గాయత్రి ఇంకా సునంద గారు ప్రియా రూమ్ వైపు వస్తూ ఉంటారు గాయత్రీ గారి చేతిలో ఫ్రూట్ బౌల్ పట్టుకొని ఉంటారు , అది అక్షయ కోసం .లోపల జరుగుతుంది చూసిన వారి ఇద్దరి మొహాల్లో ఆనందం విచ్చుకుంటుంది . ఎందుకంటే అక్కడ అక్షయ బెడ్ మీద కూర్చుని ఉంటే ప్రియా ఇంకా శైలు , అక్షయ బేబీ బంప్ తో ఏదో మాట్లాడుతూ ముసి ముసిగా నవ్వుకుంటూ ఉన్నారు . ప్రియ , అక్షయ కడుపులో అన్న బేబీస్ తో ఏదో మాట్లాడుతూ మధ్య మధ్యలో అక్షయ కి ఫ్రూట్ తినిపిస్తుంది. ప్రియా అక్షయ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటుంది అక్షయ ప్రెగ్నెంట అని తెలిసినప్పటినుంచి తన మీద ఎక్కువగా కేర్ ప్రియా నే తీసుకుంటుంది అక్షయ డైట్ ప్లాన్స్ అన్ని కూడా రాసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చి ఉంటుంది, ఎప్పటికప్పుడు తన డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో