You are my life books and stories free download online pdf in Telugu

నువ్వే నా ప్రాణం

నువ్వే నా ప్రాణం..... ❣️


స్నేహిత ఆలోచనలు అన్ని ప్రస్తుతం తన కెరీర్ మీదే ఉన్నాయి.

కారణం గతంలో జరిగిన ఒక చేదు అనుభవం వల్ల తను జీవితంలో ఎమ్ కోల్పోయిందో తెలుసుకుంది.

ఒకప్పుడు కెరీర్ కంటే ప్రేమ ఎక్కువ అనుకోని ప్రేమ కోసమే జీవించింది.కానీ ఇప్పుడు తనకి తన జీవితం విలువ ఏంటో అర్థం అవుతుంది.

ఎంత భార్య భర్తలు అయిన అందరికీ కోపతాపాలు వచ్చేది డబ్బు దగ్గరే.

కెరీర్ విలువ తెలిసింది కదా అని తన భర్తను వదిలి ఏమీ సంతోషంగా ఉండడం లేదు.తన భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తోంది.ఇప్పటికీ స్నేహిత ప్రాణం యష్ (యశ్వంత్) తన భర్త 💕.

గతంలో........!!!!!????

యష్-స్నేహిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ రోజులు గడుస్తున్నా కొద్ది ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

కారణం ఉండేది కాదు కానీ మనస్పర్ధలు.

ఒకరోజు స్నేహిత ఈ గొడవలు భరించలేక యష్తో మాట్లాడలని డిసైడ్ అయింది.

స్నేహిత: యష్ నేను నీతో కొంచెం మాట్లాడాలి....???

యష్ : నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి.

స్నేహిత : ఒక్కసారి నేను చెప్పేది విను...??

యష్ : ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి.

స్నేహిత : మనం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో నీకు అర్థం అవుతుందా యష్ ఎందుకు ఇలా ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నావు చాలా బాధ పెడుతున్నావు యష్ నన్ను 😭😭😭😭😭😭

యష్ : నా సమస్యలు నాకు ఉన్నాయి ముందు వెళ్ళు ఇక్కడి నుంచి.

స్నేహిత : 😭😭😭😭😭😭😭

ప్రస్తుతం :

ఆరోజు రాత్రి ఇద్దరు భోజనం చేయలేదు వండిన భోజనం అలాగే ఉంది.కొద్ది రోజుల వరకు ఇద్దరి మధ్య మౌనం.మాటలు లేవు సరి కదా ఒకరి మొహం ఒకరు చూసుకోవడమే మర్చిపోయారు.ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఎవరికి ఎవరు ఏమి కానట్టు ఉన్నారు.

స్నేహితకి ఇదంతా భరించడం చాలా కష్టంగా ఉంది.
ఇటు పుట్టిన ఇంటి వాళ్ళకు చెప్పుకోలేక అటు యష్ ప్రవర్తనలో మార్పు లేకుండా మధ్యలో చాలా నలిగి పోయింది.

బాధలను పంచుకునే తోడు ఉంటే ఏ బాధ పెద్దది అనిపించదు.ఆ తోడు నీడ లేకపోతే ప్రతి అమ్మాయి జీవితం నరకం అవుతుంది.

తరువాత రోజు రాత్రి యష్ ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు.

ఇంట్లో పెద్ద గొడవే జరిగింది కోపంలో స్నేహితను కొట్టాడు దెబ్బకి తను కింద పడిపోయింది.చాలా రక్తం పోయింది.తాగిన మనిషితో ఏమీ మాట్లాడిన అర్థం ఉండదు అని మెల్లిగా పైకి లేచి సోఫాలో కూర్చుంది.
యష్ గదిలోకి వెళ్లి నిద్రపోతున్నాడు.


స్నేహిత బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది ఉదయం యష్ నిద్ర లేచిన తరువాత తనకి చెప్పాలి అనుకోని అలాగే సోఫాలో నిద్ర పోయింది.

ఉదయం యష్ నిద్ర లేచి బయటకు వచ్చిన తరువాత హాలులో మొత్తం రక్తం మరకలు ఉన్నాయి.రాత్రి ఎమ్ జరిగిందో ఎంత గుర్తుకు తెచ్చుకున్న తనకి గుర్తుకు రావడం లేదు.

సోఫాలో సృహ లేకుండా స్నేహిత పడి ఉండడం చూసి కంగారుగా వెళ్లి నిద్రలేపాడు కానీ ఎంతకీ కళ్లు తెరవలేదు.భయంతో అలాగే చేతిలోకి తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్లాడు.

