Read Suryakantham - 2 by keerthi kavya in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

సూర్యకాంతం - 2

సూర్యకాంతం పార్ట్-2 

సూర్య ఆనందంగా మైత్రి తో కలిసి పొలానికి ఆ పచట్టి పొలాలు ఆడుకుంటూ అలిసిపోయి ఇంటికి తిరిగి ప్రయాణం అయింది.


అపుడే సూర్య ని చూసి వాలా బామ్మ దీనికి వయసు వచ్చింది ఒక మంచి అబ్బాయి ని ఇచ్చి పెళ్లి చేసేయాలి అని వస్తున్న సూర్య ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది.


సూర్య: నాని! నికోసమని కొబ్బరి బొండాలు తీసుకొచ్చా అంటూ ఒక బోండా ని తన చేతులతోనే పగలకొట్టి ఇస్తుంది (సూర్య లావు అనే కానీ తాను చాల స్ట్రాంగ్ ఒకరకంగా రెస్ట్లెర్ ల ఉంటుంది )


కాంతమ్మ: బంగారం అంటూ మురిసిపోయి నా కోసం తీసుకోవచ్చవా అంటూ తీసుకోని తాగుతుంది.


సూర్య తుర్రుమంటూ వాలా అమ్మ దగరికి వేలి మా నాకు పాయసం కావాలి చేస్తావా అంటూ తన రూమ్ లో కి వెళ్తుంది

భాగమతి: దీనికి పొలానికి వెళితేనే ఇంత ఆనందమో అని మురిసిపోతూ సూర్య అడిగిన పాయసం చేసే పనిలో ఉండిపోయింది.


సూర్య ఫ్రెష్ అయి వచ్చేసరికి పాయసం తీసుకొచ్చింది భాగమతి. ఇంకా కాంతమ్మకి కూడా ఇవ్వడానికి వెళ్తుంది. 

భాగమతి: ఇదిగోండి అత్తయ్య! మీ కోసం పంచదార లేకుండా స్పెషల్ గ చేసి తీసుకొచ్చాను.

కాంతమ్మ: చిరుబురు లాడుతూ తీసుకోని కూతురు చూపిందని చేయటం కాదు భాద్యత అంటే తనని భాద్యతగా ఒక అయ్యా చేతిలో పెట్టాలి అది మర్చిపోకు నువ్వు ఎలా ఐతే ఈ ఇంటికి వచ్చావో అలానే న మనవరాలు కూడా ఒక ఇంటికి వేలాలిసిందే మీ ఇద్దరి వాలకం చూస్తుంటే దానికి పెళ్లి చేసే ఊసే లేకుండా పోయింది. 


భాగమతి: తాను ఇంకా చిన్న పిల్లే అత్తయ్య గారు అపుడే పెళ్లి అంటే !


కాంతమ్మ: ఇంకా ఆపుతావా ! నేను చచ్చేలోపు దాని పిల్లల్ని చూసి ఆదుకోవాలి అని నా ఆశ. ఈ కోరిక తీరుతుందో లేదో ఓహ్! యమధర్మ రాజా ! నాకు కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండేటట్టు చూడు అయ్యా !

భాగమతి: ఆలా మాట్లాడకండి అత్తయ్య మీరు నిండు నూరేళ్లు బతకాలి. సరే అత్తయ్య ఈ విష్యం గురించి అయన తో కలిసి మాట్లాడదాం.


కాంతమ్మ (మనసులో): హమ్మయ్య! ఇది నా బుట్టలో పడింది. నా ప్లాన్ కొంత వరకు మొదలయింది భాను రావటం ఆలస్యం మన ప్లాన్ పూర్తిగా అమలు చేయాలి.


ఇలా అనుకుందో లేదో భాను వస్తుంటాడు. 


కాంతమ్మ: దేవుడా ! నువ్వు ఉన్నావయ్యా ఇలా అనుకున్నానో లేదో అపుడే కరుణించవా 


భాను: అమ్మ ! ఏంటి అంత దిగులుగా ఉన్నావ్ 


కాంతమ్మ: పదరా లోపలి అంటూ భాగమతి ని కూడా పిలిచింది.


ఇక ముగ్గురు ఒక గదిలో వెళ్లి గొళ్ళెం పెట్టుకుంటారు. 


ఇది గమనించిన సూర్య, "నాని ఏదో గూడుపుఠాణి చేస్తునట్టు ఉంది. కొంపదీసి నా గురించి ఐతే కాదు కదా" అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది."


