Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా కలల నందనవనం. - 3

మీ నందనవనాన.....


లేత గులాబీ వర్ణం
పులుముకున్నా ఆమె పెదవులు.
తేనెలూరే, మకరందం
నింపుకున్న ఆమె పెదవులు.
వర్ణించలేని రుచి
ఆ పెదవులకు సొంతం.

ఆమె అతని పట్టులో, ఒదిగిపోయింది.
అతని గుండెలకు, దగ్గరగా చేరిపోయింది.
తొలిముద్దు తమకంలో, తెలియాడుతుంది.
కలిపిన అదర యుద్ధానికి, సాయమవుతున్నది.

అంతకుముందు తాకి తాకకుండా తాకిన ఆమె పెదవుల స్పర్శకి, తుళ్ళిపడ్డ అతను.. ఇప్పుడు పూర్తిగా అందుకున్న, ఆమె పెదవుల రుచిని ఆస్వాదిస్తున్నాడు.

ఏ రంగులు అద్దని సహజమైన గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె పెదవులను చూసి.. అంతకుముందే చూపు తిప్ప లేకపోయినా వాడు, ఇప్పుడు ఆ పెదవులతోనే, తన పెదవులను జత కలిపి, అందులోని మకరందాన్ని ఆగ్రణిస్తున్నాడు.

అద్భుతమైన వర్ణించలేని ఆ పెదవులు రుచికి మరింతగా ఆమె కోమలమైన పెదాలను, తన పెదవుల మధ్య బంధిస్తున్నాడు.

ఎంగిలికి ఇంత రుచి ఉంటుందా?? లేదా, ఆ పెదవులకి ఈ రుచి సొంతమా..?? అది ఏదైనా కానీ.. అతనికి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.

ఆ మకరందం అతని గొంతు దిగుతుంటే, ఎప్పుడూ చవిచూడని రుచితో, అమృతాన్ని మింగుతున్నంత తృప్తిగా అనిపిస్తుంది. ఆ మకరందాన్ని మరింతగా అందుకోమంటు, అతనిని ఆ రుచి ప్రేరేపిస్తుంది.

చెప్పలేని మధురమైన రుచితో తనని ఊరిస్తున్న, ఆ అదర సుధలను మరింతగా జుర్రుకుంటూ, అతని అన్వేషణ ముందుకు సాగుతుంది.

తన ఇష్ట సకుడితో, జరుగుతున్న అదర యుద్దంలో ఆమె పూర్తిగా సహకరిస్తుంది.

బిగుస్తున్న అతని పెదవుల స్పర్శలో.. బిగుతుగా ముడిపడుతున్న, తమ ప్రేమ బంధాన్ని, మరింత ఇష్టంగా ఆహ్వానిస్తుంది.

ఆమె చుట్టూ బిగించిన అతనిపట్టు ఏమాత్రం సడలకుండా, అతని మెడ చుట్టూ ఒక చేతిని హారంలా మార్చి, అతనిని అల్లుకుపోతుంది.

మరొక చేతితో అతని మెత్తని, ఓత్తయిన, జుట్టుని తన వేళ్ళ మధ్యన బంధించి, ఆ పట్టుతో.. అతనిని మరింతగా తన వైపుకు పొదువుకుంటుంది.

ఆ క్షణం, ఆమెకు ఇంకేమీ గుర్తుకు రావడం లేదు. అంతా మరిచిపోయేంత గా, అతని మత్తులో మునిగిపోయింది.

ఆ ఆదరచుంబనంలో, వెచ్చగా ఆమె గొంతు దిగుతున్న సురభి, మత్తుగా ఆమె శరీరమంతా పాకేస్తుంది. ఆ మత్తుతో మరింతగా అతని మాయలోకి జారిపోతుంది.

కోమలమైన ఆమె పెదవుల మీద అతను మీసాల ఓరిపిడికి, చిరు మంట చెలరేగుతున్న, మొదటిసారి అనుభవంలోకి వచ్చిన ఆ చిరు మంట కూడా ఆమెకు గమ్మత్తుగా అనిపిస్తుంది.

అమృత అన్వేషణలో మరింత ఉద్రేకంగా ముందుకు సాగిపోతున్న అతను లోతులను వెతుకుతూ అక్కడ తచ్చాడుతున్న ఆమె నాలుకతో, అతని నాలుకను ముడివేశాడు.

