చూడండి నేను మీరనుకున్నట్టు చేసేవాడిని ఐతే చాందిని నన్ను వదిలేసినప్పుడే వేరే అమ్మాయిని చూసే వాడిని కానీ నా మనసు అలా యాక్సెప్ట్ చెయ్యదు, నేను ఆకాష్ కి చేసింది మనసులో పెట్టుకొని మీరు ఏది బడితే అది మాట్లాడితే నాలో వేరే విక్రమ్ ని చూస్తారు..”నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా రా.., అయినా నువ్వేదో చేస్తే.. చూస్తూ కూర్చోవడానికి నేనేం చేతకాని వాడిని కాదు..ఆయన అలాగే మాట్లాడుతుంటే నాకు కోపం పెరిగిపోతోంది.ఇంతలో చాందిని వచ్చి నన్ను వెనక్కి తోసింది.., నేను కాలర్ వదిలేసా.., “నాన్న వెళ్దాం పదండి” అంది చాందిని..ఇంకా వీడితో మాటలు ఏంటి, అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నాడు.మహా… నాకు సమాధానం చెప్పు, నాతో మాట్లాడు, ఒకవేళ నేను తప్పే చేసి ఉంటే, సరే అంగీకరిస్తున్నా, కానీ తప్పు చేసిన వాళ్ళకి ఈ లోకంలో బతికే హక్కు లేదా, నీతో మాట్లాడకూడదా…, నిన్ను ప్రేమించకూడదా…, “చెప్పు చాందినీ”