డాక్టర్ నా వైఫ్కి ఎమైందో ఒకసారి చెక్ చేసి చెప్పండి కళ్లు అసలు తెరవడం లేదు.

వెంటనే ఎమర్జెన్సీ వర్డ్కి తీసుకొని వెళ్లారు బయట కంగారుగా ఎదురు చూస్తూ ఉన్నాడు యష్.

కాసేపు తరువాత డాక్టర్ బయటకు వచ్చి సారీ మిస్టర్ తనకి అబార్ష్న్ అయింది 😭 కడుపులో పిండం పగిలి పోయింది ఎవరో గట్టిగా కడుపు మీద తన్నినట్టు ఉన్నారు అందుకే సృహా లేకుండా ఉంది రాత్రి అంత బ్లీడింగ్ అయింది మిష్టర్.

తను మీ భార్య కదా జాగ్రతగా చూసుకోలేరా కడుపుతో ఉండే అమ్మాయిని.

డాక్టర్ అసలు మీరు ఎమ్ అంటున్నారు తను గర్భవతి ఏంటి డాక్టర్.

అవును మిష్టర్ తనకి ఇప్పుడు మూడో నెల ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పుడు ఇలా అయింది తను చాలా డిప్రెషన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది జాగ్రతగా చూసుకొండి.

ఓకే డాక్టర్ అలాగే 😭😭

అంటే ఆరోజు రాత్రి నాతో మాట్లాడాలి అనుకున్న విషయం ఇదా.... ఇది తెలియకుండా చాలా బాధ పెట్టాను.రాత్రి కూడా తాగి ఇంటికి వెళ్ళను అంటే తాగిన మత్తులో కడుపులో తన్నాను తనని,ఇప్పుడు గుర్తుకు వస్తుంది 😭😭😭😭

అయ్యో స్నేహిత నన్ను క్షమించు నాకు తెలియకుండా జరిగింది తాగిన మత్తులో కొట్టాను కానీ కావాలనే కాదు అసలు నువ్వు గర్భవతి అని తెలియదు రా 😭 😭 😭 నా చేతులారా నేనే నా బిడ్డని చంపేసుకున్నాను 😭😭😭😭

ఏదో కోపంలో ఉండి రోజు నీతో గొడవ పడుతున్నాను ఆఫీసు టెన్షన్స్ ఇంటి వరకు తేవడం నా తప్పు నన్ను క్షమించు రా 😭

కాసేపటి తరువాత స్నేహితకి మెలుకువ వచ్చింది.
యష్కి తనని చూడడానికి కూడా మొహం రావడం లేదు.ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది స్నేహ.....??? అన్నాడు.

స్నేహనా.......... ఎప్పుడో ప్రేమించే అప్పుడు ప్రేమగా పిలిచేవాడివి మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు నటిస్తున్నారు యష్ ఇప్పుడు.

యష్ : నన్ను క్షమించు స్నేహ ప్లీజ్ 😭😭😭

స్నేహిత : ఆరోజు రాత్రి ఎంతో ఆశగా ఎదురు చూశాను నీకు ఆ విషయం చెప్పాలి అని కానీ ఎప్పుడు మీరు నా మాట వినింది లేదు అసలు కోపంతో ఎమ్ సాధిస్తావు యష్.ఈరోజు మీ కారణంగా నా బిడ్డను కోల్పోయాను.
నిన్న రాత్రి మీరు ఏలా ప్రవర్తించారో గుర్తు ఉందా అసలు.తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్లు తిట్టారు,కొట్టారు,కడుపులో తన్నారు రాత్రి అంత నరకం చూశాను మీకు అసలు మెలుకువ రాలేదు 😭😭😭😭

యష్ : ఇంకెప్పుడూ ఇలా జరగదు రా ప్లీజ్ నన్ను క్షమించు స్నేహ.... 😭

స్నేహిత : వద్దు యష్ మీ నాటకాలు చాలు ఇంకా. నేను మిమ్మల్ని ఇంక భరించలేను,మీలో మార్పు వస్తుంది అని చాలా ఆశగా ఎదురు చూశాను కానీ లాభం లేదు అని అర్థం అయింది.నేను బెంగళూరులో జాబ్ చూసుకున్నాను రెండు రోజుల్లో నా ప్రయాణం. మన ప్రయాణం అనేది ఇంక ఉండదు ఏమో యష్.

