నా కలల నందనవనం.
కలలు కనే కనులకు, ఆ కలలను నిజము చేసే మనసుకు మధ్యన అందముగా అల్లుకున్న రాగ బంధమే
నా కలల నందనవనం.
ఆకాశాన ఉరిమే ఉరుము అతను. కారు మబ్బుల మేఘాలను చీల్చుకుంటూ మెరిసే మెరుపు ఆమె.
రూపం తెలియని ఉరుము ఉరిమి భయపెడుతుంటే, ఆ ఉరుముతో జతకట్టి వెండి వీణాల వెలుగులు వెదజల్లే మెరుపు మిరు మెట్లు గొలుపుతుంది.
వెలుగు అక్కరలేని ఉరుము చీకటిన ఉరుముతు ప్రతిధ్వనిస్తుంటే ఆ చీకటినంత తన వెలుగుతో ప్రకాశింపజేసేది మెరుపు.
ఉరుము ఉరమడం, మెరుపు మెరవడం వాటి సహజ లక్షణాలు.
ఆ ఉరుము మెరుపుల సంగమమే
నా కలల నందనవనం.
ప్రేమ మనసు మమత అనురాగ ఆప్యాయతలు వంటి పదాల శబ్దాలు కలలో కూడా వినని అతను.
ఆకాశంలో విరిసే అందాల రంగుల హరివిల్లును ఎనాడు తన కంటితో కూడా చూడని మరో ప్రపంచం అతనిది.
నిజమయిన, కలయినా కదిలే ప్రతి క్షణం చెంత నిలిచే ప్రతి బంధంము ప్రేమతో పెనవేసే ఆమె.
అనురాగ ఆప్యాయతల హరివిల్లులో, మమతా అనురాగాల సరిగమలతో మనసుని విరిసే రాగ బంధాల ప్రేమ పొదరింట ఆమె.
స్వేచ్ఛ విహంగం లా ఆకాశాన ఎగురుతూ అందాల హరివిల్లుతో ఊయలలూగే, ఊహ ప్రపంచం ఆమెది.
ఏమాత్రం పొంతన లేని ఇద్దరి ప్రపంచాలు ఇద్దరి మనసులు ఇద్దరు మనుషులు.
తన ఊహల ప్రపంచం నుంచి ఆమె అతని మరో ప్రపంచంలోకి అడుగు పెడుతుందా??
లేదా
తనకి మాత్రమే సొంతమైన తన ప్రపంచాన్ని వదిలి అతను ఊహల హరివిల్లులో ఊయల లుగుతున్న ఆమెను అందుకుంటాడా??
ఆ ఇరువురి పయనం ప్రణయ తీరాన
కలిసిన క్షణమున ఆవిర్భవించిన
నా కలల నందనవనం.
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
నిండు పున్నమి.
దీని కోసమే ఎదురు చూస్తున్నాను.
నువ్వు నాకోసం ఎదురు చూడు.
ఎవరిని పట్టించుకోవద్దు
ఎక్కడ ఆగవద్దు.
ఆలయం వెనుక మండపాన వేచి ఉండు.
అంటే ఎదురు చూడు.
వెయిట్ ఫర్ మీ.
నేను నీకోసం వచ్చేస్తాను.
కచ్చితంగా టైం కి వచ్చేస్తాను.
ఒకవేళ ఆలస్యమైన అక్కడే ఉండు.
అందర్నీ తప్పించుకొని, వాళ్ల కన్నుగప్పి రావాలి.
సరేనా అర్థమయ్యిందా, నా డెవిల్ కన్నా??
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
విశాల గగనాన, మిరుమిట్లు గొలుపుతున్న వేలాది వెలుగులీను తారకల మధ్యలో గోపికల నడుమ మురళి రాగాలు రవళిస్తున్న మనోహర రూప నీల మేఘశ్యాముణి వలే కొలువుదీరిన నిండు చందమామ!!
కనుచూపుమేరలో అందంగా పరుచుకున్న వెన్నెల పొర, నులివెచ్చని శరీరాన్ని హాయిగా అలరిస్తున్న, శీతల మలయ మారుత ఝరి!!
