Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నువ్వేనా..నా నువ్వేనా.. 2


ముందు భాగాలు చదివిన తర్వాత రెండవ భాగం చదవండి..


నిన్న....


అందరు పొద్దునే టిఫిన్ చేస్తున్నారు..


మామయ్యా నిన్న కాలేజీకి విజయ్ రాలేదు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అని ఇరికిస్తుంది హాని (రేణు నీ హాని అని పిలుస్తారు)..


పేరుకి హనీ చెప్పేవన్ని అబద్ధాలే... తను కుడా రాలేదు ఎందుకో అడుగు అత్తయ్యా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విజయ్..


హనీ నీ పిలిచి ఎందుకు వెళ్ళలేదనీ చీవాట్లు పెడుతుంది సీత..


పారిపోయాడా లేకపోతే మామయ్యాతో చెప్పి అంతుచూసే దాన్ని కోపంతో ఉగిపోతూ..


హనీ రోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతుంది అని చెవి మెలివేస్తుంది సీత..


మామయ్యా మామయ్యా మీ చెల్లి నన్ను చంపేస్తుంది... అని పెద్దగా అరుస్తుంది..


చిన్న పిల్లని పట్టుకొని ఇంత గట్టిగానా మదలించేది చూడు చెవి ఎలా కందిపోయిందో అని సీత మీద అరుస్తు రేణు నీ దగ్గరికి తీసుకుంటాడు భూపతి..


చూశావా అని కళ్ళు ఎగరేస్తుంది రేణు..


చూడు వదిన అన్నయ్యా దాన్ని ఎలా గారాబం చేస్తున్నాడో అసలు అది మాట వింటం లేదు..


నా కోడలు హనీ.. బంగారం అని భూపతీకి వంతపాడుతొంది అంజలి..


హనీ కాలర్ ఎగరేసుకుంటూ కాలేజ్ కి వెళ్ళిపోతుంది..



భూపతి దానీ గోల చూస్తూనే ఉన్న ఎప్పుడు హానీ నీ వెనకేసుకొని వస్తే వాడు చిన్నబుచ్చుకోడా... రేపు పెళ్ళి తరువాత వాడిని అసలు లెక్కచేస్తుందా కొంచం దాన్ని మందలించాలి అంటుంది శారదా దేవి..


సరిగ్గా అడిగావు అమ్మ అన్నయ్యే అనుకుంటే వదినా దాన్నీ వెనకేసుకోస్తుంది సీతా వాపోతుంది....


అది కాదు అత్తయ్య ఈరోజుతో పరీక్షలు అయిపోతాయి, రేపటి నుండి మందలిస్తాలే అంటూ తన పని చేస్తున్న అంజలీ తో... కోడలా నువ్వు ఆమాట గత ఇరువై ఏళ్ళుగా చేప్తున్నావు ఇదే మాట..


శారద మాటకి భూపతి నవ్వుతాడు..


మీరు కూడానా అంటూ కిచెన్లోకి వెళుతుంది.. నవ్వుతు సీత కుడా వెళుతుంది..


సాయంత్రం ఇంటికి రాగానే... అయిపోయా మీ పరీక్షలని శారదా దేవి అడుగుతుంటే..

 అవును నానమ్మ అని లోపలికి వెళ్తున్న విజయ్ నీ అంజలి ఆపి  తేనే నిమ్మరసం కలిపి తేచ్చాను తాగు అని ఇస్తుంది..


ఈ నగరానికి ఏమైంది ఒక వైపు దుమ్ము మరో వైపు హాని.. అటువంటి హనీ ఇందులో వేశావా అమ్మ..? ఛీ హనీ ఎంత హానికరం, ఎంత చేదు ఈ హానికి పడాలి చరమ గీతం.. నాకొద్దు అంటు హనీ వైపు చూసి వెక్కిరిస్తాడు విజయ్..


కొపంతో వచ్చి అంజలి చేతిలో గ్లాస్ లాక్కుని ఆ నీళ్ళు విజయ్ తల మీద పోసి అక్కడ నుండి పారిపోతుంది హని..


ని...న్ను.... ఈ రోజు అయిపోయావు అంటూ విజయ్ వెంటపడతాడు..


