నేను వేసే ప్రతి అడుగూ అక్కడి వాతావరణాన్ని కాస్త భారంగా, నా వెనక ఉన్న వాళ్ల గుండెల్లో ఓ అనుమానంతో కూడిన భయాన్ని మిగిలిస్తున్నాయి..లాస్ట్ ఆడియో అయిపోయింది.ఇంకా తర్వాత వినడానికి ఎలాంటి రికార్డింగ్స్ లేవు..గదిలో నిశ్శబ్దం.ఆకాష్ ఆలోచనల్లో పడ్డాడు…. అసలు నాన్న తర్వాత ఏం చేశాడు, మా అమ్మ చూస్తే నాన్నని పెళ్ళి చూపుల్లో చూసి పెళ్ళి చేసుకున్నా అని చెప్తోంది..ఇక్కడ చూస్తే నాన్న చాందినీ ని ప్రేమించి తనని మహా అని పిలుస్తున్నాడు, బహుశా చాందిని వదిలేసి వెళ్లిపోయినందుకు ఆ పేరు ఉన్న అమ్మని పెళ్ళి చేసుకున్నాడా, అయితే కథలో ఉన్న చాందిని ఏమైపోయింది.. అలా అయితే నాన్న ఇద్దరికీ మోసం చేసినట్టే కదా…?, ఇలాంటి అనుమానాలు వానలా కురుస్తున్నాయి..టైం చూస్తే రాత్రి 12 అవుతుంది ఆతృత తట్టుకోలేక వెళ్లి వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ తలుపు కొట్టాడు.డోర్ తీసి, ఏంట్రా నాన్న ఈ టైంలో నిద్ర లేపుతున్నావ్ అని అడిగింది అమ్మ. “అమ్మా