ప్రీతీ...!! ప్రీతీ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ రా... నాకింకా బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది ప్రీతీ నాకు... " కష్టంగా శ్వాస తీసుకుంటూ చెప్తూనే, ఆమె ఒడిలో తన ఆఖరి శ్వాస విడిచాడు అతను... " అరుణ్...!!! " ఉలిక్కి పడి లేచింది ఆమె... ఒళ్లంతా చిరు చెమటలు... బిక్కు బిక్కుమంటూ చుట్టూరా చూసుకుంది... వణికే చేతులతో, పక్కనే బెడ్ ల్యాంప్ స్టాండ్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని, సగం నీళ్ళు తాగేసింది... బాటిల్ పక్కన పెడుతూ, గోడకున్న గడియారం వైపు చూసి, అప్పటికే టైం తెల్లవారి నాలుగున్నర గంటలు అవ్వడంతో, అరి చేతులతో మొహాన్ని రబ్ చేసుకొని, బెడ్ దిగి, తన గదిలోంచి బయటకు నడిచి, ఇంటి పనులు మొదలుపెట్టింది ప్రీతి... ఇళ్ళు, వాకిలి శుభ్రం చేసి, వాకిట్లో కళ్ళాపి జల్లి, ముగ్గు పెట్టేసరికి సమయం అయిదు గంటలు... " ప్రీతీ...!! లేచేసావా తల్లీ...!? " అంటూ తన గదిలోంచి బయటకు వచ్చింది మాధవి... " హా... అమ్మా...!! గుడ్ మార్నింగ్... నేను ఫ్రెష్ అయ్యి వచ్చి, టీ రెడీ చేస్తాను... ఈ స్ట్రీట్ చివర పార్క్ వుంది... నువ్వీలోగా వెళ్ళి, కొంచెం సమయం వాకింగ్ చేసిరా... "

కొత్త ఎపిసోడ్లు : : Every Tuesday, Thursday & Saturday

1

ప్రేమమ్ - 1

" ప్రీతీ...!! ప్రీతీ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ రా... నాకింకా బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది... నీతో కలిసి వుంది ప్రీతీ నాకు... " కష్టంగా శ్వాస తీసుకుంటూ చెప్తూనే, ఆమె ఒడిలో తన ఆఖరి శ్వాస విడిచాడు అతను... " అరుణ్...!!! " ఉలిక్కి పడి లేచింది ఆమె...ఒళ్లంతా చిరు చెమటలు... బిక్కు బిక్కుమంటూ చుట్టూరా చూసుకుంది... వణికే చేతులతో, పక్కనే బెడ్ ల్యాంప్ స్టాండ్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని, సగం నీళ్ళు తాగేసింది...బాటిల్ పక్కన పెడుతూ, గోడకున్న గడియారం వైపు చూసి, అప్పటికే టైం తెల్లవారి నాలుగున్నర గంటలు అవ్వడంతో, అరి చేతులతో మొహాన్ని రబ్ చేసుకొని, బెడ్ దిగి, తన గదిలోంచి బయటకు నడిచి, ఇంటి పనులు మొదలుపెట్టింది ప్రీతి... ఇళ్ళు, వాకిలి శుభ్రం చేసి, వాకిట్లో కళ్ళాపి జల్లి, ముగ్గు పెట్టేసరికి సమయం అయిదు గంటలు..." ...మరింత చదవండి

