Read Radhamadhuram by Radhika in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

రాధామధురం

" ఎక్స్క్యూజ్ మీ మేడమ్!!! ఆర్డర్ ప్లీజ్!!!! " వెయిటర్ పిలుపుకి ఆలోచనల నుంచి తేరుకుంటూ అతన్ని చూసాను...

సన్నగా నవ్వుతూ చూసాడు అతను నావైపు... నేను కూడా బదులుగా, బలవంతాన చిన్న నవ్వు నవ్వి, స్యాండ్విచ్ ఆర్డర్ చెప్పి, వాచ్లో టైం చూసుకున్నాను...

అప్పటికే నేనొచ్చి పావుగంట అయ్యింది... కానీ అతనింకా రాలేదు... అసలు వస్తాడా!!?? అసలెలా వస్తాడే పిచ్చి మొద్దు... పన్నెండు ఏళ్ళు!!! సరిగ్గా పన్నెండు ఏళ్ళు అయ్యింది ఇప్పటికి....

ఇన్నేళ్ళ తరువాత నువ్వు సడెన్గా కాల్ చేసి, కలవాలి అంటే నీకోసం రెక్కలు కట్టుకొని నీ ముందర వాలిపోడానికి, ఇప్పుడతనేమీ నీకోసం పడి చచ్చిపోయే రాధ కాదు...

ఇప్పుడతనికంటూ ఓ కుటుంబం వుంది...
భార్యా!!!! పిల్లలూ!!!!! అతని ప్రపంచం వేరిప్పుడు...

" కానీ!!! ఒకప్పుడు నువ్వే ప్రపంచం కదా అతనికి... " నా మనసు సముదాయించింది నన్ను...

అవును!!! ఒకప్పుడు నా రాధకు నేనే ప్రపంచం... పడి చచ్చిపోయేవాడు నేనంటే... లేదు లేదు... తన పిచ్చి ప్రేమతో నన్ను చంపుకుతినేవాడు...

మొండోడు... మాట వినేవాడు కాదు... వాడి మాటే మనం వినాలి అంటాడు... మరిప్పుడు నా మాట విని, నాకోసం వస్తాడా!!??

మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాయి నా ఆలోచనలు... ఉఫ్ఫ్!!! ఎదురుగా వున్న వాటర్ గ్లాస్ అందుకొని దించకుండా మొత్తం తాగేసాను...

ఖాళీ అయిన గ్లాస్ టేబుల్ మీద పెట్టి చేతుల్లో మొహాన్ని దాచుకొని కూర్చున్నాను...

అప్పుడు వినిపించింది వాడి అడుగులు చప్పుడు... అవును!!! నా రాధ వస్తున్నాడు... వాడి అడుగుల చప్పుడు నేనెంత మందిలో వున్నా కూడా గుర్తు పట్టగలను...

వాడు దగ్గరగా వస్తుంటే, నా గుండెల్లో ఎదో తెలియని అలజడి... వాడిని తలచుకున్నా చాలేమో!!! ఇలానే గుండెల్లో దడ మొదలైపోతుంది...

దగ్గరకి వస్తున్నాడని తెలుస్తున్న కొద్దీ, గట్టిగా కళ్ళు మూసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకున్నాను గుండె దడను అదుపుచేసుకోడానికి... వచ్చేసాడు... నా ఎదురుగా కూర్చున్నాడు అని కూడా తెలుస్తుంది నాకు అలికిడి కారణంగా...

లోపల ఒకరకమైన సంతోషం!!!
నాకోసం ఇన్నేళ్ళ తరువాత కూడా పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చాడని...
మరోపక్క భయం కూడా!!!
ఎందుకో ఇన్నేళ్ళ తరువాత వాడిని చూడాలంటే...

కళ్ళు తెరవలేదు నేను... అలానే ఊపిరి కూడా బిగబట్టుకొని వుండిపోయాను... ఎంతకీ వాడు మాత్రం, ఒక్క మాటైనా మాట్లాడటం లేదు... నిజంగానే వచ్చాడా!!?? లేదా నేను భ్రమపడుతున్నానా!!??

భ్రమ పడుతున్నట్టున్నాను... నిజమే!!! ఎన్ని కాల్స్ చేసాడు... ఎన్ని మెసేజెస్ చేసాడు... చివరకు ఇంటి వరకూ వచ్చేసాడు... ఒక్కసారైనా పట్టించుకున్నావా వాడిని!!?? పైగా చచ్చిపోతానని బెదిరించావ్ నీ కళ్ళ ముందుకొస్తే...