హనీ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది తనకి తేలుసు భూపతి ఇంటిలొ లేడు అని..


హనీ బయటకురా అని సీత పిలుస్తోంది, నేను రాను మామయ్యా వచ్చేదాకా..


అంత బయపడే దానివి ఎందుకు అలా వాడి మీద నీళ్ళు పోశావు, అసలే వాడికి జలుబు జ్వరం తెలుసు కదా శారద దేవి, సీత అరుస్తూన్నారు..


వాళ్ళని ఆపటానికి అంజలి ప్రయత్నం చేస్తుంది కాని వినటం లేదు..


అంజలి ఈరోజు ఊరుకునేది లేదు మమ్మల్ని ఆపకూడదు, రోజు రోజుకి దీనీ అల్లరి పెరుగుతుంది (సీత, శారదలు) అంజలి మాట వినటం లేదు..


పోనిలే అత్తయ్య చిన్న పిల్ల.. నువ్వు కుడా ఏంటి సీత అలా అరవకు వాడికి బానే ఉందిలే..


ఎప్పుడు దాన్ని ఒక్క మాట అననివ్వావు కోపంగా అంజలి మీద అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద దేవి..


హనీ నువ్వు రా బయటకు వీళ్ళు నిన్ను ఏమి అనరు అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంజలి..


అంజలి మాటలు విని బుంగ మూతి పెట్టుకుని బయటకి వస్తుంది..


నువ్వు చేసిన పనికి అత్తయ్య బాధ పడదా వాడికి జ్వరం పెరిగితే అని సీత హనీ వైపు చూస్తోంది..


నేను వెళ్ళి సారి చెప్పనా అత్తయ్యకి..


వదినకు కాదు విజయ్ కి చెప్పు..


ఇంకో నాలుగు తిట్లు తిట్టు గానీ వాడికీ నేను చెప్పను సారి అని వెళ్ళిపోతుంది అక్కడ నుండి హనీ..


అన్నము తిను విజయ్..


నాకు ఏమీ వద్దు, నా మీద ఆ దయ్యం నీళ్ళు పోసిన ఏమి అనరు కదా వెళ్ళి దానికే పెట్టు గోరు ముద్దలు అంటూ విజయ్ అంజలి చేతిలో ప్లేటు తోసివేస్తాడు..


నేను పెట్టిన తినవా అని సీత తినిపిస్తుంది విజయ్ కి..


నేను బాగ బుద్ధి చెప్పాను దానికి మీ మామయ్యా వచ్చాక చేప్పడం కాయం సరే ఇక తిను అంటూ అన్నం ముద్ద నోటిలో పెడుతుంది సీత..


వచ్చారా మీరు, ఈ రోజు రేణు ఎం చేసిందో తేలుసా..


ఏమిటి సీత అన్నయ్య రాగానే మొదలు పెట్టావా.. ముందు వాళ్ళని భోజనం చేయని..


అంజలి నువ్వు అడ్డు రాకు అంటూ సీత జరిగింది చెప్తుంది..


రఘు ముఖంలో కోపం చూసి రేణు భూపతి వెనుక దాక్కుంటుంది..


పోనిలే రఘు రేపు అందరం ఊరికి వెళ్తున్నాము కదా దాన్ని ఏమి అనకు..


భూపతి నువ్వు ఇక్కడే ఉన్నావా నిన్ను చూసుకునే అది అలా రెచ్చిపోతుంది చూడు అసలు దాని ముఖంలో ఏమైనా భయం ఉందా..


మీరు అందరు ఇంతే ఎప్పుడు నన్నే అంటారు నేను ఏమి తినను అంటూ తన గదిలోకి వెళ్తుంది రేణు..


అలా అలకలతోనే తెల్లారింది..


విజయ్ మాత్రం రేణు మీద కోపంగా ఉన్నాడు..


రేయ్ నువ్వు నా రూంలో ఎం చేస్తున్నావు మర్యాదగా బయటకి వెళ్ళు..


హలో మిస్ రాక్షసి నా చేతికి మట్టి అంటుకుంది అది ఇక్కడ ఈ ఓల్డ్ క్లాత్ కి తుడుచుకుందామని వచ్చాను వచ్చిన పని అయిపొయిందిగా భూజాలేగరేస్తున్నడు విజయ్..


