Read The Elevator by Hrushi in Telugu Horror Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

The Elevator

 

The elevator 

నా పేరు ఆనంద్.నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి ఐదు సంవత్సరాలు అవుతోంది.ఈ ఇన్సిడెంట్ని నేను మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నాను కానీ నన్ను మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేదు.ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది అప్పుడు మా ఆఫీస్ వాళ్ళు నాకు ఏదో హోటల్లో రూమ్ బుక్ చేసారు నేను నార్మల్ గా మార్నింగ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని సాయంత్రంగా బయటికి వచ్చి ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను.ఆ క్యాబ్ నేను ఉండే లొకేషన్ కి వచ్చింది.క్యాబ్ డ్రైవర్ సర్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అప్పుడు నేను వెళ్లాలనుకుంటున్న హోటల్ పేరుని ఆ డ్రైవర్ కి చెప్పాను అతను సర్ నాకు సరిగ్గా వినపడలేదు అని అన్నాడు నేను మల్లి అతనికి హోటల్ పేరు చెప్పాను అలాగే సర్ ఎక్కండి అన్నాడు ఎక్కాక సాయంత్రం కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో నాకు నా హోటల్ చేరడానికి దాదాపు ఒక గంట సమయం పట్టింది.అతనికి డబ్బులు పే చేసి హోటల్ లోపలి వెళ్ళాను రిసెప్షన్ లో నా డీటెయిల్స్ అన్ని చెప్పి నా రూమ్ కీస్ తీసుకున్నాను హోటల్ వాళ్ళు నాకు నా రూమ్ చూపించడానికి ఒక అబ్బాయిని పంపిస్తామన్నారు కానీ నేను వద్దు అని చెప్పి నా లగేజీ తీసుకొని నా రూమ్ వైపుకి బయలుదేరాను చూస్తుంటే ఆ హోటల్ చాల పెద్దగా చాల గ్రాండ్ గా ఉంది.ఆ హోటల్ దాదాపు పదిహేను ఫ్లోర్లు ఉండచ్చు వాళ్ళు నాకిచ్చిన రూమ్ తొమ్మిదవ ఫ్లోర్ లో ఉంది నేను ఎలివేటర్ దగ్గరకి వచ్చి బటన్ క్లిక్ చేసి ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తున్నాను పదవ ఫ్లోర్లో ఉన్న ఎలివేటర్ కిందకి వచ్చింది దాని డోర్స్ ఓపెన్ అయ్యాయి ఆ ఎలివేటర్ చివరిలో ఒక అద్దం ఉంది నేను నా లగేజీ మొత్తం లోపలికి తీసుకొని వెళ్ళాను డోర్స్ క్లోస్ అయ్యాయి,ఎలివేటర్ స్లోగా మూవ్ అవుతోంది కానీ నాకు ఎందుకో తెలియని భయంగా ఉంది.ఈ ఎలివేటర్ వెళ్తున్నప్పుడు పైన ఫ్లోర్లలో ఉన్న మనుషులని చూడగలుగుతున్న నాకెందుకో ఈ ఎలివేటర్ స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తోంది.ఒక ఫ్లోరునుండి ఇంకో ఫ్లోర్కి దాదాపు పది సెకండ్ల సమయం పడుతోంది.పాత హోటల్ కదా అందుకే దీని మూవ్మెంట్ ఇంత స్లోగా ఉందని నేను అనుకున్న,ఇది ఫ్లోర్ నుండి ఫ్లోర్కి వెళ్లేకొద్దీ నాకెందుకో భయం ఇంకా పెరుగుతూ ఉంది.ఇంకా ఒక్కసారిగా ఈ ఎలివేటర్ ఆరవ ఫ్లోర్ దగ్గరకి వచ్చి ఆగింది ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక నాకు ఎదురుగా ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న ఒక ఆవిడ కనబడింది ఆమె ఎడమ చేతిని ఒక చిన్న పిల్లాడు పట్టుకొని ఉన్నాడు. వాళ్లిద్దరూ ఎలివేటర్ లోపలి ఎక్కారు డోర్స్ మల్లి మూసుకున్నాయి. ఇంకా నా ఫ్లోర్ కి వెళ్ళడానికి రెండు ఫ్లోర్లే ఉన్నాయి, వాళ్లిద్దరూ నాకు కనిపించేసకుండా నా వెనకాల నిలబడుకొని ఉన్నారు.ఇక ఒక్కసారిగా “ఆనంద్ ఎక్కడికి వెళుతున్నావ్” అని ఆవిడ అడిగారు.దానితో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అసలు ఆవిడకు నా పేరు ఎలా తెలుసు ? ఇంకా నేను ధైర్యం చేసి అసలు మీకు నా పేరు ఎలా తెలుసు అనిఅడుగుదామని అనుకున్నాను, కానీ అప్పుడే ఆవిడ చెయ్యి పట్టుకొని ఉన్న పిల్లవాడు “అమ్మ నాకు పైన ఏదో కనిపించింది అందుకే అది నీకు చూపించడానికి నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను” అని చెప్పాడు. