ప్రేమ్ ఈ రోజు ఎలాగైనా ప్రియా తో తనమీద అన్న ఫీలింగ్స్ బయట పెడదాము అని అనుకుంటాడు , అందుకే ఆ స్టెప్ తీసుకున్నాడు కానీ, ప్రియా కళ్ళల్లో నీళ్లు చూసిన ప్రేమ్ కి బాధగా అనిపిస్తుంది , ఈ టైం కరెక్ట్ కాదేమో అని అనుకుంటాడు , తన కోపాన్ని తగ్గించుకొని , ప్రియా నీ బెడ్ మీద కూర్చోబెట్టి తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ "ఏడవకు బంగారం నువ్వు ఏడుస్తే నేను చూడలేను రా, ప్లీజ్ ఏడవద్దు " అని లాలనగా అంటూ తన కళ్ళు తుడుస్తాడు. ప్రియా కి ఇంకా ఇంతకుముందు జరిగిందే గుర్తుకు వస్తూ ఉంటుంది . ప్రేమ్ తనకి ముద్దు పెడుతుంటే తను ఎందుకు కాదనలేదు అని , తనకి ఆ క్షణం ఏం జరిగిందో కూడా తనకి అర్థం కాలేదు, ప్రేమ్ తన దగ్గరలో ఉన్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ . అతనికి దగ్గరగా