Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆమె కథ(వ్యధ) - 1

 
సిరి ఆంటీ ఇంకా రాలేదా?? త్వరగా రావే మీటింగ్ కి టైమ్ అవుతుంది.. అని గంట నుండి పిలుస్తున్నా రాకపోవడంతో!! విసుగ్గా అంటుంది ప్రీతి.

ఒక్క ఫైవ్ మినిట్స్ నే... ప్లీజ్ !! అమ్మ వస్తానని చెప్పింది.... అని టెన్షన్ గా గోళ్ళు కోరుకుతూ అంటుంది ఆమె.

సరే ఒన్లీ ఫైవ్ మినిట్స్.... ఒకవేళ నువ్వు రాకపోతే నీకోచ్చే అవార్డ్ నేను తీసేసుకుంటాను.

కాని ప్రీతి మాటలు ఆమె చెవిక్కేకితే కదా?? ఆమె చూపు మొత్తం తన తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులోనే పావుగంటని గడిపేస్తుంది.

బి. టెక్ ఫైనల్ ఇయర్ లో స్టెట్ టాప్ రాంకర్ గా వచ్చిన
" మిస్. సిరి కమ్ టు ద డయాస్ ". మైక్ లో నుండి పిలుస్తూ ఉంటారు కాలేజ్ డైరెక్టర్.

తన పేరు వినిపించడంతో ప్రీతి కంగారుగా ఆమెని లాక్కుని వెళ్తుంటే!! ఎంట్రన్స్ వైపు బాధగా చూసి!! మిటింగ్ హల్ కి వెళ్తుంది సిరి.

ఒకవైపు ఆమె గురించి గోప్పగా చెప్తుంటే,, మరోవైపు ఎందరో హర్షద్వానాలు మధ్యలో !! విధ్యా శాఖామంత్రి చేతుల మీదగా అవార్డ్,, అండ్ గోల్డ్ మెడల్ ని తీసుకుంటుంది సిరి. ఆమె మెడల్ తీసుకునే ముందు కూడా ఇంత సంతోషకరమైన మూమెంట్ తల్లి లేనందుకు బాధగా ప్రీతి వైపు చూస్తుంటే !! మీడియా వైపు చూపించి నవ్వమని చెప్తుంది.
ఆమె కష్టంగా నవ్వడంతో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ !! అమ్మ సిరి నీ హయ్యర్ స్టడీస్ అన్ని ఇక నుండి మంత్రిగారే చూసుకుంటారు. అని మైక్ లో చెప్పడంతో!! థాంక్యూ సో మచ్ సార్ అని హ్యపీనెస్ తో ఆయనకి నమస్కారం చేస్తుంది సిరి.
ఫంక్షన్ అయిపోయాక !! ప్రీతి,, సిరి స్కూటీ మీద వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వడంతో !! సిరిని లోపలికి రాకుండా గుమ్మంలోనే ఆపుతూ !! ఆమెకి అందరి దిష్టి పోయేలా దిష్టి తీసి లోపలికి తీసుకోస్తారు కమల గారు.
ఏంటి పిన్ని ఇదంతా??
అదేంటి తల్లి అలా అంటావ్... ఎందరి కళ్ళు పడ్డాయో నీ మీద ?? మీ అమ్మ చాలా సంతోషిస్తుందే ?? అని ఆమె నుదుటిన ముద్దు పెడుతూ అంటారు.
పిన్ని ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడకు. కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సిరి.
ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ!! ఎమైందే దీనికి?? ఇంత కోపంగా ఉంది.
అమ్మ పెద్దమ్మ రాలేదని సిరి చాలా బాధపడింది. కాసేపు దానిని ఒంటరిగా వదిలేయ్ అని ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తుంది ప్రీతి.
కమల బాధగా సిరి వైపు చూస్తూ!! వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుని వంటింట్లోకి వెళ్తారు.


@@@@@@


సిరి బాధగా బెడ్ మీద పడుకుని!! నీ గురించి ఎంత వెయిట్ చేసానో తెలుసా అమ్మ.... ఇలాంటి హ్యపీ మూమెంట్స్ లో నువ్వు లేకపోతే ఎలా?? అని బాధగా అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూస్తుంది.

