటికే రష్యా నుంచి వెళ్ళిపోయింది అని వాళ్ళకి తెలుస్తుంది. అన్ని ఫ్లైట్స్ సమాచారం తెలుసుకుంటారు, ఇండియాలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ కి తన ఫోటో పంపించారు, తను కనపడితే సమాచారం చెప్పడానికి. 


Mounika: సాక్ష్యాలు  స్వయంగా నా చేతుల మీదగా పీఎం గారికి ఇవ్వాలని అనుకున్నారు హేమంత్ సార్. అప్పటి వరకు మీడియాకి ఇవ్వద్దు అని చెప్పారు హేమంత్ సార్ . 


తరువాతే తెలిసింది హేమంత్ సార్ చనిపోయారు అని!!!


తరువాత నీకు ఫోన్ చేయడం అంతా నీకు తెలుసు. ఆలా జరిగింది అంతా చెప్తుంది మౌనిక. 


మౌనిక చేసిన పనికి మానస, హేమంత్ ఇద్దరు కొంచెం ఆశ్చర్యంతో అలానే ఉంటారు, మానస కి తెలియని భయం, కానీ ఎక్కడో లోపల తను చేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతుంది. 


కానీ సుభాష్ కి మాత్రం కొన్ని అనుమానాలు వస్తాయి. అవి స్వయంగా మౌనికనే అడుగుతాడు. 


సుభాష్ మౌనిక దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలు చూస్తాడు. అందులో ఒక తేడా కనిపెడతాడు. హేమంత్ సార్ తో మాట్లాడేప్పుడు మౌనిక బోర్డు మీద ఉన్న సమాచారాన్ని ఫోటో తీసుకుంటుంది. 


హేమంత్ సార్ చనిపోయిన తరువాత తన ఫోన్ లో అదే ఫోటో చూస్తాడు. కానీ రెండిటి మధ్య ఒకే ఒక్క తేడా ఉంటుంది, కింద ఒక సంఖ్య వేసి ఉంటుంది 13596. ఎంత ఆలోచించిన అది ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అదే విషయం మౌనికని కూడా అడుగుతాడు కానీ తనకి కూడా తెలియదు అంటుంది. 




సుభాష్: 1. నువ్వు ఇక్కడి వచ్చే దాకా నువ్వు, మీ అక్క ఒకేలా ఉంటారు అని మాకు తెలియదు, కానీ ఒకరికి మాత్రం తెలుసు. అది హేమంత్ సార్. తను ఎందుకు మాతో కానీ, నీతో కానీ చెప్పలేదు. ??


మౌనిక: నేను సార్ కి చివరగా ఫోన్ చేసినప్పుడు సాక్ష్యాల గురించి మాట్లాడాను, చివరగా నన్ను ఒక విషయం అడిగారు.


నేను హైదెరాబాద్ లో ఒక వ్యక్తి ని కలిసాను తన పేరు మానస, చూడడానికి నీలాగానే ఉంది అన్నారు.


మీరు అక్కని చూసారా? ఎలా ఉంది? తనతో ఏమైనా చెప్పారా నా గురించి? అని అడిగాను. తనని నేను బయట చూసాను, కానీ ఏమి మాట్లాడలేదు ఎందుకంటే తను నాకు తెలియదు కదా అన్నారు. చూడగానే అర్ధమైంది తను మీ అక్క గాని, చెల్లె అయ్యిఉండవచ్చు అని? అందుకే అడిగా అన్నాడు.

 *(హేమంత్ సార్ కావాలనే ఆలా చెప్తారు, అన్ని విషయాలు దాచింది అంటే ఏదో సమస్య ఉంటుంది అనుకున్నాడు, మానస గతంలో జరిగిన సంఘటనలు కూడా హేమంత్ సార్ కి తెలుసు, అందుకే జాగ్రత్త పడింది అనుకున్నాడు)


నా గురించి తనకి ఏమి చెప్పకండి సార్ కంగారుపడుతుంది, అక్కడికి వచ్చాక నేను చెప్తాను అని చెప్పా, కానీ అసలు విషయం గురించి, సుభాష్, మానస గురించి చెప్పలేదు సార్, వచ్చినతరువాత చెప్పుదాం అనుకున్నారు ఏమో? 

కానీ ఒక విషయం మాత్రం చాలా నమ్మకంగా చెప్పారు  "తను చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పాడు, కానీ ఆ సంతోషం వెనుక నువ్వు ఉంటావు అని మాత్రం చెప్పలేదు". 


(* హేమంత్ సార్ సుభాష్ ఇంటికి వచ్చిన రోజే తనకి అనుమానం వచ్చింది, అందులో మానస తన చెల్లి వచ్చాకే పెళ్లి అనడంతో సూర్యనే మౌనిక అని తనకి అర్ధం అవుతుంది). 


