Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా కలల నందనవనం. - 2

మీ నందనవనాన.....


అడుగులో అడుగు జత చేర్చుతూ...
సప్తపది శతకాలను మనసున పలుకుతూ...
మోహన రాగాలు రవళిస్తున్నా వెన్నెల రేయిలో...
నల్ల రాతి కళ్యాణ మండప మధ్య భాగామున...
ఇరువురు ఒక్కరిగ ఒకరి చెంత ఒకరు చేరారు!!

అతని చూపు తరంగంలా ఆమె చుట్టూ తాకుతూ తడబాటు గురి చేస్తుంటే. చెప్పలేని భావంతో అతని మీద చూపు నిలపలెని, ఆమె కనులు నేల వాలిపోతున్నాయి.

నిండుగా విరగ కాస్తున్న, పండు వెన్నెల మండపం లోపలికి ఒక వంతు బాగం వరకు తొంగి చూస్తుంది.

ఒకరికి ఒకరుగా సరితూగుతున్న ఆ ఇరువురిని చూడడానికి, తనని దుప్పటిలా కప్పుతున్న కారు మేఘాలను కట్ట కట్టి తరిమి కొట్టి, ముచ్చటగా వారిని చూసి మురిసిపోతుంది, నింగిన విరిసిన నిండు జాబిలి.

చెలి చెక్కిలిపై పూసిన సంపంగి సిగ్గులు, వెన్నెల వెలుగులు పులుముకొని మెరిసిపోతుంటే... మైమరుపుగా చూస్తున్న అతని కన్నులకు సరికొత్తగా కనిపిస్తున్న ఆమె రూపం మోహన బాణాలను సంధిస్తుంది.

అతని చేతిలో ఉన్న ఆమె చేతిని మరి కాస్త వత్తి పట్టుకుని, ఆమె చెక్కిళ్లను మరొక చేతి వేళ్ళతో తాకుతూ, ఆమె చెంపలోని కెంపులను సుతారంగా స్పృశిస్తున్నాడు.

ఆ స్పర్శకు ఆ కన్నులు మోయలేని సిగ్గుతో మూసుకుపోగా, గుండెల్లో వేయి వీణల సరాగాలు రాగమాలపిస్తున్నాయి.

బాలా......

లో గొంతుకతో, బరువుగా అతని పెదవుల నుంచి వస్తున్న ఆ పిలుపు వినసొంపుగా తాకుతుంది, ఆమె చెవులను.

భారంగా వాలిపోయిన కనుపాపలను బుజ్జగించి బామాలిందో, కనికారం చూపలేదని కసురుకున్నదో నెమ్మదిగా పైకి నిలిచి నిర్మలమైన చంద్రబింబంతో, పోటీ పడుతున్న తన ప్రియ సఖుడిని చూస్తున్నాయి.

అతని చెంపలను తాకాలని ఆత్రంతో అప్రయత్నంగానే అక్కడి వరకు చేరిన ఆమె చెయ్యి బిడియంతో, తాక లెక, వదిలి వెనక్కి రాలేక సన్నగా వణుకుతూ, చిన్నగా ఊగిసలాడుతుంది.

మనోహరంగా తనని చూస్తూ, తాకాలని తనదాకా వచ్చి నిలిచిపోయిన, ఆమె చేతిని అతను మృదువుగా పట్టుకొని, అతని చెంపపై పెట్టాడు.

నులి వెచ్చని ఆమె చేతి స్పర్శ, చాలా కొత్తగా ఉంది, అతనికి. ఆ చేతి మీద మనసయిన వాడి చేతి స్పర్స ఆమెకు, అతని అనురాగ బంధాన్ని తెలియజేస్తుంది.

మొదటిసారి తనను ఈ విధంగా తాకిన ఆమె చేతి స్పర్శకి, క్షణకాలం కళ్ళు మూసి తెరిచిన అతను ఆమెను, అంతే అపురూపంగా చూస్తున్నాడు.

