Read Love - 2 by Harsha Vardhan in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ - 2

ముందు చెప్పినట్టు తను కుందనపు బొమ్మలా తయారుగా ఉంది . అర్జున్ కి మెసేజ్ కూడా చేసింది నేను రెఢీ గా ఉన్నాను అని .

చాలా పెద్ద సాహసం చేసి మరీ ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి వాళ్ళ వీధి దాటి ముందుకు సాగుతున్నారు .

దేవుడి పుణ్యమా అని ఎవరు చూడకుండా బయటకు వచ్చేశాం అని హ్యాపీ గా ఫీల్ అయ్యారు .

తను ఇలా అంటోంది మన అర్జున్ తో ...

ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? అంది .

తను మన అర్జున్ ప్రపోజ్ చేస్తాడు అని చాల ఆశగా ఆ మాట వినడానికి సంతోషంగా ఉంది .

మన అర్జున్ “ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు బయటకు రాగానే ఎదో విషయం చెప్తాను అన్నావు .


మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు .

“ హహహ అది మాత్రం నీకు సర్ప్రైజ్ ఇప్పుడు మాత్రం చెప్పను అని కళ్ళు నలుపుకుంటూ ఇంకొక 10 మినిట్స్ అంటూ నిజంగానే టెన్ మినిట్స్ లో వారు అనుకున్నా చోటుకి చేరుకుంటారు .

“ ఎందుకంటే నువ్వు నిజంగానే ముందులాగా అసలు లేవు...... పెద్దయిపోయాక చాలా మారిపోయావు ఎప్పుడు ఇలానే ఉండు...... “ అని నవ్వుతూ చెప్పిది .

మన అర్జున్ ఇంకా తను ఇప్పుడు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డిగ్రీ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి జాయిన్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నారు .

అర్జున్ తన బుగ్గ మీద చేయి వేసి తదేకంగా సీత వైపు చూస్తూ “ నువ్వు అన్నట్టు నిజంగానే నిన్ను చూస్తూ ఉండి రోజు రోజు కీ మారిపోయాను అనుకుంటూ తనలో తాను నవ్వు కున్నాదు .

నువ్వు పరిచయం కాకముందు వరకు నాలో నాకు క్లారిటీ ఉండేది కాదు నువ్వు 7 వ క్లాస్ లో పరిచయం అయ్యావు పూర్తి క్లారిటీ వచ్చేసింది..... “ అంటూ తనని ఇంకా గట్టిగా కౌగిలిలో బిగించి సంతోషంగా ఉన్నాడు మన అర్జున్ .

తనకి అర్జున్ అంటే ప్రాణం అందుకే వాడు ఏం చేసినా తనకి పిచ్చి . అర్జున్ మొదటిసారి కౌగిలించు కోవడం తో తన ఆనందానికి అంతులేకుండా పోయింది .

తర్వాత అర్జున్ తో ఇంకా ఎన్ని రోజులు లీవ్స్ ఉన్నాయని అడగగా నాలుగు రోజులు ఉన్నాయని చెప్తే సరే అని ఆ నాలుగు రోజులు రోజు ఒకచోట ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఫిక్స్ అయ్యారు ఇద్దరు .

ఆ తరువాత రోజుకి మళ్ళీ హ్యాపీగా మన సాగర్ , సి.ఆర్ గార్డెన్స్ , లుంబిని పార్క్ , ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయారు .

అలా మూడు రోజులు బాగా తిరగడం , తిప్పి నాలుగో రోజున నుంచి అర్జున్ షాపింగ్ చేయాలి అన్నాడు ., తను తనకి కావాల్సిన షాపింగ్ చేసుకొవాదానికి నేను వస్తాను మాల్ కి వెళదాం అంది .

తనకి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఉంది నీకు అర్జున్ అంటే మరీ నీ ఇష్టం అని చెప్పగానే అర్జున్ కోసం జీన్స్ ,టీషర్ట్స్ ,జర్కిన్స్, అలాగే

తనకోసం అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సెస్ పటియాల టైప్ టాప్ వేర్ డ్రెస్సెస్ పార్టీవేర్ సారీస్ నార్మల్ సారీస్ చాలా రకాలు తీసుకొని దాదాపు 30 వేల బిల్ చేసింది .

