Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ వెన్నెల - 1

***ప్రేమ వెన్నెల***
Part-1
బావ....ఇంత దూరం వచ్చావు భోజనం చేసి వెళ్లాచ్చుగా
అంటూ ఎంతో క్యూట్ గా వాళ్ల బావను అడుగుతుంది వెన్నెల,నువ్వు తినిపించు తింటాను ఓకే నా వెన్నెల.
నువ్వు ఏమైన చిన్న పిల్లోడివా బావ తిను వచ్చి అంటూ తన నుదుటి మీద పడే కురులను,పక్కకి తీస్తు ఇప్పుడు వచ్చి తింటావా..?తినవా..?ఏదో ఒకటి చెప్పు అంటూ కొంచం పెంకితనం,కొంచెం కోపం చూపిస్తూ లోపలికి వెళ్లి పోతుంది వెన్నెల.
ఏంటి మేడమ్ చాలా కోపంగా ఉన్నారు.
ఎమ్ లేదు లే ముందు తిను కూర్చొని.ఓకే మేడమ్ మీరు ఏలా అంటే అలానే.
నందన్-వెన్నెల బావ మరదల్లు ఇంకో 7 నెలల తరువాత పెళ్లి చేసుకోబోయే నూతన జంట కూడాను.
వెన్నెలకి నందు అంటే చాలా ఇష్టం ఇష్టం అనే దానికంటే పంచ ప్రాణాలు అనడం కరెక్ట్ ఏమో...అంతల ప్రేమిస్తుంది వాళ్ల బావను.
నందుకి కూడా అంతే వెన్నెల అంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం కోపం ఎక్కువ,ఎంత ప్రేమ ఉందో అంతే కోపం కూడా.కోపం అంటే వెన్నెల మీద అని కాదు నార్మల్గా తన నేచర్ అంతే.
నందు హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంటారు.వెన్నెల విశాఖపట్నంలో btech ఫైనల్ ఇయర్ చదువుతుంది.
వరసకు బావ మరదల్లు అయినా ఎప్పుడు కలిసినది లేదు కేవలం ఫోన్ లోనే మాట్లాడుకునే వారు.వాళ్ల మధ్య అంత దూరం ఉన్న మనసుల మధ్య మాత్రం చాలా దగ్గరితనం ఉంది.
నందుకు అవి శెలవ దినాలు వెన్నెలకి మెసేజ్ చేశాడు.
నందు : హలో మరదల్
వెన్నెల : హలో బావ చెప్పు ఏంటి ఈ టైమ్ లో మెసేజ్,నిద్ర రావడం లేదా...??
నందు : రాలేదు పాప.
వెన్నెల : ఓకే తిన్నవా బావ
నందు : పంది...!!
వెన్నెల : ఏంటి బావ నేను ఎమ్ అన్నను ఇప్పుడు..??
నందు : ఎమ్ లేదులే మేడమ్.
వెన్నెల : అవునా ఓకే బావ.
నందు : రేపు పెళ్లి అయ్యాక ఎలా వేగాలో నీతో.
వెన్నెల : ఇప్పుడు ఎలా ఉన్నావు,అలాగే ఉండు బావ.
నందు : ఛీ..!!నా జీవితం,కొంచెం కూడా రొమాంటిక్ ఫీలింగ్ లేదు ఎంటే నీకు.
వెన్నెల : అబ్బా ఎప్పుడు ఇదే గోలనా.
నందు : లోక సృష్టి అంతే మేడమ్,ఎంతటి వాడు అయినా మీ ఆడ వాళ్ల దగ్గర తల వంచక తప్పదు.
వెన్నెల : ఇప్పుడు ఇది అంత ఎందుకు బావ,ఓకే మనం లాంగ్ డ్రైవ్ కు veldham అన్నావు కదా ఎప్పుడు వస్తావు బావ వూరికి.
నందు : ఈ వీక్ఎండ్లో వస్తాను రెడీగా ఉండు డార్లింగ్.
వెన్నెల : ఓకే బావ ఐతే ఇంకా పడుకో రేపు exam ఉంది నాకూ.
నందు : ఓకే చదువుకో బై గుడ్ నైట్ డార్లింగ్.