యష్ : ఎందుకు స్నేహ అలా మాట్లాడుతావు తప్పు అయింది ఈ ఒక్కసారికి నన్ను మన్నించు ప్లీజ్ స్నేహ.

స్నేహిత : ఎన్ని విషయాల్లో మన్నించాలి యష్ చెప్పు పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా...??
ఇంటికి ఎప్పుడు అయిన సరైన సమయానికి వచ్చావా...?? ఎక్కడికైన బయటకు తీసుకొని వెళ్లావా.వచ్చిన నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది.నేను మనిషినే కదా,నాకు నా భర్తతో సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది కదా.
ఎప్పుడు చూడు ఇంట్లో ఒక ఖైదీల ఆ నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నాను.ఇవి అన్నీ నీకు ఎప్పటికి అర్థం కావు ఎంత చెప్పినా.

యష్ : పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి తరువాత బాధ్యతగా మారుతుంది స్నేహ.

స్నేహిత : బాధ్యతగా అంటే ఎలా కోపంగా,ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండడమా,అసలు మీరు నా భర్తనా అనే ఫీలింగ్ రావడం లేదు యష్.ఎమ్ మాట్లాడాలి అన్న భయం,ఏది అడగాలి అన్న భయం. భర్త అంటే భయం ఉండాలి కానీ మాట్లాడడానికి కూడా భయపడే అంత భయం అంటే ఇంకేమీ అనుకోవాలి చెప్పండి యష్.

యష్ : జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు స్నేహ....??

స్నేహిత : జరిగిపోయిందా మీకు అర్దం అవుతుందా యష్ మీ వాళ్ళ నా కడుపులో బిడ్డ చనిపోయింది మీకసలు బాధ అనిపించడం లేదా 😭😭😭

యష్ : బాధ లేకుండా ఎలా ఉంటుంది స్నేహ తాగిన మత్తులో నిన్ను చాలా బాధ పెట్టాను.ఇంక నుంచి కొత్త జీవితం మొదలు పెట్టదాము స్నేహ.

స్నేహిత : హాహా మీలాగా నేను రకానికో విధంగా ఉండలేను అండీ రెండు రోజుల్లో నా ప్రయాణం.

యష్ : అంటే నన్ను వదిలి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నావా స్నేహ...???

స్నేహిత : నేను మీకు ఇంట్లో ఉన్న లేనట్టె కదా యష్, ఇంట్లో ఉండే వస్తువులు ఎలాగో నేను కూడా అంతే కదా.నాకు ఒక మనసు ఉంది అని అది మీ ప్రేమ కోరుకుంటుందని మీకు ఎప్పుడు అనిపించలేదు. కారణం నేను సంపాదన లేకుండా ఇంట్లోనే ఉంటాను కదా అందుకే ఏమో.

యష్ : ఎందుకు స్నేహ అలా అంటావు.

స్నేహిత : నిజమే కదా అదే సంపాదన ఉంటే మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారో కదా.అందుకే నిర్ణయం తీసుకున్నాను అండీ జాబ్ చేయాలి అని.

యష్ : ఈ సమయంలో ఉద్యోగం అవసరమా స్నేహ ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా.

స్నేహిత : ఒక్కోసారి నేను బ్రతికి ఉండడమే మీకు ఇష్టం ఉండదు అనిపిస్తుంది అలాంటిది మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచించడం.....????

యష్ : నీ ఇష్టం స్నేహ ఇంక నేను ఎన్ని చెప్పిన నా మాట వినవు అని అర్దం అయింది.

స్నేహిత : నేను కాసేపు నిద్ర పోవాలి మీరు వెళ్ళండి ఇంటికి నేను డిస్చార్జ్ అయ్ వస్తాను.

యష్ : సరే స్నేహ పడుకో నేను బయట వెయిట్ చేస్తాను.

స్నేహిత : అవసరం లేదు మీరు వెళ్ళండి.

యష్ : 😭😭

యష్ రూమ్ బయటే నిద్రపోతున్నాడు.స్నేహితను తరువాత డిస్చార్జ్ చేస్తారు కలిసే ఇంటికి వెళ్తారు.కానీ స్నేహిత ఎమ్ మాట్లాడదు యష్ తో.చాలా డల్గా, మూడీగా ఉంటుంది.అంతే కదా ఒక అమ్మాయి పెళ్ళి తరువాత అమ్మగా మారడానికి చాలా ఎదురు చూస్తుంది కానీ ఆ ఎదురు చూపు తన భర్త వల్లే ఆగిపోయింది అంటే భరించడం చాలా కష్టం.తన బేబీ మీద తను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయిపోయేసరికి చాలా కుంగిపోయింది.