ఇంత చేసిన నీకోసం, ఈరోజు వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనే అనుకుంటున్నావా!!??

" కళ్ళు తెరిచి చూడు వాడు నీ కళ్ళముందే వుంటే!!?? " మనసు చెప్పింది నా ఆలోచనలన్నిటినీ పక్కకి నెట్టేస్తూ...

లాభం లేదు... నేనే ధైర్యం చెయ్యాలి అనుకుంటూ, వేలి సందుల్లోంచి చిన్నగా ఎడమ కన్ను తెరిచి చూసాను...

" రాధ!!! " అప్రయత్నంగా పలికాను... నా చేతులు నాకే తెలియకుండా మొహం మీద నుంచి పక్కకు తప్పుకున్నాయి... లోపల భయం ఇంకా పెరిగిపోతుంది ఎదురుగా కూర్చోనున్న వాడిని చూస్తుంటే...

కొట్టేట్టు చూస్తున్నాడు నన్ను.. కాదు కాదు.. చంపేసేట్టు... అసలు!! అసలు వాడి చూపులు ఎలా వున్నాయి అంటే!!! నన్ను కాల్చేసే శక్తి వాటికున్నట్టు... భయంతో గుటకలు మింగుతూ వాటర్ గ్లాస్ అందుకున్నాను... అబ్బే!!! గ్లాస్ ఖాళీ... ఇందాకే కదా తాగేసాను...

వణుకుతున్న నా చేతి ముందు వాటర్ గ్లాస్ పెట్టాడు... తీసుకొని తాగేసాను దించకుండా మళ్ళీ...
ఇంతలో బేరర్ వచ్చాడు నేను ఆర్డర్ చేసిన స్యాండ్విచ్ పట్టుకొచ్చి నా ముందు పెట్టాడు...

" ఎనీ థింగ్ ఎల్స్ మ్యామ్!!! " వాడి ప్రశ్నకు సమాధానంగా తలను అడ్డంగా ఊపి, పొమ్మన్నట్టు చేతిని ఊపాను...

" ఓకే మ్యామ్!!! " వినయంగా చెప్పి బేరర్ మరో టేబుల్ దగ్గరకి వెళ్ళిపోయాడు...

నా ముందించిన ప్లేట్ తన ముందుకు తీసుకున్నాడు రాధ... బిత్తర చూపులు చూసాను వాడి వైపు...

" రానని ఫిక్స్ అయినట్టున్నావ్.. అనవసరంగా వచ్చాను... " అంటూ స్యాండ్విచ్ బైట్ చేసాడు...

కళ్ళు పెద్దవి చేసి, తలను అడ్డంగా, లేదు లేదు అడ్డ దిడ్డంగా ఊపేసాను...

ఆరాంగా తింటూ అన్నాడు మళ్ళీ వాడే...
" ఇంకా ఈ గడ్డి తినడం మానలేదా నువ్వు అని... "

" బానే తింటున్నావు కదా మరి నువ్విప్పుడదే గడ్డిని... " అనాలని వున్నా కూడా, గుటక వేసి మరీ గొంతుదాకా వచ్చిన మాటను, మింగేసాను లోపలికి...

కను బొమ్మలు ఎగరేసాడు నా కళ్ళల్లోకి చూస్తూ ఏంటన్నట్టు... నేనేం లేదన్నట్టు మళ్ళీ నా తలను
అడ్డదిడ్డంగా ఊపేశాను... చూపుల్ని మరల్చేసాను అతని పైనుంచి...

చక్కగా తినేసాడు మూడు ముక్కల్లో మొత్తం స్యాండ్విచ్ ని.. కనీసం నేను తింటానో లేదో కూడా చూడకుండా... ఒళ్ళు మండిపోతోంది నాకు... వీడు మారడని తిట్టుకుంటూనే, ఇక ఆకలికి ఆగలేక మళ్ళీ బేరర్ ని పిలిచాను...

" ఎక్స్క్యూజ్ మీ!!! " నా పిలుపు నాకే వినిపించనంత చిన్నగా పిలిచాను... మాట గట్టిగా బయటకు రావట్లేదు... వణుకు మాత్రం వస్తుంది షివర్ అవుతున్న నా కాళ్ళను దగ్గరకు ముడుక్కుంటూ చీర కుచ్చిళ్ళు సర్దుకొని కూర్చున్నాను...