2

ప్రేమమ్ - 2

భారంగా అనిపిస్తున్న కనురెప్పలను నెమ్మదిగా తెరిచింది ఆమె...కరస్పాండెంట్ వైష్ణవి గారు, ప్రీతి చేతిలో చెయ్యి వేసి," అమ్మా ప్రీతి..!! ప్రీతి ఆర్ యూ ఓకే...!? " అడుగుతారు...చెమ్మగిల్లిన కళ్ళతో వైష్ణవి గారిని చూస్తూ, తల నిలువుగా ఊపుతుంది ప్రీతి...ప్రీతి తల నిమురుతూ, ఆమె పక్కనే కూర్చోని జరిగింది చెప్తారు వైష్ణవి గారు... ఆవిడ చెప్పింది మొత్తం విన్న ప్రీతికి తనే అధర్వ్ విషయంలో ముందుగా తప్పు చేశానని అర్థం చేసుకుంటుంది...ఈలోగా ప్రీతిని వుంచిన రూంలోకి వస్తారు ఆ కాలేజ్ ఫౌండర్స్ లో ఒకరైన ధర్మేంద్ర... ఇంకా ప్రిన్సిపల్ విష్ణు మోహన్ కలిసి...నెమ్మదిగా లేచి కూర్చుంటూ, ప్రిన్సిపల్ విష్ణు మోహన్ ని చూస్తూ చిన్నగా నవ్వి, వచ్చిన వాళ్ళని విష్ చేస్తుంది ప్రీతి..." అమ్మా ప్రీతి... ఈయన అక్కినేని ధర్మేంద్ర గారు... ఈ కాలేజ్ ఫౌండర్... " ధర్మేంద్ర గారిని పరిచయం చేస్తారు విష్ణు మోహన్..." సర్..!! తినే ప్రీతి... " ...మరింత చదవండి

3

ప్రేమమ్ - 3

అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి, 5 మినిట్స్ అయింది... ఈ బ్యాచ్ మొత్తం క్యాంటీన్లో, ఈరోజు వాళ్ళు విన్ అయిన మ్యాచ్ కోసం సొల్లు వేసుకొని వచ్చారు... క్లాస్ లోకి ఎంటర్ అయిన బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎదురుగా వున్న దృశ్యాన్ని చూసి...చాలా శ్రద్ధగా క్లాస్ చెప్తూ వుంది ప్రీతి... అంతకన్నా శ్రద్ధగా క్లాస్ వింటున్నారు స్టూడెంట్స్... చూపు తిప్పకుండా, కళ్ళను ఆమెకు అప్పగించేసి, ఏదో ట్రాన్స్లో వున్నట్టు వుండిపోయారు స్టూడెంట్స్ అంతా...జరుగుతున్నది మొత్తం చూసి, కీర్తి ముందుగా తేరుకుంటూ, " ఎక్క్యూజ్ మీ మ్యామ్... " చిన్నగా పర్మిషన్ అడిగింది...కీర్తి మాటలకు డిస్టర్బ్ అయిన ప్రీతి, కనుబొమ్మలు ముడిచి డోర్ వైపు తలతిప్పి చూస్తుంది...అంతమంది వున్నా ప్రీతి లుక్ అధర్వ్ మీదనే పడుతుంది ముందుగా... తరువాతనే మిగిలిన బ్యాచ్ మొత్తాన్ని ఒక లుక్ వేసి, చిన్నగా నిట్టూరుస్తూ ఎడమ చేతికున్న టైటన్ వాచ్ ని చూసుకుంటుంది..." ...మరింత చదవండి

4

ప్రేమమ్ - 4

సాయంత్రం ఇంటికి చేరుకున్న ప్రీతి, తల్లిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది... డాక్టర్ చెప్పిన టెస్ట్ లన్నీ చేయించి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారిద్దరూ..." ఇప్పుడెందుకు ఈ టేస్ట్ లన్నీ నాకు... బానే వున్నాను కదా... చెప్పినా వినకుండా ఇలా వేలు ఖర్చు చేసావ్ నాకోసం... "" ఇప్పటికే ఇంటికి రెంట్ అడ్వాన్స్ అనీ, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సామాన్లు ఇలా చాలానే ఖర్చులయ్యాయి కదా... మళ్ళీ ఇవి కూడానా... "" అమ్మా...!! నాకు నీ హెల్త్ కన్నా, ఇంకేం ముఖ్యం కాదు... కాసేపు మాట్లాడకుండా కూర్చో.... " " హుమ్మ్... మొండి పిల్లవి.. చెప్పినా వినవు కదా... "నర్స్ వచ్చి పిలవడంతో, ఇద్దరూ డాక్టర్ గారి క్యాబిన్ లోకి వెళ్తారు...డాక్టర్ రిపోర్ట్స్ చూసి, రాసిచ్చిన మందులు తీసుకొని, బయల్దేరారు ఇద్దరూ...ఆటోలో వస్తూ, మార్కెట్ దగ్గర ఆగి, కావాల్సిన కూరగాయలు తీసుకొని ఇంటికి బయల్దేరుతారు..." ప్రీతి...!! కాలేజ్ ఎలా వుంది... ...మరింత చదవండి