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. యు హావ్ రిచెడ్ నైన్త్ ఫ్లోర్ అని ఆ లిఫ్ట్ లో సౌండ్ వచ్చింది, ఇక నేను నా ఫ్లోర్ కి రీచ్ అయ్యానని నా లగేజీ మొత్తం తీసుకొని ఆ లిఫ్ట్ నుండి బయటికి వచ్చా. ఆలా బయటికి వచ్చి చూద్దామా వద్ద అని ఆలోచిస్తూ ఆ ఎలివేటర్ డోర్లు మూసుకునే సమయానికి వెనక్కి తిరిగి చూసాను. ఎలివేటర్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు నా వైపు అలానే చూస్తూ ఉన్నారు. ఇక నాకు అసలు ఎం జరుగుతుందో అర్థం కాక సతమతమవుతుంటే ఆ లిఫ్ట్ లో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు భయం ఇంకా ఎక్కువ అవుతోంది. ఇక నేను అక్కడినుండి వేగంగా నా రూమ్ నెంబర్ 906 కి బయలుదేరాను ఇంకా నా రూమ్ డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళాను. నా సామాన్లు అన్ని సద్దేసి పని ఉండడంతో లాప్టాప్ ఓపెన్ చేసి టేబుల్ దగ్గర పెట్టి పని చేసుకుంటూ ఉన్నాను. అలా పని చేస్తూనే నాకు తెలియకుండానే సమయం రాత్రి 11 అయ్యింది ఇక లాప్టాప్ క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆపేసి పడుకొని నిద్ర పోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో గట్టిగ తన రూమ్ డోర్ ని కొడుతుంటారు ఆ శబ్దానికి నాకు మెళుకువు వచ్చి లైట్స్ ఆన్ చేశాను కానీ అవి ఆన్ అవ్వట్లేదు, హోటల్ వాళ్లకి కాల్ చేసి తన విషయాన్ని చెబుదామని అనుకున్నాను. నా లాండ్లైన్ తో వాళ్లకి కాల్ చేశాను కానీ అది వాళ్లకి కనెక్ట్ అవ్వట్లేదు. అప్పుడే సడెన్గా ఎలివేటర్ దగ్గర ఎవరో ఉన్నట్టు శబ్దాలు వినిపించాయి.ఇక నేను న రూమ్ బయటకు వచ్చి అక్కడ హోటల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని సహాయం అడుగుదామని అనుకున్నాను. ఇక నేను అలా నడుస్తూ హాల్ లో నుంచి ఎలివేటర్ దగ్గరకి చేరుకుందామనుకున్నా కానీ ఆ సమయంలో ఆ హాల్ మొత్తం చీకటిగా భయానకంగా ఉంది. ఆలా నడుస్తూ ఉన్న నాకు కూడా ఎందుకో భయంగా ఉంది, చివరిగా నేను ఎలాగో ఆ ఎలివేటర్ దగ్గరికి చేరుకున్నా. కానీ ఆ ఎలివేటర్ ని చూసాక నాకు భయం ఇంకా ఎక్కువ అవుతోంది. ఆ ఎలివేటర్ దగ్గర ఎవరు లేరు కానీ దాని డోర్లు మాత్రం ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఎలాగో ధైర్యం పెంచుకొని నేను ఎలివేటర్ లోపలికి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ని క్లిక్ చేసి వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ సారి నా అదృష్టం బాగుండడం వల్ల ఆ ఎలివేటర్ డోర్లు మూసుకున్నాయి. ఇక నేను ఊపిరి పీల్చుకున్నాను. ఎలివేటర్ అలా కిందకి వెళ్తూ ఉండగా ఎందుకో దాని వాతావరణం మొత్తం చల్లగా మరియు మరింత చీకటిగా మారిపోతున్నట్టు అనిపించింది.అలా గ్రౌండ్ ఫ్లోర్ వైపు వెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా 6 వ ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక నాకు వెన్నులో వణుకు పుట్టడం మొదలయింది. ఎలివేటర్ డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇక నా ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి నాకు చమటలు పట్టడం మొదలయ్యాయి. ఇంతక ముందు నేను పైకి వెళ్తున్నప్పుడు ఎక్కిన వాళ్ళ ఇద్దరే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ ఇద్దరి వెనకాల ఉన్న హాల్ మొత్తం చీకటిగా ఉంది. అంతేకాకుండా దూరంగా అక్కడక్కడా మద్ధ్యలో రెడ్ కలర్ లైట్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ఈ సారి వాళ్ళు ఇద్దరు నల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. నేను భయంతో పక్కకి జరిగి నిలబడ్డాను. ఇక వాళ్ళు ఇద్దరూ లిఫ్ట్ లోకి ఎక్కారు. ఆవిడ 