అదంతా చూసి అర్జున్ కళ్ళు తేలేసి “ ఏంటే ఈ కొనటం??? “ అని అడిగితే తను ముద్దుగా మొహం పెట్టి “ మరి కొత్త కాలేజీ కి వెళ్లేటప్పుడు గ్రాండ్ గా ఉండాలి కదా అర్జున్ !!!!

అందుకే ఇవన్నీ అయినా నేనేమంత ఎక్కువగా కొనుక్కోలేదు జస్ట్ 30,000 అంతే...... ఆ అమౌంట్ నీకు ఎంత చెప్పు నువ్వు చేసే పనిలో నీకు వచ్చే సాలరీ యేగా నీ వన్ మంత్ శాలరి అలా తీసి ఇలా పడేసెయ్...... అలాగే నీకు ఇంకా షాపింగ్ చేద్దాం పద..... “ అంటూ ముందుకు నడుస్తూ ఉంటే

అర్జున్ తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి “ అమ్మ తల్లి నేను తెచ్చింది 35 వేలమ్మ.... కార్డ్స్ కూడా తీసుకురాలేదు నువ్వు తక్కువ షాపింగ్ చేస్తావు అనుకొని ఇంతే తీసుకువచ్చాను..... అందులో 30000 నువ్వే తీసుకుంటే 5000 కి నాకు రెండు డ్రెస్ వచ్చాయి .

అయినా నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు నువ్వు రా..... “ అని తన చేతిని పట్టుకుని బలవంతంగా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి తీసుకువెళ్లి బిల్లింగ్ వేయిస్తూ ఉంటే తను చుట్టూ ఉన్న సారీస్ ని చూస్తూ ఉంటుంది .

బిల్లింగ్ అయ్యాక తనని పిలుచుకొని కవర్స్ తీసుకొని
బయటకు వచ్చేశాడు .

తనని ఇటు చూడు అని ఒక చేతితో బైక్ ని హ్యాండిల్ చేస్తూ ఇంకో చేత్తో తన చేయి పట్టుకొని నువ్వు హ్యాపీ కదా అని అడిగాడు . నీతో సమయం గడిపితే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అంది తాను .

నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి “ అని అర్జున్ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టాడు .

తను అలా ముద్దు పెట్టేసేసరికి ఎక్సైట్మెంట్ ఎక్కువైంది అది చూసి అర్జున్ నవ్వుతూ నువ్వు నా క్యూట్ తెడ్డి బేర్ వి “ అని తన నుదిటికి అర్జున్ నుదుటిని ఆన్చి అన్నాడు .

" మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు నాతో బయటకు వచ్చి షాపింగ్ చేసిన విషయం తెలిస్తే నిన్ను చీపిరి తీసుకొని ఉరికించి కొడుతుందేమో మీ అమ్మ " అని నవ్వుతూ అన్నాడు .

తను నిజంగానే ఇమేజింగ్ చేసుకుంటే సుధ గారు చీపిరి పట్టుకొని తనని ఇల్లంత పరిగెత్తించి కొడుతున్నట్టు ఊహల్లో కనిపించి ఒక్కసారిగా బెదిరిపోయి తు తు అని భుజం తట్టుకొని “ అమ్మో ఊహిస్తెనే భయంకరంగా ఉంది అని ఏడుపు మొహం పెట్టి అంది .


అర్జున్ హాహహా అని గట్టిగా నవ్వుతూ “ ఎంత భయమే!!!! ఆ మాత్రం భయం నా గురించి కూడా పెట్టుకో ఎందుకంటే నిన్ను ఇరికించటంలో నేను ఫస్ట్ ఉంటాను కదా!!!! “ అని శాడిస్ట్రిక్ స్మైల్ ఇచ్చి “ దిగి ఇంటికి వెల్లు అన్నాడు .

తను సేమ్ ఏడుపు మొహంతో “ నువ్వు మారిపోయావు అనుకున్నాను కొంచెం కూడా మారలేదు...... నన్ను ఏడిపించే విషయంలో పీహెచ్డీ చేసి ఛాన్స్ దొరికితే చాలు ఏడిపిస్తున్నావు “ అని అంది .

ఇంకా ఉంది.....🫡

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్...... ఒకవేళ ఉంటే .