రెండు రోజుల తరువాత తన ప్రయాణం బెంగళూరుకి.

యష్ వద్దు అంటున్నా వినడంలేదు.రాత్రి బస్కి తన ప్రయాణం.యష్కి ఇప్పుడు బాధ కలుగుతుంది తను దూరం అవుతుంటే.

ప్రయాణం మొదలు అవ్వడానికి ఇంకో గంట సమయం ఉంది.

స్నేహ కలసి భోజనం చేద్దాం రా.

వద్దు అనలేకా చివరిసారి కాబట్టి తింటుంది.

తినడం అయిన తరువాత తన లగేజ్ తీసుకొని క్యాబ్ బుక్ చేస్తుంది.యష్ డ్రాప్ చేస్తాను అనిన వద్దు అంటుంది.

స్నేహ నువ్వు వెళ్లడం నాకు అసలు ఇష్టం లేదు ప్లీజ్ ఉండిపో.

నేను ఉంటే మీకు సంతోషం ఉండదు మీరే హ్యాపీగా ఉండండి మిమ్మల్ని అడిగేవారు ఇంక లేరు.నేను బయలుదేరుతున్నాను జాగ్రత బై.

యష్కి ఆ రోజు రాత్రి అంత నిద్ర పట్టదు.చాలా బాధ పడతాడు.స్నేహను ఇన్ని రోజులు చాలా లైట్ తీసుకున్న అందుకు మనసులోని బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది.

వెంటనే స్నేహకి మెసేజ్ చేస్తాడు.

యష్ : ఐ లవ్ యూ స్నేహ 💕
వెంటనే యష్ ఫోన్ ఆఫ్ అవుతుంది చార్జ్ లేకపోవడం వల్ల.

స్నేహిత : గుడ్ నైట్

స్నేహిత బస్లో వెళ్తు చాలా బాధ పడుతుంది.
ఎన్ని గొడవలు వచ్చిన కలిసే ఉన్నారు గానీ ఎప్పుడు ఇలా దూరం అవ్వలేదు కానీ ఈరోజు ఆ దూరం చాలా పెరిగింది.అప్పుడే సమయానికి తగిన పాట బస్లో వస్తుంది.

నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే

నే నిన్నటి రవినే
నువు రేపటి శశివే
నేనంటూ వెళ్ళాకే
నువ్వొస్తావు పైకే

ఇది తప్పని మజిలీ
ఇది జాముల బదిలీ
నువ్వే వెన్నెలే

నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే

హా ఆ ఆఆ ఆ ఆహ ఆ ఆఆ ఆ
హా ఆ ఆఆ ఆ హా ఆఆఆ
నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే
పోవద్దు ఆ దూరమే
వస్తాలే వస్తాలే నేను వస్తాలే
నువ్వెళ్ళే ఆ తీరమే

నేనడిగే చిన్ని సాయమే
చినగనే లేదు నీకు సమయమే
సాయం అడిగే పనే నీకు లేదే
అవధులు లేని అనంతం నువ్వే

నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే

నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే.

పాట పూర్తి అయ్యే లోపు తన కంట్లో కన్నీళ్లు నిండిపోయాయి.కొన్ని సార్లు మార్పు రావాలి అంటే దూరం తప్పదు యష్.

😭 ఐ మిస్ యూ యష్ 😭

చార్జర్ కోసం వెతుకుతున్న యష్కి అప్పుడే స్నేహ డైరీ దొరుకుతుంది.



💕 యష్ - స్నేహిత 💕

💕 ఐ లవ్ యూ సో మచ్ యష్ 💕

అది చూడడం యష్ కళ్లలో నీళ్లు తిరగుతాయి.