నందు ఫోన్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టాడు గానీ వాళ్ల వెన్నెల గురించి ఒక్కటే కవ్వింపులు.
ఎందుకు అంటే....!!!
ఫ్లాష్ బ్యాక్...
వెన్నెల వాళ్ల అక్కను నందు వాళ్ల అన్నయ్యకు ఇచ్చారు,సో వాళ్ల ఇద్దరు అలా బావ మరదల్లు అన్న మాట.
పెళ్లిలో ఒకరిని ఒకరు చూసుకున్నారు,కానీ ఇద్దరు మాట్లాడుకోలేదు.కానీ ఇద్దరికి ఏదో తెలియని ఫీలింగ్.
రెండు గుండెల హృదయం అన్నట్లు,మాట్లాడుకోరు కేవలం చూపులు కలిసిన శుభవేళ మాత్రమే.
అలా అలా కొనసాగుతూ ఉండగా వెన్నెల అంటే నందు వాళ్ల నాన్నగారికి చాలా ఇష్టం,అభిమానం.వెన్నెలను ఇంటి కోడలు చేసుకోవాలి అని చాలా కలలు కనే వారు.
అప్పుడు అప్పుడు ఫేస్బుక్ లో ఇద్దరు chat చేసుకునే వారు.తరువాత ఫేస్బుక్ నుంచి WhatsApp కి వచ్చారు.
వాళ్ళు chat చేసుకోవడం అనే కంటే ఎప్పుడు గొడవ పడతారు అనడం మంచిది.tom and Jerry లాగా ఎప్పుడు తిట్టుకుంటు,కోపం వస్తే బ్లాక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి మధ్య ప్రేమ పుట్టింది అంటే ప్రేమ చాలా గొప్పది కదా...అలా ఒక రోజు ఫస్ట్ టైమ్ లాంగ్ డ్రైవ్ కి ప్లాన్ చేస్తారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళు ఇంత వరకు ఒకరికి ఒకరు propose చేసుకోలేదు.
*****ఫ్లాష్ బ్యాక్ తరువాత*****
ఆరోజు మార్నింగ్ వెన్నెలకి exam ఉంది afternoon వెళ్లేల ప్లాన్ చేస్తారు.అసలే వర్ష కాలం,వెన్నెల exam రాసేసి నందు కోసం విశాఖపట్నం బస్ స్టేషన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది.
ఫోన్ ఏమో ఆఫ్ అయ్యేలా ఉంది బావ ఏంటి ఇంకా రావడం లేదు కాల్ చేస్తే 5 నిమిషాలులో నీ ముందర ఉంటాను అంటాడు.ఏంటో ఈ పిచ్చి బావ వాళ్ల బావ కి ఒక క్యూట్ name ఉంది Bijju డార్లింగ్ అని,అప్పుడే బహుబలి రిలీస్ ఐనా రోజులు,సో ఆ conversation లో నందు వెన్నెలను కాకి సేనా అన్నాడు,ఆ సినిమా లో నాజర్ చాలా హాస్యాస్పదంగా ఉంటారు కదా అందుకు నువ్వు Bijju Darling pey అంటుంది వెన్నెల.
ఒకరికి మనం స్పెషల్ పేరు పెట్టము అంటే వాళ్ళు మనకు,మన మనసుకి ఎంతో చేరువా అయితే తప్ప ఆ ఆలోచన రాదు కదా.
ఫోన్ తీసుకొని కాల్ చేద్దాం అని చూస్తూ ఉండగా ఎదుటే అంటే opposite రోడ్డులో నందు హీరోల బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి,బైక్ ఆపి హార్న్ కొట్టడు.
నందుని చూడడం వెన్నెలకి ఎక్కడలేని సిగ్గు, బయట పడకూడదు అనే కంగారు.మొదటి సారి నందు బైక్ ఎక్కడం,నందుకి బైక్ లు అంటే చాలా ఇష్టం,చాలా బాగా డ్రైవ్ చేస్తాడు కూడా.
అలా వెళ్తూ ఉండగా నందు cap 🧢 కింద పడి పోతుంది గాలికి.ఉండు నేను తెస్తాను అని చెప్పి వెన్నెల వెళుతుంది.తరువాత ఇద్దరు బయలుదేరుతారు.