15 వ ఫ్లోర్ బటన్ ని క్లిక్ చేసింది. నేను, నాలో నేను “మొదట నేను క్లిక్ చేశాను కాబట్టి అది ముందు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుంది ఆ తర్వాత 15 వ ఫ్లోర్ కి వెళ్తుంది అయినా నేను వీళ్ళని చూసి ఎందుకు ఇలా భయపడుతున్నాను” అని నాలో నేను అనుకున్నాను. కానీ ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లకుండా 15 వ ఫ్లోర్ వైపుగా వెళ్లడం మొదలయింది. ఇక నాకు అర్థం అయ్యింది ఇక్కడ కచ్చితంగా ఏదో జరగబోతోంది అని. ఆలా నేను ఆలోచిస్తూ ఉండగానే వెనక నుండి ఆవిడ మళ్ళీ “ఆనంద్ ఎక్కడికి వెళుతున్నావ్” అని అడిగింది. నేను కొంచం ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నాకు నా వెనకాల ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ ఎలివేటర్ లో ఉన్న అద్దంలో వాళ్లిద్దరూ అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నారు. అద్దం లో ఉన్న వాళ్లిద్దరూ నన్నే చూస్తున్నట్టు కనిపిస్తున్నారు కానీ నాకు ఎదురుగా మాత్రం అసలు కనిపించటంలేదు.ఇంకా అప్పుడే ఆమెతో ఉన్న ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో మళ్ళీ “నాకు 15 వ ఫ్లోర్ లో ఏదో కనిపించింది” అని చెప్పాడు. ఇక నేను భయం తో ఆ ఎలివేటర్ మూల కి వెళ్లి కూర్చున్నాను. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు నాకు మాత్రం ఏవేవో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇంక ఆ ఎలివేటర్ 15 వ ఫ్లోర్ లో ఆగింది. డోర్లు ఓపెన్ అయిన వెంటనే వాళ్లిద్దరూ బయటికి వెళ్లిపోయారు. నేను మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ని వేగంగా క్లిక్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ఎలివేటర్ డోర్లు మాత్రం అసలు క్లోజ్ అవ్వడం లేదు. నేను ఇక అలానే ఆ ఎలివేటర్ లో ఒక మూల కూర్చొని దూరంగా ఉన్న ఆ హాల్ లో చూస్తూ ఉన్నాను. నాకు ఆ హాల్ మొత్తం రెడ్ కలర్ లైట్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. ఎంత సేపు చూసినా కూడా ఆ ఎలివేటర్ డోర్లు క్లోజ్ అవ్వడం లేదు, ఎలివేటర్ కూడా కదలడం లేదు. ఇక నాకు వేరే మార్గం లేదని చెప్పి ఇంకా ఎం చెయ్యాలో అర్థం కాక నేను ఎలివేటర్ లో నుండి బయటకు వచ్చాను. ఆ హాల్ లోని డోర్ లు అన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి కానీ ఒక్క డోర్ మాత్రం ఓపెన్ అయ్యి ఉంది. ఆ డోర్ కి పైన ఉన్న ఒక రెడ్ కలర్ ట్యూబ్ లైట్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంది. నేను ఇంకా కొంచం ధైర్యం తెచ్చుకొని చీకటిగా ఉన్న ఆ హాల్ లో మెల్లగా నడుస్తూ ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డోర్ లోపల వైపుకి చూసాక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ రూమ్ లో ఎవడో ఒక అతను ఇందాక నేను లిఫ్ట్ లో చూసినా వాళ్ళ ఇద్దరిని అతి దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపుతున్నాడు. ఆ రూమ్ మొత్తం అంతా ఎర్రటి రక్తం తో నిండి పోయి ఉంది. ఇక నేను కళ్ళు తెరిచి చూసే సరికి నేను నా రూమ్ లో పడుకొని ఉన్నాను. పక్కనే హోటల్ వాళ్ళు కూడా ఉన్నారు. “నాకు ఏమైంది” అని నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు నాతో “రాత్రి మీరు ఎలివేటర్ లో కళ్ళు తిరిగి పడిపోయారు” అని వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పారు. అంతే ఇంక నేను ఆ హోటల్ నుంచి వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఆ హోటల్ లో జరిగిన విషయాలు ఇంక అప్పుడప్పుడు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చమటలు పట్టేస్తాయి. కొద్ది రోజులకి ఆ సంఘటనలని మర్చిపోతూ వస్తున్నాను.