యష్ నేను అంటే మీకు ప్రేమ అనుకున్నాను కానీ భారం అని పెళ్ళి అయిన తరువాత అర్థం అయింది.
ఇంట్లో ఒక్కదాన్నే నరకం చూస్తున్నాను ఏ అర్ధ రాత్రికో ఇంటికి వస్తావు.నీకోసం ఎదురు చూసే మనిషి ఒకరు ఉన్నారూ అనే విషయమే మీకు గుర్తు ఉండదు 😭.
ఒంటరితనం ఎలా ఉంటుందో చూశాను చాలా బాధ పడ్డాను.మీరు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడింది లేదు,నా బాగోగులు అడిగింది లేదు.ఇంట్లో వస్తువులు ఎలాగో నేను అలాగే అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు.
ఇప్పుడు నేను వెళ్లకపోతే మీ దగ్గర ఇంక చాలా చులకన అవ్వడం నాకు ఇష్టం లేదు.మీ దృష్టిలో సంపాదన ఉంటేనే మనిషి అని అర్థం అయింది. అందుకే సంపాదించాలి అనుకుంటున్నాను.నేను గర్భవతి అని తెలిసిన తరువాత అయిన మీలో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ నాకు అమ్మ అనే పిలుపునే దూరం చేస్తారు అనుకోలేదు.మీరు అంటే నాకు ఎప్పటికి ఇష్టమే యష్.నేను మాత్రమే వెళ్తున్నాను నా ప్రాణం మీ దగ్గరే ఉంది.

ఏదో ఒక రోజు మీలో నిజమైన మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అప్పుడు నేనే మీ దగ్గరకు వస్తాను.సంపాదన ఉంటేనే మీ దృష్టిలో మనిషిని అని చెప్పకనే చెప్పారు థాంక్స్ యష్.

నా వల్ల మీరు బాధ పడి ఉంటే నన్ను క్షమించండి, ఉంటాను.

💕💕 ఐ లవ్ యూ సో మచ్ యష్ గారు 💕💕

ప్రేమతో మీ స్నేహ

యష్ కళ్లలో నీళ్ళు,భూమి గుండ్రంగా తిరగుతున్నట్టు ఉంది.

అలా రోజులు గడుస్తున్నా కొద్ది యష్ ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు.ఎటు చూసినా స్నేహిత గుర్తులు.మనిషి ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడే వెలితిగా ఉంటుంది అని ఇప్పుడు యష్కి బాగా అర్ధం అయింది.

ఇల్లు ఖాళీ చేసి తను కూడా బెంగళూరు వెళ్లిపోయాడు.

స్నేహిత ఎక్కడ ఉన్నా తనని కలుసుకోవాలని ఎంత వెతికిన లాభం లేకుండా పోయింది అసలు స్నేహిత బెంగళూరులో లేదు.

బెంగళూరులోనే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మంచి అవకాశం రావడంతో అమెరికా వెళ్లిపోయింది.ఇప్పుడు తన సంపాదన నెలకు అక్షరాల పది లక్షలు.

ఒకరోజు యష్కి ఫోన్ చేసింది.

ఎలా ఉన్నారు నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అంటూ.

నన్ను వదిలి వెళ్లి సంతోషంగా ఉన్నావా స్నేహ...??

నేను లేకపోతే మీరు సంతోషం కదా యష్.

గతన్ని తీయకు స్నేహ బెంగళూరు వచ్చేయి నీకోసం ఇక్కడికి వచ్చేశాను.

దూరంగా ఉంటేనే ప్రేమ ఉంటుంది అంటే ఈ దూరమే బావుంది యష్.ఎప్పుడు లేనిది ఇప్పుడు మీరు నాకోసం ఆలోచిస్తున్నారు అది చాలు నాకు.నేను రావడానికి ఇంక పది నెలల పడుతుంది యష్.

నీకోసం ఎన్ని నెలలు,సంవత్సరాలు అయిన ఎదురు చూస్తాను స్నేహ ఐ లవ్ యూ 💕

చాలా కొత్తగా కనబడుతున్నారు ఇప్పుడు మీరు.

నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్నేహ బై 💕💕😭💕💕

థాంక్యు యష్ 💕


*******************************

అలా పది నెలలు గడిచినా తరువాత స్నేహ-యష్ బెంగళూరులోనే కాపురం పెట్టారు.ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్తో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.
యష్లో చాలా మార్పు వచ్చింది ఎప్పుడు ఫ్రెండ్స్ అని తిరిగే యష్ ఇప్పుడు స్నేహ స్నేహ అంటూ తిరుగుతున్నడు.భార్య స్థానం భార్యకు ఇవ్వాలి లేకపోతే ఆ బంధానికి విలువ ఉండదు.మీకోసమే ఎదురు చూసే వాళ్ళలో మొదటి స్థానం అమ్మ అయితే పెళ్లి తరువాత ఆ స్థానం భార్యది.ఎవరి విలువ వారికి తప్పకుండా ఇవ్వాలి.

💕 ఎప్పటికి నువ్వే నా ప్రాణం స్నేహ 💕

💕 శుభం 💕

💐 ధన్యవాదాలు 💐

అంకిత మోహన్ ✍️