" బేరర్!!! " ఖంగు మనేలా వినిపించింది వాడి టోన్...

కళ్ళెత్తి చూసాను వాడిని... నన్నే చూస్తూ వున్నాడు తీక్షణంగా... నా కళ్ళల్లోకే చూస్తూ వున్నాడు... ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ ఇప్పటికీ తగ్గలేదు... ఒకప్పడు నన్ను చూసే వాడి కళ్ళల్లో నాకేం కనిపించేదో, ఇప్పుడూ అదే కనిపిస్తుంది...

ప్రేమ!!! ఇష్టం!!! వాడెంత కోపంగా వున్నా కూడా, వాడి కళ్ళల్లో మాత్రం నాపై ఇష్టాన్ని మాత్రం చూడగలను నేను ఒకప్పుడు...

ఇప్పుడు కూడానా!!?? లేదు లేదు... పన్నెండు సంవత్సరాల క్రితం మాట ఇది...
ఇప్పుడు మేమిద్దరం????? ఒకరికొకరం ఏమీ అవ్వము... అవ్వమా!!?? తనకీ, నాకూ మధ్య ఏ బంధం లేదా!!?? లేదు!!! ఆ కథ ఎప్పుడో ముగిసిపోయింది...

" హెలో పాప!!! " వాడి పిలుపుకి ఆలోచనల నుంచి తేరుకొని, కనుబొమ్మలు ముడిచి చూసాను గుర్రుగా...

" పాపేంటి పాప!!?? " కొంచెం కోపంగా అడిగాను...

ఒక్క కనుబొమ్మను ఎత్తి చూశాడు నన్ను... మాటక్కర్లేదు నన్ను భయపెట్టడానికి... ఆ చూపులు చాలు... అయినా ఇప్పుడు నేనెందుకు వీడిని చూసి భయపడాలి అసలు... ఉక్రోషంగా అనుకుంటూ మొహం ముడుచుకొని చూసాను...

బేరర్ వచ్చాడు మళ్ళీ మా దగ్గరకు...
" ఆ గడ్డే కావాలా నీకు... " అడిగాడు నన్నే చూస్తూ... ఆ మొహంలో ఏ భావం పలికించడు...
కానీ వాడి మాటకి ఈ బేరర్ మాత్రం మొహం పక్కకు తిప్పుకొని నవ్వాపుకుంటున్నాడు...

నాకు కోపం తన్నుకొచ్చేస్తుంది... ఐస్ క్రీం!!! అసహనంగా చెప్పి, మొహం పక్కకు తిప్పుకున్నాను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని...

" హుమ్మ్!!! అవసరమే ఇప్పుడు నీకు ఐ.......స్ క్రీం... " సాగదీస్తూ అన్నాడు, వెటకారం మిక్స్ చేసి...

" వీడి నోట్లో గొడ్డుకారం కొట్టనూ... సచ్చినోడు!!! అస్సలే మారలేదు... డిక్కీ కిందకు ముప్పై అయిదేళ్ళు వచ్చినా కూడా... "

" నీకు ముప్పై రెండేళ్ళు వచ్చినా కూడా నువ్వూ మారలేదు కదా... " వాడి మాటకి గొనుగుడు ఆపి, కళ్ళు తెలేసాను...

" మర్చిపోయాను.. వీడివి పాము చెవులు కదూ... ఎంత చిన్నగా గొనిగినా వీడి చెవుల్ని చేరిపోతాయి... " ఈసారి మాత్రం మనసులో తిట్టుకుంటూ, ఓ వెర్రి నవ్వు నవ్వాను...

అదే ఇంటెన్స్డ్ లుక్ తో చూస్తున్నాడు నన్ను... తెలియకుండానే చూసాను వాడిని పరీక్షగా ఒక్క క్షణం... వెంటనే చూపుల్ని పక్కకి మరల్చేసాను వాడు నేను చూడటం కనిపెట్టేస్తాడని...

కానీ కనిపెట్టేసాడు.. వెంటనే అడిగాడు..............
" హ్యాండ్సం గా వున్నాను కదా!!! " అని...

మూతి తిప్పాను నేను సమాధానం ఇవ్వకుండా... నవ్వాడు వాడు సన్నగా... మళ్ళీ చూసాను... ఇప్పుడు మాత్రం నా చూపుల్ని అస్సలు పక్కకి మరల్చలేదు... నిజానికి ఇష్టంగా చూసాను వాడినిప్పుడు నేను...

