అందరూ హాల్లో డిస్కషన్ పెట్టారు, జయ కూడా వచ్చాడు.నాకు తర్వాత వారం పెళ్లి చేసేద్దామని అందరూ మాట్లాడుకుంటున్నారు, “ “ఏంటి విక్రమ్ నీకు ఓకే నా” అడిగాడు తాతయ్యా.”నేను లేచి “ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు” అంటూ గట్టిగా అరిచాను.తాత మళ్లీ లేచి మీదకి వచ్చాడు, మళ్లీ పీకుతాడేమో అనుకున్నా…వచ్చి నన్ను హత్తుకొని ఏడుస్తున్నాడు, ఒకపక్క అమ్మ ఏడుస్తోంది, నాన్న నా ముందు ఏడవలేక పక్కకు తిరిగాడు, అసలు నేను ఉన్నంతవరకు వీళ్ళందర్నీ ఎంత హ్యాపీగా చూసుకుందాం అనుకున్నా, ఇప్పుడు చూడు ఏడిపించి చస్తున్నా.వీళ్ళతో పాటు జయ కూడా ఉన్నాడు, ఎందుకో తెలియదు మౌనంగా ఉన్నాడు, బహుశా వాడికి ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాలేదేమో.“సరే చేసుకుంటా” అని ఒప్పేసుకున్నా, ఎలాగూ గౌతమి వాళ్ళ నాన్నతో మాట్లాడతా అని చెప్పింది అనే ధైర్యం తో…కట్ చేస్తే… నెక్స్ట్ వారం పెళ్లి, తన అభిప్రాయం అడిగితే గౌతమి ఒప్పుకుందట,