వెచ్చగా ఒకదానితో ఒకటి పోటీపడుతూ పెనువేసుకుపోతున్న, ఆ రసజ్ఞ ఆట.. ఇద్దరికీ సరికొత్తగా ఉంది. జిహ్వ కి కొత్త రుచిని అందిస్తూ, వాటి పొడవును కొలుస్తూ.. మరింతగా వాటిని ముడివేసి మెలితిప్పుతున్నారు.

ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గడం లేదు. బలమైన అతని చేతిపట్టు, ఆమె నడుము చుట్టూ, మరింతగా ఒత్తుతుంది. ఆమె గుప్పిట అతని కుర్తాని బిగించి పట్టి, మరింతగా తన వైపు హత్తుకుంటుంది.

నేలను తాగుతున్న ఆమె పాదాలకు కూడా అతను కష్టం కలగనివ్వదల్చుకోలేదు. అందుకేనేమో ఆమె నడుమును చుట్టుకుపోయిన, ఆ ఒక చేతితోనే ఆమెను పైకెత్తి ఒడిసిపట్టుకున్నాడు.

గాలిలో తేలుతున్నాయి, ఆమె పాదాలు. తనని బిగిసిపట్టిన, అతని చేతిలో బందీగా మారి, అతని ఎదకి అతుక్కుపోయింది.

అధరాల కలయికలో, అమృతాన్ని ఆస్వాదిస్తున్న వారిద్దరికీ, గుండె లయలకి ఊపిరి అవసరమన్న విషయం మరిచారు.

భారమవుతున్న, గుండెకి వారిలో ఉన్న ఊపిరిని ఒకరికి ఒకరు పంచుకుంటూ.. సాయం అవుతున్నారే తప్ప, ఆ పెదవుల కలయికని చెదరినివ్వదల్చుకోలేదు.

అతని ఉద్రేకం లో ఆమె ఊపిరి కోసం, ఉగిసిలాడుతుంది.
అతని పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉండి, బలంగా ఊపిరి తీసుకుంటున్నాడు.

ఇక తన వల్ల కాదు అని నిర్ణయించుకున్న క్షణాన.. ఆమె తన చేతితో, అతని ముఖాన్ని వెనక్కి తోస్తుంది. మరొక చేతితో అతని భుజాల మీద కొడుతుంది.

తనది కానీ, సరికొత్త లోకంలో అమృత కలశాలతో అధిరోహించిన అతనికి ఆస్పర్శ తెలిసిన క్షణం. నెమ్మదిగా ఆమె పెదవులను వదిలాడు.

కానీ ఇద్దరిలో, ఏ ఒక్కరు దూరం జరగలేదు.

ఇద్దరు వేగంగా, తెరిచిన నోటితో ఊపిరి తీసుకుంటున్నారు.

అతని కన్నా, ఆమె మరి కాస్త ఎక్కువగా, భారంగా గాలిని పట్టి వదులుతుంది.

ఆమె ముఖానికి తన ముఖాన్ని ఆనించి అలాగే, ఉండిపోయాడు అతను.

నుదురుని, నుదురు తాకుతుంది.
ముక్కుని, ముక్కు తాకుతుంది.
పెదవులను, పెదవులు తాకుతున్నాయి.
ఇద్దరు కళ్ళు మూసుకుని, ఉండిపోయారు.
అతను ఆమెను, కిందకి దించలేదు.
ఆమెకు కూడా, దిగాలని లేదు.

ఒక చెయ్యి ఆమె నడుము చుట్టు, బంధంగా అల్లుకుపోయింది. అతని మరొక చెయ్యి ఆమె మోమును భద్రంగా పొదివి పట్టుకుంది.

ప్రేమ, ప్రణయం నిండిన వెచ్చని అతని సాంగత్యంలో, ఆమెకు స్వర్గంలో ఉన్నట్టే ఉంది. ఇంతకుమించి ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.

వారిద్దరి మధ్య వేగంగా కదులుతున్న, ఊపిరి పయనం. అంతకుమించి, వేగంగా సవ్వడి చేస్తున్న, గుండె లయలు. ఇద్దరి కౌగిలి మధ్య, మంద్రంగా పలకరిస్తున్నాయి.