వాడు నవ్వితే నాకు చాలా ఇష్టం... ఇప్పుడే కాదు... ఎప్పుడూ కూడా... చాలా అందంగా వుంటాడు... మొదటిసారి నేను వాడిని చూసినప్పుడు!!!!! అప్పుడప్పుడే వస్తున్న కోరమీసాలు, గడ్డం... మంచి ఎత్తు... రంగు కూడా!!! మరీ ఎక్కువ రంగు కాదు గానీ, చామన్ ఛాయ రంగు... కానీ ఎదో తెలియని ఆకర్షణ వాడి మొహంలో... ముఖ్యంగా నవ్వినప్పుడు ఇంకా అందంగా కనిపించాడు... కళ్ళు కూడా నవ్వుతాయి...

ఇప్పుడు కూడా... అంతే అందంగా కనిపిస్తున్నాడు... ఆ మీసకట్టు... ట్రిమ్ చేసిన బియర్డ్... పదునైన చూపులు... తప్పేమో ఇలా నేను వాడిని చూడటం... వాళ్ళావిడకు తెలిస్తే!!!! తన భర్తను మరో ఆడది ఇలా చూస్తుందని... ఛ!!! ఛ!!! ఏం చేస్తున్నాను నేను...

" నేను చాలా గుడ్ లుకింగ్ అండ్ హ్యాండ్సమ్ అని నాకు తెలుసు... కానీ మరీ అలా తినేసేలా చూడకు... కొంచెం ఎంబారిసింగ్గా వుంది... "

వాడి మాటలకు నాకు పిచ్చి లేచింది...
" అబ్బో!!! చెప్పావులే!!! గుడ్ లుకింగ్ అంట.. హ్యాండ్సమ్ అంట... అద్దంలో చూసుకున్నావా అసలు ఆ మొహాన్ని ఎప్పుడైనా... పిల్లల్ని ఎత్తుకుపోయే బూచోడిలా వున్నావ్ నిజానికి... నువ్వూ, నీ మొహం.. హు!!! " మూతి తిప్పేస్తూ అన్నాను కోపంగా... నిజానికి అది ఉక్రోషం అనాలేమో!!! ఏమో!!! నాకే తెలియట్లేదు...

మర్చిపోతున్నాను వాడి కళ్ళముందున్న ఈ క్షణం నేను మా ప్రేమ కథ ఓ చెదిరిపోయిన కల అని... మిగిలిపోయిన జ్ఞాపకమని...

ఇక ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా, వాడితో నేను పిలిచిన కారణం చెప్పి, మాట్లాడవలసింది మాట్లాడి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి... లేదంటే పాత జ్ఞాపకాలు నేను చంపుకున్న నా ఇష్టాలను మళ్ళీ నాకు పరిచయం చేస్తున్నాయి...

అసహనంగా అనుకుంటూ, గట్టిగా శ్వాస తీసుకున్నాను...

" నీతో మాట్లాడాలి నేను... " చిన్నగా అన్నాను పెదవులు తడుపుకుంటూ...

తీక్షణంగా చూస్తూ వున్నాడు నన్ను వాడు... వీడి కళ్ళల్లోకి చూస్తే నేను ఖచ్చితంగా మాట్లాడలేను... అనుకుంటూ నా చూపుల్ని పక్కకు తిప్పేసి,

" రాధ!!! నాకు నీ సహాయం కావాలి... " ఇక అడిగేసాను నేరుగా నేను అడగాలి అనుకున్నది...

" నాకు నువ్వు కావాలి... ఫర్ వన్ నైట్... "

నేనేం విన్నానో నాకే అర్థం కాలేదు... బొమ్మలా బిగుసుకొని, తెల్ల మొహం వేసి చూసాను నేను వాడిని...

అదే ఇంటెన్స్డ్ లుక్ తో చూస్తున్నాడు నన్ను... బహుశా నేను విన్నది నిజం కాదేమో!!! అనుకుంటూ వుండగానే...................

" ఈ నైట్ కి నీకు ఓకేనా!!?? " ఒక్క ముక్కలో తేలిగ్గా అడిగేశాడు...

ఇక నా రియాక్షన్.......................

తరువాయి భాగంలో తెలుసుకోండి...