కమల,, రాజీవ్ గారికి ప్రీతి సోంత కూతురైతే,, సిరి అక్క కూతురు. పసిగుడ్డులా ఉన్నప్పుడు కమల గారు సిరిని ఇంటికి తీసుకురావడంతో!! రాజీవ్ గారు భార్య కళ్ళల్లో కన్నీళ్ళు చూసి!! సిరిని చేతిలోకి తీసుకుంటారు. ఎక్కడ వ్యత్యాసం చూపించకుండా ఇద్దరిని సోంత బిడ్డల్లానే చూసుకుంటూ ఆనందంగా ఉంటారు నలుగురు.
ఆ మర్నాడు ఉదయాన్నే సిరి లేచే సరికి ఫోన్ లో వాయిస్ మెసెజ్ ఉండటంతో!! తన కోపాన్ని అంతా మర్చిపోయి ఆ మెసెజ్ ని ఆన్ చేస్తుంది ఆమె.

" సిరమ్మ ముందుగా నీకు మెడల్ వచ్చినందుకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు కూడా నీ మీద ఎల్లపుడూ ఉండి నువ్వు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను.....
నన్ను క్షమించరా సిరమ్మ.... ఆఖరి నిమిషం వరకు నీ దగ్గరికి రావడానికి ప్రయత్నించాను. కాని ఇక్కడ పని వల్ల రావడానికి కుదరలేదు... మీ అ‍మ్మని క్షమిస్తావు కదూ?? కాని నేను నిన్ను చూసాను తల్లి.... చాలా అంటే చాలా అందంగా ఉన్నావు... నా దిష్టే తలుగుతుంది.... కాని నీ కళ్ళల్లో నేను కనిపించలేదని బాధ కనిపించింది తల్లి.... నీకు సంతోషాన్ని ఇవ్వలేని నీ తల్లిని క్షమించు సిరమ్మ..... ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి నువ్వు.... ఉంటాను తల్లి.... జాగ్రత్తగా ఉండు.... తెలియని వాళ్ళతో మాట్లాడకు !! అని ఎండ్ అవుతుంది ఆ మెసెజ్.

తన తల్లి మాటలలో బాధ తెలుస్తుంటే!! ఆమె రికార్డ్ ఆన్ చేస్తూ!! ప్లీజ్ అమ్మ నువ్వలా మాట్లాడకు... నువ్వు కష్టపడేది నా గురించే కదా?? నేను అర్థం చేసుకుంటాను నిన్ను. నిజంగా చాలా హ్యపీగా అనిపించింది నాకు మెడల్ రావడం... నీ పేరు నిలబెడతాను అమ్మ... ఐ లవ్ యూ సో మచ్ అని ఆ రికార్డ్ ని సెండ్ చేస్తుంది సిరి.
వాళ్ళ అమ్మ మీద ఎంత కోపం ఉన్నా!! రోజు ఉదయాన్నే తన తల్లి వాయిస్ వింటే చాలా హ్యపీగా అనిపిస్తుంది సిరి. కాలేజ్ హలీడెస్ ఇవ్వడం వల్ల రెడీ అయ్యి బయటకు రావడంతో!! కమల గారు ఆమెని కూర్చోపెట్టి టిఫీన్ వడ్డిస్తారు.
పిన్ని ప్రీతి ఇంకా లేవలేదా??
లేదు సిరి... హలీడెస్ కదా?? పది అయినా లేవదు అది. కోపంగా అంటారు.
పోనిలే వదిలేయ్ పిన్ని... బాబాయ్ షాప్ కి వెళ్ళారా??

వెళ్ళారు తల్లి.

సరే పిన్ని నేను షాప్ కి వెళ్తున్నా అని రాజీవ్ గారి దగ్గరికి వెళ్తుంది ఆమె.
రాజీవ్ గారిది పెద్ద సూపర్ మార్కెట్ షాప్.... సిరికి కాలేజ్ లేనప్పుడు షాప్ కి వెళ్ళి ఆయనకి హెల్ప్ చేస్తుంటుంది.
గుడ్ మార్నింగ్ బాబాయ్??

వెరీ గుడ్ మార్నింగ్ తల్లి....

వర్క్ ఉందా బాబాయ్ ??

ఈ లెక్కలు క్లారిఫై చెయ్ తల్లి.... షాప్ కి సరుకు వచ్చింది... ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తారు ఆయన.

కంగ్రాచ్యులేషన్స్ బటర్ప్లై !! నవ్వుతూ అంటాడు అతను.

సిరికి పెదవులపై నవ్వు రావడంతో!! చిరునవ్వుతో అతని వైపు చూస్తూ!! థాంక్యూ సో మచ్ సమీర్.

పార్టీ లేదా మరి??

ఏం కావాలి??

ఏం ఒద్దు కాని!! ఈవినింగ్ ***** హోటల్ లో పార్టీ ఉంది.... నువ్వు తప్పకుండా రావాలి అని రాజీవ్ గారు రావడంతో!! ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోతాడు సమీర్.

ఇంకా ఉంది ......