ఇడియట్ అది నా ఫేవరేట్ డ్రెస్ దాన్ని ఏమైనా చేశావా చంపేస్తా అని రేణు మాటలు పూర్తికాకుండానే... అది చూద్దం అంటూ చేతులు మళ్ళీ తుడిచేస్తాడు విజయ్..


నా డ్రెస్ పాడుచేస్తావా అంటూ చేతి నిండా కాజల్ తీసుకుని విజయ్ షర్ట్ మీద వేసి పరిగెడుతుంది..


నీ పని ఈ రోజుతో అయిపోయింది రాక్షసి..


ఛా.. నీ ముఖం చూసుకో నువ్వే అలా ఉన్నావు వెక్కిరిస్తున్న రేణు చేయి వెనక్కి తిప్పి పట్టుకుని నా మీద కాటుక రాశావుగా ముందు సారి చెప్పు అంటాడు విజయ్..


చేయి వదులు లేకపోతే మామయ్యకి చెప్పి నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుందీ రేణు..


ముందు సారి చెప్పు అప్పుడే వదులుతా అంటాడు విజయ్ ఇంకాస్త గట్టిగా పట్టుకుని..


నీకు నేను సారి చెప్పాలా అని చేతికందిన బాడీ స్ప్రే విజయ్ ముఖాన కొట్టి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటు తన బ్యాగ్ తిసుకుని కిందకి వెలుతుంది..


విజయ్ కొపంతో రేణు వేసుకున్న దుప్పట్టాని కత్తిరిస్తాడు..


దుప్పట్టా చూస్తూ బాధ పడుతూ.. వీడు ఎప్పుు చచ్చిపోతాడో అప్పుడే నాకు మనఃశాంతి అని అనుకుంటుంది రేణు..


 నాది అదే ఫిలిగింగ్ అని రేణు జడలాగి వెళ్తున్న విజయ్ తో.. సరే ముందు ఆపని చూడు.. నేనూ హాయిగా ఉంటాను వెక్కిరిస్తూ అంటుంది రేణు..


ఛీ నీకు అసలు బుద్ది లేదు పోవే..


 హలో 'ఐఓఐ' నీకు లేదు కదా అని అందరికీ లేదు అనుకోకు..


రేణు మాటలకి కొపంతో చేతికి దొరికినవి విసురుతున్నాడు విజయ్..


నామీదే విసురుతావా అంటు రేణు ఫోటో ఫ్రేం తీసుకుంటుంది..


అబ్బాబ్బాబా.. మళ్ళి మొదలు పెట్టారు అసలు మీకు విసుగు రాదా ఇలా గొడవ పడుతుంటే.. చూడండి అల్లుడుగారు, భూపతి వచ్చే సమయం అవుతుంది రాగానే వెళ్ళాలి అని చెప్పారు కదా శారద దేవీ అరుస్తోంది..


టామ్ అండ్ జర్రి అన్నా కాసేపు స్నేహంగా ఉంటాయి వీళ్ళు ఉండరు అత్తయ్యా..


అవునే అంజలి అందరికీ అవి టీవీలో ఉంటాయి మన కర్మకి అవి ఇంటిలోనే ఉంటాయి కదా మనకి ఈ తిప్పలు తప్పవు..


అమ్మ నువెళ్ళు వీళ్ళు ఆపరులే సీత కొపంగా రేణు వైపు చూస్తుంది..


 అత్తయ్య నిన్న గొడవ అదే మొదలు పెట్టిందీ నా తప్పేమీ లేదు అని తప్పుకుంటున్న విజయ్ మీదకి  కొపంతో చేతిలో ఉన్న ఫోటో ఫ్రేం విసురుతుంది రేణు..


అది కొంచంలో శారద దేవినీ దాటి పక్కనే ఉన్న టీవీకి తగలడంతో టీవీ పగిలిపోతుంది..


రాక్షసి కొంచం ఉంటే అమ్మ తల పగిలిపోయేది అని అరుస్తుంది సీత..


