Read on the shore of the moon by Madhu Madhu in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓ వెన్నెల తీరాన

నిద్ర పట్టని ఓ రాత్రి! విసిగిస్తోంది నను లీలగా!
కుదురుగుండని పసిపాపల, మసలుతున్న మంచం మీదగా!
కంటి రెప్పల పై ఊహల యుద్ధమేదో జరుగుతుంది. కనుమరుగయ్యే దృశ్యాలు 'వంద 'వచ్చుంటాయి.ఆ క్షణాల్లో!
ఉన్నట్టుండి చిమ్మ చీకటంతా కమ్ముకుంది. ఆలోచనలన్నీ పారిపోయాయి.
ఆ చీకటి లోంచి మెరుపులా మెరుస్తూ నిండు చందమామ వెలుస్తుంది. దాని చుట్టూ దిష్టి చుక్కలు పెట్టినట్టు చుక్కలన్ని మెరిసిపోయాయి.

దూరంగా ఉన్న అలలన్నీ దిష్టి పెట్టడానికై దాని దగ్గరికి చేరడానికి ఎగసిపడుతున్నాయి.ఇదంతా కళ్ళకు కట్టినట్టు అలా మెత్తటి ఇసుక పాన్పుపై నడుము వాల్చి చూస్తూ ఉండిపోయాము.
నువ్వు ,నేను అలా!

మన కింద నలిగి ,మలిగైపోతున్న ఆ ఇసుకకు. ఎంత విసుగొచ్చిందో, ఎంత గునుక్కుంటూ మోసిందో మన బరువుని. దానికే తెలియాలి?
అయినా అవేవీ మనకు పెద్దగా పట్టనట్టు ఆ వెన్నెలలో లీనమైపోయాం ఇద్దరుo.

నిండు వెన్నెల ,పండు వెన్నెలలా ఉంది. కోసుకొని తినేద్దాం అన్నంత కసి పుట్టుకొస్తోంది . ఎన్ని చుక్కలు ఉన్నాయో అని నువ్వు లెక్కపెడుతుంటే, అంత వెలుతురేలా వస్తోంది అని నే ఆలోచనలో ఉన్న.

ఒక్కసారి ఆ వెళ్తురంతా నీ మోహన వాలి , పరివర్తన దాడి చేస్తుంది. తల మెల్లిగా నీ వైపు తిప్పా!
ఆ వెన్నెల వెలుగoతా నీ మొహంలో నింపినట్టుంది. ఒక్కసారిగా చంద్రుడికి పెట్టిన దిష్టి చుక్కలన్నీ లాక్కొచ్చి నీ పాలబుగ్గకు పెట్టాలనిపించింది.
అంత గొప్పగా ఉంది నీలో దాగున్న ఆ కల. ఒక్కసారిగా బిత్తిరి పోయాను!
వెన్నెల ప్రతిబింబమేమోనని పోల్చి చూశాను.
కానీ కాదు!
దాని అందం దానిదే ,దీని అందం దీనిదే! ఆశ్చర్యచికితుడినయనూ!
అందరూ ఒక చందమామే ఉంటుందన్న భ్రమలో వునారు.కాని రెండు ఉన్నాయన్న రహస్యం నాకు ఇప్పుడే తెలిసింది.
అంతలా ఆకర్షించింది ఆ వెలుగు నన్ను.
అందానంత లోతుగా నీ కళ్ళల్లోకి నేను, నా కళ్ళల్లోకి నువ్వు దూకేశాము. పైనున్న వెన్నెల కూడా మనతో ప్రేమలో పడినట్టుంది,మబ్బుల చాటుకు వెళ్లట్లేదు,
చూస్తూ ఉండిపోయిందలా!
అంతా నిశ్శబ్దం, అలల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది.
టాపునా! ఒక శబ్దమేసింది. నీ పెదవి నా పెదవితో ముడిపడిన శబ్దంమది. మనిద్దరి కళ్ళరెప్పలు రెండు సిగ్గుతో కళ్ళను కప్పేసాయి.

దీని కోసమే అనుకుంటా? చందమామ ఇందాకటి నుంచి నుంచి ఆత్రుతగా ఎదురు చూస్తుంది.
ముద్దు వ్యవధ ఎంతో తెలియదు? కానీ!
నాకు మాత్రం చాలా నచ్చింది, ఎంతో బాగుంది!
దాన్ని ఆస్వాదించడంలో ఎనలేని సుఖముంది!