మనసుకు శరీరానికి హాయి గొలుపుతున్న ఆహ్లాదకర వాతావరణంలో కనులలో కొలువుదీరిన నిరీక్షణ క్షణాలు!!
ఎన్నడూ లేని ప్రశాంతతలో, తన గుండె చప్పుడు తనకి లయబద్ధంగా వినిపిస్తుంటే... అతని చూపుల నిరీక్షణ సాగుతుంది అటువైపుకు, అక్కడికి రాబోతున్న మరొకరి కోసం!!
చూపుల నిరీక్షణ కందని, చిరుమువ్వల సవ్వడి చెవులను తాకగానే అటుగా చూస్తున్న అతని చూపులలో మరింత తీక్షణ పెరిగింది!!
అప్పటివరకు కలవాలన్న ఆత్రం తొందరపెడుతుంటే, పరిగెత్తిన పాదాల వెంట తోడుగా నిలిచిన మువ్వల సవ్వడి, క్షణమున మరిచెను, రవళించడం.
కంగారు కనికట్టు చేసినట్టు కదలకుండా నిలిచిన ఆమె కాళ్ళను అలంకరించిన, ఆ వెండి మువ్వలు పైకెత్తి పట్టుకున్న పట్టు పరికిణి అంచుల కింద నుంచి తొంగి చూస్తున్నాయి. తమ రవళి ఆగడానికి కల కారణం ఏమిటా అని??
వేగంగా, కంగారుగా పరిగెత్తుకొచ్చిన ఆమె వేగానికి తగిన విధంగా ఎగిసిపడుతున్న ఊపిరి లయలు... ఆమె కనుల ఎదుట నిలిచిన కమనీయ దృశ్యాన్ని చూస్తూ... ఆగిన ఆమె అందెల రవలితో, పాటు కొన్ని క్షణాలు ఏద ఊపిరి స్తంభించిపోయింది. మరుక్షణం మందగించిన గుండె లయతో, భారంగా శృతి కలుపుతూ, నెమ్మదిగా మొదలైన ఆమె ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు.
శిల్పులు చెక్కగా, చక్కగా మలిచిన నల్ల రాతి నాలుగు స్తంభాల మీద నిలిపిన కళ్యాణ మండపం మధ్యన... తన కోసమే ఎదురుచూస్తున్న తన మనసుమెచ్చిన మొహాన రూపం... తన డెవిల్ కన్నా!
మనసు మెచ్చిన చెలికాడిని చూస్తున్న... ఆమె కనులు రెప్పవేయడం మరిచిపోతే, కాళ్ళు కదలనని మారం చేస్తున్నాయి. మనసు చెంత చేరా త్వర పడమంటుంది!
చెవులను తాకిన మువ్వల సవ్వడి తో పాటు, కలిసి వచ్చి నిలిచిన నిలువెత్తు లావణ్య రూపాన్ని, చూసిన అతని కన్నులు తనను తాను మరిచిపోయాయి!
అతని శరీరం అతని వసం తప్పింది అనడానికి గుర్తుగా అప్పటి వరకు నడుం మీద నిలిచిన అతని చెయ్యి అక్కడి నుంచి పట్టుతప్పి అతనికి తెలియకుండానే క్రిందికి జారిపోయింది!
12 అంగుళాల... నెమలి పించపు నీలపు రంగు పెద్ద బోర్డర్ లో, చెయ్యి తిరిగిన నేతగాడు తన నేత చాతుర్యంతో చెక్కిన బంగారపు నెమళ్లు తో నిండి, వెన్నెల వెలుగులను అద్ధుకున్నదా, అన్నట్టు మెరిసిపోతున్న... వెండి తీగలతో నేసిన, వెండి వర్ణాల కంచి పట్టు లంగా! నెమలి పించపు నీలి రంగు పట్టు పరికిణి, పట్టు రవికలతో, జతచేర మురిపిస్తున్న, ముగ్ద మనోహర రూపం!
వావ్..... గార్జియస్.....
బాలా..... నువ్వు ఇంత
అద్భుతంగా ఉంటావా??
అతని చూపులు,
ఆమెను చేరగానే...
అతని మనసు అప్రయత్నం గా,
అనేక వేలసార్లు, పలికిన పలుకులు!