చల్లని చిరుగాలి.. వారిద్దరి చుట్టూ చేరిన తాపాల వేడిని తగ్గించలేక, వారి మధ్యన చేరలేక, మందగమనంతో ముందుకు సాగిపోతుంది.

పెదవులు నాలుగు, ఏవేవో వుసూలాడుకుంటున్నాయి.
తనువులు రెండు, మరింకేదో కావాలని పరితపిస్తున్నాయి.
ఇద్దరి మనసులు, మత్తుగా ఉసిగొలుపుతుంటే,
ఇరువురి మొహాలు, వెచ్చగా తపనలు రగిలిస్తున్నాయి.

బాలా ....,,,,,''''''......''''',,,,,,.......

ఆమె గుండె జల్లుమంటు తెలియని కొత్త రాగాలు పలుకుతుంది. అంత మత్తుగా ఉంది అతని పిలుపు.

ఉ... అంటూ, ఆమె పలికింది.
కానీ, ఆ స్వరము ఆమె గొంతు దాటలేదు. వెచ్చని ఊపిరి మాత్రమే నిట్టూర్పుగా, అతనిని తాకింది.

బాలా,,,,,,,'''''''',,,,,,,,''''''',,,,,,''''''........

మళ్లీ అంతకన్నా... ఎక్కువ తుళ్ళింత కలిగిస్తున్న, అతని గొంతులోని భావానికి. తన స్వరము అతనిని చేరలేదని తెలిసిన మనసుతో, కళ్ళు తెరిచి అతనిని చూస్తుంది.

అతని కళ్ళు ఎన్నో, చెబుతున్నాయి. చూపులతోనే ప్రణవాస్త్రాలు సంధిస్తున్నాడు. అతని చూపులతో, కలిసిన ఆమె చూపులను నిలువరించలేక, సిగ్గుతో నేల దించేసింది.

ఆమె చూపులలోని భావాల కన్నా, ఆ మోమూలో చేరిన కొత్త రంగులు అతనిని కవ్విస్తున్నాయి.

బాలా....
ఐ వాంట్ ఇట్..!!
నాకు కావాలి..!!
నీలో, ఏదో మ్యాజిక్ ఉంది!!
నన్ను, నేను ఆపలేను..!!
నాకు, కావాలి..!!
ఇంకా, కావాలి..!!
ఇంకా.. ఇంకా.. కావాలి..!!
నీకు.. ఇష్టమేనా..??

చాలా ఆవేశంగా, ఖచ్చితంగా, మత్తుగా వస్తున్నాయి... అతని మాటలు.

అతని మాటలలోనే, అతని కోరిక గాఢత తెలుస్తుంది.
అంతటి మోహంలో కూడా.. ఆమె అంగీకారం కోసం, ఎదురుచూస్తున్నాడు.

ఆ క్షణంలో.. ఆమెకు తన డెవిల్ కన్నా ను మించి ఇంకేది కావాలనిపించలేదు. ఇంకేది, ముఖ్యం అనిపించలేదు.
తన డెవిల్ కన్నా, తన అంగీకారం కోసం... ఎదురుచూస్తున్నాడు. అది ఆమెకు, మరింత గొప్పగా కనిపిస్తుంది.

అతని బాహువుల్లో బందీగా ఉండి, అతని సాంగత్యంలో కరిగిపోతున్న ఆ సమయంలో కూడా... తన కన్న, తన అంగీకారం కోసం.. అడుగుతున్నాడు.

ఆమె తల నెమ్మదిగా పైకెత్తి, ప్రేమ నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ... తన అంగీకారాన్ని తెలుపుతుంది.

కొత్త కాంతులతో... మెరిసిపోతున్న ఆమె కళ్ళను చూస్తున్నాడే కానీ, అందులోని భావాలను అతను, చదవలేకపోతున్నాడు.

మై డియర్ డెవిల్ కన్నా...
ఎలారా, నీతో చచ్చేది..!!
ఆడపిల్ల అన్ని నోరు తెరిచి, చెప్పాలంటే కష్టం!!