ఇలా అలోచించి టైం వేస్ట్ వాలు ఎం మాటలాడుతున్నారో మనం ఆ గది కిటికీ వైపు వేలి చూదాం అని కిటికీ డాగర నుంచి తన రెండు చెవులు పెడుతుంది


కాంతమ్మ: భాను ఈ మధ్య నాకు మీ నాన్న నే గుర్తొస్తున్నారు రా! 


భాను: ఎమ్మా ఏమైంది నీకు ఎం కావాలో చెప్పు నేను ఉన్నాను కదా 


కాంతమ్మ: ఏడుస్తూ ! ఆయన ఎలానో మనవరాలి పెళ్లి చూడాలి చూడాలి అంటూ అర్థంతరంగా  నను విడిచి వేలి ఒక భద్యతని అప్పగించి వెళ్లరు. కానీ నేను ఆ విష్యం ఇంత వరకు చెప్పలేదు. సమయం వచ్చినపుడు చెపుదాం ఆ విషయాన్ని నా మనసులో దాచుకున్నాను.


భాను: ఏంటమ్మా నాన్న చివరి కోరిక ! చెప్పు ! కొడుకుగా అది నా భాద్యత ! నేను తీరుస్తాను అని కాంతమ్మ కన్నిలని తుడుస్తూ ఉంటారు.


భాగమతి: అసలు విషయం తెలిస్తే ఈయన ఎం అవుతారో అని (కాంతమ్మ గారి నట విశ్వరూపం చూసి ఆశ్చర్యం లో మునిగి తేలుతుంది ) 


కాంతమ్మ: ఎం లేదు రా , మీ నాన్న తన మనవరాలి పెళ్లి చేయాలి అని అది కూడా తన ప్రాణ మిత్రుడు రామారావు గారి మనవడిని (శ్రీకాంత్) ఇచ్చి.


 అది విన్న భాగమతి ఒకసారి షాక్ లో ఉండిపోయింది.

భాగమతి: అత్తయ్యగారు ! శ్రీకాంత్ మన సూర్య కి అసలు పడదు కదా చిన్నప్పటి నుంచి వాలా ఇద్దరు ఉన్న మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది.

(కిటికీ బయట ఉన్న సూర్య పెళ్లి అనే విషయం వినగానే దూరంగా వేలి కళ్ళలో ఎపుడు చూడని కన్నీళ్లు ధారగా వస్త్తు ఉంటాయి తనకి తెలియకుండానే . కానీ శ్రీకాంత్ ఏ తన భర్తగా రాబోతున్నాడు అనే విషయం తెలిస్తే ఎం అవుతుందో ) 

భాను : అమ్మ! సూర్య కి అపుడే పెళ్లేంటి అమ్మ !

కాంతమ్మ: భాను పైన ఆ యముడు మీ నాన్న నాకోసం ఎదురు చుస్తునారు రా ! ఎపుడు వస్తావు నా దగరికి అని. మీ వాలకం చూస్తే పెళ్లి ఊసే లేకుండా పాయె. ఆయన చివరి కోరిక తీర్చి నేను ముని మనవాళ్లతో ఆడుకొని ప్రశాంతగా అయ్యన దగరికి వెళ్ళాలి.

భాను: సరే అమ్మ! కానీ సూర్య చిన్న పిల్ల ఈ మాట తాను ఎలా తీసుకుంటుందో? నాన్న చివరి కోరిక తీర్చటం మన భాద్యత చూద్దాం అమ్మ! నేను సూర్య తో మాట్లాడానికి ప్రయత్నిస్తాను అని కాంతమ్మ సర్ది చెప్పి బయటకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. 

 

ఇంతలో బయట కూర్చొని ఏడుస్తూ ఉన్న సూర్య చూసి ఏమైంది అని కంగారుగా వెళ్తారు. 


ఏమైంది కన్నా అని సూర్య దగ్గరికి తీసుకుంటాడు భానుచంద్ర .


సూర్య: నాన్న! అని తనని కౌగిలించుకుంటుంది. ఎం లేదు నాన్న అని తన మనసులోని బాధ ని ఆపుకుంటూ.


భాను: నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కన్నా నువ్వు ఎందుకు ఆలా ఉన్నావో . మా నుంచి ఎక్కడ నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళాల్సి వస్తుంది అని నీకు ఒక్కసారిగా దుఃఖం ఆగలేదు . 