ఎక్కడికి వెళుతున్నం sir అంటుంది,నాకూ మాత్రం ఏమీ తెలుసు అలా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్లి వద్దం.
నీ ఇష్టం oye అంటుంది,డైరెక్ట్గా బావ అనలి అంటే ఎక్కడ లేని సిగ్గు వెన్నెలకి.
కావాలనే స్పీడ్ పెంచుతున్నవా స్లోగా వెళ్లు పంది అంటుంది.ఎమ్ భయమా...?
భయం ఐతే పట్టుకో పర్లేదు ఎమ్ అనుకోనులే...
Haha నాకేమీ భయం లేదు పద ముందు చూసి.
బావ నాకోసం ఇంత దూరం వచ్చావు,నిజంగా చాలా సంతోషంగా ఉంది.నీ చిన్న చిన్న కోరికలను కూడా తీర్చకపోతే ఇంక నేను ఎందుకే ఉండేది మెంటల్.
ఇంతకీ ఏమైన తిన్నవా,లేదా exam రాయడం ఇలానే వచ్చేశావు,పద ఏమైన తిందువు ముందు,వద్దు బావ నాకూ ఆకలిగా ఎమ్ లేదు షాప్ దగ్గర ఆపి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకో చాలు.
Sprite ok na....
నీ ఇష్టం బావ ఏదైనా పర్లేదు.
ఓకే ఇప్పుడు ఎక్కడికి పోతు ఉన్నాం బావ.
అలా నేచర్ ఎంజాయ్ చేద్దాం.
అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర బైక్ ఆపాడు నందు.
అక్కడ ఎవరూ లేరు,చాలా ప్రశాంతంగా,చుట్టూ కొండలు,పెద్ద బ్రిడ్జి కూడాఉంది కాకపోతే అదిconstruction లో లేదు అప్పుడు.
ఎందుకు ఇక్కడ ఆపావు బండి.
ఎందుకే అంతా కంగారు పడుతావు,నిన్ను నేను ఏమీ కొరికి తినను,కూల్ డ్రింక్ తాగుతావు అని stop చేశాను, ముందు తాగు టెన్షన్ పడకుండా.
నా బంగారం బావా నువ్వు ఊరికే భయపడ్డ,సడన్గా ఆపేసరికి.
ఏదైనా తన తరువాతే కదా నేను కాకపోతే మనసులో మాట ఇంక బయట పెట్టలేదు.
ముందు నువ్వు తాగివ్వు పంది,తరువాత నేను తాగుతాను.
చిన్నప్పటి నుంచి నేను ఎవరి ఎంగిలి తినలేదు,అసలు అలవాటు కూడా లేదు చాలా నీట్గా maintain చేసే దానిని.
అలాంటిది జీవితంలో మొదటిసారి ఇలా,బావ సిప్ చేసిన కూల్ డ్రింక్ నేను తాగడం.
. ప్రేమ చాలా గాఢమైనది కదా దాని ముందు ఎవరి అలవాటులు అయినా మారాలి.
ఏదో తెలియని అలజడి,అలా నందు తాగిన కూల్ డ్రింక్ తాగినాక.సడన్ గా vibrations స్టార్ట్ ఐనై.
నందు బండి స్టార్ట్ చేశాడు,సడన్గా వెన్నెలలో మార్పు నందును వెనుక నుంచి గట్టిగా కౌగిలించుకుంది.
Oye ఏమైంది వెన్నెల.
ఎమ్ లేదు బావ కొంచెం చలిగా ఉంది అంటూ కవర్ చేసింది ఆ క్షణనా.
మొదటిసారి ఒక స్పర్శ ఏంటి ఈ కొత్త ఫీలింగ్ oh God.
నందు చేతిలో వెన్నెల చేతిని పెట్టి బావ నా చెయ్యిని ఎప్పటికీ వదలవు కదా అంటుంది.నా ప్రాణం ఉన్నంతకాలం అది జరగని పని వెన్నెల నువ్వేమి బాధ పడకు.
"I love you so much baava ❤"
" I love you to kaki darling ❤"
తను ఎప్పుడు చూడని లోకం బైక్ లో అలా నిలబడి oyee baava అని గట్టిగా అరుస్తూ,తన సంతోషానికి మాటలు, హద్దులు లేవు అనుకొండి.
