నువ్వు మీ నాన్న లాగే, సరే వెళ్ళు అంటూ చిన్నగా నవ్వింది..అమ్మ నువ్వు పెళ్లి కాకముందు ఎవరితో అన్న డేట్ కి వెళ్ళావా..లేదు రా.. మీ నాన్నతోనే నా ఫస్ట్, అండ్ లాస్ట్.., ఇప్పుడు మనుషులకు ఓపిక తగ్గిపోయింది,” జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించే మైండ్ సెట్ మీ జనరేషన్ కి లేదు..నిజంగా జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం..అది ప్రేమిస్తే కానీ తెలియదు.. రా, సరే చెప్తా విను“జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఒక చెట్టు నీడలో ఉండడం లాంటిది కొంచెం బోరింగ్ గా ఉన్నా లైఫ్ పీస్ ఫుల్ గా ఉంటుంది.., అదే మనసు మారినప్పుడల్లా కొత్తవాళ్ళ కోసం వెళ్తే మనకు నీడ దొరుకుతుందేమో గాని లైఫ్ లో ప్రశాంతత ఉండదు..”అయినా ఇవన్నీ నీకిప్పుడు అర్థం కావు, పోను పోను నీకే తెలుస్తుంది..నువ్వు బాగా మాట్లాడతావు మా, ఇలా మాట్లాడటం నీకు ఎవరు నేర్పించారు..ఇంకెవరు మీ నాన్నే.., అలా