నా ఇష్టాన్ని, ఎంతో కష్టంగా తెలుపుతున్న...
ఆ కష్టం లోని, నా ఇష్టాన్ని తెలుసుకోలేని...
ఈ మోద్దు, కన్నాని...
ఎంతో ఇష్టంగా, ఇష్టపడుతున్నాను రా!!

నా మనసున, నిలిపిన నికై...
నా తలపులు, తరిమేను నీకై...

పరుగు పరుగున వచ్చి, చేరితిని నీ కౌగిట..!!
అంతా మరిచి, నీ చెంత నిలిచితిని!!

చెంత చేరిన చెలిని,
తరచి తరచి ప్రశ్నించనేలా..??
భావ్యమా, నీకు??
న్యాయమా, నీకు??

మై డియర్, డెవిల్ కన్నా!!
మనసా, వాచా, కర్మణా...
నీ బాలా, నీదిరా..??

అర్థమైందా, నా డెవిల్ కన్నా!! అని.. అతనిని మృదు మధురంగా అడుగుతుంది.

ఆమె ముద్దు ముద్దుగా తన మనసులోని భావాలన్నింటినీ... తన ఇష్టాన్నంతటిని, మాటలలో రంగరించి అతనికి తెలియజేస్తుంది.

కానీ, అతని చూపులలో.. ఏ భావం లేదు.
అంతా ఇష్టంగా ఆమె పలుకుతున్న, ఆ పదాలతో పాటు కదులుతున్న.. ఆమె పెదవులను, మిరుమిట్లు గొలుపుతున్న ఆమె కళ్ళను, ఆదమరిచి అలా చూస్తున్నాడు.

అంతకుమించి, ఆమె మాటలలోని సారం.. అతనిని పూర్తిగా చేరలేదు. తన మాటలలోని అర్థం అతనిని చేరదని ఆమెకు తెలుసు. తెలుసు కనుకనే నేరుగా చెప్పలేని, తన ఇష్టాన్ని... ఆ విధంగా చెప్పింది.

లేదు, బాలా..!!
అని, అమాయకంగా, ఆమెకు తెలుపుతున్నాడు.

అతను చెప్పిన దానికి.. అందంగా నవ్వుతూ, అతని తలను ముందుకు వంచి నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది.

అతని చెవుల దగ్గరకు చేరి 'యస్' అనే మాటని, నెమ్మదిగా పలికి.. అతనిని, గట్టిగా కౌగిలించుకుంది.

యస్... ఆ ఒక్క చిన్న పదంతో, అతని శరీరం అంతా ఒక్కసారిగా జలదరించింది.

యస్...
తిరిగి రిపీట్ చేసాడు అతను.

హా...
పలకలేక పలకలేక పలుకుతుంది, ఆమె.

అతని బాడీ అంతా, చిన్నపాటి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆమె అంగీకరిస్తుందని, అతను అసలు ఊహించలేదు. కానీ, అంగీకరించింది.

అతని ఊహకు మించి, ఆమెలో ఇంకేదో ఉంది.
అది అతని ఊహకి, అందడం లేదు.

సంతోషంగా తన చెంత చేరిన ఆమె నుండి.. ఆమె నవ్వులో, ఆమె స్పర్శలో.. ఎన్నో భావాలు అతనిని చేరుతున్నాయి.

ఆ భావాలు అతని మనసుకి, మరో అందమైన లోకాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇంతకు ముందెన్నడు, ఎప్పుడూ కూడా.. అటువంటి ఆలోచనలు అతనిని చేరలేదు.

అతనికి అంత కొత్తగా ఉంది. ఆమెలోని ఏదో మాయా, ఏదో శక్తి, అతన్ని మరింతగా ఆకర్షిస్తుంది.

ఆ ఆకర్షణకి, అతను పూర్తిగా బానిసగా మారిపోతున్నాడు.

అంతగా ఆకర్షిస్తున్న బాలా ని,
ఒక అద్భుతంగా...
ఒక అమూల్యమైనదిగా...
చూస్తూ.. ఆమె పెదవులతో, జత కలిపాడు.
ఆమెను గాఢంగా, కౌగిలిలో బిగించేసాడు.

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶


డోంట్ ఇగ్నోర్....

సపోర్ట్ విత్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్.



నా కలల నందనవనం.
మీ కోసం వేచి ఉంది.
ధన్యవాదాలు.
మీ వర్ణ.