అలా నందు-వెన్నెల ఫస్ట్ ట్రిప్ బాగా జరిగింది.

ఇంక నందు హైదరాబాద్ పోవలసి ఉండగా వాళ్ల నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక,వైజాగ్ లోనే ఉండాల్సి వస్తుంది.
అనుకోకుండా ఒక రోజు నందు వాళ్ల నాన్నగారు చనిపోతారు,ఆ విషయం వెన్నెలకి తెలిసి బయలుదేరి వెళుతుంది.
అక్కడ ఏమో నందు వెన్నెల ప్రేమ సంగతి ఎవరికి తెలియదు.వెన్నెల ఏమో డైరెక్ట్ గా పోయి పలకరించాలి అంటే చుట్టూ బంధువులు,మొదటిసారి నందు ఏడవడం చూసి వెన్నెల మనసుకు చాలా బాధ వేసింది.
నందు ఫోన్ కూడా ఎక్కడో పోయింది,ఇంకో చిన్న ఫోన్ ఉంది గానీ sim లేదు,వెన్నెలనే తన దగ్గర ఇంకో sim card ఉంటే ఇచ్చింది నందుకి.
అప్పటికి వెన్నెల చదువు కూడా అయిపోయింది.
వైజాగ్లోనే సెంట్రల్ ఆఫీసు లో వర్క్ చేస్తుంది ఇప్పుడు.
ఆరోజు నందు వాళ్ల నాన్న గారి కర్మకాండలు,వెన్నెల అసలు నిద్ర పోలేదు,మేలుకొనే ఉంది కరెక్ట్ గా సమయం 12 am or 1 am అవుతుంది ఏమో వాళ్ల అమ్మగారికి పసుపు కుంకుమ తీస్తారు కదా అది అంత నందు పక్కన ఉండే చూసింది.తన వెనుకే నడవడం,చిలిపి అల్లరి బావ బావ అంటూ ఆట పట్టించడం ఆ సమయంలో.నందుకి ఓదార్పుగా ఉండాలి ఆ సమయంలో అనేది వెన్నెల intension కానీ అక్కడ పెద్ద వారు అంత ఇక్కడ ఉండకూడదు అమ్మ పిల్లలు వెళ్ళండి ఇంటికి అని పంపేశారు కానీ వెన్నెల పోలేదుగా డైరెక్ట్గా వెళ్లి నందు పక్కన కూర్చుంది.
ఒక రోజు నందు నుంచి ఫోన్ ఎక్కడ ఉన్నావు అని
ఆఫీసు అంటే,వెంటనే ఆఫీసు దగ్గరకు వెళ్లి పోయాడు, జోరువాన,వెన్నెలకి అలా వర్షంలో తడవాలి అంటే చాలా ఇష్టం.అలా కాసేపు అయ్యాక వెన్నెలను బస్ స్టేషన్ లో డ్రాప్ చేసి నందు వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినకా కాల్ చే అని చెప్పి.
అంతా వానలో తన కోసం వచ్చినందుకు she is so happy.
ఏంటి బావ ఈ వర్షంలో నేను వెళ్లే దానినిగా,పర్లేదు నువ్వు మాత్రం ఎలా వెళ్తావు తడుచూకుంటు,ఆ క్షణం నా మనసులో ఇంత ప్రేమ బావకి నేను అంటే అనిపించింది.
అలా వెన్నెలను బస్టాండ్ లో దింపి నందు వెళ్లిపోయాడు.
తరువాత ఒకసారి వెన్నెలకి ఒకసారి ఆఫీసు నుంచి లేట్ అవడంతో నందునే ఇంటి వరకు డ్రాప్ చేశారు,ఆ క్షణనా వెన్నెల ఫీలింగ్,వెన్నెలలో బావతో ఇలా journey అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ తన బావను కౌగిలించుకుంది.
అలా అలా వాళ్ల చిన్న చిన్న ఫీలింగ్,ఎంతో ఆనందం,ఇంకో ఆరు నెలల్లో పెళ్లి,వెన్నెల తన బావతో కలిసి ఏడు అడుగులు వేయడానికి ఎంతల ఎదురు చూస్తోందో మాటలలో వర్ణించలేను.
Advance wish u a very happy married life వెన్నెల and నందు.