ఒక్కొక్క అక్షరం బలంగా పలుకుతూ, పదాలుగా మార్చి అతని నోటి నుండి పలుకుతున్నాడు. అతనికి తెలిసి అతను ఈ విధంగా మాట్లాడడం, తనకు తాను ఈ విధంగా, ఒక గొప్ప అనుభూతిని ఆస్వాదించడం ఇదే మొదటిసారి!
మొదటిసారి అతను ఆమెను చూసిన క్షణం.
అది ఒక అపురూపం.
కానీ, ఇప్పుడు అతనికి ఆమె ఒక అద్భుతం!
ఇంతకుముందు చూసిన రూపమే అయినా ఇప్పుడు ఇ క్షణం ఆమె రూపం, పదిలంగా అతని గుండెల్లో చేర్చుతూ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మలుచుకుంటున్నాడు!
ఆరు అడుగుల రెండు అంగుళాల ఆజానబాహుడిని, స్వచ్ఛమైన శ్వేతవర్ణపు ఖాది కుర్తా పైజామా లో చూస్తున్న ఆమె గుండెల్లో అలజడి మొదలయ్యింది!
అతనిని చూసిన మొదటిసారి... "అమ్మో... వీడు నా డెవిల్ కన్నానా??" అనే మాట దగ్గరే ఆశ్చర్యంగా అతనిని చూస్తూ ఆగిపోయిన ఆమె ఆలోచన.
మరి ఇప్పుడు... ఏదో తెలియని భయం,
గుండెల్లో తెలుస్తున్న అలజడి,
అడుగులను ఆపుతున్న బిడియం,
బుగ్గల్లో చేరిపోతున్న సిగ్గులు,
కళ్ళారా చూడమంటున్న కోరిక,
కనికరించకుండా వాలిపోతున్న కనురెప్పలు,
ముందుకు పదమంటు, నస పెడుతున్న మనసు, ఆగమంటు అడ్డుపడుతున్న ఆడతనం!
అన్ని ఉద్వేగాలు చేరి ఉప్పొంగుతున్న ఎద ఎత్తులను అణిచిపెడుతూ, ఆమె తన అరిచేతులతో నొక్కి అదిమిపెట్టింది!
భారమవుతున్న ఊపిరి నులివెచ్చగా ముంజెతిని, తాకుతుండగా... 'చెలికాడి చెంత చేరమంటు' మెలిపెడుతున్న మనసు మాటను, పాదాలకు తెలియజేస్తూ నెమ్మదిగా ముందుకు కదిలింది!
కదులుతున్న పాదాలతో పాటు రవళిస్తున్న మువ్వలు మురిసిపోతున్నాయి, ఆమె అడుగులలోని బిడియాన్ని గమనిస్తూ!
ఆమె వాలు జడలోని జడగంటలు శృతి కలుపుతున్నాయి. కదులుతున్న ఆమె పిరుదులపై హోయలోలుకుతూ!
కోమలాంగి చేతినా, నిండుగా చేరిన మట్టి గాజులు, సుకుమారంగా నాజూకు చేతుల మీద కదిలి కదలకుండా నాట్యమాడుతూ, గాలి తిమ్మెరలతో స్వరము కలుపుతున్నాయి!
ఐదు అడుగుల పదిన్నర అంగుళాల అజంతా శిల్పం ముగ్ద మనోహరంగా కదిలి వస్తుంటే అతని రెండు కళ్ళు చాలనంటున్నాయి. కదిలే ఆ సోయగాన్ని అతని గుండెల్లో భద్రంగా బంధించలేక, అవి అలసిపోతున్నాయి!
క్షణాలు కదులుతున్నాయని మరిచిన ఇరువురి మనసులు, ఒకరిని చేర ఒకరు కదులుతున్న ఇరువురి తనువులు!
నల్లరాతి మండపం వరకు నెమ్మదిగా చేరిన ఆమె అడుగులు, మండపం మెట్ల వద్ద ఆగిపోయాయి. ఆగమంటు, ఆమె పాదాలను ముందుకు పోలేని బిడియం బంధించగా!
నేలపై తనకోసం కదిలి వస్తున్న, నింగిలోని పండు వెన్నెలను, కనురెప్ప వేయడం మరిచి చూస్తున్నా అతను, ఆగిన ఆమె పాదాలను చేరా, కదిలి ఆమె చెంత నిలిచాడు!
మెట్లకి ఎదురుగా నిలిచిన ఆమెకు, మెట్లపై ఎదురుగా నిలిచిన అతను... "నీకోసమే నా ఎదురు చూపు. చేరా రాగా సాయమవుతా." అన్నట్టు, అతని చేతిని ఆమె కోసమై ముందుకు చాపాడు!
అందుకోమని ముందుకు చాపిన అతని చేతిని సున్నితంగా చూస్తూ... పయనిస్తున్న ఆమె చూపులు, అతని కన్నులను చేరి ఆ చూపులతో జతకట్టి అక్కడే నిలిచిపోయాయి!
ఆమెను ఒక అద్భుతంలా, చూస్తున్న అతని చూపులలోని మేరపు, ఆమె కళ్ళను కట్టిపడేసేయి. ఆ క్షణంలో తన కోసమే ఎదురు చూస్తున్నా స్వచ్ఛమైన అతని మనసుకి అద్దంలా మారాయి, అతని కన్నులు!
చల్లని చిరుగాలి ఉద్వేగంతో ఉగిసిలాడుతున్న, ఆమె తనువును తాకి చలికాచుకుంటూ, ఆమె తాపాన్ని తనలో నింపుకొని వెచ్చగా ముందుకి సాగిపోతుంది!
తనకోసం ఎదురు చూస్తున్న అతని చేతికి ఆమె చేతిని జత చేర్చగానే, చల్లని మంచు పోరని తాకినట్టు... వెచ్చని ఆమె చెయ్యి చిన్నగా కంపించింది. క్షణంలో కనురెప్పలు వాలిపోయి శరీరమంతా ఆ స్పర్శ తరంగాలు పయనించాయి!
ఆమె కనురెప్పలు మూసుకుపోగానే, వెచ్చగా తన చేతిలో చేరిన ఆమె చేతిని మనోహరంగా చూస్తున్నాడు అతను!
కోమలంగా ఉంది ఆమె చేయి!
చాలా కొత్తగా ఉంది ఆమె స్పర్శ!
ఆ స్పర్శలో, అతనికి తెలియని ఏదో మత్తు!
జారిపోకుండా, మెత్తగా ఒత్తి పట్టుకున్నాడు!
వెంట రమ్మంటూ, నెమ్మదిగా సంకేతాలు పంపాడు!
పులకింత నిండిన తనువుతో...
పరవశంలో ఓలలాడుతున్న మనసుతో...
కన్నులలో చేరిన మైమరుపుతో...
అతని మీద చూపు నిలిపి...
అతనితో ముందుకు కదిలింది!!
అడుగులో అడుగు జత చేర్చుతూ...
సప్తపది శతకాలను మనసున పలుకుతూ...
మోహన రాగాలు రవళిస్తున్నా వెన్నెల రేయిలో...
నల్ల రాతి కళ్యాణ మండప మధ్య భాగామున...
ఇరువురు ఒక్కరిగ ఒకరి చెంత ఒకరు చేరారు!!
@@@@@@@@@
నా కలల నందనవనం.
మెచ్చిన ప్రతి ఒక్కరికి.
ఆదరించిన అందరికీ ధన్యవాదాలు.
తిరిగి కలిసే వరకు మీ అభిప్రాయాలను తెలియజేయండి.
సపోర్ట్ మీ విత్ యువర్ రేటింగ్స్ అండ్ ఫాలోయింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.
నా ఆలోచనల నుంచి నేను తయారు చేసుకున్న, ఊహాజనిత కథ.
ఇందులోని ఏ ఒక్క పాత్రలు, పేరులు, మనోభావాలు, సన్నివేశాలు, ఎవరిని ఉద్దేశించినవి కాదు.
నా కథ అనుగుణంగా, నా ఆలోచనల నుంచి నేను పొందుపరచుకున్న కల్పిత వర్ణాల సమాహారం.
ధన్యవాదాలు.
మీ వర్ణ.