చెప్పకుండా దాచిపెట్టింది అంటే తన పని వల్ల అక్కకి ఇబ్బంది రాకూడదు అని అర్ధం చేసుకుంటాడు. అందుకే మౌనిక ఉద్యోగంలో చేరినప్పుడు కూడా ఎక్కడ అక్క గురించి సమాచారం ఇవ్వలేదు. 


సుభాష్: అంటే ఆరోజు మా మీద ఎటాక్ చేసిన వారు మా గురించి వచ్చిన వారు కాదు, మీ అక్కని చూసి నువ్వు అనుకోని మా మీద ఎటాక్ చేసారు. 


మౌనిక: మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు.?


మానస: అప్పుడు నాకు అనుమానం వచ్చి నీకు చేశా. నీ ఫోన్ పని చేయలేదు.


మౌనిక నిజమే అంటుంది 


సుభాష్: 2. రష్యాలో నీకు కావాల్సిన సాక్ష్యాలు సంపాదించిన తరువాత ఎందుకు మమ్మల్ని కలవాలి అని ఎందుకు అనుకున్నావు, మీడియాకి పంపంచు కదా. ?


మౌనిక: కేవలం నువ్వు మాత్రమే హేమంత్ సార్ కి మాట ఇచ్చావు అనుకుంటున్నావా(కొంచెం కోపముగా)? 


నేను కూడా మాట ఇచ్చాను హేమంత్ సార్ కి, ఈ సాక్ష్యాలు స్వయంగా PMO ఆఫీస్ కి ఇస్తాను అని చెప్పా, అదే కదా సార్ కూడా కోరుకున్నది. దానికి గల కారణం కూడా నాకు తెలుసు. 


సుభాష్ చాలా సంతోషిస్తాడు 


సుభాష్: "ఒక ఆర్మీ చేయాల్సిన పనిని మీ చెల్లి చాలా సులభంగా చేసింది, అది ప్రాణాలకి తెగ్గించి. ఇలాంటి ధైర్య, సాహసాలు ఉన్న  చెల్లి ఉన్నందుకు నువ్వు చాలా గర్వపడాలి" . 


"we are really proud of you for what you done for country and Indian Army”



జరిగింది అంతా అభిరామ్ సార్ కి చెప్పి PMO(Prime Minister Office) ఆఫీసులో అప్పోయింట్మెంట్(Appointment) కోసం ప్రయతించమని చెప్తాడు, అలానే అంటాడు అభిరామ్ సార్. 



చెప్పినట్లుగానే పీఎంవో ఆఫీసులో అప్పోయింట్మెంట్ తీసుకున్నారు అభిరామ్ సార్, దానికి ఒకరి సహాయం తీసుకోవాల్సివచ్చింది. వెంటనే సుభాష్ కి ఫోన్ చేసాడు అభిరామ్ సార్, అప్పుడు సమయం సాయంత్రం 5 కావస్తుంది. 


రేపు ఉదయం 10కి మన అప్పోయింట్మెంట్, 11 కి రష్యన్ కంపెనీ తో ఆర్మీ చీఫ్, PM మీటింగ్ ఉంది, అది జరగకుండా ఆపాలి అని చెప్తాడు అభిరామ్ సార్. 


అభిరామ్ పై అధికారులతో మాట్లాడి సుభాష్, మౌనిక ని తీసుకురావడానికి ఆర్మీ హెలికాప్టర్ సిద్ధం చేస్తాడు దానికి కొంత సమయం పడుతుంది అని తెలుసు, అదే విషయం సుభాష్ కి కూడా చెప్పాడు, ఉదయం 6 కి హెలికాప్టర్ సిటీ కి(ఆర్మీ కంటోన్మెంట్) వస్తుంది, మీరు అక్కడ నుంచి ఢిల్లీ రావాలి అని చెప్తాడు. 


అందరిని రెస్ట్ తీసుకోమని చెప్పి సుభాష్ తన రూంలోకి వెళ్తాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు. కానీ అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. 


టాటూ.. టాటూ 


అవును టాటూ. మౌనిక చూపించిన వీడియోలో దిమిత్రి మెడ మీద ఒక టాటూ ఉంది, అదే టాటూ కొన్ని రోజుల క్రితం సుభాష్, మౌనికని ఎటాక్ చేసిన వారి మీద కూడా ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది 


కానీ మౌనిక హైదరాబాద్ వచ్చిన తరువాత AMB మాల్ లో, బొటనికల్ గార్డెన్ లో కూడా ఇదే టాటూతో కొంత మంది కనిపించారు. అంటే వాళ్ళు మౌనిక ని ఫాలో చేస్తూ వచ్చారు. కచ్చితంగా ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో చేస్తూ ఉండవచ్చు అని అనుకుంటాడు. 


వెంటనే హేమంత్ ని పిలిచి అంతా చెప్తాడు. ఒకవేళ తను కనపడితే వెంటనే చంపేయాలి కానీ ఎందుకు ఫాలో చేసారు. 


సుభాష్: డైరెక్టుగా హైదరాబాద్ వచ్చింది అంటే తన వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకొని అందరిని చంపేద్దాం అని అనుకుంటున్నారు. 


