Read Kaapari - 1 by Garika Srinivasu in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కాపరి - 1

ఒక గుడిలో ఇద్దరూ ముసలివాళ్ళ ప్రార్థనతో ఈ కథ మొదలవుతుంది.దేవుణ్ణి ఇలా కోరుకుంటారు ఎంతోమందికి సాయం చేసి ఎందరో రైతులను ఆదుకున్నారు దారితప్పుతున్న వాళ్ళని ఒక దారికి తెచ్చారు అలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష.అని ఏడుస్తూ దేవుని కోరుకుంటారు,ఒక ఇంట్లో మంచం మీద ఒక పెద్దాయన రాజరామ్ ని పిలవండి అని రొప్పుతూ అంటారు.5 నిమిషాల తరువాత రాజరామ్ గారు వచ్చి అయ్యా అని బాధతో వస్తారు.రాజ నా చావు నాకు కనపడుతుంది,రమేష్ వాళ్ళ పిల్లల్ని దారిలో పెట్టమని నాతో చెప్పారు నేను ఆ పని నీకు అప్పగిస్తున్నాను అని దగ్గుతూ చెప్తారు అయ్యా నిన్ను నేను బ్రతికించుకుంటాను నీకేం కాదు అని రాజరాం అంటారు.రాజ వాళ్ళని నువ్వే మార్చాలి అని రెండు సార్లు చెప్పి రాజరాం గారి చేతిలో చెయ్యివేసి తుదిస్వాస విడుస్తాడు.రాజరాం కళ్ళు మూసుకుని మీ కోరిక నేను తీరుస్తాను అని మనసులో అనుకుంటాడు అప్పుడు రాఘవేంద్రగారు చనిపోయిన విషయం రమేష్ గారికి చెప్తారు అందరు వచ్చి అంత్యక్రియలు జరిపిస్తారు.
అది అలా ఉండగా ఒకతను పరిిిిగెత్తుకుంటూ వచ్చి రేయ్ అజయ్ అక్కడ గొడవ జరుగుతుంది అని అనగాాానే అప్పుడు అజయ్ తన మిత్రులు పరిగెత్తుకుంటూ గొడవ దగ్గరకు వస్తారు చక్కని కలిపి పది మంది కొడుతువుంటారు అప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి ఆపండి అని గట్టిగా అరవగానే వాళ్ళంతా ఆగి పోతారు కానీ ముగ్గురూ మాత్రం కొడుతూనే ఉంటారు ఆపండ్రా అని గట్టిగా అరవగానే ఆపేస్తారు ఏం జరిగింది అని ప్రిన్సిపాల్ అడగానే,వాళ్ళ గ్రూప్ లో వాడు మా గ్రూప్ లో అమ్మాయి కి ప్రపోస్ చేసాడు సార్ అని మానస్ చెప్తాడు నువ్వేమంటావ్ అమ్మా ఒక్క కంప్లయింట్ ఇవ్వు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ప్రిన్సిపాల్ చెప్తారు,నేను అతని ప్రేమిస్తున్నాను అతని వది లేయండి అని చెప్పి నందిని ఏడ్చుకుంటూ వెల్లిపోతుంది.మీరు ఎప్పటికీ మారరు క్లాసుకి వెళ్ళండి అని చెప్పి వెళ్తారు.తరువాత మీరు ఎన్ని చేసిన ఇన్నాళ్ళూ ఊరుకున్నాం ఈ సారి కదిలిస్తే మీకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇస్తాను ఎస్ స్పెషలీ మీ ముగ్గురూ కీ చెప్తున్నా ఈ గొడవంతా మీ వల్లే మీకు మావులుగా ఉండదు అని అజయ్ వార్నింగ్ ఇస్తాడు ఆ మాటకి ఆ ముగ్గురూ వెటకారంగా తలవూపి క్లాసుకి వెళ్తారు, రమేష్ వాళ్ళ ఇంటి దగ్గర రాజరాం గారు మీ పిల్ల లకి భయం మీరు భయం చెప్ప లేక పోతున్నారని వాళ్ళు మీ మీద తిరగ బడు తున్నారనీ చెప్పారు, ఏం చేయ మంటా రండి తల్లి తండ్రి గురువు ధైవం అనే భక్తి వాళ్ళ కి లేదు నేను ఒక తండ్రి గా ఓడి పోయాను మీరేమన్నా చేయ గలిగితే చేయండి సార్ అని రమేష్ గారు బాధ పడతారు, వాళ్ళ కాలేజీ కీ వెళ్దాం పదాండి అని రాజరాం గారు రమేష్ గారు కాలేజీ దగ్గరకు వెళ్తారు కాలేజీ కీ వచ్చిన తరువాత ప్రిన్సిపాల్ రాజరాం గారిని చూసి ఆశ్చర్యపోయి రాజు గారు మీరు ఇలా వచ్చారు ఏంటి అని అడుగుతాడు , అయ్య గారు కట్టించిన కళాశాల ఇది అందరు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలే కానీ ఎవరు చెడు మార్గంలో వెళ్ళకూడదు అనే వచ్చాను ఈ కాలేజీలో మాటవినని వాళ్ళు లిస్ట్ కావాలీ అని రాజరాం గారు అంటారు తప్పకుండా మీరడిగితే లేదంటానా ఆయన కోరుకున్న వన్నీ జరగాలి తప్పకుండా చెప్తాను అని చెప్పి స్టాఫ్ కీ ఫోన్ చేసి వివరాలు పంపండి అని అంటాడు 5 ని మిషాలు ఎదురు చూసిన తరువాత లిస్ట్ వస్తుంది దానిని చూసి ఎక్కువ మంది లేరు కానీ నలుగురు మాత్రం మెయిన్ అండి వారి పేర్లు చెప్పగలరా అని రాజరాం గారు అడుగు తారు అమర్, అభి, మానస్, అజయ్ వీళ్ళ నలుగురి వళ్ళ కాలేజ్ కీ చాల ఇబ్బంది గా ఉంటుంది వీళ్ళ అమ్మా నాన్న లకు చెప్పిన ఎలాంటి ఉపయోగం లేదు అయ్యగారిని ఒక సారి రమ్మని కబురు పెట్టాను తీరా అలా జరిగి పోయింది సార్ అని ప్రిన్సిపాల్ చెప్తారు ఆయన చెయ్య లేకపోయిన పనిని నేను చేదాం మని వచ్చాను రాజు గారు ఆ నలగురిలో ముగ్గురూ మా పిల్లలు అండి అని రమేష్ గారు చెప్తారు. వీళ్ళు ఎంత ప్రమాదం అంటే ఆడపిల్ల ల్నీ ఏడి పించడం టీచర్స్ నీ ఎగతాలి చేయడం అన్ని చడ్డ పనులు ఈ కాలేజీలో చేసేది ఈ నలుగురే అని ప్రిన్సిపాల్ చెప్తారు. జింకని చంపాలంటే పులి లేదా సింహం , అదే ఆ పులిని, సింహాన్నీ చంపాలంటే వేటగాడు రావాలి అలాగే మంధబుధ్ధి గల గొర్రె మారాలంటే కాపరి రాక తప్పదు అని ప్రిన్సిపాల్ అంటారు మీరు చెప్పి నట్టే ఆ గొర్రె లకు తగ్గ కాపరిని తీసుకు వస్తాను అని చెప్పి రాజరాం గారూ వెళ్తారు. ....
Wait For Episode 2

Written By
G.Srinivasu