( అసలు విషయం ఏంటి అంటే భాను గారు సూర్య కిటికీ లో ఉంచి మా సంభాషణ వింటుంది అని గమనించారు ). 


*************************************************

రామారావు సీతమ్మ ఇద్దరు బాల్కనీ లో కూర్చొని రామాయణం చదువుతున్న రామారావు గారు చేపవి వింటుంది సీతమ్మ.


ఇంతలో ముద్దుల మనవడు వచ్చి గ్రాన్నీ అంటూ తన వెనకాలకి వచ్చి అదరగొడతాడు. 


సీతమ్మ: తు తూ ! ఇంత వయసు వచ్చిన వీడికి ఈ చిన్న పిల్లల చేష్టలు మానలేదు. త్వరగా విడి అల్లర్లకు అడ్డుకట్ట వేసేదాని ఇచ్చి పెళ్లి చేసేయాలి.


హ హా ! అని నవ్వుతారు రామారావు. 


రామారావు: వాడిని ఐనా కొంచం ప్రశాంతంగా ఉండనీవు సీత!


సీతమ్మ: ఆహ్ ! ఏంటి అండి మీ ఉదేస్సామ్. నేను మిమల్ని అంత భాధ పెడుతూ నానా!


థాంక్స్ తాత! అని నవ్వి తన రూమ్ కి వెళ్లిపోతాడు. 


శ్రీకాంత్ వెళ్లిపోయింది గమనించి సీత ! అని 


సీతమ్మ: హా ఏంటి అండి ! 

 రామారావు: నువ్వు శ్రీకాంత్ కి పెళ్లి అని నువ్వు అనగానే నాకు నా ప్రాణస్నేహితుడు కి ఇచ్చిన మాట గుర్తొచ్చింది అని కాంతమ్మ వాలా ఆయినా కాంతారావు ని తలచుకొని భాధపడుతుంటారు.


సీతమ్మ: ఊరుకోండి అండి అన్నయ గారు ఎలాపడు మనతోనే ఉంటారు . ఇంతకీ అన్నయ కి మీరు ఎం మాట ఇచ్చారు అని అడుగుతుంది

రామారావు: సీత ! సమయం వచ్చింది కాబ్బటి చెబుతున్నాను . కాంతారావు ప్రాణాలు విడుస్తున్నసమయం లో 


కాంతారావు: రేయ్! రామ ! మన స్నేహబంధం బంధువుతాం అవ్వాలి అది మన పిల్లలు వల్ల కాలేదు కనీసం నా మనవరాలు ని మనవడితో ఐన జరిగిలే చూడు రా.


రామారావు: (దుఃఖం లో ) నా ప్రాణ స్నేహితుడు అడిగితే నేను కాదంటానా ! మన మనసులు ఎపుడు ఒకేలా ఆలోచిస్తుంటాయ్ రా ! నువ్వు ఎలా అయితే అనుకున్నావో నేను అలానే కోరుకున్నాను రా ! 


కాంతారావు: సంతోషం తో ఆ మాట విని తన చివరి శ్వాస విడిచారు.


రామారావు ఆ సందర్భం ని తలచుకొని భాధపడ్తు ఉంటారు

సీతమ్మ: బాధపడకండి మీరు ! అన్నయ కోరిక మీ కోరిక తీర్చాల్సిన సమయం వచ్చింది. దీని అమలు పెడదాం అని ఇద్దరు లోపాలకి వస్తారు.


రామారావు గారు తన స్నేహితుడు మరణ అనంతరం ఆ ఊరి లో ఉండలేక పక్కనే ఉన్న రామయ్యపట్నం లో తన కొడుకు తో కలిసి వేరు కాపురం పెడతారు. ఆ తరువాత శ్రీధర్ (రామారావు కొడుకు స్వీట్స్ వ్యాపార నిమ్మితం ఇంకా ఆ ఊరిలో నే ఉండి పోవాల్సి వచ్చింది.


శ్రీధర్ కూడా పని ముగించుకొని ఇంటికి వస్తుంటారు. శ్రీధర్ ఆయన భార్య శ్రీవాణి , రామారావు , సీతమ్మ, శ్రీకాంత్ అందరూ రెడీ అయి డిన్నర్ కి వస్తారు. 


రామారావు , సీతమ్మ ఇద్దరు ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు.