నాకేమీ కాలేదు సీత బంగారం లాంటి టీవీ పగిలిపోయింది అని కింద పడిన టివి నీ చూస్తుంది శారదా దేవి..


పోనీలే అత్తయ్య మీకు ఏమి కాలేదు..


ఏంటి అంజలి ఎం కాలేదా రొజు రోజుకి వీళ్ళ అల్లరి పెరుగుతుంది పొనీలే చిన్న వాళ్ళని వదిలేశా ఈరోజు వీళ్ళు చేసిన పనికి శిక్ష తప్పదు..


కోపంగా ఉన్న భూపతినీ రఘునీ చూసి వీళ్ళు ఎప్పుడు వచ్చారో అని అందరు కంగారుగా చూస్తున్నారు..


డాడ్ ఇందులో నా తప్పేమీ లేదు అదే విసిరింది నానమ్మ మీదకి భయం నటిస్తూ చెప్తాడు విజయ్..


లేదు మామయ్య వాడే అంత చేశాడని అమాయకంగా ముఖం పెడుతుంది రేణు..


చాలు అపండి అని రఘు పెద్దగా అనే సరికి అందరు మౌనంగా ఉంటారు..


ఎప్పుడు లేనిదీ ఎందుకు మీరు వీళ్ళని అరుస్తున్నారు శారదా దేవి చిన్నగా అంటుంది..


ఈరోజు మీరు ఎవరు మాట్లాడద్దు.. చెప్పు ఏంచేద్దాం అని రఘు భూపతి వైపు చూస్తాడు..


 ఆమ్మో వీడు కొపంగా ఉన్నాడు పెద్ద శిక్ష వేస్తే ఎలా నా బంగారం బడపడుతుంది అని మనసులో అనుకుంటాడు..


చెప్ప భూపతి అని రఘు మాటకి ఈలొకంలోకి వస్తాడు... అదే ఎలా పనిష్ చెయాలి అని ఆలోచిస్తున్న అంటాడు భుపతి..


 వద్దులే భూపతి నువ్వేమీ ఆలోచించకు వీళ్ళకి సరైన శిక్ష మనం అందరం ఒక కారులో వీళ్ళిద్దరు ఒకే కారులో వస్తారు రఘు నోటి వెంట ఆ మాట రాగానే..


నో..... అని వినిపిస్తుంది.. అది వారణాసి అరుపు, సార్ అది వాళ్ళకి కాదు నాకు శిక్ష వీళ్ళిద్దరు ఒకే కారులో వస్తే..


వారణాసి మాటలకి వసున్న నవ్వుని అపుకుంటూ ఇదే ఫైనల్ అని సినిమా డైలాగ్ చెప్తాడు రఘు..


వాడితో ఒకే కారులో నేను రాను మామయ్య అని బుంగమూతి పెట్టి భూపతి చేయి పట్టుకుంటుంది రేణు..


హా డాడ్ నేను కూడా అని కోపంగా చూస్తున్నాడు విజయ్..


భూపతి కోపంగా చూస్తూ హా... సరే మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్తాము వారం రోజులదాకరాము, అమ్మ బయలుదేరండి వీళ్ళు ఇక్కడే ఉంటారు ఒంటరిగా అని భూపతి ముందున్న కారు వైపు నడుస్తుంటాడు...

వీళ్ళకి ఎన్ని సార్లు చేప్పినా వినరు పదండి అని శారద దేవీ విసుగు వెళ్ళి కారేక్కుతుంది..


ఏమిటి అత్తయ్య ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారా ఎలా గోలా తీసుకు వస్తాను అన్నాడు వారణాసి మీరు భాద పడకండి..


అంజలి మాటకి కొంచం ఆ ఆలోచనలో నుండి బయటకి వచ్చి చుట్టూ చూస్తుంది అప్పుడే కార్ సిటి దాటి పచ్చని పొలాలా మధ్య హైవే మీద దుసుకువెళ్తుంది..


ప్రస్తుతం....


కార్లు అన్ని వెళ్ళిపోయాయి ఇద్దరు ఒకరిని ఒకరు కోపంగా చూస్తూ ఉంటారు వారణాసి కంగారు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని..



ఇంకా ఉంది..