యూ ఆర్ మై డెస్టినీ - 13

  • 144
  • 57

ఆరోజు ఆఫీస్ మీటింగ్ ఉండడంవల్ల బయట డిన్నర్ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తుంది ప్రియా తన ఇంటికి వస్తూ ఉండంగా తన నాన్న ఇంకా నానమ్మ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఊర్మిళాదేవి మాట్లాడుతూ "  ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఇన్నాళ్ళకి నా కూతురు జాడ తెలిసింది" అని ఎంతో సంతోష పడుతూ ఉంటారు,  ఆవిడ మాటల్లో కూడా కొంచెం దుఃఖం తొంగి చూస్తుంది.ఊర్మిళ దేవి  మాటలకు సునంద గారు మాట్లాడుతూ " అవును అత్తయ్య గారు ఇన్నాళ్ళకి మీ ప్రార్ధనలు అన్నీ ఆ కృష్ణయ్య వినడు అందుకే వదినా జాడ తెలుసుకోగలిగాము " అని అంటారు." ఆ కృష్ణయ్య  నా ఈ ఇంకో ప్రార్థన కూడా ఎప్పుడు ఆలకించి దాని నెరవేరుస్తాడో ఏమో"  అంటారు ఊర్మిళాదేవి గారు. " ఏంటమ్మా అది?"  అని అడుగుతాడు జగదీష్ చంద్ర." ఇంకేముంటుందిరా,  నా మనవరాలి పెళ్లి, దాని పెళ్లి కూడా చేసేస్తే