ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయం గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, ఆ రోజు నుండి చాందిని తిరిగి వచ్చే వరకూ నా మనసు కుదుటపడలేదు.చాందిని వాళ్ల నాన్నతో పాటు వచ్చింది, నేనూ ఆయన్ని పలకరించా..తను తిరిగి వచ్చాక నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, తనతో సమయం గడపడం నాకు మెడిసిన్ అని డాక్టర్ ఓబెరాయ్ చెప్పక ముందే నాకు తెలుసు. నాకిప్పుడు ఆకాష్ గురించి ఆలోచించడం క్యాజువల్ విషయం లా అనిపిస్తోంది, ముందులా ఎక్కువ యాంగ్జైటీ రావడం, వాడు కనిపించడం ఇలాంటివి అస్సలు జరగట్లేదు.. ****ఒకరోజు ఉదయం టీం మొత్తం కాఫీ తాగడానికి వెళ్ళాం.. అందరం ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని, మాట్లాడుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాం.అంతా బానే ఉంది, కానీ నాకు హోటల్ బయట హేమ కనబడింది…ఎందుకో తెలియదు కానీ ఈ సిచ్యుయేషన్ లో తనకు ఎదురుపడడం నాకు ఇష్టం లేదు, “తొందరగా తాగండి వెళదాం” అన్నా..అంత తొందరెందుకు