బాలా.....
ఏం చేస్తున్నావ్ నన్ను??
ఏమవుతుంది నాకు??
సంథింగ్ హ్యాపెన్స్ టు మీ.....
ఇదని చెప్పలేకపోతున్నాను!!
ఇదని చూపలేకపోతున్నాను!!
సంథింగ్ ఇస్ దేర్.....
సంథింగ్ ఇస్ మేజిక్.....

విత్ యువ్..... మరొక కొత్త ప్రపంచంలో, ఉన్నట్టు ఉంది!!

అతను పలుకుతున్న ప్రతి అక్షరం ఆమె చెవులకు వినసొంపుగా శ్రావ్యంగా ఎంతో ఇష్టంగా వినబడుతున్నాయి.

ప్రతి అక్షరంలోను అతని మనసులోని ప్రేమ మధురిమలను రంగరించి పలుకుతున్నట్టు, ఆమె పొంగిపోతున్నది.

అక్షరాల ప్రేమ మాలను అందంగా అలంకరిస్తున్న అతని గుండెల మీద తృప్తిగా వాలిపోతుంది. అతని చెంపను తాకుతున్న చేతిని అతని మెడ చుట్టూ హారంలా మార్చి లతల అతనిని అల్లుకుపోతుంది.

డెవిల్ కన్నా.....

నీ చెంత నేనుండ,
నాకంతను వింతయే.....

నిలువ లేను -
మనసైన నిను చేరకుండా!!
నిలుపలేను -
కనులకు నిను చూపకుండా!!
చూపలేను -
మనసులో ఉన్న నీ రూపాన్ని!!
చెప్పలేను -
మదిలో రేగుతున్న ఊసులని!!
ఆపలేను -
నీ కౌగిట కరగాలనే తపనలను!!
ఆగలేను -
నీలో ఊపిరిగా కరిగిపోయేవరకు!!

మాటలతో చెప్పలేనిది
కనులకు చూపలేనిది
మనసున నిలిచిన
ప్రణయపు మాయా
నీ ప్రపంచమైనను
నా ప్రపంచమైనను
మన ప్రపంచమాయే క్షణమున
ఈ మొహాల మాయలో
ఇరువురిది, మరొక
కొత్త ప్రపంచమే!!

తల పైకి ఎత్తి ఆర్తిగా అతనిని చూస్తున్న ఆమెను,
ప్రేమగా అలరిస్తున్నాయి నిశ్చలమైన అతని చూపులు.

ఇరువురిలో తొంగి చూస్తున్న
తొలకరి ప్రణయపు ఝరులు.

తెలుపమని, తెలుసుకోమనే ఆరాటాలు.
అదురుతున్న ఆధారములు.
పెరుగుతున్న గుండెలయలు.
దగ్గరవుతున్న ఊపిరి సెగలు.

ఆమె ముఖాన్ని అపురూపంగా చూస్తున్నా
అతనికి అంతా అద్భుతమే.
అణువణువు ను నిశితంగా
గమనిస్తున్నాయి అతని కళ్ళు.

బాలా....

మత్తుగా, మరల మరల పలుకుతున్నవి.
అతని పెదవులు ఆమె పేరుని.

అప్పటికే అనేక వేలసార్లు అతని మనసు
పదే పదే, అదే పేరు పలవరిస్తున్నది.
ఆ పేరు తప్ప మరింకేది, పలకలేకపోతున్నాడు.
అతని మనసున్నంత ఆ పేరులోనే నింపి,
పదేపదే అదే పలువరిస్తున్నాడు.

ఆమెకు ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది.
అతని మనసులో ఆమె గురించిన ఎన్నెన్నో ఆలోచనలు. ఏవేవో మనసును తాకుతున్న మధుర భావాలు.
మనసులోని భావాలను మాటల రూపంలో
ఆమెకు అందివ్వలేకపోతున్నాడు.
కానీ, ఆ భావాలకు పదాలను చేర్చి అందంగా ఆమెకు చెప్పలేని అతని ఆసక్తికి చూపులనే సాయం కోరుతున్నాడు.