అది గమనించిన శ్రీధర్ , 


శ్రీధర్: అమ్మ ! నాన్న ! నాతో ఏమైనా చెప్పాలా ?


సీతమ్మ: అవును రా ! ఇంతకటి నుంచి చూస్తున్న మీ నాన్న ని ఎంత అడిగిన నాకు చెప్పలేదు ని ద్వారా ఐన తెలుసు కుందాం అని నేను కుతూహలంగా ఉన్నాను రా ! ( సీతకి అసలు విషయం తెలిసిన శ్రీధర్ కి చెప్పలేక సైడ్ అయి రామారావు గారిని ఇరకాటం లో పెడుతుంది ) 


రామారావు: అది అది ...! అని నీళ్లు నోముల్తూ ఉంటారు . 


శ్రీధర్: చెప్పండి నా దగ్గర మీరు ఆలా ఉండటం ఏంటి ? మీకు ఏమైనా సమస్య నా ?


రామారావు: ఆబ్బె ! అదేం లేదురా నాన్న ! అది నా ప్రాణ స్నేహితుడు కాంతారావు గుర్తున్నారా నీకు ? "


శ్రీధర్: మావయ్యా ! గుర్తున్నారు . అతని మర్చిపోతేనే కదా ! నా బాల్యం అంత మావయ్యా , భానుచంద్ర తోనే గడిపాను కదా. మరి ఇపుడు ఎలా ఉన్నాడో ఏంటో అని తన బాల్యాన్ని తలచుకొని నవ్వుతుంటారు.


రామారావు: నువ్వు ఇంకా మర్చిపోలేదా శ్రీధర్ ! 


శ్రీధర్: మీ  కోసం అని మీ స్నేహితుడు లేరు అనే భాధ ని చూడలేక ఇక్కడికి రావాల్సి వచ్చింది మన ఊరు సూర్యపురం ని విడిచి వెళ్లటం నా స్నేహితుడు ని విడిచి వెళ్లటం అనేది నా జీవితం లో మర్చిపోలేని రోజు నాన్న !


రామారావు: నా వల్లే ఇక్కడికి వచ్చాము. నన్ను క్షమించురా ! 


శ్రీధర్: అయ్యో నాన్న ! అదేం లేదు ! మనం దూరంగా వాడు నను తలచుకొని రోజు లేదు నేను వాడిని తలుచుకోకుండాను ఉండను. మా మాటలు దూరం ఐనా మా మనసులు ఒకేలా ఉంటాయి ఒకేలా ఆలోచిస్తాయ్!


రామారావు మనసులో "హమ్మయ్య ఇదే మంచి సమయం ఇపుడు , విషయం చెప్తే ఓ పని ఐపోతుంది అని అనుకుంటారు "


రామారావు: మీ మావయ్యా కి చివరి కోరిక నా కోరిక కూడా అదే ఉంది . కాంతారావు కి నేను మాట ఇచ్చాను రా! తన కోరికని ఎలా ఐనా తీరుస్తాను అని!

శ్రీధర్: చెప్పండి నాన్న ! తీర్చేధం


రామారావు: అదేం లేదు రా ! మరి మరి అని శ్రీకాంత్ వైపు చూస్తుంటాడు 


శ్రీకాంత్: ఏంటి తాతా! ఏంటి matter ! కొంపదీసి నా గురించి ఐతే కాదుగా


రామారావు: ని గురించేరా ! మనవడా!


శ్రీకాంత్: ఏంటి నా గురించా! ( అని ఆలోచిస్తూ ఉంటాడు )


రామారావు: హా ని గురించే ! కాంతారావు మనవరాలు సూర్యకాంతం కి మన శ్రీకాంత్ ని ఇచ్చి పెళ్లి చేయాలి అని నా కాంతరావు నాకు కోరిక రా శ్రీధర్! మా స్నేహ బంధాన్ని చుట్టరికం చేయాలి అని చెప్పారు రా మీ మావయ్యా!


శ్రీకాంత్: షాక్ లో ఉండి ! ఏంటి ! సూర్యకాంతం అంటే  ఆ చివిడి ముక్కులేసుకొని ఎపుడు నోట్లో ఏదోకటి తింటూనే ఉంటది అదేనా! 


