ప్రేమ్ ,ఆదిత్య ఇంకా అక్షయ, ప్రియా గదిలోకిరాగానే అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యంలో వారి కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎందుకంటే అక్కడ ప్రియా ఉగ్రకాలి లాగా నితిన్ ఇంకా అరుణ్ నీ కొడుతూ ఉంటే . నిఖిల్ కూల్ గా సోఫాలో కూర్చుని అక్కడ జరిగిందంతా ఒక మూవీ చూసినట్టు చూస్తున్నాడు, శైలు కి మాత్రం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ ఇంకా జాలిగా నితిన్ ఇంకా అరుణ్ నీ చూస్తుంది.ప్రియా ని అలా చూసిన ఆదిత్య కొంచెం భయపడుతూ ప్రేమ్ వైపు చూసి " ఈ పిల్ల నీకు కరెక్టేనంటావా రా, చూసావా ఎలా కొడుతుందొ వాళ్ళ ఫ్రెండ్స్ ని, రేపొద్దున నీ పరిస్థితి ఏంటి అంటావ్" అని జాలి పడతాడు.పెళ్లయిన తర్వాత ప్రేమ్ ప్రియా మాట వినకపోతే ప్రియా ప్రేమ్ ని పట్టుకొని ఇలా కొట్టడం ఆదిత్య ఇమేజింగ్ చేసుకుంటూ ఉంటాడు." ఒరేయ్ ఇప్పటికైనా మించి పోయింది