ప్రెసెంట్ (ప్రస్తుతం):అలా జరిగింది అంతా కూడా డీటెయిల్ గా వివరించి చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. " నిన్న ఈవినింగ్ ఫైల్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చదువుతున్నప్పుడు ఫొటోస్ లేవు అని గమనించాను అతనికి ఫోన్ చేస్తే అన్రిచబుల్ అని వచ్చింది . ఈరోజు పొద్దున్న కాల్ చేసి ఆ ఫొటోస్ వివరాలు అడుగుదాం అని అనుకున్నాను. నాకేం తెలుసు ఇలా రాత్రికి రాత్రి డాడీ కాల్ చేసి అత్తయ్యతో మాట్లాడుతారు అని , అత్తయ్య ఇలా పొద్దున్నే ఫ్యామిలీతో వస్తుంది అని " అని అంటూ బెడ్ మీద కూలబడిపోతుంది. పాపం ప్రియ బ్యాడ్ లక్ కి తన ఫ్రెండ్స్ అందరు కూడా ఫీల్ అవుతారు ఇలా ఒక్క నైట్ లో తన లైఫ్ మొత్తం తలకిందులు అవుతుందని ఎవరు ఊహించలేదు.కానీ జరిగిందంతా విన్న ప్రేమ్ మాత్రం చాలా సంతోషపడతాడు. " వావ్.. బంగారం నాకు మాత్రం భలే థ్రిల్లింగ్ గా ఉంది