ఇంతలో గాలి స్వరం ఒకటి మన చెవిన పడి, కంటి రెప్పలు తెరుచుకొని, పెదవుల ముడి విప్పేసింది.
సిగ్గుతో అలా పైకి లేచి, చెరో వైపు తిరుగుకొని, ఆ మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటుంటే మన ఇద్దరి బుగ్గలు కంది ఎరుపెక్కాయే.

ఉన్నట్టుండి నడక పిలిచినట్టు అలానే పైకి లేచి అడుగులో అడుగులేసుకుంటూ, ఒకరినొకరం అతుక్కొని నడుస్తుంటే వేగంగా వచ్చే ఆలలు మన కాళ్ళని తడిపి పోతుంటే, ఆ తడికి ఇసుక పాద ముద్రలను ముద్రిస్తుంటే, తిరిగి ఆలలాన్ని దాంట్లో కలుస్తుంటే , ఆ కడలి కూడా ప్రేమలో మునిగినట్టుంది.
దానికి కూడా ప్రేమంటే పిచ్చి అనుకుంటా ,మనల్ని దానిలో కలుపుకోవడానికి చూస్తుంది.

అప్పుడే సుడిగుండంలాంటి గాలేదో మనల్ని చుట్టేస్తుంది. ఎత్తుల అలల వేగాన్ని కూడా అది వెనుకుతోస్తోంది.
వెన్నెల మాత్రం ఇంచు కదలకుండా అలానే ఉంది. నాకు ఆశ్చర్యంమేసింది!
ఇంతలో జల్లుమని వెనక్కి తిరిగి పడుతున్న అలల శబ్దానికి నువ్వు భయపడి బిగ్గరగా హత్తుకుపోయావు నా హక్కునా.
ఒక్క క్షణం అదిరిపోయాను, ఆ వెచ్చని కౌగిలికి!

గుండెచప్పుడు కొలచలేనంత వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లంతా చెమటలు నిండిపోయాయి, కలవరపాటులో కంగారు పడుతున్నా, కిర్రు మని చెవి దగ్గరో మోత మోగింది.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచా, రెండు చేతులను కౌగిలిలా చేర్చి, వాటి మధ్యలో నున్న దిండును హత్తుకున్నా. తలతిప్పి చూస్తే సూటిగా సూర్యకిరణాలు నా కళ్ళలో పొడిచాయి.

అప్పటివరకు తెలియదు ఉదయం' పది 'అయిందని.
అయినా భలే మాయ చేశావు నువ్వు!
ఎలా నిద్రలోకి జారుకున్నానో గుర్తులేనంత మాయ చేశావు.
పట్టిన చెమటలు మృదువుగా తుడుచుకుంటూ.

ఇద్దరం కలిసి సముద్ర ఒడ్డున సేద తీర్చడం ఏంటో! వెన్నెలతో కబుర్లులాడడంమేంటో!
మరిచిపోని మధురాను బృతుల్ని ముద్రించుకోవడంమేంటో !
గాలంతా సుడిగుండమై మరడమేంటో!
అలలు బీకర శబ్దంమీవ్వడమేంటో!
నువ్వు వచ్చి నా మదీనా వాళ్ళడమేంటో!
అంతా నా భ్రమ!
అనుకుంటూ లేచి తలను తట్టుకొని ,మంచం దిగి హాల్లోకి వెళ్లి కూర్చున్న!

ప్రేమలో తేలే ప్రతిక్షణం,నీ ప్రేరణకై పరితపిస్తున్న..
ఇలాంటి ఊహలలో బ్రతికే రోజులోంచి నీ ప్రేమ ఊయలలో ఊగే రోజుకు చేరుకోవాలని ప్రగాఢంగా ప్రార్థిస్తున్నా!

పరిచయాలు లేని ఈ నీ ఊసులే ఇంత ఆనందాన్ని అందిస్తుంటే పరిచయమైతే ఇంకెంత అనుభూతునందిస్తుందో.

రోజుల తరబడి చూడాలా కనిపించని ఆ నిరాకారాన్ని!

తరలిరా, అలలై పొంగు కుంటూ నాపై నీ స్మృతులను చిమ్ముకుంటూ, ఎత్తత్తుగా ఎగసిపడుతూ, స్పష్టంగా ధ్వనిస్తూ, ఇష్టంగా కలుస్తూ, క్షణంలో తడిపేసి హఠాత్తుగా హృదయానికి హత్తుకు పోవే సహృదయంగా!

నిరంతరం నీ ప్రేమ ఊసులో బతికే ఓ గాడ ప్రేమిక
కోరిక ఇది.