నీల అయాన్ వైపు చూస్తూనే ఉంది.అయాన్ మాత్రం పూర్తిగా ఏదో మాయలో పడిపోయినట్టుగా ఆమెనే చూస్తున్నాడు. అతని చూపు నీల ముఖం మీద నుంచి పక్కకు తప్పడం లేదు.ఆ నిశ్శబ్దంలో నీల నెమ్మదిగా పిలిచింది.“అయాన్...”ఆ ఒక్క పిలుపులోనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.ఇప్పటికైనా నిజం చెబుతావా?ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది ఒప్పుకుంటావా?అయాన్ ఏమీ మాట్లాడలేదు.నీల కళ్లలోకి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.నీల మరో అడుగు ముందుకు వేసింది.“అయాన్...”ఆమె గొంతు వినగానే అతని ఛాతీలోని కోర్ ఒక్కసారిగా వేగంగా స్పందించింది.అతను తనను తాను నెమ్మదించుకోవడానికి ప్రయత్నించాడు.కంట్రోల్... అయాన్. కంట్రోల్.ఇప్పటికీ నీ మనసులో దాచుకుంటావా?ఎందుకు ఒప్పుకోవడం లేదు?అతని సిస్టమ్‌లో ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తున్నాయి.చివరికి అయాన్ తన చూపును నీల మీద నుంచి తిప్పుకున్నాడు.“నీలా... నేను ఒక రోబోని.”అతని గొంతులోని భావాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది.“మన ఇద్దరి మధ్య ఇది వర్కవుట్ అవ్వదని నీకు చాలాసార్లు చెప్పాను.”నీల ముఖంలో ఉన్న చిన్న ఆశ ఒక్కసారిగా మసకబారింది.ఆమె కొద్దిసేపు