పెదవులతో మాటల రూపంలో అందించలేని
అతని మనసులోని భావాలను
అతని చూపులలో తెలుసుకున్నదేమో

మునివేళ్ల మీద తనని తాను నిలిపి
సమ్మోహన అస్త్రాలను సంధిస్తూ
మౌన ముని లాగా నిలిచిన అతని
పెదవులకు పలుకులు నేర్పమని
కలవరిస్తున్న తన పెదవులను
అతని పెదవులతో జతచేసినది.

ఆమెకు తెలుసు అతనికి
అందంగా మాటలను కూర్చి
వర్ణించడం గానీ, అతని మనసులోని
ఆమె పట్ల ఉన్న ప్రేమని
ఆమెకు మనోహరంగా వ్యక్తపరచడం
కానీ తెలియదని.

అతని కళ్ళల్లో తోనికిసలాడుతున్న
భావాలకు ఆమె రూపాన్ని అందివాలనుకున్నది.
ఆ భావాల రూపం తానే అయినప్పుడు,
తనని తాను ప్రేమగా తన ప్రేమను
అంతా తెలియజేస్తూ అందివ్వాలనుకున్నది.

అతని కళ్ళల్లో తనమీద కనిపిస్తున్న ఆ ప్రేమనంత అందుకోవడానికి, అతని మీద తనకున్న ప్రేమను తెలియజేయడానికి, ఆమె తొలి అడుగు వేసింది.
ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ఇరువురు,
అందిపుచ్చుకుంటేనే కదా అది పరిపూర్ణమయ్యేది.

అతని ప్రేమను అందుకుంటూ,
తన ప్రేమను అందించాలన్న
ఆమె తపన వారి ఇరువురి మధ్య
తొలి అదర సంతకానికి నాందిగా మారింది.

ఆ క్షణమున కాలం స్తంభించినదా
అన్నట్టు ఆమె పెదవుల స్పర్శ తాకగానే
తుళ్ళి పడుతూ, ఆమెను విడిచి
ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాడు.

ఇద్దరి శరీరాలు ఆ పెదవుల
తొలి స్పర్శకి జల్లు మంటున్నాయి.

అపురూపం, అద్భుతం ఆమె రూపం.
ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా
సమ్మోహనంగా కనిపిస్తున్నది అతనికి.

ఆరాటమో, ఆత్రమో,
బిడియమో, లేక భయమో.
ఆమె ప్రేమని తెలియజేసింది.
తనను విడిచి వెనక్కి వెళ్లిన అతనిని
తెలియని ఆలాపనతో అలాగే చూస్తూ ఉంది.

ఆమె ఇష్టం తెలుస్తుంది.
కావలసినది ఏమిటో కనిపిస్తున్నది.
నిలువెత్తు పదహారణాల పడుచుదనం.
ఎదురుగా నిలిచి పరితపిస్తుంటే,
ఉప్పెనలా చేరిన మోహపు ఆవేశం.
క్షణం ఆగలేదు అతని ప్రాయం.

ఒక్క అడుగులో ఆమెను అందుకున్నాడు.
సుకుమారమైన ఆమె నడుమును
బలమైన అతని చేతితో చుట్టేసాడు.
ఆమె ముఖాన్ని మరొక చేతితో
చెంపల మీద ఒరుపుగా పట్టుకున్నాడు.

తన పెదవులను తాకి
తనలో తపనలు రేపిన
కోమలమైన ఆమె పెదవులను
ఆవేశంగా అందుకున్నాడు.

లేత గులాబీ వర్ణం
పులుముకున్నా ఆమె పెదవులు.
తేనెలూరే, మకరందం
నింపుకున్న ఆమె పెదవులు.
వర్ణించలేని రుచి
ఆ పెదవులకు సొంతం.

ఆమె అతని పట్టులో ఒదిగిపోయింది.
అతని గుండెలకు దగ్గరగా చేరిపోయింది.
తొలిముద్దు తమకంలో తెలియాడుతుంది.
కలిపిన అదర యుద్ధానికి సాయమవుతున్నది.



¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶



డోంట్ ఇగ్నోర్...

సపోర్ట్ విత్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.

ఫాలోమి ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.