శ్రీవాణి: రేయ్ ! ఏంటి ఆ మాటలు ! సూర్య చాల ముద్దుగా ఉంటుంది. నా కోడలు ని ఏమైనా అంటే నేను ఊరుకోను అని చిరు కోపంగా చూస్తుంది


శ్రీధర్: నాన్న ! నాకు చాల సంతోషంగా ఉంది నాన్న ! నాకు రాని ఆలోచన మీకు వచ్చినందుకు కొంచం నా మీద నాకే కోపం వస్తుంది


శ్రీవాణి: ఏమండి! ఈ శుభవార్త విన్నాక నాకు స్వీట్ చేయాలి అనిపిస్తుంది అని స్వీట్ చేయడానికి వెళ్తుంది.


శ్రీధర్: ఆగవోయ్ ! శ్రీమతి గారు ! నేను వస్తా స్వీట్ షాప్ లో తీసుకొచ్చాను అని సోఫా టేబుల్ మీద పెట్టాను తీసుకురా అంటాడు.


శ్రీకాంత్: నాన్న ! మీరు అందరు కలిసి నన్ను బాలి చేయకండి నేను ఈ పెళ్లి చేసుకోను. అందిట్లో ఆ తిండిబోతు కాంతమ్మ ని అసలు చేసుకోను అని కోపంగా చెబుతాడు.


శ్రీధర్: రేయ్! ఎపుడో చిన్నప్పుడు నిన్ను కొట్టింది అని తన మీద ద్వేషం తో ఉన్నావ్ ! అసలు తన ప్లేస్ లో నేను ఉన్న అలానే రియాక్ట్ అవుతాను ! నువ్వు తనని తిట్టడం వల్లే కదా నిను కొట్టింది.


శ్రీకాంత్: నాన్న మీరు ఎపుడు దాని పార్టీ నే ! పోండి! ఐన కానీ నాకు కాబోయే భార్య ఆలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో ఉన్నాయి మీరు ఇలా మాట తీసుకోవటం ఎం బాలేదు తాత! అంటూ తాత వైపు కోపంగా చూడకు.


రామారావు: మాట తీసుకోవడం కాదురా ! బడుదాయ్ ! నేను నా స్నేహితుడు కోరము అంటే అది కచ్చితంగా పైన ఉన్న శ్రీకృష్ణ భగవానుడే మా నోటా పలికించాడు అనుకో! ఊరికే ఎవరు ఇలాంటి చెప్పారు రా ! 


శ్రీకాంత్: ఓహ్ గాడ్ ! ఏంటి ఈ పెద్దవాళ్లు ! అసలు మా మనోభావాలు తెలుసుకోరే!


అందరు ఒక నవ్వు నవ్వి స్వీట్స్ తింటూ ఉంటారు


శ్రీకాంత్ కి మాత్రం కోపం నషాళానికి అంటుంది. ఒక విసురుగా  తన రూమ్ కి వెళిపోయాడు. 


రామారావు: రేయ్! మనవడా ఆగు ఆగు ఈ స్వీట్ తిను రా !


శ్రీధర్: నాన్న మీరు వాడ్ని వదిలేయండి నాన్న ! వాడ్ని చినగ్గ చెప్పి ఒప్పిదం ! 


 నా స్నేహితుడితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం నాన్న ! ఏమంటారు?


రామారావు: అలాగే రా!


ఇంకా అందరు సంతోషంగా ఎవరి రూమ్ లో వాలు వెళ్లి నిద్రపోతారు.

**************************************

ఇక్కడ సూర్య రాత్రి అంత అద్దం లో తనని తాను చూసుకొని నా శరీరాన్ని కాకుండా నా మనసు తగినవాడు నా భర్తగా వస్తాడా? నేను నా ఫామిలీ ని విడిచి వేళలా? ఎందుకు ఆడ పిల్లలే వెళ్ళాలి ! అబ్బాయి లకి ఏమైనా కొమ్ముల? ఇలా ఎన్నెనో ప్రశ్నలతో తన మదిలో అలజడి సృష్టిస్తుంటే ఆలోచనలకి సమాధానం లేదా పరిష్కారం ఏంటి దేవుడా ? ఇప్పటికి నేను చాల అవమానం హేళనలు చాల చూసాను మల్లి ఇపుడు ఇంకో పెద్ద సమాధానం లేని పరీక్షా పెడుతున్నావా ? అని బాధపడుతూ ఎప్పటికో నిద్రపోతుంది.


*************************************************

స్టోరీ ఎలా ఉందొ మీ కామెంట్స్ రూపం లో తెలుపగలరు. థాంక్ యు అల్ !


ఇంకా ఉంది