మరి కొద్ది రోజులకి నేను ఆ విషయాలని పూర్తిగా మర్చిపోయే సమయానికి మళ్ళీ ఇంకో సంఘటన ఎదురైంది. అదేంటంటే నేను ఒక రోజు రాత్రి ఆఫీస్ పని చూసుకొని కార్ లో ఇంటికి వస్తున్నాను. మా ఆఫీస్ కి ఇంటికి మధ్య దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో 7 కిలోమీటర్లు టౌన్ మరో 6 కిలోమీటర్లు అది మార్గంలో నుంచి వెళ్ళాలి. నేను ఆ టౌన్ మార్గం మొత్తం ముగించుకొని ఇక ఆ అడవి మార్గంలోకి వచ్చాను. అందులో మొదటి 2 కిలోమీటర్లు బాగానే ఉంది తర్వాత కొద్ది సేపటికి దట్టమైన అడవి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే సడెన్గా వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ చూసి ఒక్కసారిగా ముందు కి చూసేసరికి ఎవరో నా కార్ కి అడ్డంగా నిలబడునట్టు అనిపించింది. ఇక వెంటనే కార్ ని ఆపి చుట్టుపక్కల చూసాను. కానీ అక్కడ ఎవ్వరు లేరు నేను ఇంక ఇంటికి వెళ్లి పోయాను. ఆఫీస్ నుండి ఆలస్యంగా రావడంతో తొందరగా పడుకున్నాను. కొద్ది సేపటి తర్వాత నాకు మళ్ళీ ఆ హోటల్ లో జరిగిన విద్యలు అన్ని గుర్తుకు వస్తున్నాయి. అంతే ఇక రాత్రంతా అలా భయపడుతూనే పడుకున్నాను. ఇక తెల్లవారగానే లేచి ఆ ఇంటిని కాళీ చేసి నా ఆఫీస్ కి దగ్గరగా టౌన్ లో ఉండే ఒక ఇంటికి మారిపోయాను. అంతే ఇక అలాంటి విషయాలు ఏమి జరగకుండా రోజు సంతోషంగా ఆఫీస్ కి వెళుతూ ఇంటికి పోతు హాయిగా గడిపేస్తున్నాను.

ధన్యవాదాలు.


ఇట్లు,
మీ మిత్రుడు హృషీ.