హేమంత్: మరి ఇంకా ఎందుకు ఆగారు?


సుభాష్: నా అంచనా కరెక్ట్ ఐతే, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటారు, చీకటి పడాలని ఎదురు చూస్తున్నారు "ఒకడిని చంపడానికి చీకటి ఇచ్చే అవకాశం, బలం ఎవ్వరు ఇవ్వలేరు ". (వాళ్ళు ఏమనుకుంటున్నారో చెపుతాడు)


హేమంత్ ని బయటకి వెళ్లి చుట్టుప్రక్కల గమనించు ఏదైనా కారు కొత్తగా, అనుమానంగా ఉందేమో చూసిరా అని పంపిస్తాడు. సుభాష్ అనుమాన పడ్డట్టుగానే కొంతమంది ఉన్నారు, సుభాష్ ఇంటికి కొంచెం దూరంలో. 


హేమంత్: మరి పోలీస్ వాళ్ళని పిలుద్దామా ?


సుభాష్: వీళ్ళని పోలీస్ వారు తీసుకువెళ్లి ఎం చేస్తారు? ఏమి చెయ్యరు ? సాక్ష్యాలు కూడా సరిపోవు. నా దగ్గర ఇంకో మార్గం ఉంది. 


హేమంత్ కి అర్ధం అవుతుంది సుభాష్ గట్టిగానే పథకం రచించాడు అని. 


సుభాష్ అప్పుడే ఒక వ్యక్తికి కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. 


అనుకున్నట్టు గానే చీకటి పడింది. రాత్రి 11 కావస్తుంది, అందరూ పడుకున్నారు, చుట్టుప్రక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది. 


"చీకట్లో అందరికీ వాళ్ళ లోపల ఉన్న భయాలు కనపడుతాయి, కానీ సుభాష్ కి మాత్రం ఆ చీకట్లో తన ఎదురుగా వచ్చే శత్రువు ఓటమి కనబడుతుంది". 


కిటికీ (window) దగ్గర నుంచి ఆలా ప్రకృతిని చూస్తూ ఉన్నాడు సుభాష్. సమయం 11 దాటింది. 


అప్పుడే ఒక నల్ల కారు సుభాష్ ఇంటి వైపుగా వచ్చి ఆగింది. కారులో నుంచి ఆరుగురు బయటకి వచ్చారు, వారందరు ఇక్కడి వారు కాదు, నల్ల రంగుల దుస్తులు వేసుకొని ఉన్నారు, మొఖాలు కూడా కనపడకుండా మాస్క్ వేసుకున్నారు. (Russians). 


అదే సమయంలో అకస్మాత్తుగా  MLA నర్సింగ్ అతని మనుషులతో అక్కడికి వస్తాడు. రష్యాన్స్ మీద కాల్పులు జరిపారు నర్సింగ్ మనుషులు, అక్కడే ఇద్దరు Russians చనిపోయారు. అది గమనించిన వాళ్ళ నాయకుడు Andrew కోపంతో బయటకి వచ్చి నర్సింగ్, వాళ్ళ మనుషులు అందరిని చంపేస్తాడు. 


ఇది జరుగుతుంది అని సుభాష్ ముందే ఉహించాడు. అసలు ఏమి జరిగింది అని హేమంత్ అడుగుతాడు. సాయంత్రం సుభాష్ నర్సింగ్ కి ఫోన్ చేసి.


సుభాష్: నీ వీడియో నీకు ఇచ్చేస్తా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద నాకు ఒక సహాయం నువ్వు చేయాలి. ఒకే ఒక్క సాయం !!


నర్సింగ్: నీకు నేను సహాయాం? నిన్ను నేను ఎలా నమ్మాలి?


సుభాష్: నీలాగా రాజకీయ నాయకుడిని కాదు..సైనికుడిని !!


నర్సింగ్: సరే ఏమి చేయాలి చెప్పు.?


సుభాష్.: కొత్తగా నువ్వు చేయవలసింది ఏమి లేదు, ఎప్పుడు చేసేదే, నాకోసం ఒకడిని చంపాలి. 


నీకు ఒక లొకేషన్ పంపుతా అక్కడికి నువ్వు రావాలి, తరువాత నీకు మళ్ళి ఇంకో మెసేజ్ చేస్తా అప్పుడు నేను చెప్పిన వాడిని నువ్వు చంపాలి. 


నర్సింగ్: ఎవరు?


సుభాష్: కచ్చితంగా మంచివాడు అయితే కాదు. 


నర్సింగ్: సరే, నేను వస్తా. నిన్ను నమ్ముతున్నాను. 


హేమంత్: అంటే వాడిని వదిలేస్తావా?? సుభాష్ చిన్నగా నవ్వుతాడు. 


సుభాష్: వదిలేస్తాను, వాళ్ళకి, వల్లే వాడిని చంపేస్తారు. 


జరిగింది చెప్తాడు సుభాష్ హేమంత్ కి.